ఖలీస్తానీ వేర్పాటు వాది అమృత్‌పాల్ సింగ్ నెలరోజులుగా పరారీలో ఉండి ఈరోజు(ఆదివారం) అనుహ్యంగా అరెస్టవ్వడం పలు అనుమానాలను రేకెత్తించింది. అతను పంజాబ్ నుంచి నేపాల్ అక్కడి నుంచి వేరే దేశానికి వెళ్లిపోయి ఉండొచ్చని వార్తలు వస్తున్న వేళ..అనుహ్యంగా పంజాబ్‌లోని మోగా జిల్లాలో ప్రత్యక్షమవ్వడం అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. అదీకూడా అతడి భార్య కిరణదీప్ కౌర్ అతన్ని తరలించేందుకు చేసిన ప్రయత్నం విఫలమైన రెండు రోజుల్లోనే అమృత్‌పాల్ అరెస్టు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అతను మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి అతనిపై అణిచివేత ప్రారంభమైంది. ఆ క్రమంలోనే అతడి భార్య కిరణ్‌దీప్ కౌర్‌పై పంజాబ్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ప్రస్తుతం ఆమె భారతదేశంలో నివశిస్తున్నారు. అదీగాక ఆమె వీసా గడువు ఈ జూలైలో ముగుస్తోంది. సరిగ్గా ఆమె అమృత్‌పాల్ కోసం వేట కొనసాగిస్తున్న తరుణంలోనే లండన్ వెళ్లేందుకు యత్నించింది. ఐతే ఆమె విమానం ఎక్కి వెళ్లిపోతుందనంగా..చివరి నిమిషంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని లుక్‌ఔట్ నోటీసులు జారీ చేసి ఆమెను దేశం విడిచి వెళ్లొద్దని చెప్పారు. దీంతో కిరణ్ కౌర్ అరెస్టు ఖాయమని వార్తలు ఊపందుకున్నాయి. నిజానికి ఆమెను దేశం నుంచి సురక్షితంగా దాటించేయాలనకున్నాడు. అది బెడిసికొంటింది.
మరోవైపు తాను పారిపోయేందుకు సాయం చేసినందుకు గానూ తన భార్య అరెస్టు ఖాయమన్న భయం కూడా అమృత్‌పాల్‌ని వెంటాడింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల ఎదుట లొంగిపోయి ఉండవచ్చనని అధికారులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే బ్రిటన్ పౌరసత్వ కలిగి ఉన్న అతడి భార్య ద్వారా కిరణ్ దీప్ కౌర్ యూకేకి నిధులు మళ్లించినట్లు సమాచారం. దీంతో ఈ విషయం ఎక్కడ బయటపడుతుందన్న భయం కూడా అమృత్‌పాల్‌లో మొదలైంది.
ఈ కారణాల రీత్యా అతను పంజాబ్‌లో తన సొంత మోగా జిల్లాలో ప్రత్యక్షమై లొంగిపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, కిరణ్‌దీప్ కౌర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పెళ్లి కోసం ఇండియాకు వచ్చింది.ఆమె పెళ్లి అమృత్‌పాల్ స్వస్థలమైన జల్లుపూర్ ఖేరా గ్రామంలో జరిగింది. పోలీసుల అతడి ఆచూకి కోసం సాగిస్తున్న వేటలో అమృత్‌పాల్ తల్లి తోపాటు ఆమెను కూడా విచారించారు.
Comments
Please login to add a commentAdd a comment