న్యూఢిల్లీ: ‘రాజీవ్‌ఖేల్‌రత్న’ అవార్డు కోసం ఈ ఏడాది భారత సీనియర్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ పేరును ప్రతిపాదించిన పంజాబ్ ప్రభుత్వం ఇప్పుడు దానిని ఉపసంహరించుకుంది. అయితే ఇందులో ప్రభుత్వం తప్పేమీ లేదని, వారు నిబంధనల ప్రకారమే వ్యవహరించారని భజ్జీ వివరణ ఇచ్చాడు. ‘కొంత మంది ఈ అంశాన్ని వివాదం చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సరిగానే పని చేసింది. ఖేల్‌రత్న నిబంధన ప్రకారం గత మూడేళ్ల కాలంలో అంతర్జాతీయ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవాలి. అలా చూస్తే నాకు అర్హత లేదు. అందుకే నేనే దరఖాస్తు వెనక్కి తీసుకోమని వారికి విజ్ఞప్తి చేశాను. ప్రభుత్వం దానికి అంగీకరించింది’ అని హర్భజన్ వెల్లడించాడు. అయితే భారత జట్టు తరఫున 2016 మార్చిలో చివరి మ్యాచ్ ఆడిన హర్భజన్ పేరును అసలు అర్హతే లేకుండా ఇప్పుడు ఎందుకు ప్రతిపాదించారనేదే ప్రాధమిక సందేహం. 40 ఏళ్ల హర్భజన్ భారత్ తరఫున మూడు ఫార్మాట్‌లలో కలిపి మొత్తం 711 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment