ఓబీసీల వార్షికాదాయ పరిమితి పెంపు | obc cremylayer limit increased to 8 lakhs | Sakshi
Sakshi News home page

ఓబీసీల వార్షికాదాయ పరిమితి పెంపు

Published Thu, Oct 19 2017 1:14 PM | Last Updated on Thu, Oct 19 2017 2:26 PM

obc cremylayer limit increased to 8 lakhs

సాక్షి,చండీఘర్‌: ఓబీసీల వార్షికాదాయ పరిమితిని రూ 6 లక్షల నుంచి రూ 8 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ఆమోద ముద్ర వేశారు.రిజర్వేషన్ల ప్రయోజనాలను ఎక్కువ మంది అర్హులకు వర్తింపచేసే ఉద్దేశంతో సామాజిక న్యాయాన్ని విస్తృతం​ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అమరీందర్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు.ఓబీసీ కింద పరిగణించే వారి వార్షిక ఆదాయ పరిమితిని రూ 6 లక్షల నుంచి రూ 8 లక్షలకు పెంచాలని ఈ ఏడాది ఆగస్ట్‌లో కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

1993లో ఓబీసీ క్రీమిలేయర్‌ రూ లక్ష కాగా, 2004లో దీన్ని 2.5 లక్షలకు పెంచగా , 2008లో 4.5 లక్షలకు, 2011లో ఓబీసీల క్రీమిలేయర్‌ పరిధిని రూ 6 లక్షలకు పెంచారు. రిజర్వేషన్‌ ప్రయోజనాలను ఓబీసీలో సమంగా పంపిణీ చేయడం సవాలేనని అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement