ఐవీఎఫ్‌.. శారీరకంగా, మానసికంగా ఎంత బాధ ఉంటుందంటే.. కొరియోగ్రాఫర్‌ | Farah Khan Talks About Emotional And Physical Toll Of IVF | Sakshi
Sakshi News home page

ఐవీఎఫ్‌ జర్నీ.. రోజుకు ఐదు ఇంజక్షన్స్‌.. అంత ఈజీ కాదు: కొరియోగ్రాఫర్‌

Published Fri, Jan 24 2025 5:46 PM | Last Updated on Fri, Jan 24 2025 6:21 PM

Farah Khan Talks About Emotional And Physical Toll Of IVF

బాలీవుడ్‌ దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌(Director and choreographer) ఫరాఖాన్‌(Farah Khan) తరుచుగా తన ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) జర్నీ గురించి మాట్లాడుతుంటారు. ఇటీవల నటి డెబినా బోనర్టీతో పాడ్‌కాస్ట్‌ సంభాషణలో ఫరాఖాన్‌ ఐవీఎఫ్‌ సవాళ్ల గురించి భావోద్వేగంగా చెబుతూ నాటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. నిజానికి ఐవీఎఫ్‌తో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందా..? శారీరకంగా, మానసికంగా చాలా దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయా అంటే..

ఫరాఖాన్‌ తన ఐవీఎఫ్‌ జర్నీ గురించి మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ వల్ల శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు ఫేస్‌ చేస్తామని అన్నారు. ముందుగా మన శరీరాన్ని సిద్ధం చేసేందుకు వైద్యులు చాలా హార్మోన్‌ ఇంజెక్షన్‌లు ఇస్తారని అన్నారు. ఈ ప్రక్రియలో ప్రాథమికంగా అండాశయాల కోసం రోజుకు ఐదు ఇంజెక్షన్‌లు(5 injections) తీసుకున్నట్లు తెలిపారు. అలాగే "గర్భాశయ పొరను సరిచేసేందుకు అండాశయాలు సరిగ్గ పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకోవడానికి ప్రెగ్నైల్ అనే హార్మోన్‌ని ఇంజెక్షన్‌ రూపంలో కడుపుకు, తొడకు ఇస్తారు. 

ఇది ఎంత బాధాకరంగా ఉంటుందంటే.. మాటల్లో చెప్పలేం. కానీ ఇక్కడ బిడ్డను కనాలనే ఆలోచన ఆ బాధను ఓర్చుకునేలా చేస్తుంది. అయితే ఈ హర్మోన్‌ ఇంజెక్షన్‌లు మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. అకస్మాత్తుగా ఏడవడం, మూడీగా ఉండటం, చికాకు తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ సమస్యలన్నింటిని అర్థం చేసుకునే భర్త అండదండ ఉంటేనే ఈ ఐవీఎఫ్‌ ప్రక్రియను విజయవంతంగా ఎదుర్కొని బిడ్డను కనగలరని అన్నారు." ఫరాఖాన్‌. ఆమె 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌ ద్వారా ముగ్గురు పిల్లలకి తల్లయ్యారు. 

ఈ ఐవీఎఫ్‌ వంధ్యత్వం(Infertility)తో పోరాడుతున్న వారికి ఆశను అందిస్తుండగా, దీన్ని చేయించుకోవాలంటే ఆయా వ్యక్తులుకు అంతే స్థాయిలో అపారమైన స్థైర్యం కావాలి. ముఖ్యంగా శారీరక, మానసిక భావోద్వేగాలను అదుపు చేసుకోగలిగే శక్తి ఉండాలి లేదా స్ట్రాంగ్‌గా ఎదుర్కొనేలా సిద్ధపడాలి.

హార్మోన్ల చికిత్సల వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు..
తరచుగా అండాశయాలను ఉత్తేజపరిచేందుకు, పిండ ఇంప్లాంటేషన్ కోసం శరీరాన్ని సిద్ధం చేసేలా హార్మోన్ల చికిత్సలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల వీటివల్ల అనేక రకాల దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పదంటున్నారు. అవేంటంటే..

ఓవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్ సిండ్రోమ్ (OHSS): అండాశయాల సేకరణ కోసం ఇచ్చే హార్మోన్‌ ఇంజెక్షన్‌ల కారణంగా అండాశయాలు వాపు రావడం జరుగుతుంది. ఇది చాలా బాధకరమైన స్థితి. దీని కారణంగా పొట్ట ఉబ్బరం, వికారం, వాంతులు, కడుపు నొప్పి తదితర సమస్యలు వస్తాయి.  

మూడ్ స్వింగ్స్, భావోద్వేగ అసమతుల్యత: IVF చేయించుకుంటున్న సమయంలో తరుచుగా అనుభవించే మానసిక కల్లోలం, చిరాకు, భావోద్వేగ బాధలకు హార్మోన్ల హెచ్చు తగ్గులే మూల కారణం. దీనివల్ల మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్‌లను ప్రభావితం చేసే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

ఇంజెక్షన్‌ ఇచ్చే ప్రాంతంలో నొప్పి లేదా వాపుకి గురవ్వడం.

అలసట, తలనొప్పులు 

నిర్జలీకరణం, నిద్రలేకపోవడం వంటి సమస్యలు ఎదరవుతాయని చెబుతున్నారు నిపుణులు

భావోద్వేగ సవాళ్లని అధిగమించాలంటే..

  • యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి. 

  • కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) లేదా కౌన్సెలింగ్ వంటివి తీసుకోవడం

  • వాకింగ్‌ లేదా స్విమ్మింగ్‌ వంటి తేలికపాటి వ్యాయామాలతో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొనవచ్చు. 

  • కుటుంబ సహకారం తీసుకోవడం తదితరాలతో ఈ ఐవీఎఫ్‌తో వచ్చే భావోద్వేగ సవాళ్లని అధిగమించగలుగుతారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement