Indian Union Muslim League
-
సుప్రీంకోర్టుకు పౌరసత్వ బిల్లు
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును సవాలు చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పౌరసత్వ బిల్లు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని ఆ పిటిషన్లో ఐయూఎంఎల్ ఆరోపించింది. మత ప్రాతిపదికన ఒక వర్గానికి చెందిన అక్రమ వలసదారులకు పౌరసత్వం కల్పించే ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. తాజాగా, గురువారం రాత్రి ఈ బిల్లుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దాంతో ఈ బిల్లు పౌరసత్వ (సవరణ) చట్టంగా మారింది. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఐయూఎంఎల్ తరఫున న్యాయవాది పల్లవి ప్రతాప్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తక్షణమే బిల్లుకు సంబంధించిన కార్యాచరణపై స్టే విధించాలని కోర్టును కోరారు. ఏ చట్టమైనా అక్రమ వలసదారులను ఉద్దేశించి రూపొందించాలంటే.. మతం, కులం, జాతీయత ఆధారంగా కాకుండా.. మొత్తం అక్రమ వలసదారులను ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించి చట్టాన్ని రూపొందించాలని పేర్కొన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమైనదే కాదు, అమానవీయమైనది కూడా అని అన్నారు. కాగా, ఈ బిల్లు సుప్రీంకోర్టు కొట్టివేయడం తథ్యమని కాంగ్రెస్ నాయకుడు మనీశ్ తివారీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో రభస పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ హింసను రాజేస్తోందని అధికార పక్షం వ్యాఖ్యానించడంతో గురువారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజ్వరిల్లుతున్న హింస అంశాన్ని జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌధురి లేవనెత్తారు. ఈ బిల్లు వల్ల మొత్తం ఈశాన్య ప్రాంతమంతా అట్టుడుకుతోందన్నారు. ‘ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఈశాన్యం మరో కశ్మీర్‌లా మారింది’ అన్నారు. వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైన ఈ రెండు ప్రాంతాల్లో సాధారణ స్థితి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి స్పందిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే హింసను రాజేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జోషి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. వారితో పాటు డీఎంకే సభ్యులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు. -
‘ఆ తల్లి ప్రకటన చూసి చలించిపోయా’
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు తప్పుడ వాగ్ధానాలు చేస్తున్నాయని, ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రోహిత్ ఆత్మహత్య తరువాత తన కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం ఇరవై లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారని, రెండేళ్ల గడిచిన వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఇటీవల ఆమె తెలిపారు. రాజకీయ లబ్ధికోసమే తనకు తప్పుడు వాగ్ధానాలు చేశారని వాపోయారు. రాధిక వ్యాఖ్యలపై పియూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. ‘రోహిత్ తల్లి రాధిక ప్రకటనను చూసి నేను చలించిపోయాను. రాధికను ప్రతిపక్ష పార్టీలు రాజకీయ బంటుగా వాడుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి చిల్లర రాజకీయలు మానుకోవాలి. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పలు ర్యాలీలో రోహిత్ వేముల కుటుంబానికి పలు హామీలు ఇచ్చారు. ఆ తల్లికి అబద్ధపు ప్రకటను చేసినందుకు రాహుల్ క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంద’ని గోయల్ అన్నారు. తనకు ఇంటి నిర్మాణం కోసం ప్రకటించిన ఇరవై లక్షలకు ముస్లిం లీగ్ నుంచి రెండు చెక్కులు వచ్చాయని, అవి రెండు బౌన్స్ అయ్యాయని ఆమె చేసిన ఆరోపణలపై ఐయూఎమ్ఎల్ నేత ఎమ్కే మునీర్ స్పందించారు. ‘రాధిక వేములకు ఇరవైలక్షలు ఆర్థిక సహయం చేస్తామన్నది వాస్తవం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం. పొరపాటు వల్ల రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఇదివరకే ఇంటి నిర్మాణ స్థలం కోసం ఐదు లక్షలు చెల్లించామ’ని ముస్లిం లీగ్ నేత మునీర్ పేర్కొన్నారు. -
ఉప ఎన్నికల రిజల్ట్స్.. బీజేపీకి బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఆదివారం వెలువడిన ఓ పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి ఊహించని రీతిలో ఘోర పరాభవం ఎదురయ్యింది. కేరళ వెంగర అసెంబ్లీ స్థానాన్ని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ నిలుపుకోగా, గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాఖర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి స్వర్ణ్ సాలారియాపై లక్షా 93 వేల 219 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆప్ తరఫున మేజర్ జనరల్ సురేష్ ఖజారియాకు స్వర్ణ్‌కు మంచి పోటీ ఇచ్చారనే తెలుస్తోంది. ఈ ఓటమితో ఆరు నెలల క్రితం పంజాబ్ లో సంకీర్ణ అధికారానికి దూరమైన బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలినట్లయ్యింది. ఈ విజయంపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ప్రజలు తమవైపే ఉన్నారని, కేంద్రంలోని బీజేపీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నదానికి ఈ ఫలితాలు నిదర్శనమని పేర్కొంది. సీనియర్ నటుడు వినోద్ ఖన్నా ఆకస్మిక మరణంతో గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని గురుదాస్ పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగగా, గత ఎన్నికలతో పోలిస్తే చాలా తక్కువ శాతం (సుమారు 54 శాతం) పోలింగ్ నమోదు కావటం విశేషం. కేరళలోనూ వాడిన కమలం... ఇక కేరళ వెంగర అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితంలో మాత్రం ఊహించిన విధంగానే తీర్పు వచ్చింది. వెంగర అసెంబ్లీ నియోజక వర్గంలో ముస్లిం లీగ్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి కేఎన్ఏ ఖాదర్(యూడీఎఫ్ మద్దతుదారు).. ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి పీపీ బషీర్‌పై(ఎల్డీఎఫ్ మద్దతుదారు) 23,000 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ది సోషలిస్ట్ డెమొక్రటిక్ పార్టీ మూడు స్థానంతో సరిపెట్టుకోగా, ఆరెస్సెస్ అల్లర్ల కారణంతో ఓటు బ్యాంకు దారుణంగా పడిపోయి బీజేపీ చివరకు నాలుగో స్థానానికే పరిమితం అయ్యింది. విజయంపై ఖాదర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం లీగ్ అభ్యర్థి కున్హాలీ కుట్టి 38,000 ఓట్ల తేడాతో విజయం సాధించగా.. ఈసారి మాత్రం ఆ మెజార్టీ 15000పైగా పడిపోవటం గమనార్హం. కున్హాలీ లోక్‌సభ(మలప్పురం నియోజకవర్గం)కు వెళ్లటంతో ఖాళీ అయిన వెంగర అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 11 ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెలిసిందే. -
ఎంపీ అహ్మద్ కన్నుమూత
నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి న్యూఢిల్లీ/తిరువనంతపురం: పార్లమెంటులో మంగళవారం గుండెపోటుకు గురైన ఎంపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఇ.అహ్మద్ (78) బుధవారం తెల్లవారుజామున మరణించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు తదితర నేతలు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన చనిపోయినా సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. మరణవార్త ప్రభుత్వ పెద్దలకు ముందే తెలిసినా బడ్జెట్‌కు ఆటంకం కలగొద్దనే దాచారని లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అహ్మద్ చనిపోయినట్లు వైద్యులు మంగళవారమే తనకు చెప్పారనీ, తర్వాత వారు మాటమార్చి బుధవారం ఈ విషయం ప్రకటించారని కాంగ్రెస్ ఎంపీ కేవీ థామస్ ఆరోపించారు. అంతకుముందు ఆసుపత్రిలో అహ్మద్‌ను కలుసుకోడానికి ఆయన కుటుంబీ కులనూ వైద్యులు అనుమతించలేదని వార్తలొచ్చాయి. 1938లో జన్మించిన అహ్మద్ కేరళ హైకోర్టులో న్యాయవాదిగా చేశారు. ఆయనకు ‘గల్ఫ్ దేశాలకు భారత అనధికార రాయబారి’గా పేరుంది. 1967లో తొలిసారిగా కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఐదుసార్లు అసెంబ్లీకి, ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004–12 మధ్య మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. 10 సార్లు ఐరాసకు భారత ప్రతినిధిగా వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ హజ్ కమిటీలో కీలకంగా వ్యవహరించారు. ఇంగ్లిష్, మలయాళాల్లో నాలుగు పుస్తకాలు రాశారు. అహ్మద్ భార్య ఇప్పటికే చనిపోయారు. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. -
ఉపసంఘాల మాటేమిటో!
► జాప్యంతో అసంతృప్తి ► అసెంబ్లీ కార్యదర్శికి ఎమ్మెల్యేల వినతి ► ఆర్థికమంత్రితోనూ భేటీ శాసనసభ ఉప సంఘాల ఏర్పాటులో జాప్యంపై కాంగ్రెస్ శాసనసభా పక్షం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌తో భేటీకి యత్నించినా, ఆయన అందుబాటులో లేని దృష్ట్యా, అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆర్థికమంత్రి ఓ పన్నీరు సెల్వంతోనూ భేటీ అయ్యారు. సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే- 136, డీఎంకే-89, కాం గ్రెస్-ఎనిమిది, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఒకటి చొప్పున గెలిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా బలమైన ప్రధాన ప్రతి పక్షం అధికార పక్షానికి ఎదురుగా కూర్చున్నది. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతోంది. అరుుతే, ఇంతవరకు శాసనసభ ఉపసంఘాల ఏర్పాటు మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కనీసం అందుకు తగ్గ చర్యల్ని స్పీకర్ ధనపాల్ చేపట్టనూ లేదని సంకేతాలు ఉన్నారుు. ఇందుకు కారణం, ప్రధా న ప్రతిపక్షం సభ్యుల సంఖ్య అత్యధికంగా ఉండడమే. ఉప సంఘాల్లో వారికి తప్పనిసరిగా ప్రాధాన్యతను కల్పించక తప్పదన్న విషయాన్ని గ్రహించి జాప్యం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ శాసన సభ ఉప సంఘాల ఏర్పాటు గురించి ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసన సభా పక్షం, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఎమ్మెల్యేలు ఏకంగా ప్రభుత్వం, స్పీకర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, శాసన సభ ఉప సంఘాల ఏర్పాటుకు పట్టుబట్టే పనిలో గురువారం నిమగ్నమైంది. ఉప సంఘాలు ఎప్పుడో: కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత కేఆర్ రామస్వామి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వసంతకుమార్, విజయధరణి, ఊటీ గణేషన్, రాజేష్‌కుమార్, కాలి ముత్తులతో పాటు ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఎమ్మెల్యే అబూబక్కర్ ఉదయం సచివాలయానికి వచ్చారు. నేరుగా అసెంబ్లీ వైపుగా వెళ్లారు. స్పీకర్ ధనపాల్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అరుుతే, ఆయన అందుబాటులో లేని దృష్ట్యా, అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌ను కలిశారు. ఆయనకు వినతి పత్రం సమర్పించారు. అక్కడి నుంచి ఆర్థికమంత్రి పన్నీరు సెల్వం చాంబర్‌కు వెళ్లిన ఎమ్మెల్యేలు ఆయనతో భేటీ అయ్యారు. నిధుల కేటారుుంపులు గురించి సమాలోచించి ఉన్నారు. వెలుపలకు వస్తూ మీడియాతో కేఆర్ రామస్వామి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతోందని, ఇంత వరకు శాసన సభ ఉప సంఘాలను ఏర్పాటు చేయక పోవడం శోచనీయమని విమర్శించారు. ఇంత వరకు అందుకు తగ్గ చర్యలు చేపట్టనట్టు సంకేతాలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో తాను ఈ విషయంగా ప్రస్తావించడం జరిగిందని గుర్తు చేశారు. ఇందుకు సమాధానం ఇచ్చే క్రమంలో స్పీకర్ ధనపాల్ త్వరితగతిన ఉప సంఘాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అరుుతే, ఇంత వరకు అందుకు తగ్గ ప్రయత్నాలే చేయక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రధాన ప్రతి పక్షం సభ్యుల సంఖ్య అత్యధికంగా ఉండడం కాబోలు ఆ సంఘాల ఏర్పాటు మీద చిత్తశుద్ధిని పాలకులు కన బరచడం లేదని మండిపడ్డారు. త్వరితగతిన ఉప సంఘాలను ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించామని, లేని పక్షంలో ఏమి చేయాలో తమకు తెలుసునని, తదుపరి చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇక, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంతో నిధుల కేటారుుంపులు గురించి మాట్లాడినట్టు, ఉప సంఘాల ఏర్పాటు గురించి ఆయన దృష్టికి సమాచారం తీసుకెళ్లామని వివరించారు. -
'పగటి కలలు కంటున్న బిలావల్'
న్యూఢిల్లీ: కాశ్మీర్ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) తప్పుబట్టింది. బిలావల్ పగటి కలలు కంటున్నారని పేర్కొంది. భారత భూభాగంలో ఇంచు కూడా వదులుకోబోమని స్పష్టం చేసింది. చివరివరకు భారత భూభాగాన్ని కాపాడుకుంటామని ప్రకటించింది. జమ్మూకాశ్మీర్- భారత్ అంతర్భాగమని ఐయూఎంఎల్ అధ్యక్షుడు ఇ అహ్మద్ అన్నారు. కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటామంటూ బిలావల్ భుట్టో జర్దారీ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.