కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం .. తొలి 18వ లోక్‌సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు కూడా ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్.. సభ్యులతో ప్రమాణం చేయించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఆయనతో ప్రమాణం చేయించారు. చిన్న రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఇంగ్లీష్‌లో ఆయన ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. చివరలో జైహింద్, జై సంవిధాన్ అని నినదించారు. ప్రమాణం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు భారత్ జోడో అంటూ నినాదాలు చేశారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్‌బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.
కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి, కేరళలోని వయనాడ్.. రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీచేసి విజయం సాధించారు. అనంతరం ఆయన వయనాడ్‌ను వదులుకొని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
కేరళలోని వయనాడ్ స్థానానికి ఆయన చేసిన రాజీనామాను స్పీకర్ సోమవారం ఆమోదించారు. దీంతో నేడు ఆయన రాయ్‌బరేలీ (యూపీ) ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక వయనాడ్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ బరిలో నిలవనున్నారు.
ఈరోజుతో ఎంపీల ప్రమాణ స్వీకారం పూర్తి కానుంది. బుధవారం స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ సురేశ్ పోటీ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment