కరీంనగర్: తమపై పెట్టిన హత్యాయత్నం కేసు ను రాజీ కుదర్చుకోవడం లేదనే కారణంతో ఓ వ్యక్తి ని హత్య చేసిన అన్నదమ్ములకు యావజ్జీవ శిక్షతోపా టు రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ జగిత్యా ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ మంగళవారం తీర్పు చెప్పారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లికా ర్జున్ కథనం ప్రకారం.. మెట్‌పల్లి మండలం వేంపేట కు చెందిన ధనరేకుల రాజేందర్ వ్యవసాయంతోపా టు ఉపాధిహామీలో మేట్‌గా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడంటూ సదరు మహిళ భర్త జెల్ల రమేశ్, అతని తమ్ముడు జెల్ల మహేశ్ 2020 మార్చి 3న కత్తితో రాజేందర్‌పై దాడి చేశారు. దీంతో రాజేందర్ మెట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అన్నదమ్ములపై కేసు నమోదైంది.
ఇద్దరూ జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చారు. ఆ కేసును రాజీ చేసుకోవా లంటూ పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ జరిగింది. రాజీకి రాజేందర్ ససేమిరా అన్నాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని అన్నదమ్ములు నిర్ణయించుకున్నారు. 2020 మే 19న గ్రా మ శివారులో ఉపాధి హామీ పనులకు వెళ్లిన రాజేందర్‌పై జెల్ల రమేశ్, జెల్ల మహేశ్ విచక్షణరహితంగా కత్తులతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందా డు.
రాజేందర్ భార్య హరిణి ఫిర్యాదు మేరకు అప్ప టి మెట్‌పల్లి ఎస్సై ఎన్.సదాకర్ కేసు నమోదు చేశా రు. అప్పటి సీఐలు రవికుమార్, ఎల్.శ్రీనివాస్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధి కారులు కిరణ్‌కుమార్, రంజిత్‌కుమార్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించిన జడ్జి రమేశ్, మహేశ్‌కు యావజ్జీవ శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment