
ఖలిస్థానీ ఉగ్రవాది, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని డిబ్రూగఢ్‌లో జైల్లో ఉన్న అమృత్‌పాల్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్సా హిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.
అమృత్‌పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణ స్వీకారానికి బుధవారం స్పీకర్‌ను కలిసి అనుమతి కోరినట్లు ఫరీద్‌కోట ఎంపీ సరభ్‌జీత్ సింగ్ ఖల్సా వెల్లడించారు. లోక్‌సభలో కాకుండా.. స్పీకర్ ఛాంబర్‌లో జులై 5న ప్రమాణం చేసేందుకు ఓం బిర్లా అనుమతి ఇచ్చారని తెలిపారు.
అతడికి ఐదవ తేదీ నుంచి నాలుగురోజులకు పేరోల్ లభించినట్లు చెప్పారు. ఇక అదే రోజు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో నిందితుడిగా ఉన్న బారాముల్లా ఎంపీ ఇంజినీర్ రషీద్‌ప్రమాణ స్వీకారం కూడా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment