పరిగి: ఏడునెలల పసిబిడ్డను అమానుషంగా నీటిగుంతలో ముంచి కడతేర్చాడో కసాయి తండ్రి. వివరాలు.. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం జాపర్‌పల్లికి చెందిన కొందపల్లి వెంకటయ్య, పద్మ దంపతులు వ్యవసాయం చేస్తూ కూలీపనులకు వెళ్తుంటారు. వీరికి పిల్లలు శ్రీవాణి(4), శోభిత(7 నెలలు) ఉన్నారు. ఇద్దరు కూతుళ్లే పుట్టారని కొంతకాలంగా వెంకటయ్య అసంతృప్తితో ఉన్నాడు.
ఈ క్రమంలో, బుధవారం ఉదయం పద్మ వంట చేస్తుండగా శోభితను ఆడించుకుంటూ బయటకు తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలో ఓ నీటిగుంతలో ఆ పాపను ముంచి చంపేశాడు. అక్కడే ఓ గుంతలో మృతదేహాన్ని ఉంచి తిరిగి ఇంటికి వచ్చాడు. గ్రామస్తులు అతడిని నిలదీయడంతో విషయం చెప్పాడు. ఆయన్ను ఘటనా స్థలానికి తీసుకెళ్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు.
కొన్ని రోజులుగా తన మానసిక పరిస్థితి బాగాలేదని, ఏం చేస్తున్నానో.. తెలియడం లేదని వెంకటయ్య తెలిపాడు. కాగా.. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారనే అక్కసుతోనే వెంకటయ్య ఓ పాపను చంపేశాడని పద్మ తరఫు బంధువులు ఆరోపించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శంషొద్దీన్ తెలిపారు.
ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని..
Published Thu, Apr 9 2015 1:01 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement