
సాధారణంగా మనం పామును దూరం నుంచి చూస్తేనే హడలిపోతాం.. ఆమడదూరం పరిగెత్తుతాం.. కానీ అమెరికాకు చెందిన జే బ్య్రూవర్ అనే జూ కీపర్‌కు మాత్రం ఇలాంటి భయమేమీ లేదు. పైగా అన్ని సరీసృపాలను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంటాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను నెటిజన్లతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాడు.
తాజాగా అతను ఇంధ్రదనుస్సు రంగుల్లో ఉన్న ఓ భారీ కొండచిలువ (రెటిక్యులేటెడ్ పైథాన్) తలను సుతారంగా నిమురుతూ దాన్ని హత్తుకుంటున్న వీడియో నెటిజన్లను అవాక్కు చేసింది. అయితే ఆ కొండచిలువను మచ్చిక చేసుకోవడం అంత వీజీగా ఏమీ జరగలేదని.. ఎన్నో ఏళ్లపాటు దాన్ని కంటికి రెప్పలా చూసుకున్నానని.. అందుకే తనతో కొండచిలువ ‘స్నేహం’ చేస్తోందని వీడియోలో అతను చెప్పుకొచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అతను పోస్టు చేసిన ఈ వీడియో తెగ వైరల్ అయింది. ఇప్పటివరకు 10 లక్షలసార్లకుపైగా నెటిజన్లు వీడియోను చూసి ఫిదా అయ్యారు. ఈ వీడియోను లక్ష మందికిపైగా ‘లైక్’ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment