
న్యూఢిల్లీ: గత కొద్దిరోజులుగా పాకిస్తాన్(Pakistan)లో ఉగ్రవాద దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో జమ్ముకశ్మీర్‌లో భద్రతను మరింతగా పెంచుతూ, హై అలర్ట్ జారీ చేశారు. భద్రతా దళాలు పెట్రోలింగ్‌ను మరింతగా పెంచాలంటూ ఆదేశాలు అందాయి. అలాగే జమ్ముకశ్మీర్‌లోని రాజకీయ నేతలు, వీఐపీలు భద్రతా ప్రోటోకాల్స్‌ను ఖచ్చితంగా పాటించాలని ఆర్మీ అధికారులు సూచించారు.
పాక్‌లోని బలూచిస్తాన్‌లో ఇటీవల జరిగిన వరుస ఉగ్రవాద దాడుల నేపథ్యంలోనే ఈ భద్రతా హెచ్చరికలు(Safety warnings) జారీ చేశారు. కాగా జమ్ముకశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్ర దాడుల్లో ఉగ్రవాది కతాల్ హస్తముంది. కతాల్ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్‌కు అత్యంత నమ్మకస్తునిగా పేరొందాడు. అతనికి పూంచ్, రాజౌరిలలో నెట్‌వర్క్ ఉంది. పాక్‌లో అతని హత్య జరిగిన దరిమిలా, అతని వర్గం దాడులకు తెగబడే అవకాశాలున్నామని నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపధ్యంలో వీఐపీలంతా తమ టూర్ షెడ్యూళ్లను సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లకు ముందుగానే తెలియజేయాలని రక్షణదళ అధికారులు తెలిపారు.
వీఐపీలు తమ పర్యటన కార్యక్రమాలను చివరి నిమిషంలో మార్చుకోకూడదని, సూర్యాస్తమయం తర్వాత ఏ ప్రాంతానికి వెళ్లకపోవడమే మంచిదని అధికారులు సూచించారు. వీఐపీలు, రాజకీయ నేతలు తమ కార్యక్రమాలను గోప్యంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహాయం తీసుకోవాలన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సమావేశం కాకుడదని, బహిరంగ సమావేశాలకు హాజరు కావద్దని సూచించారు. గుర్తింపు కార్డు లేకుండా ఎవరినీ కలుసుకోవద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment