kisses
-
కొడుకుని ముద్దాడుతున్న హీరోయిన్ ప్రణీత (ఫొటోలు)
-
కింగ్ కోబ్రాకు కిస్.. నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్..
ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పోస్టు చేసి లైక్స్, వ్యూస్ చూసి తమ పలుకుబడి ఎంత ఉందో అంచనా వేసుకుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావడానికి ప్రాణాల మీదకు వచ్చే పనులు కూడా చేస్తుంటారు. అయితే.. ఇందులో కొందరు సహజంగా విభిన్నమైన టాలెంట్‌ను ప్రపంచానికి చూపించే వారు కూడా ఉండకపోరు. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు కిస్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాములంటే ఎంత భయం. చూడగానే వన్నులో వణుకు వస్తుంది. కానీ కొందరు వాటితో కూడా స్నేహం చేసే వారు ఉంటారు. ఈ కోవకే చెందిన వ్యక్తేనేమో నిక్. తను ఓ కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు. చాలా పొడవు ఉన్న ఆ పాము పడగ విప్పిన వేళ.. దానికి వెనకు నుంచి ధైర్యంగా ముద్దు పెట్టాడు. కానీ ఆ కింగ్ కోబ్రా ఆయన్ని ఏమీ అనలేదు. ఈ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. నిక్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు కొంత మంది నెటిజన్లు. పాములపై తమ భయాన్ని వెలిబుచ్చారు మరికొందరు. 'పోతావ్ రేయ్..' అంటూ మరికొంత మంది క్రేజీగా స్పందించారు. ఏదేమైనా పాములకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ వీడియోకు వారం రోజుల్లోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
విమానంలో పెద్దాయన పాడుపని..ఫ్లైట్ అటెండెంట్‌కి బలవంతంగా..
ఇటీవల విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలకు సంబంధించి ఏదో ఒక ఘటనను తరుచుగా వింటున్నాం. అవన్నీ మరువకే మునుపే అచ్చం అలాంటి మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో సదరు ప్రయాణకుడు కటకటాల పాలయ్యాడు కూడా. ఈ ఘటన డెల్టా ఎయిర్‌లైన్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 10న మిన్నెసోటా నుంచి అలస్కాకు ప్రయాణిస్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో 61 ఏళ్ల డేవిడ్ అలాన్ బర్క్ అనే వృద్ధ ప్రయాణికుడు ఫ్లైట్ అటెండెంట్ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాడు. ఆ వృద్ధ ప్రయాణకుడు ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ సీటులో కూర్చొన్నాడు. అక్కడే ఓ మగ ఫ్లైట్ అటెండెంట్ పనిచేస్తున్నాడు. సాదారణంగా ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు టేకాఫ్ చేయడానికి ముందు ఫ్లైట్ అటెండెంట్ నుంచి డ్రింక్స్‌ని స్వీకరిస్తారు. అయితే ఆ అటెండెంట్ ఆ వృద్ధ ప్రయాణికుడు బర్క్‌కి నచ్చిన రెడ్ వైన్ ఆల్కాహాల్ని అందించలేదు. దీంతో ఆ ప్రయాణికుడు ఒకింత అసహనానికి గురయ్యాడు. ఆ తర్వాత భోజన ఆర్డర్లను తీసుకోవడానికి ఆ ఫ్టైట్ అటెండెంట్ వస్తుండగా.. ఆ ప్రయాణికుడు బర్క్ అతనిని అందంగా ఉన్నావంటూ బలవంతంగా ముద్దు పెట్టుకునే యత్నం చేశాడు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ ఒక్కసారిగా గురయ్యాడు. పాపం ఆ అటెండెంట్ ఆ ప్రయాణికుడి కాంప్లీమెంట్కి ధన్యావాదాలు చెబుతూ వద్దు సార్ అంటూ వెనక్కి వెళ్లే యత్నం చేసిన మెడపై ముద్దు పెట్టే యత్నం చేశాడు. వాస్తవానికి ఆ ప్రయాణకుడు రెస్ట్‌రూమ్‌కి వెళ్లేందుకు లేచాడని ఆ తర్వాత తాను ఎదురపడగానే అతను ఇలా అనుచితంగా ప్రవర్తించినట్లు సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఆ ఫ్టైట్ అటెండెంట్ డెల్టా ఎయిర్‌లైన్స్‌కి జరిగిన విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా తెలయజేసి ఫిర్యాదు చేశారు. అలాగే అతను తాగిన మత్తుమలోనే అలా ప్రవర్తించాడని, పైగా పైలట్ భోజనం ట్రైని కూడా పగలుగొట్టి భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశాడు ఫ్లైట్ అటెండెంట్. ఆ ప్రయాణికుడు నిద్రపోయే ముందు మరో రెండు గ్లాస్‌ల రెడ్వైన్ని అడిగినట్లు సమాచారం. ఈ మేరకు ఆ విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే అధికారులు ఆ వికృత వృద్ధ ప్రయాణికుడిరి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ నెల ఏప్రిల్ 27న కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. (చదవండి: సెప్టెంబర్‌లో భారత్‌కు బైడెన్) -
Amritpal Singh: వివాహేతర సంబంధాలు.. వీడియో కాల్లో ముద్దులు..
చండీగఢ్: అమృత్‌పాల్ సింగ్.. కరుడుగట్టిన ఖలిస్థానీ వేర్పాటువాది. ఆరు రోజులుగా పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో తిరగుతూ దేశం దాటేందుకు ప్రయత్నిస్తున్న అతివాది. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ప్రమాదకర వ్యక్తి. అయితే ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెలిస్తే మాత్రం.. ఇతనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అనుకుంటారు. అవును మరి సోషల్ మీడియాలో మనోడి వేషాలు మామూలుగా లేవు.. అమృత్‌పాల్ సింగ్‌కు చాలా మంది అమ్మాయిలు, వివాహితలతో సంబంధాలు ఉన్నట్లు ఓ జాతీయ వార్త సంస్థ వెల్లడించింది. సోషల్ మీడియాలో ఇతడు అనేక మంది మహిళలతో చాట్ చేసినట్లు పేర్కొంది. ఈ చాట్లతో పాటు 12 వాయిస్ మెసేజ్‌లను సేకరించింది. అమృత్‌పాల్ సింగ్ అమ్మాయిల అసభ్య వీడియోలను రికార్డు చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు కూడా పేర్కొంది. తనకు అమ్మాయిలతో కేవలం సాధారణ రిలేషన్షిప్ మాత్రమే కావాలని, సీరియస్ రిలేషన్షిప్ కోరుకోవడం లేదని అమృత్ పాల్ సింగ్ వాయిస్ మెసేజెస్‌లో చెప్పాడు. మహిళలకు ముక్కు మీద కోపం అని అన్నాడు. అలాగే ఓ మహిళ తన వివాహ సంబంధంపై ప్రభావం పడనంతవరకు వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చాడు. అమృత్‌పాల్ సింగ్ ఇన్స్టాగ్రాం ఖాతాలో అమ్మాయిల చాటింగ్ లిస్ట్ చాలా పెద్దగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక మందికి అతడు తరచు మెసేజ్‌లు పంపాడు. మన వివాహేతర సంబంధం ఖరారైంది అని ఓ మహిళతో, దుబాయ్‌లో హనీమూన్ చేస్కుందాం అని మరొకరితో చాట్ చేశాడు. వీటికి ఆ మహిళ లాఫింగ్ ఏమోజీస్‌తో రిప్లై ఇవ్వడం గమనార్హం. ముమ్మర గాలింపు.. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సింగ్ కోసం ఆరు రోజులుగా వేట కొనసాగిస్తున్నారు. అతను మాత్రం సినిమా స్టైల్లో పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో, వాహనాలు మార్చుతూ తిరుగుతున్నాడు. బైక్‌ను పక్కన పెట్టుకుని ఓ బండిపై అతను వెళ్తున్న ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయినా ఇప్పటివరకు అతని జాడ మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. మహారాష్ట్ర పోలీసులు కూడా ఇతని కోసం అలర్ట్ అయ్యారు. చదవండి: నెల క్రితమే ఎన్నారై కిరణ్‌దీప్‌తో పెళ్లి.. అక్కడికి వీసా.. ప్లాన్ అదేనా? -
వికృత ప్రవర్తన: శవపేటికలోని అస్థిపంజరాలకు ముద్దు పెట్టి వీడియో..
'పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి' అన్న నానుడిలా కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అవి హద్దులు దాటి వికృతంగా మారితేనే ప్రమాదం. విచిత్ర ప్రవర్తనలతో పేరుగాంచాలనో లేక మరే ఏ ఉద్దేశ్యంగానో పాపం అదే వారిని కటకటాల పాలు చేయడం లేదా వారికే ప్రాణాంతకమవ్వడం జరుగుతుంది. అచ్చం అలాంటి ఓ ఘటన చైనాలో వెలుగుచూసింది. ఏం జరిగిందంటే.. చైనాలో 21 ఏళ్ల వ్యక్తి టీవీలో పలు ఆసక్తికర లైవ్ టెలీకాస్టింగ్లను ప్రసారం చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తుంటాడు. తన ఇమేజ్ పెంచుకునేందుకో ఏమో తెలియదు గానీ.. ఓ చెత్త పని అనాలో లేదా విచిత్రమైన పని అనాలో తెలియని వికృత పని చేశాడు. ఓ స్మశానవాటికకు వెళ్లి అక్కడ శవపేటికలోని అస్థిపంజరాలను ముద్దు పెట్టుకుంటూ..లైవ్ వీడియో తీసి ప్రసారం చేశాడు. అలా మొత్తం మూడు శవపేటికలను తన స్నేహితుల సాయంతో ఓపెన్ చేసి.. ఆ ఆస్థిపంజరాలను, పుర్రెలను ముద్దు పెట్టుకోవడం వంటి విచిత్రమైన పనులు చేశాడు. దీన్ని గమినించిన సమీపంలోని గ్రామస్తులు పట్లుకుని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా సదరు వ్యక్తికి తొమ్మిది నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటన గతేడాది మార్చిలో జరిగినట్లు సమాచారం. ఇలాంటి వికృతి చర్యలు నెక్రోఫిలియా లక్షణం అని, దీని కారణంగా మృతదేహాలతో ఇలాంటి విచిత్ర పనులు చేస్తుంటారని చైనాలోని నిపుణులు చెబుతున్నారు. అలాంటివారు మృతదేహాలపై వ్యామోహం పెంచుకుని ఇలాంటి చేష్టలకు దిగుతారని అంటున్నారు. (చదవండి: 'మా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామి భారత్": యూఎస్ పొగడ్తల జల్లు) -
పులితో ఆటలా? అని అనకండి.. ముద్దులాటలు కూడా..! వైరల్ వీడియో
అడవిలో జంతువులను దగ్గర నుంచి చూస్తేనే గుండె ఆగినంత పనైపోతుంది. పొరపాటున జంతువుల కంటపడితే.. ఇంకేమైనా ఉందా ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగు పెట్టాల్సిందే. ఇక పులి, చిరుత, సింహాల జోలికి పోకపోవడమే ఉత్తమం. వాటిని చూస్తేనే భయంతో ఒళ్లు జలదరిస్తుంది. . అదే వాటిని పక్కన పెట్టుకొని ఆటాలాడితే పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఓ యువతికి అలా జరగలేదు. ఎంచక్కా చిరుత దగ్గర కూర్చొని దానికి ముద్దు పెట్టింది. శక్తివంతమైన జంతువులలో చిరుత ఒకటి. చిరుత కంట పడిన ఏ జంతువైనా దాని బారి నుంచి, తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అత్యంత వేగంగా పరుగెత్తి వేటాడుతుంది. అయితే ఇందుకు భిన్నంగా ఓ యువతి మాత్రం చిరుతతో రాసుకొని పూసుకొని తిరుగుతోంది. చిరుత పక్కన ఎలాంటి బెరుకు లేకుండా పడుకొని ఉంది. దానిని ప్రేమగా లాలించింది. అంతటితో ఆగకుండా ఏకంగా ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం చేసింది. అయితే చిరుత కూడా ఏం అనకుండా యువతితో అంతే ప్రేమగా ప్రవర్తించడం విశేషం. కాగా, ఆ చిరుత యువతికి పెంపుడు జంతువుగా తెలుస్తోంది. ఆఫ్రికన్ యానిమల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరికొంతమంది చిరుతో యువతి చేష్టలు చూసి భయపడుతున్నారు. ‘ఒకే ఫ్రేమ్‌లో ఓ మై గాడ్.. చిరుత ఆమెకు ముద్దు పెట్టిందా.. అమె అసలు ఏం చేస్తోంది. చిరుతతో లిప్‌లాక్. ఒకే ఫ్రేమ్‌లో రెండు చిరుతలు.. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవర్.. ఇంత పెద్ద ప్రపంచంలో ఒక చిన్న ప్రేమ, అనురాగం ఎంత దూరం తీసుకెళ్లగలదో ఇది చూపిస్తుంది.’ అని నెటిజన్లు కామెంట్ చేస్తుంటారు. చదవండి: Viral: పెళ్లి అంటే ఏంటి?.. పిల్లాడి దిమ్మతిరిగే సమాధానం.. నవ్వాపుకోలేరు! View this post on Instagram A post shared by African animals (@african_animal) -
హీరోయిన్‌కు సడెన్‌గా ముద్దు పెట్టిన హీరో.. వీడియో వైరల్
Varun Dhawan Kisses Kiara Advani And KRK Trolls: తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. వరుసగా ప్రేమ కథా, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల వరుణ్ ధావన్ నటించిన చిత్రం 'జుగ్ జుగ్ జీయో'. జూన్ 24న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ కపూర్, నీతూ కపూర్ సైతం కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించినట్లు సమాచారం. అయితే ఈ మూవీలో వరుణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటించింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక మేగజైన్ కవర్ ఫొటో కోసం ఫోజులిచ్చారు. ఈ ఫొటో షూట్లో వరుణ్, కియారా ఇద్దరు కౌగిలించుకుని స్టిల్స్ ఇస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా కియారా బుగ్గపై వరుణ్ ధావన్ ముద్దు పెడతాడు. ఈ అనుకోని పరిణామానికి షాక్ అయి వరుణ్‌ను పక్కకు నెడుతుంది కియారా. ఈ ఫొటో షూట్ వీడియోను బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్‌గా చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు 'షూటింగ్ సమయంలో కంట్రోల్ చేసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి' అని రాసుకొచ్చాడు కూడా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవగా.. 'ఇలా అయితే కష్టం గురూ' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్ నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? Jab Aadmi shoot Karte Huwe Mood Main Aa Jata Hai Toh Kuch Aisa Ho Jata Hai. pic.twitter.com/3SzXU6M5WR — KRKBOXOFFICE (@KRKBoxOffice) August 1, 2022 -
Viral Video: బాబోయ్! పామును ముద్దులతో ముంచేస్తోందిగా!
-
బాబోయ్! పామును ముద్దులతో ముంచేస్తోందిగా!
Girl Kisses and Cuddles Her Pet Snake Video: సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి రావడం కోసం చాలామంది ఇటీవల కాలంలో పాములతో ఒళ్లు గగుర్పాటుకి గురిచేసే విధంగా రకరకాల విన్యాసాలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పైగా అవి ఒక్కొసారి వికటించి ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. అంతేకాదు వాటిని పట్టుకుని డ్యాన్సుల చేయడం వంటివి కూడా చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక అమ్మాయి తన పెంపుడు పాము(కొండచిలువ)ని ముద్దుపెట్టుకున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. (చదవండి: లాక్డౌన్లో ప్రజలకు ఎంత జుట్టు పెరిగిందో చెప్పేందుకే..!) అయితే ఆ అమ్మాయి ఈ వీడియోలో తన పెంపుడు పామును కౌగలించుకుని మంచంపై పడుకుని ఉంటుంది. పైగా ఆ పాము తల ఆమె పెదాల దగరకు రాగానే ముద్దుపెడుతుంది. అంతే ఆ పాము ఆశ్చర్యంగా నోరు తెరుస్తుంది. దీంతో ఆమె నవ్వుతూ ఐ లవ్ యూ అంటూ మళ్లీ ముద్దు పెడుతుంది. అది కూడా నేను కూడా ప్రేమిస్తున్నాను అంటూ ఆ పాము కూడా తన తలను ప్రేమగా ఆ అమ్మాయి బుగ్గ పై ఆనించింది. దీంతో నెటిజన్లు పాములు కూడ ఇంత ప్రేమగా ఉంటాయా, ఇలా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయా అంటూ ఆశ్చర్యపోతూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ప్లీజ్ అంకుల్ నన్ను కూడా టెస్ట్ చేయండి) -
ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టస్
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ఒక కపుల్ విమానంలో చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విమానంలో ఉన్నామన్న సంగతి మరిచి వారిద్దరు ముద్దుల్లో మునిగిపోయారు. అయితే ఇది చూసిన తోటి పాసింజర్ సివిల్ ఏవియేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మే 20న చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే కరాచీ- ఇస్లామాబాద్‌కు వెళ్తున్న పీఏ-200 ఫ్లైట్‌లో ఒక కపుల్ నాలుగో వరుసలో కూర్చున్నారు. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఆ దంపతులు ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు. వారి వెనకాలే కూర్చున్న ఒక వ్యక్తి వారి చర్యలకు ఇబ్బంది పడి ఎయిర్ హోస్టస్‌ను పిలిచి చెప్పాడు. ఆమె వెళ్లి మీ చర్యలతో చుట్టుపక్కల వాళ్లకు అభ్యంతరం ఉందని.. ఇలాంటివి చేయకూడదని వివరించింది. అయినా వారు పట్టించుకోకుండా తమ పనిలో మునిగిపోయారు. దీంతో ఎయిర్ హోస్టస్ వారికి బ్లాంకెట్ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయింది. అయితే బిలాల్ ఫరూక్ ఆల్వీ అనే అడ్వకేట్ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ దంపతులు చేసే పనిపై ఎలాంటి చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో సీఏఏ విమాన సిబ్బందితో ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలని మందలించారు. అయితే అప్పటికే ఈ వార్త సోషల్ మీడియాకు పాకడంతో వైరల్‌గా మారింది. విమానంలో కపుల్ చేసిన పనిపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో మీమ్స్, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: వైరల్: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’’ Live scenes from Airblue. pic.twitter.com/FkVbzpLXfT — 𝕾 🇵🇸 (@seennzoned) May 25, 2021 Air-host to other Passengers after giving blanket to kissing couple on #AirBlue pic.twitter.com/OqtwTxoiJw — Junaid Khawar (@jjkhawar) May 25, 2021 Air Hostess gives blanket to kissing couple in #Airblue flight. Single me: pic.twitter.com/gUvNWAiBVY — Malik Muzamil (@mozammalnawaz) May 26, 2021 #Airblue Guy on seat no. 5 : pic.twitter.com/K6F01ah5Wc — ابرار ابنِ عزیز (@ballisays) May 25, 2021 -
ప్రియురాలిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక..
ముంబై : ప్రముఖ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ' పదకొండవ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగే ఈ షోలో పాల్గొనేందుకు ఇప్పటికే కంటెస్టెంట్లు సన్నద్ధం అయ్యారు. ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ ఫేం రాహుల్ వైద్య, వరుణ్ సూద్, దివ్యంకా త్రిపాఠి అర్జున్ బిజ్లాని, నిక్కి తంబోలి, అభినవ్ శుక్లా సహా పలువురు ఈ షోలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి ముంబై ఏయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్ ప్రియురాలు దిషా పర్మార్‌ని వదిలి వెళ్లేటప్పుడు ఎమోషల్ అయ్యారు. ప్రియురాలికి ముద్లులు, హగ్గులు ఇచ్చి విడ్కోలు పలికారు. ఈ ఫోటోలను క్లిక్ మనిపించిన ఫోటోగ్రాఫర్లు వీరిది ఎంతో క్యూట్ జోడీ అంటూ కొనియాడారు. ఇక ఈ పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హిందీ బిగ్‌బాస్-14లో రుబీనా దిలైక్‌తో తలపడి రాహుల్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇదే షోలో ప్రియురాలు దిశా పర్మార్‌ని కూడా పరిచయం చేసిన రాహుల్ మరొకొద్ది నెలల్లోనే తమ వివాహం ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే పెళ్లి పనులు మొదలు పెట్టినా కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొనేందుకు సన్నద్ధం అయ్యారు. అయితే ఏయిర్‌పోర్టులో ప్రేయసిని వదిలి వెళ్లలేక, షోను వదులుకోలేక రాహుల్ మదనపడుతూ కనిపించాడు. View this post on Instagram A post shared by Rahul Vaidya world (@mad_fan_of_rahul_vaidya_) ఛదవండి : 'బిగ్‌బాస్' వల్ల నాకు ఒరింగిందేమీ లేదు : నటి నా కుమారులు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు: నటి -
ఆ దేశాల్లోనే ‘ఫ్రెంచ్ ముద్దులు’ ఎక్కువ
న్యూఢిల్లీ : ‘ముద్దంటే చేదా నీకు, ఆ ఉద్దేశం లేదా నీకు!’ అంటూ ఆ దేశాల్లో ఎవరు, ఎవరిని అడకక్కర్లేదు. అడక్కుండానే అక్కడ ప్రేమికులు, భార్యా భర్తలు కలసుకున్నదే తడవుగా ‘ఫ్రెంచి కిస్’లు పెట్టుకుంటారు. దాన్నే మన సినిమా పరిభాషలో ‘లిప్ లాక్’ ముద్దులంటాం. ధనవంతుడికి పేద వాడికి మధ్య అత్యంత ఎక్కువ వ్యత్యాసాలున్న ఆరు ఖండాల్లోని 13 ఎంపిక చేసిన దేశాల్లో ‘ముద్దు’ ముచ్చటపై స్కాట్లాండ్లోని ఆల్బర్టీ యూనివర్శిటీ పరిశోధన బృందం అధ్యయనం జరిపింది. (చదవండి: పెంపుడు కుక్క పిల్లకూ కోవిడ్ వైరస్) మిగతా దేశాలకన్నా ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్న ఈ దేశాల్లోనే ప్రేయసీ ప్రేమికులు, భార్యా భర్తలు నాలుకకు నాలిక, పెదాలకు పెదాలు కలిపి గాఢ చుంభనంలో మునిగిపోతున్నారట. ప్రేమ, ఆప్యాయతల వ్యక్తీకరణకు, శృంగార ఆస్వాదనకు ఇంతకుమించిన మార్గం లేదని వారు వాదిస్తున్నారు. ముద్దే అసలైన శృంగారమని, ముద్దులేని సెక్స్ కూడా శృంగారం కాదని వారు వాదిస్తున్నారట. మగవారితో పోలిస్తే ఈ ముద్దులను ఎక్కువగా మహిళలే ఆస్వాదిస్తున్నారట. ముద్దూ ముచ్చట విషయంలో ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువున్న దేశాల్లోనే ఎందుకు ఆదరణ ఎక్కువగా ఉందో, అందుకు సంబంధించి ఆర్థిక, సామాజిక కారణాలపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ క్రిస్టఫర్ వాట్కిన్స్ మీడియాకు తెలిపారు. మరిన్ని అధ్యయన వివరాలతో ప్రజల ముందుకు వస్తామని, అప్పుడే తాము అధ్యయనం జరిపిన 13 దేశాల పేర్లను బహిర్గతం చేస్తామని ఆయన చెప్పారు. యువతీ యువకులు పది సెకన్ల పాటు ఫ్రెంచి ముద్దు పెట్టుకుంటే ఒకరి నుంచి ఒకరికి ఎనిమిది కోట్ల బ్యాక్టీరియా ఒకరి నోట్లో నుంచి ఒకరి నోట్లోకు పోతుందని డచ్ జీవ శాస్త్రవేత్తలు ఇప్పటికే తెలియజేశారు. ప్రతి మనిషిలో సహజంగా కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుందనే విషయం తెల్సిందే. మరో రకంగా చెప్పాలంటే ఓ మనిషి బరువులో 30 శాతం బరువును ఈ బ్యాక్టీరియానే ఆక్రమిస్తుంది. చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉండడం వల్లనే మనుషులు మనుగడ సాగిస్తున్నారన్న విషయం కూడా తెల్సిందే. దంపతులు పది సెకడ్ల పాటు ముద్దు పెట్టుకుంటే ఒకరి నుంచి ఒకరిలోకి 8 కోట్ల బ్యాక్టీరియా వెళ్లినప్పుడు అది మంచిదా, కాదా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. దంపతుల్లో ఒకరు అనారోగ్య వంతులైతే రెండోవారికి బ్యాక్టీరియా మార్పిడి వల్ల నష్టం జరుగుతుందని కొంత మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడగా, ఆరోగ్యవంతుల నుంచి అనారోగ్యవంతులకు బ్యాక్టీరియా చేరడం వల్ల అవతలి వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వాదిస్తోన్న శాస్త్రవేత్తలు లేకపోలేదు. ఏదేమైనా ముద్దుల్లో బ్యాక్టీరియా ప్రభావంపై ప్రపంచంలో ఇప్పటి వరకు ఎలాంటి పరిశోధన జరగలేదని, అవసరమైతే ఇప్పుడు జరపొచ్చని ‘నెదర్లాండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ అప్లైడ్ సైంటిఫిక్ రిసర్చ్’ పరిశోధకులు డాక్టర్ రెమ్కో కోర్ట్ తెలియజేస్తున్నారు. (చదవండి: కామ పిశాచి.. సవతి కూతురిని దాచేసి) -
వందల జంటలు చుంబనాలు...
న్యూయార్క్: డెబ్బై యేళ్లనాటి అనుభవాలను, విజయాలను తలచుకుంటూ వందలాది జంటలు న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ దగ్గర గుమిగూడాయి. తమ సంతోషాన్ని, సంబరానికి గుర్తుగా సంబరాలు చేసుకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ తోక ముడిచిన సంరంబాన్ని తలచుకుంటూ ఒకర్నొకరు కౌగిలించుకున్నారు. ముద్దులు పెట్టుకున్నారు. జపాన్ పై సాధించిన విజయానికి గుర్తుగా ఈ సంబరాలను శుక్రవారం వేడుకగా జరుపుకున్నారు. నావికుల దుస్తుల్లో పురుషులు, తెల్లని వస్త్రాల్లో మహిళలు అలనాటి నావికుల విజయ ప్రతీకలుగా ఫోజులిచ్చారు. జపాన్‌పై విజయం సాధించామంటూ ఫోటో జర్నలిస్టు అల్ఫ్రెడ్ తీసిన 'వి-జె డే ఇన్ టైమ్స్ స్వ్కేర్ ' ప్రసిద్ధి పొందింది. ఆ ఫోటోను గుర్తుకు తెచ్చుకుంటూ పలువురు ఫోటోలకు ఫోజులిచ్చారు. అమెరికా నావికుడు, తెల్లని దుస్తుల్లో ఉన్న మహిళలను ముద్దాడుతూ ఉన్న ఫోటో అది. ఆనాటి యుద్ధంలో పాల్గొన్న రే అండ్ ఇల్లీ దంపతులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అలనాటి అనుభవాలను తలచుకుని ఉద్విగ్నభరితంగా మారిపోయారు. వీరి పెళ్లిరోజు కూడా శుక్రవారమే. ప్రపంచ దేశాలను వణికించిన రెండవ ప్రపంచ యుద్ధం 1945 సంవత్సరం ఆగస్టు14న ముగిసింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో మిత్ర రాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియెట్ యూనియన్... జపాన్‌తో తమకు గల తటస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి జపాన్ ఆధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి వశపరచుకుంది. అదే సమయంలో అమెరికా జపాన్ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకీ లపై అణుబాంబులను ప్రయోగించటంతో తప్పని పరిస్థితిలో జపాన్ కూడా లొంగిపోయింది. -
ఏమిటీ 'ముద్దు గోల'
ఇటీవల కేరళలో ప్రారంభమైన ముద్దుల గోల అవమానకరంగా ఉంది. ఏం సాధించాలని విద్యార్థులు ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు? ఉద్యమాల బాట వీడి ముద్దుల బాట పడతామని వారు అనడం విచారకరం. కల్చరల్ పోలీసింగ్‌కు నిరసన తెలియచేయాలంటే ఇదా మార్గం? వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వేరే విధంగా నిరసన తెలియ చేయవచ్చు. వ్యక్తి స్వేచ్ఛకూ మతానికీ ముడిపెడితే దానికి కూడా అభ్యంతరం చెప్పవచ్చు. కానీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇలా ముద్దులు ఎందుకు పెట్టుకోవాలి? అప్పుడైనా ఎవరో అందమైన బాలిక దగ్గరే కుర్రకారు అంతా కనిపించింది తప్ప, మామూలు బాలికలు ఎవరూ ఇందులో పాల్గొనలేదు కదా! పాల్గొన్నా వారిని అబ్బాయిలు ఆకర్షించలేదా? ఒకనాడు తమ మనోభావాలను వ్యక్తీకరించడానికి విద్యార్థులు గొప్ప ఉద్యమాలు చేశారు. సినిమాలలో ముద్దు సీన్లకు వ్యతిరేకంగా పోరాడివారే ఇప్పుడు వ్యక్తి స్వేచ్ఛకు భంగం పేరుతో బహిరంగ ముద్దులను ప్రేరేపించడం ఏమిటి? ఇదంతా విద్యార్థులలో, యువతలో తీవ్రంగా ఆలోచించగలిగే మనస్తత్వం నశించిపోవడమే. దీనిని సరిదిద్దాలి. బి. సాయికిరణ్ గుంటూరు నత్తనడకన 'బాబు'పాలన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు నత్తనడకను తలపించింది. ఈ వ్యవధిలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టకపోవడం దురదృష్టకరం. రైతు రుణ మాఫీ అంటూ వాగ్దానాలను కురిపిం చి అధికారాన్ని చేపట్టిన చంద్రబాబు, ఆ దిశగా ఇప్పటికీ సుస్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం రైతుల్లో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఒక వైపు బ్యాంకర్ల ఒత్తిడి, మరోవైపు ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతో రైతులు రుణాలు పొందాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. మరోవైపు డ్వాక్రా రుణాలను లక్ష రూపాయల వరకే మాఫీ ప్రకటించారు. ఒక్కో గ్రూపులో పది మందికి పైగా సభ్యులున్న మహిళలకు దీని వల్ల ఒనగూరేది అంతంత మాత్రమే. చౌక దుకాణ వస్తువుల సరఫ రాను గ్రామాల్లో 2 రోజులకు, పట్టణ, నగరాల్లో 3 రోజులకు కుదించడం హేయమైన చర్య. కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికీ ఆధార్ లేకపోయినా బియ్యం కోత పెడుతున్నారు. ఇదెక్కడి న్యాయం? కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా ప్రజల మనసెరిగి పాలించేందుకు సమాయత్తం కాచాలి. బట్టా రామకృష్ణదేవాంగ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా న్యాయమే అయినా, సమస్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండటం చాలా వరకు న్యాయమే. అయితే అక్కడ రాజధానిని నిర్మిస్తే మనకున్న భౌగోళిక స్థితి వల్ల చాలా వరకు పంట భూములను కోల్పోవలసి వస్తుంది. ఇప్పటికి చాలా మంది రైతులు వ్యవసాయం లాభసాటిగా లేదంటున్నారు. మనిషిని బతికించేది ఆహారం. ఆ కొరత రానివ్వకుండా ఆంధ్ర అన్నపూర్ణగానే ఉండాలి. రాయలసీమ వాసులు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల వారిని ప్రత్యేకంగా గౌరవిస్తారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక చాలా బాగుంది. వారి సూచనకు మౌలిక మార్పులతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చు. భారతదేశంలో చివరిసారిగా రెండు ముక్కలైంది మన తెలుగు రాష్ట్రమే ఇప్పుడు అభివృద్ధి అంటే ఆంధ్రను చూసి నేర్చుకోవాలని మిగిలిన రాష్ట్రాలు అనుకోవాలి. ఈ విషయంలో నేతలు వినాయకులుగా మారకుండా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తమ ప్రత్యేకతను నిరూపించుకోవలసిందే! ఏ రాష్ట్రానికి లేని సముద్ర తీర ప్రాంతం మనకు మాత్రమే ఉంది. ఒకరకంగా అదృష్టం. మైనేపల్లి సుబ్రహ్మణ్యం ఆకునూరు, కృష్ణా జిల్లా -
బాలా, పూజా చుంబనాలు
దర్శకుడు బాలా, నటి పూజా పరస్పర చుంబన దృశ్యాలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు కోలీవుడ్‌లో కలకలం పుట్టిస్తున్నాయి. సాధారణంగా నటీనటులు ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం పరిపాటి. ఇక్కడ దర్శకుడు, నాయకి ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడంతో రకరకాల వదంతులు హల్చల్ చేస్తున్నాయి. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు బాలా. ఈయన దర్శకత్వం వహించిన నాన్ కడవుల్ చిత్రంలో ఆర్య హీరోగాను, పూజా హీరోయిన్‌గాను నటించారు. ఇందులో అంధురాలిగా నటించిన పూజా నటనకు పలువురి ప్రశంసలు లభించాయి. అయితే తరువాత బాలా తన పరదేశి చిత్రంలో అవకాశం ఇచ్చినా పూజా నటించలేదు. కారణం సింగిల్ చిత్రాలతో బిజీగా వున్నానని చెప్పింది. కొంత కాలంగా అవకాశాలు లేకనో, ఇతర కారణాల వల్లనో నటనకు దూరంగా ఉన్న పూజా ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యింది. దీంతో ఇటీవల దర్శకుడు బాలాతో కలసి అవకాశం అడిగిందట. అంతటితో ఆగకుండా అనూహ్యంగా ఆయనపై ముద్దుల వర్షం కురిపించడం ప్రతిగా ముద్దివ్వమనడంతో బాలా కూడా పూజా బుగ్గలపై ముద్దు పెట్టేశారు. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో రకరకాల వదంతులకు దారి తీస్తోంది. -
'ప్రియురాలికి ప్రేమ ముద్దు, పిల్లలకు బర్త్‌డే ముద్దు'
తిరువనంతపురం : ఎస్ఎంఎస్ లు మొన్నటి మాట. ఎమెమ్మెస్లు నిన్నటి మాట. మరి నేడు...? 'కిస్ఎంఎస్'లదే హవా. ముద్దులు పంపే ఈ వినూత్న మొబైల్ అప్లికేషన్ ప్రేమికుల రోజు సందర్భంగా మార్కెట్లోకి విడుదలైంది. ప్రేమికులు ముద్దులు పంపుకోవడానికి మాత్రమే కాదు... కుటుంబమంతా సంబంధాలను బట్టి ఆయా ముద్దులను పంపుకునేందుకూ ఈ కిస్ఎంఎస్ యాప్ ఉపయోగపడుతుందట. ఉదాహరణకు...ప్రియురాలికి ప్రేమ ముద్దు, పిల్లలకు బర్త్‌డే ముద్దు, అనారోగ్యంతో ఉన్నవారికి గెట్వెల్ సూన్ ముద్దు, ఇంకా గుడ్ మార్నింగ్ ముద్దు, న్యూఇయర్ ముద్దు, మిస్‌యూ ముద్దులూ... పూలబొకేలూ దీని ద్వారా పంపొచ్చు. ఫోన్లో మనకు నచ్చినవారి ఫోటోపై ఊ... ఉంటూ ముద్దు పెడుతూ ఆ ముద్దును 10 సెకన్ల ఆడియోతో సహా వారికి సెండ్ చేయొచ్చు. వోల్మాచ్ బిజినెస్ సొల్యూషన్స్ అనే కంపెనీ తయారు చేసిన ఈ యాప్ ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లపై పనిచేస్తుంది. పాస్ కోడ్ ప్రొటెక్షన్‌తో ఈ ముద్దులకు పూర్తి రక్షణ ఉంటుందని కంపెనీవారు చెబుతున్నారు. అన్నట్టూ... అవతలివారిపై కోపం ఉందనుకోండి... వారి ముద్దులను తిరస్కరించి, కోపం తగ్గిన తర్వాత ఆ ముద్దులను స్వీకరించేందుకు కూడా ఈ యాప్‌తో వీలవుతుందట.