Amritpal Singh Has Extramarital Affairs, He Sent Kisses On Video Calls - Sakshi
Sakshi News home page

Khalistani Leader: వివాహేతర సంబంధాలు.. వీడియో కాల్‌లో ముద్దులు.. అమృత్‌పాల్ సింగ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా..?

Published Thu, Mar 23 2023 12:19 PM | Last Updated on Thu, Mar 23 2023 1:49 PM

Extramarital Affairs Kisses On Video Calls Amritpal Singh Khalistani - Sakshi

చండీగఢ్‌: అమృత్‌పాల్‌ సింగ్.. కరుడుగట్టిన ఖలిస్థానీ వేర్పాటువాది. ఆరు రోజులుగా పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో తిరగుతూ దేశం దాటేందుకు ప్రయత్నిస్తున్న అతివాది. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ప్రమాదకర వ్యక్తి. అయితే ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెలిస్తే మాత్రం.. ఇతనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అనుకుంటారు. అవును మరి సోషల్ మీడియాలో మనోడి వేషాలు మామూలుగా లేవు..

అమృత్‌పాల్‌ సింగ్‌కు చాలా మంది అమ్మాయిలు, వివాహితలతో సంబంధాలు ఉన్నట్లు ఓ జాతీయ వార్త సంస్థ వెల్లడించింది. సోషల్ మీడియాలో ఇతడు అనేక మంది మహిళలతో చాట్ చేసినట్లు పేర్కొంది. ఈ చాట్‌లతో పాటు 12 వాయిస్ మెసేజ్‌లను సేకరించింది. అమృత్‌పాల్ సింగ్‌ అమ్మాయిల అసభ్య వీడియోలను రికార్డు చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు కూడా పేర్కొంది.

తనకు అమ్మాయిలతో కేవలం సాధారణ రిలేషన్‌షిప్ మాత్రమే కావాలని, సీరియస్ రిలేషన్‌షిప్ కోరుకోవడం లేదని అమృత్ పాల్ సింగ్ వాయిస్ మెసేజెస్‌లో చెప్పాడు. మహిళలకు ముక్కు మీద కోపం అని అన్నాడు. అలాగే ఓ మహిళ తన వివాహ సంబంధంపై ప్రభావం పడనంతవరకు వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చాడు.

అమృత్‌పాల్ సింగ్ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో అమ్మాయిల చాటింగ్‌ లిస్ట్ చాలా పెద్దగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక మందికి అతడు తరచు మెసేజ్‌లు పంపాడు. మన వివాహేతర సంబంధం ఖరారైంది అని ఓ మహిళతో, దుబాయ్‌లో హనీమూన్‌ చేస్కుందాం అని మరొకరితో చాట్ చేశాడు. వీటికి  ఆ మహిళ లాఫింగ్ ఏమోజీస్‌తో రిప్లై ఇవ్వడం గమనార్హం.

ముమ్మర గాలింపు..
మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం ఆరు రోజులుగా వేట కొనసాగిస్తున్నారు. అతను మాత్రం సినిమా స్టైల్‌లో పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో, వాహనాలు మార్చుతూ తిరుగుతున్నాడు. బైక్‌ను పక్కన పెట్టుకుని ఓ బండిపై అతను వెళ్తున్న ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయినా ఇప్పటివరకు అతని జాడ మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. మహారాష్ట్ర పోలీసులు కూడా ఇతని కోసం అలర్ట్ అయ్యారు.

చదవండి: నెల క్రితమే ఎన్నారై కిరణ్‌దీప్‌తో పెళ్లి.. అక్కడికి వీసా.. ప్లాన్‌ అదేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement