baby child
-
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ నటి.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
బాలీవుడ్ ప్రముఖ నటి మసాబా గుప్తా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈనెల 11న మొదటి బిడ్డకు స్వాగతం పలికింది. ఈ విషయాన్ని మసాబా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సత్యదీప్ మిశ్రాను పెళ్లాడిన మసాబాకు ఇటీవలే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ జంటకు ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. రిచా చద్దా, శిల్పాశెట్టి, సమీరా రెడ్డి, బిపాసా బసు అభినందనలు తెలిపారు.మసాబా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మాకు చాలా ప్రత్యేకమైన రోజు. చిన్న అమ్మాయి మా జీవితంలోకి 11.10.2024న అడుగుపెట్టింది' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. మసాబా గుప్తా నటిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 18న మసాబా గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్త సత్యదీప్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది.ఎవరీ మసాబా గుప్తా..కాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా సిరీస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta) -
టికెట్ అడిగేసరికి బిడ్డనే వదిలేశారు!
టెల్అవీవ్: బెల్జియం పాస్‌పోర్టులున్న ఆ దంపతులిద్దరూ ఏడాది వయస్సున్న బిడ్డను తీసుకుని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో బయలుదేరే బ్రస్సెల్స్ విమానంలో వారు ఎక్కాల్సి ఉంది. ఆలస్యంగా వచ్చిన వారిని ఒకటో నంబర్ టెర్మినల్ వద్ద సిబ్బంది ఆపి టికెట్లడిగారు. రెండు టికెట్లే చూపారు. చిన్నారికి కూడా టికెట్ కావాలనే సరికి ఇదేమిటంటూ ప్రశ్నించారు. సిబ్బందితో వాదనకు దిగారు. మరో టికెట్ కొనడానికి నిరాకరించారు. పైపెచ్చు, ష్ట్రోలర్పైన చిన్నారిని అక్కడే సెక్యూరిటీ విభాగం వద్ద వదిలేసి హడావుడిగా విమానం వైపు వెళ్లిపోబోయారు. ఇది చూసి సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది అలెర్ట్ చేయడంతో సెక్యూరిటీ అధికారులు వారిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జనవరి 31వ తేదీన ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో ఉన్న బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. టికెట్ అడిగారనే కారణంతో ఏకంగా బిడ్డనే వదిలేసిన తల్లిదండ్రులను ఇప్పుడే చూస్తున్నామని అక్కడి సిబ్బంది వ్యాఖ్యానించారు. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటన తమకు షాక్ కలిగించిందని సిబ్బంది తెలిపారని రియాన్ఎయిర్ విమానయాన సంస్థ అధికారి ఒకరు అన్నారు. -
చివరి కోరిక తీరకుండానే మరణించిన హీరో
కన్నడ చిత్ర హీరో చిరంజీవి సర్జా (39) గుండెపోటుతో ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అభిమానులను ఎంతో కలచి వేస్తోంది. ఈ విషాద సమయంలో మరో వార్త తెలిసింది. చిరంజీవి సర్జాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఈ వార్త.. ప్రస్తుతం మరింత విషాదాన్ని పంచుతుంది. చిరంజీవి భార్య గర్భవతి. త్వరలోనే వారి కుటుంబంలోకి మరో చిన్ని అతిథి రాబోతున్నారు. పుట్టబోయే బిడ్డ కోసం చిరంజీవి దంపతులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని సన్నిహితులు తెలిపారు. అంతేకాక త్వరలోనే ఈ శుభవార్తను అభిమానులతో పంచుకోవాలని చిరంజీవి దంపతులు అనుకున్నట్లు సమాచారం. కానీ ఈ కోరికలేవి తీరకుండానే చిరంజీవి ఆకస్మికంగా మృతి చెందారు. బిడ్డ పుట్టబోతుందన్న వార్త తెలిసి అభిమానులు, సన్నిహితులు మరింత కుంగి పోతున్నారు. (కన్నీటిపర్యంతమైన అర్జున్) చిరంజీవి, మేఘనా రెండేళ్ల డేటింగ్ తర్వాత వివాహం చేసుకున్నారు. అట్టగర చిత్రంలో ఇద్దరూ కలిసి నటించారు. వారి వివాహం ఏప్రిల్ 29, 2018న కోరిమంగళంలోని సెయింట్ ఆంటోనీ చర్చిలో జరిగింది. మే 2న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో రిసెప్షన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా చిరంజీవి అంత్యక్రియలు కనకపుర రోడ్డులోని నెలగోళి గ్రామంలోని ఫాంహౌస్‌లో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిశాయి. ఒక్కలిగ సంప్రదాయం ప్రకారం జరిపారు. -
42 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్
సాక్షి, చెన్నై : ఎంత పేరు, ప్రఖ్యాతి సంపాదించినా, మాతృత్వంతో కలిగే ఆనందమే వేరు. అలాంటి కమ్మనైన అమ్మతనాన్ని నటి సంఘవి 42 ఏళ్ల వయసులో అనుభవిస్తోంది. 1990 ప్రాంతంలో కథానాయికగా వెలిగిన నటి సంఘవి. 1993లో అమరావతి చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు కథానాయకిగా పరిచయం అయిన నటి సంఘవి. ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడ అంటూ దక్షిణాది లో పలు చిత్రాల్లో నటించింది. కాగా ఈమె 2016లో వెంకటేశ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది. (నటుడికి షాకిచ్చిన భార్య.. లీగల్ నోటీసులు) ఆ తరువాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న సంఘవి ఇటీవల కాలంలో నటిగా రీఎంట్రీ అయింది. కాగా 42 ఏళ్ల వయస్సులో నటి సంఘవి అమ్మ అయింది. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డతో మాతృత్వ ఆనందాన్ని పొందుతున్న దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. (కరోనాకు హైదరాబాద్ మెడిసిన్! ) -
సానియా ‘తల్లి లాలన’...
ఏస్‌లు, సర్వీస్లే కాదు తనకు ‘శిశు’లాలనా తెలుసంటోంది హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. తన ముద్దుగారే కుమారుడు ఇజ్హాన్ను మురిపెంగా చూసుకుంటున్న ఈ ఫొటోను కొత్త సంవత్సరం సందర్భంగా మంగళవారం ట్విట్టర్లో షేర్ చేసింది. పక్కనే ఎంచక్కా కునుకు తీస్తున్న భర్త షోయబ్ మాలిక్లాగే తనకూ నిద్రపోవాలని ఉన్నా... మాతృత్వపు మధురిమల్లో మునిగితేలుతున్నానని చెప్పింది. -
మా ముద్దుల కూతురు... నుర్వీ
బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కుటుంబం పెద్దదైంది. యస్.. మీ గెస్ నిజమే. నీల్ తండ్రి అయ్యారు. గత ఏడాది రుక్మిణి మాథుర్‌ని నీల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రుక్ష్మిణి ఓ పాపకు జన్మనిచ్చారు. ‘‘మొత్తం ముఖేష్ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నాం. దేవుడి దయ వల్ల తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. మా డార్లింగ్ డాటర్‌కి నుర్వీ నీల్ ముఖేష్ అని నామకరణం చేశాం’’ అని నీల్ పేర్కొన్నారు. ఇక ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... సౌత్‌లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న మరో సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. అటు నార్త్‌లో నీల్ హీరోగా ‘బైపాస్ రోడ్’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో టాలీవుడ్ ‘హార్ట్ఎటాక్’ గాళ్ అదా శర్మ హీరోయిన్గా నటిస్తున్నారు. నీల్ బ్రదర్ నామాన్ నీల్ నితిన్ ముఖేష్ ఈ సినిమాకు దర్శకుడు కావడం విశేషం. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దేశాధినేత
ఆక్లాండ్: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ పండంటి ఆడబిడ్డకు బుధవారం ఆక్లాండ్‌లోని ఆస్పత్రిలో జన్మనిచ్చారు. దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా ఆర్డర్న్ రికార్డుకెక్కారు. 37 ఏళ్ల జెసిండా, 40 ఏళ్ల క్లార్క్ గెఫోర్డ్ దంపతులకు ఈ పాప మొదటి సంతానం. 3.3 కిలోగ్రాముల బరువుతో బిడ్డ ఆరోగ్యంగా ఉందని ఆర్డర్న్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ‘కొత్తగా తల్లిదండ్రులైన వారికున్న భావోద్వేగాలే మాకూ ఉన్నాయి. శుభాకాంక్షలు అందజేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు’అని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో 1990లో అధికారంలో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. కాగా, లేబర్‌పార్టీ అధ్యక్ష బాధ్య తలు చేపట్టిన మూడు నెలలకు అంటే గతేడాది అక్టోబర్‌లో ఆర్డర్న్ ప్రధాని అయ్యారు. -
ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని..
పరిగి: ఏడునెలల పసిబిడ్డను అమానుషంగా నీటిగుంతలో ముంచి కడతేర్చాడో కసాయి తండ్రి. వివరాలు.. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం జాపర్‌పల్లికి చెందిన కొందపల్లి వెంకటయ్య, పద్మ దంపతులు వ్యవసాయం చేస్తూ కూలీపనులకు వెళ్తుంటారు. వీరికి పిల్లలు శ్రీవాణి(4), శోభిత(7 నెలలు) ఉన్నారు. ఇద్దరు కూతుళ్లే పుట్టారని కొంతకాలంగా వెంకటయ్య అసంతృప్తితో ఉన్నాడు. ఈ క్రమంలో, బుధవారం ఉదయం పద్మ వంట చేస్తుండగా శోభితను ఆడించుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలో ఓ నీటిగుంతలో ఆ పాపను ముంచి చంపేశాడు. అక్కడే ఓ గుంతలో మృతదేహాన్ని ఉంచి తిరిగి ఇంటికి వచ్చాడు. గ్రామస్తులు అతడిని నిలదీయడంతో విషయం చెప్పాడు. ఆయన్ను ఘటనా స్థలానికి తీసుకెళ్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. కొన్ని రోజులుగా తన మానసిక పరిస్థితి బాగాలేదని, ఏం చేస్తున్నానో.. తెలియడం లేదని వెంకటయ్య తెలిపాడు. కాగా.. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనే అక్కసుతోనే వెంకటయ్య ఓ పాపను చంపేశాడని పద్మ తరఫు బంధువులు ఆరోపించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శంషొద్దీన్ తెలిపారు. -
కూతురును విక్రయానికి ఉంచిన తల్లి
ఖిల్లాఘనపురం: పోషణభారంగా భావించిన ఓ తల్లి ముక్కుపచ్చలారని కూతురును అంగట్లో విక్రయించేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండలంలో చోటుచేసుకుంది. తిర్మలాయపల్లి పంచాయతీ రోడ్డు మీది తండాకు చెందిన రాత్లావత్ దేవుజా, మణి దంపతులకు కూతురు ఉంది. రెండోకాన్పులో మణికి కవల ఆడపిల్లలు పుట్టారు. ముగ్గురు కూతుళ్ల పోషణభారంగా భావించి ఓ పాపను విక్రయించేందుకు సిద్ధపడింది. తల్లి జమ్మాతో కలసి ఘనపురం బస్టాండ్‌కు వచ్చి కొందరిని కలిసి తన కూతురును అమ్ముతానని చెప్పింది. ఎవరూ ముందుకురాకపోవడంతో కనీసం డబ్బులు ఇవ్వకుండనైనా తీసుకోండి..! అంటూ బతిమాలింది. ఈ విషయాన్ని స్థానికులు కొందరు పోలీసులకు చెప్పడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చి ఆమెను ఇంటికి పంపించారు.