బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) తప్పుబట్టింది.
న్యూఢిల్లీ: కాశ్మీర్ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) తప్పుబట్టింది. బిలావల్ పగటి కలలు కంటున్నారని పేర్కొంది.
భారత భూభాగంలో ఇంచు కూడా వదులుకోబోమని స్పష్టం చేసింది. చివరివరకు భారత భూభాగాన్ని కాపాడుకుంటామని ప్రకటించింది. జమ్మూకాశ్మీర్- భారత్ అంతర్భాగమని ఐయూఎంఎల్ అధ్యక్షుడు ఇ అహ్మద్ అన్నారు. కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటామంటూ బిలావల్ భుట్టో జర్దారీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.