Varun Dhawan Accidentally Kisses Kiara Advani During Photoshoot, KRK Trolls - Sakshi
Sakshi News home page

Varun Dhawan Kisses Kiara Advani: హీరోయిన్‌కు ముద్దు పెట్టిన హీరో.. కంట్రోల్‌ చేసుకోవాలని ట్వీట్‌

Published Tue, Aug 2 2022 4:41 PM | Last Updated on Tue, Aug 2 2022 6:04 PM

Varun Dhawan Kisses Kiara Advani And KRK Trolls - Sakshi

Varun Dhawan Kisses Kiara Advani And KRK Trolls: తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌ ధావన్‌. వరుసగా ప్రేమ కథా, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల వరుణ్‌ ధావన్‌ నటించిన చిత్రం 'జుగ్‌ జుగ్‌ జీయో'. జూన్‌ 24న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ కపూర్‌, నీతూ కపూర్‌ సైతం కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించినట్లు సమాచారం. అయితే ఈ మూవీలో వరుణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటించింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక మేగజైన్‌ కవర్ ఫొటో కోసం ఫోజులిచ్చారు. 

ఈ ఫొటో షూట్‌లో వరుణ్‌, కియారా ఇద్దరు కౌగిలించుకుని స్టిల్స్‌ ఇస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా కియారా బుగ్గపై వరుణ్ ధావన్‌ ముద్దు పెడతాడు. ఈ అనుకోని పరిణామానికి షాక్‌ అయి వరుణ్‌ను పక్కకు నెడుతుంది కియారా. ఈ ఫొటో షూట్‌ వీడియోను బాలీవుడ్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌గా చెప్పుకునే కమాల్‌ ఆర్‌ ఖాన్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ వీడియోకు 'షూటింగ్‌ సమయంలో కంట్రోల్ చేసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి' అని రాసుకొచ్చాడు కూడా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవగా.. 'ఇలా అయితే కష్టం గురూ' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  

చదవండి:  భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్‌
నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్‌ ఖాన్‌ ఆవేదన
బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా?


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement