
Girl Kisses and Cuddles Her Pet Snake Video: సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి రావడం కోసం చాలామంది ఇటీవల కాలంలో పాములతో ఒళ్లు గగుర్పాటుకి గురిచేసే విధంగా రకరకాల విన్యాసాలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పైగా అవి ఒక్కొసారి వికటించి ప్రాణాల మీదకి కూడా తెచ్చుకుంటున్నారు. అంతేకాదు వాటిని పట్టుకుని డ్యాన్సుల చేయడం వంటివి కూడా చేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక అమ్మాయి తన పెంపుడు పాము(కొండచిలువ)ని ముద్దుపెట్టుకున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.
(చదవండి: లాక్‌డౌన్‌లో ప్రజలకు ఎంత జుట్టు పెరిగిందో చెప్పేందుకే..!)
అయితే ఆ అమ్మాయి ఈ వీడియోలో తన పెంపుడు పామును కౌగలించుకుని మంచంపై పడుకుని ఉంటుంది. పైగా ఆ పాము తల ఆమె పెదాల దగరకు రాగానే ముద్దుపెడుతుంది. అంతే ఆ పాము ఆశ్చర్యంగా నోరు తెరుస్తుంది. దీంతో ఆమె నవ్వుతూ ఐ లవ్ యూ అంటూ మళ్లీ ముద్దు పెడుతుంది. అది కూడా నేను కూడా ప్రేమిస్తున్నాను అంటూ ఆ పాము కూడా తన తలను ప్రేమగా ఆ అమ్మాయి బుగ్గ పై ఆనించింది. దీంతో నెటిజన్లు పాములు కూడ ఇంత ప్రేమగా ఉంటాయా, ఇలా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయా అంటూ ఆశ్చర్యపోతూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment