Shocking: Chinese Man Opening Coffins At Ancient Burial Site, Kissing Skulls - Sakshi
Sakshi News home page

వికృత ప్రవర్తన: శవపేటికలోని అస్థిపంజరాలకు ముద్దు పెట్టి వీడియో..

Published Tue, Feb 28 2023 1:05 PM | Last Updated on Tue, Feb 28 2023 3:27 PM

Chinese Man Desecrates Coffins At Ancient Cemetery Kisses Skulls - Sakshi

'పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి' అన్న నానుడిలా కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అవి హద్దులు దాటి వికృతంగా మారితేనే ప్రమాదం. విచిత్ర ప్రవర్తనలతో పేరుగాంచాలనో లేక మరే ఏ ఉద్దేశ్యంగానో పాపం అదే వారిని కటకటాల పాలు చేయడం లేదా వారికే ప్రాణాంతకమవ్వడం జరుగుతుంది. అచ్చం అలాంటి ఓ ఘటన చైనాలో వెలుగుచూసింది.

ఏం జరిగిందంటే.. చైనాలో 21 ఏళ్ల వ్యక్తి టీవీలో పలు ఆసక్తికర లైవ్‌ టెలీకాస్టింగ్‌లను ప్రసారం చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తుంటాడు. తన ఇమేజ్‌ పెంచుకునేందుకో ఏమో తెలియదు గానీ.. ఓ చెత్త పని అనాలో లేదా విచిత్రమైన పని అనాలో తెలియని వికృత పని చేశాడు. ఓ స్మశానవాటికకు వెళ్లి అక్కడ శవపేటికలోని అస్థిపంజరాలను ముద్దు పెట్టుకుంటూ..లైవ్‌ వీడియో తీసి ప్రసారం చేశాడు.

అలా మొత్తం మూడు శవపేటికలను తన స్నేహితుల సాయంతో ఓపెన్‌ చేసి.. ఆ ఆస్థిపంజరాలను, పుర్రెలను ముద్దు పెట్టుకోవడం వంటి విచిత్రమైన పనులు చేశాడు. దీన్ని గమినించిన సమీపంలోని గ్రామస్తులు పట్లుకుని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా సదరు వ్యక్తికి తొమ్మిది నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటన గతేడాది మార్చిలో జరిగినట్లు సమాచారం. ఇలాంటి వికృతి చర్యలు నెక్రోఫిలియా లక్షణం అని, దీని కారణంగా మృతదేహాలతో ఇలాంటి విచిత్ర పనులు చేస్తుంటారని చైనాలోని నిపుణులు చెబుతున్నారు. అలాంటివారు మృతదేహాలపై వ్యామోహం పెంచుకుని ఇలాంటి చేష్టలకు దిగుతారని అంటున్నారు. 
(చదవండి: 'మా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామి భారత్‌": యూఎస్‌ పొగడ్తల జల్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement