India Pakistan ties
-
అప్పటివరకు భారత్‌తో మాటల్లేవ్.. పాక్ విదేశాంగ మంత్రి తలపొగరు..
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇరు దేశాల సంబంధాలపై బింకాలకు పోయారు. ఆర్టికల్ 370 రద్దును సమీక్షిస్తేనే భారత్‌తో సంబంధాలు, చర్చల విషయంపై ఆలోచిస్తామని అన్నారు. అప్పటివరకు భారత్‌తో ఎలాంటి సంప్రదింపులు ఉండవన్నారు. ఓ జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యా ఖ్యలు చేశారు. గోవాలో మే 4,5 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగిన షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సుకు భుట్టో హాజరయ్యారు. అయితే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఎలాంటి మాటామంతీలో పాల్గొనలేదు. దీంతో భారత్‌తో ఎప్పుడు సమావేశంలో పాల్గొంటారని ప్రశ్నించగా.. ఆర్టికల్ 370 రద్దును సమీక్షించినప్పుడే అని బదులిచ్చారు. కాగా.. 2011 తర్వాత పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భారత్‌కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అప్పుడు పాక్ విదేశాంగ మంత్రిగా ఉన్న హీనా రబ్బానీ ఖార్ అప్పటి భారత విదేశాంగమంత్రితో సమావేశమయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఏ సమావేశంలోనూ పాల్గొనలేదు. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపైనా భారత అంతర్గత విషయమైన కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి అబాసుపాలైంది. చదవండి: వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్‌ల వర్షం -
పాక్, భారత్ మధ్య అణు సమాచార మార్పిడి
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ మధ్య భవిష్యత్‌లో ఉద్రిక్తతలు పెరిగిపోతే దాడులు చేయకూడదని అణు కేంద్రాలు, స్థావరాలపై సమాచారాన్ని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించినప్పటికీ మూడు దశాబ్దాలుగా ప్రతీ ఏడాది జరిగే అణు సమాచారాన్ని ఇరుదేశాలు ఒకరికొకకు అందించుకున్నట్టుగా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1991లో ఇరు దేశాల మధ్య అమల్లోకి వచ్చిన అణు కేంద్రాలు, స్థావరాలపై దాడులు నిషిద్ధమనే ఒప్పందం మేరకు ఈ స్థావరాల వివరాలు అందించుకున్నారు. ఈ ఒప్పందంపై 1988, డిసెంబర్ 31న సంతకాలు జరగగా.. 1991, జనవరి 27న అమలులోకి వచ్చింది. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లో ఒకేసారి ఈ ప్రక్రియను చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. తొలిసారి 1992లో అణు సమచారాన్ని ఇచ్చిపుచ్చుకోగా.. 32 ఏళ్లుగా ప్రతిఏటా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: దేవుడా ఏమిటీ పరీక్ష? పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం..! -
భారత్–పాక్ మధ్య శాంతి నెలకొల్పడానికి మీ వంతు కృషి చేస్తున్నార్సార్!!
భారత్–పాక్ మధ్య శాంతి వాతావరణం నెలకొల్పడానికి మీ వంతు కృషి చేస్తున్నార్సార్!! -
వారిని అడుగు పెట్టనివ్వకండి: గంభీర్
సాక్షి, ముంబై; టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థానీయులను భారత్‌లో అడుగుపెట్టనివ్వకుండా నిషేధించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సాయంత్రం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్క క్రికెట్లోనే కాదు.. సినిమాలు, సంగీతం.. అన్ని రంగాల్లోనూ పాకిస్థాన్‌ను నిషేధించాలి. సరిహద్దులో వాళ్లు మన సైనికులను చంపుతుంటే మనం చూస్తూ ఊరుకోవాలా? శాంతి చర్చలు ప్రభుత్వం చేయాల్సిన పని. పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చే వరకు వారిని మనదేశంలోకి అడుగుపెట్టనీయకపోవటమే ఉత్తమం’ అని గంభీర్ అభిప్రాయపడ్డారు. గతేడాది ఏప్రిల్‌లో సుక్మా జిల్లా ఎన్కౌంటర్లో మృతిచెందిన సైనికుల పిల్లల చదువుకయ్యే ఖర్చును భరించిన గంభీర్..తాజాగా గురువారం రాత్రి వారితో కలిసి డిన్నర్ చేసి సందడి చేశాడు. రేంజర్లను చంపటం మంచిదే... ఇక సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలపై గంభీర్ స్పందించారు. ‘గతంలో పాక్‌ను చర్చల కోసం అనేకసార్లు భారత్ ఆహ్వానించింది. కానీ, ఏం సాధించాం?. ఒక పక్క చర్చలంటూనే.. మరో పక్క మన సైనికులను పాక్ పొట్టనపెట్టుకుంటోంది. ప్రతిగా పాక్ రేంజర్లను మన సైన్యం చంపటంలో ఎలాంటి తప్పు లేదు. సహనం అనేది కొంత వరకే ఉండాలి. ముందు శాంతి బాటలో చర్చలు జరపాలి. కుదరకపోతే కఠిన చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో రాజకీయాలకు తావు ఇవ్వకూడదు’ అని గంభీర్ పేర్కొన్నారు. అన్నట్లు ఈ స్టార్ బ్యాట్స్‌మన్ గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 2016లో పాక్‌తో క్రికెట్ సిరీస్ గురించి కేంద్ర ప్రభుత్వం-బీసీసీఐలు పాక్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపిన వేళ, ఓ ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతూ.. ‘భారత సైనికులను చంపుకుంటూ పోతుంటే పాక్‌తో క్రికెట్ ఎలా ఆడాతామంటూ’ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చిన పాక్!
సరిహద్దుల్లో కాల్పులతో పేట్రేగుతున్న పాకిస్థాన్ సైన్యం.. తాజాగా చర్చలకు దిగివచ్చిన సంగతి తెలిసిందే. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద అనుమానిత ఉగ్రవాదులు ముగ్గురు భారతీయ సైనికులను పొట్టనబెట్టుకున్నారు. అంతేకాకుండా ఒక సైనికుడి శరీరాన్ని ముక్కలుగా నరికేశారు. దీంతో రగిలిపోయిన భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. మరింత దీటుగా పాక్ సైన్యానికి జవాబు చెప్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పాక్ అధికారులు భారత బలగాల షెల్లింగ్ దాడుల్లో 11మంది పౌరులు, ముగ్గురు సైనికులు బుధవారం చనిపోయినట్టు ప్రకటించారు. అంతేకాకుండా బుధవారం సాయంత్రం పాక్ విజ్ఞప్తి మేరకు మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరళ్లు హాట్లైన్లో చర్చించి.. కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి మనోహర్ పరీకర్ స్పందిస్తూ.. సరిహద్దుల్లో ‘పిరికిపంద’ దాడులను భారత్ దీటుగా తిప్పికొడుతుండటంతో దాయాది పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చిందని, దాడులను ఆపాలని భారత్‌ను విజ్ఞప్తి చేసిందని పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవాలోని ఓ సభలో ప్రసంగించిన పరీకర్.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా దేశ నాయకత్వం బలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నదని కొనియాడారు. ‘మన సైన్యం వీరోచితమైనదనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తొలిసారి దేశ రాజకీయ నాయకత్వం కూడా బలమైన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. అంతేకాకుండా పరికిపందల దాడులకు మేం దీటుగా బదులిస్తున్నాం. కొన్నిరోజులుగా ఇలా బలంగా ప్రతిస్పందిస్తుండటంతో వాళ్లు దిగొచ్చి ‘దయచేసి ఆపండి. మేం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అంటూ వేడుకుంటున్నారు. దీనిని ఆపడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ మీరు కూడా ఆపాలి. అప్పుడే సరిహద్దుల్లో కాల్పులు ఉండవు’ అని పరీకర్ వ్యాఖ్యానించారు. -
అభివృద్ధి జరగడం లేదు: కోదండరామ్
-
పాక్ ను అడ్డంగా సమర్థించిన చైనా!
-
పాక్ ను అడ్డంగా సమర్థించిన చైనా!
ఉగ్రవాదానికి పాకిస్థాన్ పుట్టినిల్లు వంటిదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్న మరునాడే చైనా తన 'శాశ్వత మిత్రుడి'ని అడ్డంగా వెనకేసుకొచ్చింది. ఉగ్రవాదాన్ని ఏ దేశంతో ముడిపెట్టలేమంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకించింది. పాకిస్థాన్ చేసిన గొప్ప త్యాగాలను ప్రపంచం గుర్తించాలంటూ అడ్డగోలుగా వ్యాఖ్యానించింది. గోవాలో జరిగిన బ్రిక్స్ సదస్సు వేదికగా పాకిస్థాన్ పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై .ప్రశ్నించగా చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ ఘాటు స్పందించారు. ఉగ్రవాదంపై చైనా వైఖరి స్థిరంగా ఉందని చెప్తూనే.. ఉగ్రవాదాన్ని ఏ ఒక దేశంతోనో, మతంతోనో ముడిపెట్టడాన్ని చైనా వ్యతిరేకిస్తుందని ఆమె చెప్పుకొచ్చింది. 'ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా మేం వ్యతిరేకిస్తాం. అంతర్జాతీయంగా నిరంతర చర్యల ద్వారా అన్ని దేశాల్లో సుస్థిర భద్రత సాధ్యపడుతుందని భావిస్తున్నాం. ఉగ్రవాదాన్ని ఏ ఒక్క దేశంతోనో, మతంతోనో ముడిపెట్టడాన్ని మేం వ్యతిరేకిస్తాం. మేం చాలాకాలంగా అవలంబిస్తున్న వైఖరి ఇదే. చైనా, పాకిస్థాన్ అన్ని కాలాల్లోనూ శాశ్వత మిత్రులు' అని ఆమె తేల్చిచెప్పారు. భారత్, పాకిస్థాన్ కూడా ఉగ్రవాద బాధితులేనని పేర్కొన్న ఆమె.. ' ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో పాకిస్థాన్ గొప్ప త్యాగాలు చేసింది. వీటిని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి' అని తెలిపారు. భారత్, పాకిస్థాన్ తమకు పొరుగుదేశాలు కావడంతో ఈ రెండు దేశాలు తమ మధ్య ఉన్న సమస్యను చర్చలు, సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. -
పాకిస్థాన్ సైన్యానికి ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్!
ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలిపోతున్న పాకిస్థాన్ ఎట్టకేలకు చర్యలకు ఉప్రకమించినట్టు కనిపిస్తోంది. పాక్ భూభాగంలోని ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే అంతర్జాతీయంగా ఏకాకి కావాల్సి వస్తుందంటూ ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సైన్యాన్ని గట్టిగా హెచ్చరించారు. అదేవిధంగా పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై విచారణ త్వరగా పూర్తిచేయాలని, స్తంభించిపోయిన ముంబై దాడుల కేసు విచారణను తిరగదొడాలని ఆయన సైన్యానికి తేల్చిచెప్పినట్టు పాకిస్థాన్ ప్రధాన పత్రిక 'డాన్' వెల్లడించింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో పౌర ప్రభుత్వానికి-సైన్యానికి మధ్య కీలక సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో అసాధారణరీతిలో ప్రభుత్వం సైన్యానికి పరుషమైన హెచ్చరికలు జారీచేసిందని ఈ భేటీలో పాల్గొన్న విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక గురువారం వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద గ్రూపులపై చర్యలు సహా కీలకాంశాల్లో ప్రభుత్వానికి అనుగుణంగా సైన్యం నడుచుకోవాలని షరీఫ్ ఈ భేటీలో స్పష్టం చేసినట్టు డాన్ పత్రిక పేర్కొంది. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తు పూర్తిచేసేందుకు, ముంబై దాడుల కేసులో పునర్విచారణ జరిపేందుకు చర్యలు తీసుకోవాలని షరీఫ్ తేల్చిచెప్పినట్టు తెలిపింది. నిషేధిత లేదా అదుపులో లేని మిలిటెంట్ గ్రూపులపై లా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకుంటే.. అందులో సైనిక నిఘా ఏజెన్సీలు జోక్యం చేసుకోకూడదనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చిందని, ఈ సందేశాన్ని సైనిక, నిఘా వర్గాలకు అందజేసేందుకు ఐఎస్ఐ చీఫ్ లెప్టినెంట్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్, జాతీయ భద్రతా సలహాదారు నజర్ జంజువా నాలుగు ప్రావిన్సులలో పర్యటించనున్నారని ఆ పత్రిక వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా దౌత్యపరంగా, ఆర్థికపరంగా ఏకాకిని చేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు జరుపడంతో ఇరుదేశాల సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. సార్క్ దేశాలు కూడా పాక్ తీరును నిరసిస్తూ.. ఆ దేశంలో సార్క్ సదస్సుకు హాజరుకాబోమని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇరకాటంలో పడ్డ పాక్ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు భావిస్తున్నారు. -
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే.!
-
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే!
-
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే!
జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్రమైన కోపాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా నవంబర్‌లో పాకిస్థాన్‌లో జరగనున్న సార్క్ సదస్సు నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. దీంతో భారత్ దారిలోనే సాగుతూ బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్, భూటాన్ కూడా సార్క్ సదస్సును బహిష్కరించాయి. దీంతో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సదస్సు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ దాడి నేపథ్యంలో పాక్‌ను ఎంతమాత్రం ఉపేంక్షించరాదని మోదీ సర్కార్ నిర్ణయించింది. పాక్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేసేందుకు వీలున్న అన్నీ మార్గాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సింధు నది ఒప్పందంపై సమీక్ష నిర్వహించడంతోపాటు పాక్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను రద్దు చేయాలని నిర్ణయించింది. తాజాగా సార్క్ సదస్సును బహిష్కరించడం ద్వారా పాకిస్థాన్‌పై భారత్ ప్రాంతీయంగా ఆధిపత్యం సాధించింది. ఈ నిర్ణయం ద్వారా భారత్ దక్కిన సానుకూలతలు ఏమిటంటే.. ప్రాంతీయ సహకారంలోనూ ఉగ్రవాద కోణాన్ని జోడించడం! 'ప్రాంతీయ సహకారం, అనుసంధానత, సంప్రదింపుల విషయంలో భారత్ కట్టుబడి ఉంది. కానీ, ఇది ఉగ్రవాద రహిత వాతావరణంలోనే ముందుకు సాగుతుందని భావిస్తోంది'.. పాక్‌లో 19వ సార్క్ సదస్సును బహిష్కరిస్తూ విదేశాంగ శాఖ చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటన ద్వారా పాక్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదం ఒక్క భారత్‌కే కాదు.. దక్షిణాసియా ప్రాంతీయ సహకారానికి పెను ముప్పుగా మారిందనే విషయాన్ని మన దేశం తేల్చిచెప్పింది. ఒకప్పుడు భారత్-పాక్ ద్వైపాక్షిక చర్చల సందర్భంలోనే ఉగ్రవాద రహిత వాతావరణం ప్రస్తావన వచ్చేది. కానీ ఇప్పుడు ప్రాంతీయ చర్చల్లోనూ ఈ అంశాన్ని ప్రధాన అంశంగా భారత్ ముందుకు తెచ్చింది. పాక్‌ను ఇరుకునపెట్టడంలో భారత్‌కు కొత్త మిత్రులు! పాక్‌ను ప్రాంతీయంగా ఇరుకున పెట్టడంలో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విజయం సాధించింది. ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారా? లేదా? అన్నది సందేహాస్పదంగా ఉండగానే బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ ముందుకొచ్చి.. తాము ఆ దేశానికి వెళ్లబోమని తేల్చిచెప్పాయి. ఇప్పుడు భారత్ అధికారికంగా చెప్పడంతో బంగ్లా, ఆఫ్గన్‌తో మన పొరుగు దేశం భూటాన్ కూడా జతకలిసి.. పాక్‌కు షాకిచ్చింది. సార్క్ పునరుద్ధరణ! 1985లో దక్షిణాసియాలోని ఎనిమిది సభ్యదేశాలతో ఏర్పాటైన సార్క్‌తో విస్తృత సంబంధాలు కొనసాగించేందుకు ఎన్డీయే సర్కారు తపిస్తున్నా.. పాకిస్థాన్ మాత్రం అడ్డుపుల్ల వేస్తోంది. సార్క్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కొర్రిలు పెడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మినహాయించి ఇతర సార్క్ దేశాలతో సంబంధాలు పెంపొందించుకోవడం, పాక్‌ను బ్లాక్ చేసేలా సబ్-రిజినల్ కనెక్టివిటీని పెంచుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. రాజకీయంగా కీలకమే! సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్రమోదీ పాకిస్థాన్‌ను నియంత్రించడం గురించి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ హామీలపై నిలబడాల్సిన పరిస్థితి ఎన్డీయే ప్రభుత్వానిది. అంతేకాకుండా కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఒత్తిళ్లకు అనుగుణంగా పాక్‌పై కఠినంగా వ్యవహరించక తప్పదు. ఆ సంకేతాలు ఇచ్చే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇక పాకిస్థాన్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలన్న విధానం కూడా అమలవుతున్నదన్న సంకేతాలను సార్క్ సదస్సు బహిష్కరణ ద్వారా భారత్ ఇచ్చినట్టు అయింది. దీనికితోడు బంగ్లా, ఆఫ్గన్ వ్యవహారాల్లో పాక్ జోక్యాన్ని నివారించి ఆ దేశాలను తనవైపు తిప్పుకోవడంలోనూ అడ్వాంటేజ్ సాధించింది. నిజానికి దక్షిణాసియాలో మిత్రదేశాలు కావాలని పాక్ కోరుకోవడం లేదు. చైనా, అమెరికా, సౌదీ అరేబియలతో దౌత్య సంబంధాలకే ఆ దేశం అధిక ప్రాధాన్యమిస్తోంది. అయినా సార్క్ సదస్సును నిర్వహించే అవకాశాన్ని పాక్ కోల్పోవడం నిజంగా ఆ దేశానికి నష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సింధు నది ఒప్పందంపై పాక్ గగ్గోలు
-
పాక్‌పై భారత్ మరో దౌత్యదాడి!
అబ్దుల్ బాసిత్‌కు సమన్లు ఉడీ దాడిపై ఆధారాలు అందజేత న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్‌పై భారత్ తన దౌత్య దాడిని తీవ్రతరం చేసింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు మంగళవారం సమన్లు జారీచేసింది. అంతేకాకుండా ఉడీ దాడిలో పాకిస్థాన్ హస్తాన్ని నిరూపించే ఆధారాలను అబ్దుల్ బాసిత్‌కు అందించింది. ’విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించి మాట్లాడారు. సరిహద్దుల్లో (పాక్ ఉగ్రవాదుల) చొరబాట్లకు సహకరించిన ఇద్దరు గైడ్లను స్థానిక గ్రామస్తులు పట్టుకున్నారని, వారు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారని బాసిత్‌కు తెలియజేశారు’అని విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మంగళవారం ట్వీట్ చేశారు. ’ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఉడీలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడిని హఫీజ్ అహ్మద్‌గా గుర్తించారు. అతను పాకిస్థాన్ ముజఫరాబాద్‌లోని దర్భాంగ్‌కు చెందిన ఫిరోజ్ కొడుకు అని తేలింది’ అని ఆయన తెలిపారు. ఉడీలో దాడికి దిగిన మరో ఇద్దరిని మహ్మద్ కబీర్ అవాన్, బషారత్‌గా గుర్తించినట్టు తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదులు దాడులు కొనసాగించడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదని బాసిత్‌కు తేల్చి చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. పాక్ రాయబారి బాసిత్‌కు భారత్ సమన్లు జారీచేయడం ఇది రెండోసారి. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సెప్టెంబర్ 21న కూడా ఆయనకు విదేశాంగ కార్యదర్శి సమన్లు జారీచేశారు. 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దౌత్యపరంగా అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని, ఆర్థికంగా, సైనికంగా దెబ్బకొట్టే వ్యూహాలు రచించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
సింధు నది ఒప్పందంపై పాక్ గగ్గోలు
ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా తప్పుకోలేదు ఇంటర్నేషనల్ కోర్టుకు వెళుతామని వ్యాఖ్య ఇస్లామాబాద్: సింధు నది జలాల పంపిణీ ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న భారత్ నిర్ణయంపై పాకిస్థాన్ గగ్గోలు పెట్టింది. ఈ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తే.. తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొంది. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సింధు నదీ జలాలపై భారత్-పాకిస్తాన్ చర్చలను రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెత్తురు, నీళ్లు కలిసి ప్రవహించలేవంటూ ఈ ఒప్పందంపై సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. 'అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ ఏకపక్షంగా ఈ ఒప్పందం నుంచి తప్పుకోలేదు' అని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజిజ్ మంగళవారం పేర్కొన్నారు. పాక్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. కార్గిల్ యుద్ధం, సియాచిన్ సంఘర్షణ సమయంలోనూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని గుర్తుచేశారు. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు నది ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేయలేదని, ఒప్పందాన్ని రద్దుచేయడానికిగానీ, ఒప్పందం నుంచి తప్పుకోవడానికిగానీ ఎలాంటి నిబంధనలు లేవని, ఇది కుదరదని సర్తాజ్ అజిజ్ పేర్కొన్నారు. -
పాకిస్థాన్‌కు భారత్ గట్టి హెచ్చరిక!
కశ్మీర్‌లోని పరిస్థితులపై ‘బ్లాక్ డే’ పాటించిన పాకిస్థాన్ మీద భారత్ తీవ్రంగా మండిపడింది. భారత గడ్డపై ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, మద్దతు తెలుపడం మానుకోవాలని, భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలని గట్టిగా పేర్కొంది. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ‘బ్లాక్ డే’ పాటించడాన్ని ఖండించింది. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా ముద్రవేసిన వారు పాకిస్థాన్‌లో యథేచ్ఛగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. లష్కరే తోయిబా స్థాపకుడు, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ బుధవారం లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు ర్యాలీ నిర్వహించడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ మిలిటెంట్ బుర్హన్ వనీ భద్రతా దళాల ఎన్కౌంటర్లో చనిపోయిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లో తలెత్తిన హింసాత్మక ఆందోళనల్లో 44 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై పాక్ ప్రధాని షరీఫ్ కేబినెట్ బ్లాక్ డే నిర్వహించడం, జిహాదీ నాయకులైన సయీద్ లాంటివారు పాక్ అంతటా ఆందోళనలు నిర్వహించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మన దేశంలో ఉగ్రవాదాన్ని, హింసను రెచ్చగొట్టడం, మద్దతు తెలుపడం పాక్ మానుకోవాలని మేం మరోసారి స్పష్టంచేస్తున్నాం. అదేవిధంగా మా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నం చేయవద్దని చెప్తున్నాం’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. -
'ఇప్పటికైతే అనుమానం లేదు.. దర్యాప్తు పూర్తికాని'
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని పాకిస్థాన్ హామీ ఇచ్చిందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను దర్యాప్తు విషయంలో ఇంకా అనుమానించాల్సిన అవసరం లేదని తాను అనుకుంటున్నానని చెప్పారు. వారు దర్యాప్తు పూర్తి చేసేవరకు ఎదురుచూస్తే బాగుంటుందని అన్నారు. పఠాన్‌కోట్ దాడికి సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలను, వివరణలను పాకిస్థాన్ భారత్‌కు ఇచ్చిన సందర్భంగా రాజ్‌నాథ్ ఇలా స్పందించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న భారత్ వాటి వివరాలు తెలియజేయాలని పాకిస్థాన్‌ను కోరిన విషయం తెలిసిందే. అయితే, వాటిని పరిశీలించిన పాక్ అవి తమ దేశంలో రిజిస్ట్రేషన్ అయిన సిమ్ కార్డులు కాదని చెప్పడంతోపాటు, ఆ దేశ దర్యాప్తు అధికారులు పఠాన్ కోట్ దాడికి సంబంధించి ప్రాథమికంగా సేకరించిన ఆధారాలను భారత్ కు సోమవారం అందజేసిన విషయం తెలిసిందే.