AirBlue Flight Couple Complaint: ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్‌ ఇచ్చిన ఎయిర్‌ హోస్టస్‌ - Sakshi
Sakshi News home page

ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్‌ ఇచ్చిన ఎయిర్‌ హోస్టస్‌

Published Wed, May 26 2021 6:31 PM | Last Updated on Thu, May 27 2021 7:59 AM

Couple Gets Caught kissing On Flight Trolls Person Who Complains To CAA - Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు చెందిన ఒక కపుల్‌ విమానంలో చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. విమానంలో ఉన్నామన్న సంగతి మరిచి వారిద్దరు ముద్దుల్లో మునిగిపోయారు. అయితే ఇది చూసిన తోటి పాసింజర్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మే 20న చోటుచేసుకుంది.

విషయంలోకి వెళితే కరాచీ- ఇస్లామాబాద్‌కు వెళ్తున్న పీఏ-200 ఫ్లైట్‌లో ఒక కపుల్‌ నాలుగో వరుసలో కూర్చున్నారు. ఫ్లైట్‌ ఎక్కినప్పటి నుంచి ఆ దంపతులు ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు. వారి వెనకాలే కూర్చున్న ఒక వ్యక్తి వారి చర్యలకు ఇబ్బంది పడి ఎయిర్‌ హోస్టస్‌ను పిలిచి చెప్పాడు. ఆమె వెళ్లి  మీ చర్యలతో చుట్టుపక్కల వాళ్లకు అభ్యంతరం ఉందని.. ఇలాంటివి చేయకూడదని వివరించింది. అయినా వారు పట్టించుకోకుండా తమ పనిలో మునిగిపోయారు. దీంతో ఎయిర్‌ హోస్టస్‌ వారికి బ్లాంకెట్‌ ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయింది.

అయితే బిలాల్‌ ఫరూక్‌ ఆల్వీ అనే అడ్వకేట్‌ కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ దంపతులు చేసే పనిపై ఎలాంటి చర్యలు తీసుకోని విమాన సిబ్బందిపై సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీకి ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో సీఏఏ విమాన సిబ్బందితో ఇలాంటివి మళ్లీ రిపీట్‌ కాకుండా చూసుకోవాలని మందలించారు. అయితే అప్పటికే ఈ వార్త సోషల్‌ మీడియాకు పాకడంతో వైరల్‌గా మారింది. విమానంలో కపుల్‌ చేసిన పనిపై ఫిర్యాదు చేసిన అడ్వకేట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో మీమ్స్‌, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు.
చదవండి: వైరల్‌: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement