న్యూఢిల్లీ: పఠాన్ కోట్ పై దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని పాకిస్థాన్ హామీ ఇచ్చిందని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను దర్యాప్తు విషయంలో ఇంకా అనుమానించాల్సిన అవసరం లేదని తాను అనుకుంటున్నానని చెప్పారు.
వారు దర్యాప్తు పూర్తి చేసేవరకు ఎదురుచూస్తే బాగుంటుందని అన్నారు. పఠాన్‌కోట్ దాడికి సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలను, వివరణలను పాకిస్థాన్ భారత్‌కు ఇచ్చిన సందర్భంగా రాజ్‌నాథ్ ఇలా స్పందించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న భారత్ వాటి వివరాలు తెలియజేయాలని పాకిస్థాన్‌ను కోరిన విషయం తెలిసిందే. అయితే, వాటిని పరిశీలించిన పాక్ అవి తమ దేశంలో రిజిస్ట్రేషన్ అయిన సిమ్ కార్డులు కాదని చెప్పడంతోపాటు, ఆ దేశ దర్యాప్తు అధికారులు పఠాన్ కోట్ దాడికి సంబంధించి ప్రాథమికంగా సేకరించిన ఆధారాలను భారత్ కు సోమవారం అందజేసిన విషయం తెలిసిందే.
'ఇప్పటికైతే అనుమానం లేదు.. దర్యాప్తు పూర్తికాని'
Published Tue, Jan 12 2016 4:33 PM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM
Advertisement