భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. షోయబ్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచీ పలు సందర్భాల్లో ఆమె జాతీయతపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇరు దేశాల స్వాతంత్య్ర దినోత్సవాల సమయంలో సానియాకు ఎదురయ్యే ప్రశ్నలు అధికం. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తన జాతీయతను ప్రశ్నించిన ఓ నెటిజన్‌కు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఘాటు రిప్లై ఇచ్చారు.
ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నా పాకిస్థానీ అభిమానులు, మిత్రులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ భారతీయ వదిన నుంచి మీకు బెస్ట్ విషెష్, లవ్’ అని సానియా ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ చూసిన ఓ నెటిజన్ ‘‘మీక్కూడా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే, మీ ఇండిపెండెన్స్ డే కూడా ఈ రోజే’’ అని ట్వీట్ చేశాడు. నెటిజన్ ట్వీట్‌పై స్పందించిన సానియా.. ‘‘కాదు, నాది.. నా దేశానిది రేపు. ఈ రోజు నా భర్తది, ఆయన దేశానిది. ఇప్పటికైనా స్పష్టత వచ్చిందనుకుంటా. మరి మీదెప్పుడు?.. ’ అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్ అయింది.
Happy Independence Day to my Pakistani fans and friends !! best wishes and love from your Indian Bhabi 🙏🏽
— Sania Mirza (@MirzaSania) August 14, 2018
Jee nahi.. mera aur mere country ka Independence Day kal hai, aur mere husband aur unnki country ka aaj!! Hope your confusion is cleared !!Waise aapka kab hai?? Since you seem very confused .. https://t.co/JAmyorH0dV
— Sania Mirza (@MirzaSania) August 14, 2018
తన స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15నేనని తన జాతీయతను ప్రశ్నించిన ఆ నెటిజన్‌కు కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది. ట్రోల్స్‌ను సీరియస్‌గా తీసుకోవద్దని సానియాకు మరో నెటిజన్ సూచించారు. ఆ నెటిజన్ సూచనకు స్పందించిన సానియా.. ‘నేను నవ్వుతున్నా. మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు’ అని చెప్పారు. మరోవైపు తాను, షోయబ్ భారత్, పాకిస్తాన్‌లను కలుపడానికి పెళ్లి చేసుకున్నామని చాలామంది అపోహపడుతూ ఉంటారని, కానీ అది నిజం కాదని సానియా మీర్జా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రతేడాది తాను పాకిస్తాన్ వెళ్తుంటానని అక్కడి ప్రజలు తను చాలా బాగా ప్రేమిస్తారని కూడా తెలిపారు. సానియా, షోయబ్‌లు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. సానియా మీర్జాకు ప్రస్తుతం ఎనిమిదో నెల.
I am smiling :) it’s gonna take muchhhhhh more than a troll on social media to take over my brain ... thank you for your wishes 🙌🏽 https://t.co/NPBDz3h0UF
— Sania Mirza (@MirzaSania) August 14, 2018
Comments
Please login to add a commentAdd a comment