
ఏస్‌లు, సర్వీస్‌లే కాదు తనకు ‘శిశు’లాలనా తెలుసంటోంది హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. తన ముద్దుగారే కుమారుడు ఇజ్‌హాన్‌ను మురిపెంగా చూసుకుంటున్న ఈ ఫొటోను కొత్త సంవత్సరం సందర్భంగా మంగళవారం ట్విట్టర్‌లో షేర్ చేసింది. పక్కనే ఎంచక్కా కునుకు తీస్తున్న భర్త షోయబ్ మాలిక్‌లాగే తనకూ నిద్రపోవాలని ఉన్నా... మాతృత్వపు మధురిమల్లో మునిగితేలుతున్నానని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment