న్యూఢిల్లీ: పాకిస్థాన్ విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ భారత్ పర్యటనకు రానున్నారు. భారత్‌లో మే నెలలో జరగబోయే షాంఘై సహాకార సంస్థ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. కాగా చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో కీలక పదవుల్లో ఉన్నవారు భారత్‌కు రావడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ పర్యటించగా.. ఈ తరువాత పాకిస్థాన్ నుంచి భారత్‌లో అడుగుపెట్టే మొదటి నేత బిలావల్ భుట్టోనే కానుండటం విశేషం
భారత్ అధ్యక్షతన ఈ ఏడాది షాంఘై సహకార సంస్థ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా విదేశీ వ్యవహరాల మంత్రుల సమావేశం మే 4,5 తేదీల్లో గోవాలో జరగనుంది. ఈ సమ్మిట్‌లో బిలావల్ భుట్టో పాల్గొననున్నారు. ఆయనతోపాటు గ్రూప్‌లోని వివిధ దేశాల విదేశాంగ మంత్రుల ప్రతినిధుల బృందం కూడా సమావేశానికి హాజరుకానుంది.
కాగా షాంఘై సహకార సంస్థ 2001లో ప్రారంభమైంది. ఇందులో ఎనిమిది పూర్తిస్థాయి సభ్య దేశాలు(చైనా, రష్యా, భారత్, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్‌లు) ఉన్నాయి. 2017 జూన్9న శాశ్వత దేశంగా సభ్యత్వం పొందింది. సభ్య దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, సైనిక సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో స్థాపించబడింది. ఇది ప్రపంచ మొత్తం జనాభాలో 42 శాతం, ప్రపంచ జీడీపీలోలో 25 శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది.
చదవండి: Mount Annapurna: అదృశ్యమైన భారతీయ పర్వతారోహకుడి ఆచూకీ లభ్యం
Comments
Please login to add a commentAdd a comment