Fara khan
-
‘ఆమెను శ్రీదేవితో పోల్చకండి’
ముంబై : బాలీవుడ్ దర్శకురాలు, కొరియెగ్రాఫర్ ఫరాఖాన్ రీల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఈ అవార్డ్స్ కమిటీకి జ్యూరి మెంబర్‌గా వ్యవహరిస్తున్న ఆమె ఈ ఏడాది కొత్త కథాంశాలతో సినిమాలు వచ్చాయని, ‘లిప్‌స్టిక్ అండర్ బుర్ఖా’ సందేశంతో పాటు వినోదం కూడా పంచిందన్నారు. న్యూటన్, హిందీ మీడియమ్ సినిమాలు కూడా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కాయని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన బాలీవుడ్ అందాల నటి శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. లెజండరీ హీరోయిన్ శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని, కెరీర్ తొలినాళ్లలో ఆమె తననెంతో ప్రోత్సహించారన్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ‘దడక్’ సినిమాకు కొరియోగ్రఫీ చేస్తున్న ఫరా, జాన్వీ కూడా మంచి డాన్సర్ అని ప్రశంసలు కురిపించారు. అయితే ఇంకా జాన్వీ నేర్చుకునే దశలోనే ఉందదని.. ఇప్పుడే ఆమెను శ్రీదేవితో పోల్చడం సరైంది కాదన్నారు. మై హూనా సినిమాతో డైరెక్టర్‌గా మారిన ఫరాఖాన్.. కొంత కాలంగా దర్శకత్వ బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. ఈ మీడియా సమావేశంలో తన భవిష్యత్ ప్రణాళిక గురించి మాట్లాడుతూ రొటీన్ సినిమాలతో విసిగెత్తిపోయాను. స్టైల్ మార్చి ఈసారి బిగ్ బడ్జెట్ యాక్షన్ మూవీ చేయాలనుకుంటున్నాను తన మనసులో మాట బయటపెట్టారు. -
మా కుక్కలకి, నీ పిల్లులకి పెళ్లి!
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కుటుంబంలోకి ఇద్దరు కొత్త సభ్యులు చేరారట. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. తమ ఫ్యామిలీలోకి కొత్తగా వచ్చి చేరిన రెండు పిల్లుల ఫొటోలను ఆమె పోస్ట్ చేసింది. వాటికి హీర్ మీర్జా, జారా మీర్జా అనే పేర్లు కూడా పెట్టింది. చూడముచ్చటగా ఉన్న ఆ రెండు తెల్లటి పిల్లి పిల్లలు ఓ సోఫాలో విశ్రాంతి తీసుకుంటుండగా ఫొటో తీసి దాన్ని షేర్ చేసింది. దాంతో.. దర్శకురాలు ఫరాఖాన్ కూడా స్పందించింది. తాను ఇప్పటికే పెంచుకుంటున్న కుక్క పిల్లలకు, ఈ పిల్లి పిల్లలకు పెళ్లి చేద్దామంటూ ఓ ప్రపోజల్ తీసుకొచ్చింది. దీనివల్ల తామిద్దరం వియ్యపురాళ్లం అవుతామని కూడా చెప్పింది. Now ur cats can marry my puppies n v can become in laws!! https://t.co/1mVXtld0M1 — Farah Khan (@TheFarahKhan) March 7, 2016 -
అతడే నా ఫేవరెట్!
ఖాన్ల త్రయం, హృతిక్ రోషన్... ఎందరో స్టార్లకు డ్యాన్స్ సీక్వెన్స్‌లు చేసిన ఫరాఖాన్‌కు వీళ్లలో ఎవరూ నచ్చలేదట. ఎంతమంది ఎన్ని ‘మెలికలు’ తిరిగినా... కామెడీ స్టార్ గోవింద డ్యాన్స్ చూసినంత కిక్కు రాదట. బాలీవుడ్లో సిసలైన డ్యాన్స్ కింగ్ అంటే అతడే అంటోందీ డెరైక్టర్‌గా మారిన కొరియోగ్రాఫర్. ‘గోవిందా డ్యాన్స్ చేస్తుంటే నేను ఎంతో హ్యాపీగా ఫీలవుతా’ అంటోంది. పైగా... ‘డ్యాన్స్ కమ్స్ దిల్ సే. స్టెప్స్ కమ్ ఫ్రమ్ ది మైండ్’ అంటూ కొత్త కొత్తగా ఏదేదో చెప్పేసింది తాజాగా ఓ డ్యాన్స్ రియాల్టీ షో లాంచింగ్‌లో!