నవ్వకురా చెడేవు అని ఓ సామెత ఉంది. నవ్వు నాలుగిందాల చేటు అని కూడా అంటారు. సమయం సందర్భం చూసుకుని నవ్వితే పర్వాలేదు గానీ, అదేమీ లేకుండా ఇష్టం వచ్చినట్లు నవ్వితే ఇలాగే ఉంటుంది. అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదాన్ని చూసి నవ్వినందుకు.. చైనాలో ఓ అధికారికి ఏకంగా 14 సంవత్సరాల జైలుశిక్ష పడింది. ఈ మేరకు అక్కడి కోర్టు తీర్పునిచ్చింది.
దీంతో పాటు మరో అవినీతిపరుడికి కూడా భారీగా జరిమానా విధించారు. యాంగ్ డకాయ్ అనే వ్యక్తి షాంగ్జి రాష్ట్రంలో పని ప్రదేశాల్లో భద్రతను చూసే శాఖకు అధినేతగా ఉండేవారు. ఆయన లంచాలు తీసుకుంటూ.. భారీగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు పోలీసుల విచారణలో ఉంది. ఇతడికి జియన్ సిటీలోని కోర్టు 5,41,200 రూపాయల జరిమానా విధించారు.
ప్రమాదం చూసి నవ్వినందుకు 14 ఏళ్ల జైలుశిక్ష
Published Thu, Sep 5 2013 10:30 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement