
మా కుక్కలకి, నీ పిల్లులకి పెళ్లి!
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కుటుంబంలోకి ఇద్దరు కొత్త సభ్యులు చేరారట. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. తమ ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చి చేరిన రెండు పిల్లుల ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. వాటికి హీర్ మీర్జా, జారా మీర్జా అనే పేర్లు కూడా పెట్టింది.
చూడముచ్చటగా ఉన్న ఆ రెండు తెల్లటి పిల్లి పిల్లలు ఓ సోఫాలో విశ్రాంతి తీసుకుంటుండగా ఫొటో తీసి దాన్ని షేర్ చేసింది. దాంతో.. దర్శకురాలు ఫరాఖాన్ కూడా స్పందించింది. తాను ఇప్పటికే పెంచుకుంటున్న కుక్క పిల్లలకు, ఈ పిల్లి పిల్లలకు పెళ్లి చేద్దామంటూ ఓ ప్రపోజల్ తీసుకొచ్చింది. దీనివల్ల తామిద్దరం వియ్యపురాళ్లం అవుతామని కూడా చెప్పింది.
Now ur cats can marry my puppies n v can become in laws!! https://t.co/1mVXtld0M1
— Farah Khan (@TheFarahKhan) March 7, 2016