Skulls
-
జీసస్ ఎలా కనిపించేవారంటే..?! పరిశోధనలో షాకింగ్ విషయాలు
జీసస్ లేదా ఏసుక్రీస్తూ ఎలా ఉంటారో మనకు తెలిసిందే. మనం చూసిన కొన్ని ఫోటోలు, టీవీల్లోనూ పొడవాటి జుట్టుతో పై నుంచి కింద వరకు ఓ గౌను మాదిరి తెల్లటి లేదా నీలం డ్రస్ వేసుకుని, గడ్డంతోనే చూశాం. ఆయన చేతి వేళ్లు బాగా పొడుగ్గా ఉన్నట్లు చిత్రాల్లో చూపించేవారు. పాశ్చాత్య చిత్రాల్లో కూడా మనం అలానే చూశాం. అయితే నిజానికి ఆయన ఎలా ఉండేవారు? ఆయన ముఖ చిత్రం ఎలా ఉండేది అనేదానిపై చాలా మందికి పలు సందేహాలు ఉన్నాయి. ఆయను రియల్ లుక్ ఎలా ఉండేది అనే దానిపై జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు. వివరాల్లోకెళ్తే..ఏసుక్రీస్తు నిజంగా మనం చూసిన చిత్రాల్లో ఉన్నట్లే ఉంటారా? లేక ఎలా ఉండేవారనేది పలు శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఆ దిశగా జరిపిన పరిశోధనలో..కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసిద్ధి పొందిన తొలి ఏసు క్రీస్తు చిత్రం గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది. ఆ తర్వాత నాల్గో శతాబ్దం నుంచి బైజాంటైన్ యుగపు మెస్సీయ వర్ణనతో కూడిని చిత్రాలు మనస్సుల్లో బాగా నిలిచిపోయాయి. దాన్ని బట్టి క్రీస్తూ ఇలా ఉండేవారనేది ఓ ఊహ మాత్రమే కానీ వాటిల్లో కచ్చితత్వం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి ఆయన చిత్రాలు సింహాసనంపై ఒక చక్రవర్తిలా కూర్చున్న ఏసు చిత్రం ఆధారంగా వచ్చినవే. ఈ ఏసు చిత్రం రోమ్‌లో శాంటా ప్యూడెన్జైనా చర్చిలోని మొజాయిక్‌లో కనిపిస్తుంది. అందులో పొడవాటి జుట్టు, గడ్డంతో సింహాసనంపై కూర్చొన్న ఆయన జూస్ మాదిరిగా కనిపిస్తారు. జూస్ అంటే ప్రాచీన గ్రీకు మతంలో ప్రధాన దేవుడు. ఒలింపియా ఆయన దేవాలయం. అందులోని ఆయన విగ్రహం ఆధారంగానే ఏసుక్రీస్తు చిత్రాలు వచ్చాయని అన్నారు పరిశోధకులు. బైజాంటియన్ కళాకారులు ఏసుక్రీస్తును స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించారు. వారు ఆయన్ను యువ జూస్ రూపంలో చూపించేవారు. కానీ, కాలక్రమేణా స్వర్గానికి చెందిన ఏసుక్రీస్తు చిత్రాల విజువలైజేషన్లో మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఏసు క్రీస్తూ ఎలా ఉంటారనేది అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉండేది శాస్త్రవేత్తలను. ఈ నేపథ్యంలోనే ఏసు తల నుంచి పాదాల వరకు ఆయన రూపం ఎలా ఉంటుందనే దానిపై కూలకషంగా పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు రిచర్డ్ నీవ్ నేతృత్వంలోని బ్రిటీష్ ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్టుల బృందం ఇజ్రాయెల్ పురావస్తు ప్రదేశాల్లోని పుర్రెలను పరిశీలించడం, బైబిల్ గ్రంధాలు, చారిత్రక ఆధారాలను విశ్లేషించడం తదితర పనులు చేశారు. వారంతా ఏసు ఎలా కనిపించేవాడో అనే దిశగా అతని ప్రసిద్ధ ముఖ చిత్రాన్ని పునర్నిర్మించాలానే దిశగా శోధించడం ప్రారంభించారు. ప్రముఖ ప్రాంతాల్లో లభించిన కొన్ని రకాల పుర్రెల ఆధారంగా రూపొందించే దిశగా అడుగులు వేశారు. ఆ పరిశోధనల్లో..అతను ఒకటవ శతాబ్దపు యూదు మనిషిలాగా ఉండేవారని, ముదురు రంగు చర్మంతో , పొట్టి పొట్టి గిరజాల జుట్లుతో ఉండేవారని కనుగొన్నారు. నిపుణల అభిప్రాయం ప్రకారం ఆయన రూపం మనం చూసే చిత్ర రూపానికి దగ్గరగానే ఉంటుందని అన్నారు. అతని ఆ కాలంలోనే పురుషుల కంటే విభిన్నంగా కనిపించేవాడని కూడా చెప్పుకొచ్చారు. ఓ విశేషమైన వ్యక్తిత్వం కలవాడిగా సుస్పష్టంగా అనిపించేదాన్ని అందువల్లే కొందరూ ఆయన్ని దేవుని కుమారుడిగా కీర్తించి ఉండవచ్చని అన్నారు. ఆ ఫోరెన్సిక్ బృందం రూపొందించిన ముఖం చేస్తే ఏసు ముఖం ఇలా ఉండేదా..? అనిపిస్తుంది. ఇది మనం చూసే ఏసు ముఖానికి కాస్త విభిన్నంగా ఉంది. కానీ ఏసుని స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించే చిత్రాలను రూపొందించడంతో ఆయన అలా ఉంటారనే అనుకున్నాం. ఎందుకంటే బైబిల్ని విశ్లేషిస్తే ప్రజలు మొదట్లో ఆయన్ని దేవుడిగా భావించలేదు ఓ సాధారణ మనిషిలానే భావించేవారు. అప్పుడు ఆయనకు గడ్డం గానీ పొడవాటి జుట్టు కానీ లేదు. గ్రీకు-రోమన్ కాలంలో శుభ్రంగా గడ్డం చేసుకోవడం, జుట్టు పొట్టిగా ఉండడం తప్పనిసరిగా భావించేవారు. మెడ వరకూ ఉన్న జుట్టు, గడ్డం దైవత్వాన్ని సూచిస్తుంది. అప్పటి పురుషులకు అలాంటి రూపం ఉండేది కాదు. తత్వవేత్తలు కూడా చాలా పొట్టి జుట్టుతోనే ఉండేవారు. చెదిరిన జుట్టు, గడ్డం వేదాంతులకు చిహ్నంగా భావించి ఉండవచ్చు. అందువల్ల ఏసు క్రీస్తూ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని అంటున్నారు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆయన ఓ విశిష్టమైన వ్యక్తిలా అందర్నీ అబ్బురపరిచేలా ఉండేవారని, దీంతో మొదట్లో సాధారణ మనిషిలా చూసిన వారు ఆయన మంచి వ్యక్తిత్తత్వానికి దాసోహం అయ్యి దేవుడిలా భావించడం జరిగింది. అదీగాక స్వాభావికంగా మంచి పనుల చేసే వ్యక్తులను దేవత్వం కలిగినా లేదా దేవడిచ్చిన వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఆయన ముఖ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని జీసస్: ది కంప్లీట్ స్టోరీ పేరుతో చేసిన పరిశోధన డాక్యుమెంటరీలో వెల్లడించింది ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల బృందం. (చదవండి: పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్ క్రిస్మస్ ట్రీ) -
40 అస్తిపంజరాలతో ఇల్లు డెకరేషన్.. తీగలాగితే..
వాషింగ్టన్: అమెరికాలో ఎఫ్.బి.ఐ అధికారులకి ఒక విచిత్రమైన కేసు ఎదురైంది. కెంటక్కీలోని ఒక వ్యక్తి మీద అనుమానంతో అతడి తలుపు తట్టి లోపల ఎవరున్నారని అడగగా నేను, నాతో పాటు చనిపోయిన నా స్నేహితులు ఉన్నారని చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు. ఇంటి లోపలికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా మొత్తం 40 పుర్రెలు, వెన్నుపూసలు చక్కగా అలంకరించి ఉన్నాయి. దీంతో అధికారులు అతడిని వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల హార్వార్డ్ మెడికల్ స్కూల్ శవాగారం నుండి చాలా వరకు మృతదేహాల అవశేషాలు దొంగిలించబడుతున్నాయని ఎఫ్.బి.ఐకి ఫిర్యాదు చేశారు సదరు స్కూలు సిబ్బంది. అప్పటి నుండి కేసు దర్యాప్తు చేసున్న ఎఫ్.బి.ఐ అధికారులకు కెంటక్కీకి చెందిన జేమ్స్ నాట్(39) పై అనుమానం వచ్చింది. పోలీసులు అతడి తలుపు తట్టి లోపల ఎవరున్నారని అడగగా చనిపోయిన నా స్నేహితులు ఉన్నారని విచిత్రమైన సమాధానమిచ్చాడట. ఇంకేముంది పోలీసులు దౌర్జన్యంగా ఇంటిలోకి చొరబడి చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి నిండా ఎక్కడ చూసినా ఆస్తిపంజరాలు, పుర్రెలే. ఫర్నీచర్ చుట్టూ మానవ అవశేషాలను చక్కగా అలంకరించుకున్నాడట జేమ్స్. ఒక హార్వార్డ్ స్కూలుకు సంబంధించిన బ్యాగ్ కూడా అక్కడ దొరకడంతో తాము వెతుకుతున్న నేరస్తులలో జేమ్స్ ఉండి ఉంటాడని అనుమానంతో దర్యాప్తు చేశారు అధికారులు. తీగలాగితే.. జేమ్స్ నాట్ ఇల్లంతా తనిఖీలు నిర్వహించగా మొత్తం 40 పుర్రెలు, వెన్నుపూసలు దొరికాయి. అతడి పేస్ బుక్ మెసేజులన్నీ పరిశీలించగా అతడు జెరెమి పాలీ అనే వ్యక్తితో మానవ అవశేషాల కొనుగోలుకు సంబంధించి లావాదేవీలు నడుపుతున్న విషయం బయటపడింది. ఇంటిలో కొన్ని మారణాయుధాలు కూడా దొరకడంతో అక్రమ్మగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న నెపంతోనూ, నిషేధిత వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న నేరం కింద జేమ్స్ నాట్ ని అరెస్టు చేశారు. జెరెమి పాలీ కోసం గాలిస్తున్నారు. జెరెమి పాలీ, జేమ్స్ నాట్ వీరంతా మానవ అవశేషాలను విక్రయించే ముఠాకు చెందిన వారిని.. వీరు శరీరంలోని ఎముకల తోపాటు చర్మాన్ని కూడా అమ్ముకుంటారని తెలిపారు ఎఫ్.బి.ఐ అధికారులు. ఇది కూడా చదవండి: భారత ప్రధానికి ఫ్రాన్స్ అధ్యక్షుడి అపురూప కానుక.. -
వికృత ప్రవర్తన: శవపేటికలోని అస్థిపంజరాలకు ముద్దు పెట్టి వీడియో..
'పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి' అన్న నానుడిలా కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అవి హద్దులు దాటి వికృతంగా మారితేనే ప్రమాదం. విచిత్ర ప్రవర్తనలతో పేరుగాంచాలనో లేక మరే ఏ ఉద్దేశ్యంగానో పాపం అదే వారిని కటకటాల పాలు చేయడం లేదా వారికే ప్రాణాంతకమవ్వడం జరుగుతుంది. అచ్చం అలాంటి ఓ ఘటన చైనాలో వెలుగుచూసింది. ఏం జరిగిందంటే.. చైనాలో 21 ఏళ్ల వ్యక్తి టీవీలో పలు ఆసక్తికర లైవ్ టెలీకాస్టింగ్లను ప్రసారం చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తుంటాడు. తన ఇమేజ్ పెంచుకునేందుకో ఏమో తెలియదు గానీ.. ఓ చెత్త పని అనాలో లేదా విచిత్రమైన పని అనాలో తెలియని వికృత పని చేశాడు. ఓ స్మశానవాటికకు వెళ్లి అక్కడ శవపేటికలోని అస్థిపంజరాలను ముద్దు పెట్టుకుంటూ..లైవ్ వీడియో తీసి ప్రసారం చేశాడు. అలా మొత్తం మూడు శవపేటికలను తన స్నేహితుల సాయంతో ఓపెన్ చేసి.. ఆ ఆస్థిపంజరాలను, పుర్రెలను ముద్దు పెట్టుకోవడం వంటి విచిత్రమైన పనులు చేశాడు. దీన్ని గమినించిన సమీపంలోని గ్రామస్తులు పట్లుకుని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా సదరు వ్యక్తికి తొమ్మిది నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటన గతేడాది మార్చిలో జరిగినట్లు సమాచారం. ఇలాంటి వికృతి చర్యలు నెక్రోఫిలియా లక్షణం అని, దీని కారణంగా మృతదేహాలతో ఇలాంటి విచిత్ర పనులు చేస్తుంటారని చైనాలోని నిపుణులు చెబుతున్నారు. అలాంటివారు మృతదేహాలపై వ్యామోహం పెంచుకుని ఇలాంటి చేష్టలకు దిగుతారని అంటున్నారు. (చదవండి: 'మా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామి భారత్": యూఎస్ పొగడ్తల జల్లు) -
ఎయిర్‌పోర్ట్‌లో మానవ పుర్రెల కలకలం.. షాక్‌లో అధికారులు
మెక్సికో విమానాశ్రయంలో యునైటెడ్స్టేట్స్కు వెళ్లే ప్యాకేజీలో మానవ పుర్రెలు ఉన్నాయంటూ కలకలం రేగింది. ఈ మేరకు సెంట్రల్ మెక్సికోలోని క్వెరెటారో ఇంటర్కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక కార్డ్బోర్డ్ పెట్టేలో అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టబడిన పుర్రెలు కనుగొన్నారు అధికారులు. ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఈ ప్యాకేజిని అధికారులు గుర్తించారు. దేశంలో అత్యంత హింసాత్మకమైన ప్రాంతాలలో ఒకటైన పశ్చిమ తీర రాష్ట్రమైన మిచోకాన్ నుంచి ప్యాకేజి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇది సౌత్ కరోలినాలోని మన్నింగ్‌లోని చిరునామకు వెళ్లనుందని తెలిపారు. ఆ మానవ అవశేషాలు ఏ వయసు వారివి? ఎవరివీ? అనే వివరాలు తెలియాల్సి ఉందని చెబుతున్నారు. వాస్తవానికి మానవ అవశేషాలను పంపించాలంటే హెల్త్ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ఐతే ఈ ప్యాకేజి ఆ అనుమతిని పొందలేదని ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఇలానే కెన్యా నుంచి అమెరికాకు జిరాఫీ, జీబ్రా ఎముకలను తీసుకురావడానికి ప్రయత్నించినందుకు వాషింగ్టన్ డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది ఒక మహిళను అడ్డుకున్నారని కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) తన నివేదికలో పేర్కొంది. (చదవండి: చైనాకు చేయి అందించి సాయం చేస్తానన్న తైవాన్.. షాక్‌లో బీజింగ్) -
160 ఏళ్ల తర్వాత ‘కపాల మోక్షం’
సాక్షి, హైదరాబాద్: 160 ఏళ్ల మిస్టరీ వీడిపోయింది. పంజాబ్‌లోని ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ పుర్రెలు ఎవరివో తేలిపోయింది. ఎనిమిదేళ్ల క్రితం అంటే 2014లో అజ్నాలా పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో పెద్ద ఎత్తున బయటపడ్డ మానవ కపాలాలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ప్రకటించింది. ఇప్పటివరకూ ఈ కపాలాలు 1857 నాటి తిరుగుబాటులో బ్రిటిషర్ల చేతిలో హతమైన సిపాయిలవని, కొందరు చరిత్రకారులు చెబుతుండగా.. మరికొందరు 1947 నాటి దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో మరణించిన వారివి కావచ్చనని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు ఏదీ నిర్ధారణ కాలేదు. ఈ నేపథ్యంలో పంజాబ్ యూనివర్సిటీకి చెందిన మానవ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సెహ్రావత్.. సీసీఎంబీ, లక్నోలోని బీర్బల్ సాహ్నీ ఇన్స్టిట్యూట్, బెనారస్ హిందూ యూనివర్సిటీలతో కలిసి ఈ పుర్రెల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సీసీఎంబీ పుర్రెల నుంచి డీఎన్ఏను వెలికితీసి పరిశీలించగా.. మరణించిన వారు గంగా నదీ ప్రాంతానికి చెందిన వారని స్పష్టమైంది. ఫ్రాంటియర్స్ ఆఫ్ జెనిటిక్స్ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ సైనికులవి! ‘ఈ పరిశోధన ఫలితాలు చారిత్రక ఆధారాలతోనూ సరిపోతున్నాయి. ఎందుకంటే.. 26వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్‌లో బెంగాల్ తూర్పు ప్రాంతపు ప్రజలతో పాటు ఒడిశా, బిహార్, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన వారూ ఉండేవారని చరిత్ర చెబుతోంది’ అని డాక్టర్ సెహ్రావత్ వివరించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఆ బెటాలియన్‌కు చెందిన సైనికులను ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలోని మియాన్ మీర్ ప్రాంతంలో నియమించారు. బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేసిన వీరు కొందరిని హతమార్చారు కూడా. అయితే ఆ తరువాతి కాలంలో బ్రిటిష్ అధికారులు వీరిని అజ్నాలా సమీపంలో బంధించి చంపివేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పరిశోధన ఫలితాలు భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని చేరుస్తాయని, ఇప్పటివరకూ ఎవరూ గుర్తించని తొలి స్వాతంత్య్ర సంగ్రామం ఇదే కావచ్చునని ఈ పరిశోధనలో ముఖ్యపాత్ర పోషించిన బెనారస్ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే తెలిపారు. పలు చారిత్రక మిస్టరీలను ఛేదించేందుకు తాము భవిష్యత్తులోనూ ఇలాంటి పరిశోధనలు చేపడతామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. పంజాబ్, పాకిస్తాన్ ప్రజలవి కాదు అజ్నాలాలో బయటపడ్డ పుర్రెల నుంచి 50 శాంపిల్స్‌ను సేకరించి డీఎన్ఏ ఐసోటోపులను పరిశీలించామని..ఆ ప్రజల పూర్వీకులు, ఆహారపు అలవాట్లు తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడ్డాయని సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ డైరెక్టర్ డాక్టర్ కె.తంగరాజ్ తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం ఈ పుర్రెలు పంజాబ్, పాకిస్తాన్ ప్రాంతాల ప్రజలకు చెందినవి కానే కాదని, వీటి డీఎన్ఏ.. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ ప్రజల డీఎన్ఏతో సరిపోలుతోందని వివరించారు. -
మనషుల పుర్రెలతో పండుగ చేస్తారంట..!
బొలివీయా: కుటుంబంలో చనిపోయిన వారి ప్రతిరూపంగా వారిపేరు మీద ధాన ధర్మాలు చేయటం మనం చూసింటాం. కానీ బొలివియా ప్రజలు మాత్రం తమదైన రీతిలో ప్రేమను చాటుకుంటున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో బొలివీయా ప్రజలు నటిటాస్ పండుగ జరుపుకుంటారు. కుంటుంబంలో చనిపోయిన వారి పుర్రెలను పూలతో చాలా అందంగా డెకరేట్ చేస్తారు. వాటిని ఈ సందర్భంగా ఎంతగానో ఆరాదిస్తారు. చనిపోయిన వాళ్లు మళ్లీ పుడుతారనే నమ్మకంతో ఈ విధంగా చేస్తారు. అంతేకాక తమ జీవితం చాలా అందంగా ఉండేలా చూడాలని ఆ పుర్రెలను కోరుతారు. అంతేకాక వారి ప్రతిరూపంగా పుర్రెలను తమతో కుటుంబాలు ఉంచుకుంటాయంట. మరికొందరు ఆ పుర్రెలను ప్రార్థన ఆలయాలకు తీసుకెళ్లి ప్రార్థనలు చేస్తారని తెలిసింది. ఆ పుర్రెలను వారు పూలతో, కళ్లజోడు పెట్టి రకరకాలుగా ఆలంకరించి వారి ప్రేమను ఈ విధంగా చూపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఈ పండుగను డ్యాన్స్‌లతో చాలా సంతోషంగా జరుపుకుంటారని తెలుస్తోంది. మరికొన్ని పుర్రెలకు కుటుంబంలోని సభ్యులు సిగరేట్స్ నోట్లో పెట్టి, వాటి ముందు కొవ్వొత్తి పెట్టి అంటించుకున్నట్లుగా పెట్టి అభిమానాన్ని ఇలా చూపించారు. -
కపాల దీక్షకు కోలీవుడ్ మద్దతు
-
పుర్రెలు, ఎముకలతో భయాందోళన
తాండూరు: పట్టణంలో మనిషి పుర్రెలు, ఎముకలు కలకలం సృష్టించాయి. జనవాసాల సమీపంలో రోడ్డు పక్కన పుర్రె, ఎముకలు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సంఘటన బుధవారం తాండూరులో వెలుగు చూసింది. వివరాలు.. తాండూరులోని యాదిరెడ్డి చౌక్ నుంచి పోలీసుస్టేషన్ వెళ్లే మార్గంలో రోడ్డుపక్కన ఓ ప్లాస్టిక్ కవర్‌ను పారిశుద్ధ్య సిబ్బంది గుర్తించారు. అందులో చూడగా మనిషికి చెందిన రెండు పుర్రెలు, ఎముకలు, దంతాలు కనిపించాయి. కౌన్సిలర్ పట్లోళ్ల నర్సింలు సమాచారంతో ఎస్ఐ మహ్మద్ ఖలీల్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పుర్రెలు, ఎముకలు గుర్తుతెలియని వ్యక్తులు కొద్దిదూరంలో ఉన్న శ్మశానంలో క్షుద్రపూజల కోసం వినియోగించి పడేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. పుర్రెలు, ఎముకలపై ఇంగ్లీష్‌లో మెడికల్ టర్మినాలజీ పదాలు రాసి ఉన్నాయని ఎస్ఐ చెప్పారు. ఆస్పత్రుల నిర్వాహకులు, లేదా ఎంబీబీఎస్ విద్యార్థులు తమ చదువుల నిమిత్తం పుర్రెలను తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పుర్రెలు, ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
వెనుక తరాలు
టూకీగా ప్రపంచ చరిత్ర - 29 మచ్చలుమచ్చలుగా, పొడలు పొడలుగా రంగులు వేసిన నున్నటి గులకరాళ్ళు వాళ్ళ గుహల్లో చాలాచోట్ల కనిపిస్తాయి. వాటి ప్రయోజనం తెలుసునేందుకు ఆధారాలు దొరకలేదు. అవి ఆటలో ఉపయోగించే పాచికలైనా అయ్యుండాలి, లేదా తాంత్రిక తంతుల్లో ఉపయోగించే పిక్కలవంటివైనా అయ్యుండాలి. వాటితో జ్యోతిష్యం వంటిది చెప్పుకోనుంటారనే వాదనకు అవకాశం లేదు. ఎందుకంటే ఆనాటి మానవునికి ‘రేపు’ అనేది తెలీదుగాబట్టి. క్రోమాన్యాన్ మానవునికి తెలిసింది పగలు, రాత్రి మధ్య వ్యత్యాసం మాత్రమే; అంతకుమించిన కాలజ్ఞానంతో అతనికి అవసరమూలేదు, అవగాహనా లేదు. చీకటంటే భయం; అతని ఆందోళనకు ఉషోదయం ఊరట; సూర్యోదయంతో ధీమా తిరిగొస్తుంది. ఆ కారణంగానే మనిషి బుర్రలో విశ్వాసాలు ఏర్పడిన తొలిదశలోనే సూర్యుడు ఆరాధ్యుడైనాడు. సూర్యుడే మిత్రుడు, సూర్యుడే ప్రాణదాత. నైలునదీ నాగరికతలో చివరిదాకా సూర్యుడు ప్రధానమైన దేవత; ఫారో (చక్రవర్తి) సూర్యాంశ సంజాతుడు. చనిపోయిన ఆత్మీయులను ఖననం చేసే ఆచారాన్ని క్రోమాన్యాన్ మానవుడు విధిగా పాటించడంలో సాంస్కృతికమైన ఎదుగుదల కనిపిస్తుంది. అంటే, అతనిది కేవలం అన్యోన్యతలు ఏర్పడిన కుటుంబం మాత్రమే గాదు; అనుబంధాలు ఏర్పడిన కుటుంబం. సమాధుల్లో రాలిపడిన ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు రంగు పొడులను బట్టి, పూడ్చేముందు భౌతిక కాయాన్ని రంగులతో అలంకరించినట్టు తెలుస్తుంది. బహుశా, రెడ్ ఇండియన్లలాగా బతికున్నప్పుడు కూడా శరీరాన్ని రంగులతో అలంకరించుకునే అలవాటు వాళ్ళకు ఉండేదేమో. శవంతోపాటు పాతిపెట్టిన వస్తువుల్లో ఆయుధాలూ, తిండి పదార్థాలూ ఉంటాయి. అంటే, చనిపోయిన మనిషి ఎక్కడో వున్న తమ పూర్వీకులను కలుసుకునేందుకు ప్రయాణమై వెళ్ళాడని వాళ్ళ భావన కావచ్చు. అక్కడ అలంకరించుకునేందుకు కాబోలు, కొన్నిచోట్ల గవ్వలతో కూర్చిన ఆభరణాలూ పాతిపెట్టి కనిపిస్తాయి. ఆభరణాలు తప్పనిసరిగా చనిపోయిన మనిషి తాలూకువే అయ్యుండాలి. ఎందుకంటే, ఈ ఆచారం ఈజిప్టు పిరమిడ్లల్లో కూడా కనిపిస్తుంది కాబట్టి. కానీ, పనిముట్లు సొంతానివి కాదా అనేది కచ్చితంగా చెప్పలేం. అప్పటికి పనిముట్ల మీద ఏర్పడిన హక్కు వ్యక్తిగతమైనదో సామూహికమైనదో వెల్లడించే ఆధారాలు మనకు దొరకలేదు. కొన్నిరకాల పనిముట్లు సామూహికమైనవిగానూ, మిగిలినవి వ్యక్తిగతమైనవిగానూ వేరుపాటైవున్నా, ‘వ్యక్తిగత హక్కు’లకు పునాది అదే అవుతుంది. పునర్జన్మకు సంబంధించిన ఆలోచన అప్పటికి ఏర్పడినట్టు కనిపించదు. ఆ ఆలోచనే ఉంటే ఆయుధాలను అందుబాటులో ఉంచే అవసరమే వచ్చిఉండేదిగాదు. అక్కడక్కడ కొన్ని గుహల్లో చితకగొట్టిన పుర్రెలు ఉండడాన్నిబట్టి, క్రోమాన్యాన్ మానవునికి ‘కెనబాలిజం’ - అంటే స్వజాతిమాంసం తినే అలవాటు ఉందేమోనన్న సందేహం కలుగుతుంది. పరస్పరం ఏర్పడిన ఆత్మీయతలూ, సంతానోత్పత్తి పట్ల పెరిగిన ఆకాంక్ష తదితర విషయాల్లో వెల్లడయ్యే దృక్పథాలు అందుకు భిన్నమైన సంకేతాలను సూచిస్తున్నాయి. మొత్తంగా పరిశీలించి, ఎల్లప్పుడూ కాకపోయినా, ఏవో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ‘మనిషి మాంసం’ తినే ఆచారం అతనికి ఉండొచ్చని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. నాలుగవ హిమానీశకం ముగిసిన తరువాత క్రోమాన్యాన్ మానవుడు గుహలను వదిలేసి ఆరుబయటి జీవితానికి తిరిగొచ్చాడు. జంతుచర్మాలను కలిపికుట్టి, వాటితో గుడారాలు వేసుకునేవాడు. చర్మాల వాడకం పెరిగిన దరిమిలా, వేటాడిన జంతువులను నివాసస్థలానికి మోసుకొచ్చుకోవడం అవసరమయింది. నిప్పు మీద కాల్చుకు తినేది ఎముకలకే పరిమితమో లేక కండలుగూడా కాల్చుకునేవాడో చెప్పలేం. అప్పటికిగూడా మనిషి దగ్గర పెంపుడు జంతువు లేదు. కుక్క గూడా ఇంకా మచ్చిక జంతువు కాలేదు. కొన్ని గుహాచిత్రాల్లో గుర్రం తలమీద కల్లెంవిట గుర్తులు ఉన్నందున, అతడు గుర్రాన్ని మచ్చిక చేసుకున్నాడని కొందరు ఊహిస్తున్నారు. కానీ, ఆ మచ్చిక జంతువుతో అతనికి ప్రయోజనం లేదు. యూరప్‌లో దొరికే గుర్రపుజాతి గిటకరకం ‘పోనీ’. మనిషిని మోసుకుపోయేందుకు అది ఏమాత్రం పనికొచ్చేదిగాదు. పోనీ, పాలకోసం అనుకుందామంటే, పాలను ఆహారంగా తీసుకునే ప్రకృతి విరుద్ధమైన అలవాటు ఆ దశలో ఊహాతీతం. రచన: ఎం.వి.రమణారెడ్డి