
మెక్సికో విమానాశ్రయంలో యునైటెడ్‌స్టేట్స్‌కు వెళ్లే ప్యాకేజీలో మానవ పుర్రెలు ఉన్నాయంటూ కలకలం రేగింది. ఈ మేరకు సెంట్రల్ మెక్సికోలోని క్వెరెటారో ఇంటర్కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌లో ఒక కార్డ్‌బోర్డ్ పెట్టేలో అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టబడిన పుర్రెలు కనుగొన్నారు అధికారులు. ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఈ ప్యాకేజిని అధికారులు గుర్తించారు. దేశంలో అత్యంత హింసాత్మకమైన ప్రాంతాలలో ఒకటైన పశ్చిమ తీర రాష్ట్రమైన మిచోకాన్ నుంచి ప్యాకేజి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఇది సౌత్ కరోలినాలోని మన్నింగ్‌లోని చిరునామకు వెళ్లనుందని తెలిపారు. ఆ మానవ అవశేషాలు ఏ వయసు వారివి? ఎవరివీ? అనే వివరాలు తెలియాల్సి ఉందని చెబుతున్నారు. వాస్తవానికి మానవ అవశేషాలను పంపించాలంటే హెల్త్ అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి. ఐతే ఈ ప్యాకేజి ఆ అనుమతిని పొందలేదని ఎయిర్‌పోర్ట్ అధికారులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఇలానే కెన్యా నుంచి అమెరికాకు జిరాఫీ, జీబ్రా ఎముకలను తీసుకురావడానికి ప్రయత్నించినందుకు వాషింగ్టన్ డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది ఒక మహిళను అడ్డుకున్నారని కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) తన నివేదికలో పేర్కొంది.
(చదవండి: చైనాకు చేయి అందించి సాయం చేస్తానన్న తైవాన్.. షాక్‌లో బీజింగ్)
Comments
Please login to add a commentAdd a comment