అడవిలో జంతువులను దగ్గర నుంచి చూస్తేనే గుండె ఆగినంత పనైపోతుంది. పొరపాటున జంతువుల కంటపడితే.. ఇంకేమైనా ఉందా ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగు పెట్టాల్సిందే. ఇక పులి, చిరుత, సింహాల జోలికి పోకపోవడమే ఉత్తమం. వాటిని చూస్తేనే భయంతో ఒళ్లు జలదరిస్తుంది. . అదే వాటిని పక్కన పెట్టుకొని ఆటాలాడితే పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఓ యువతికి అలా జరగలేదు. ఎంచక్కా చిరుత దగ్గర కూర్చొని దానికి ముద్దు పెట్టింది.
శక్తివంతమైన జంతువులలో చిరుత ఒకటి. చిరుత కంట పడిన ఏ జంతువైనా దాని బారి నుంచి, తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అత్యంత వేగంగా పరుగెత్తి వేటాడుతుంది. అయితే ఇందుకు భిన్నంగా ఓ యువతి మాత్రం చిరుతతో రాసుకొని పూసుకొని తిరుగుతోంది. చిరుత పక్కన ఎలాంటి బెరుకు లేకుండా పడుకొని ఉంది. దానిని ప్రేమగా లాలించింది. అంతటితో ఆగకుండా ఏకంగా ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం చేసింది. అయితే చిరుత కూడా ఏం అనకుండా యువతితో అంతే ప్రేమగా ప్రవర్తించడం విశేషం. కాగా, ఆ చిరుత యువతికి పెంపుడు జంతువుగా తెలుస్తోంది.
ఆఫ్రికన్ యానిమల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరికొంతమంది చిరుతో యువతి చేష్టలు చూసి భయపడుతున్నారు. ‘ఒకే ఫ్రేమ్‌లో ఓ మై గాడ్.. చిరుత ఆమెకు ముద్దు పెట్టిందా.. అమె అసలు ఏం చేస్తోంది. చిరుతతో లిప్‌లాక్. ఒకే ఫ్రేమ్‌లో రెండు చిరుతలు.. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవర్.. ఇంత పెద్ద ప్రపంచంలో ఒక చిన్న ప్రేమ, అనురాగం ఎంత దూరం తీసుకెళ్లగలదో ఇది చూపిస్తుంది.’ అని నెటిజన్లు కామెంట్ చేస్తుంటారు.
చదవండి: Viral: పెళ్లి అంటే ఏంటి?.. పిల్లాడి దిమ్మతిరిగే సమాధానం.. నవ్వాపుకోలేరు!
Comments
Please login to add a commentAdd a comment