ఒక బ్రిటీష్ మహిళ బిడ్డకు జన్మనిచ్చేందుకు 4000 మైళ్లు(6437 కిలోమీటర్లు) ప్రయాణించింది. ప్రకృతి సిద్ధమైన అందమైన సముద్ర తీరంలో బిడ్డకు జన్మన్వివ్వాలనే తన కలను నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడింది. ఆ గర్భిణి కలను సాకారం చేసేందుకు ఆమె భర్త కూడా ఎంతో సహకారం అందించాడు. ఎట్టకేలకు ఆమె దక్షిణ కొరియా దేశమైన గ్రెనడా సముద్రతీరంలో బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇలా బిడ్డకు జన్మనిచ్చిందో లేదో, వెంటనే ఆ దంపతులను సమస్యలు చుట్టుముట్టాయి.
జనన ధృవీకరణ పత్రం కోసం చిక్కులు
బిడ్డకు జన్మనిచ్చినది మొదలు నాలుగు నెలలుగా.. అంటే ఇప్పటికీ ఆ దంపతులు గ్రెనడా తీరంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటికి తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ఆ బిడ్డకు సంబంధించిన జనన ధృవీకరణ పత్రం అడగడమే ఆ దంపతులకు పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ నేపధ్యంలో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వారి దగ్గర డబ్బులు కూడా అయిపోయాయి.
యూకేలో చిక్కుకుపోయిన పెద్ద కుమార్తె
ఆ బ్రిటీష్ మహిళ పేరు యూలియా గుర్జీ(38). ఆమె యోగా ట్రైనర్. ఆమె భర్త పేరు క్లైవ్(51). వారికి ఇప్పటికే 8 ఏళ్ల ఎలిజబెత్ అనే కుమార్తె ఉంది. ఆమెను వారు యూకేలో ఉంచారు. ఎలిజబెత్ పాస్‌పోర్టు రివ్వ్యూ కాకపోవడంతో వారు ఆ చిన్నారిని తమతోపాటు తీసుకురాలేకపోయారు. కాగా ఆ దంపతులు యూకే నుంచి యూలియా సముద్ర తీరం చేరుకునేందుకు 6437 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. యూలియా ఏప్రిల్ 23న సాగరతీరంలో బేబీ లూయిస్‌కు జన్మనిచ్చింది.
ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్!
బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసి..
క్లైవ్ మీడియాతో మాట్లాడుతూ ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్.. తాము ఆ నవజాత శిశువుకు తల్లిదండ్రులమైనట్లు తగిన రుజువు చూపించాలని కోరుతున్నదన్నారు. తాము రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు సమర్పించి, కొంతకాలం వేచి చూశామన్నారు. ఎంతకీ తమకు బర్త్‌సర్టిఫికెట్ అందకపోవడంతో తిరిగి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి అధికారులను అడగగా, ఆ బిడ్డ ఆసుపత్రిలో జన్మించలేదని, అలాగే ఆ చిన్నారి ఎక్కడ జన్మించిందనే వివరాలు లేవని, అందుకే బర్త్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చిచెప్పేశారన్నారు.
పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బంది కూడా..
తాము కింగ్ యూరోపియన్ యూనియన్ ఆసుపత్రికి వెళ్లగా, అక్కడి సిబ్బంది తాము ఆ శిశువు జననానికి సంబంధించిన వివరాలు నమోదు చేయలేమన్నారు. బిడ్డపుట్టిన 24 గంటల తరువాత రిజిస్ట్రేషన్ కోసం వచ్చినందున తాము ఏమీ చేయలేమని తేల్చిచెప్పేశారని క్లైవ్ తెలిపారు. పాస్‌పోర్టు కార్యాలయ సిబ్బంది కూడా బిడ్డ జననానికి సంబంధించిన రుజువులు లేనందున తామేమీ చేయలేమని తెలిపారు. దీంతో క్లైవ్ యూకేలోని సంబంధిత ఉన్నతాధికారులను సంప్రదించగా, వారు డిఎన్‌ఏ టెస్టు చేయించాలని కోరారు. దీనికి సంబంధించిన రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని క్లైవ్ తెలిపారు.
‘చేతిలో చిల్లిగవ్వ లేదు’
ఇప్పటివరకూ తన కార్డులోవున్న 6,000 పౌండ్లు ఖర్చయిపోయాయని, తమ దగ్గర ప్రస్తుతం చిల్లిగవ్వ కూడా లేదని క్లైవ్ తెలిపారు. తాము యూకే నుంచి సహాయం అర్థిస్తుండగా, ఇంతవరకూ ఎటువంటి సమాధానం లేదన్నారు. యూలియా మాట్లాడుతూ తాము ఈ దేశంలో బందీ అయిపోయామని, యూకే తిరిగి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. యూకేలో ఉండిపోయిన తమ పెద్ద కుమార్తె తమకు తరచూ గుర్తుకువస్తున్నదని, బంధువుల ఇంటిలో ఆమె ఎలా ఉన్నదో తమకు తెలియడం లేదని యూలియా కన్నీరుపెట్టుకుంది.
ఇది కూడా చదవండి: ‘నన్ను కొట్టి చంపేస్తున్నాడు’.. కమిషనరేట్‌లో 105 ఏళ్ల వృద్ధుని రోదన!
Comments
Please login to add a commentAdd a comment