IVF treatment
-
పిల్లల కోసం ఆ ట్రీట్మెంట్.. విపరీతమైన బాధ అనుభవించా : ప్రీతి జింటా
సినీ తారల జీవితం బయటకు చూడడానికి అద్దాల మేడలా కనిపిస్తుంది. ఒక్కసారి లోపలికి తొంగి చూస్తే కనిపించేదంతా ఊహించడానికి కష్టంగా ఉంటుంది. తెరపై పండించే వినోదం వెనుక ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. బయటకు చెప్పుకోలేని సమస్యలు తారలను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి. అయితే ఇవేవి తమ అభిమానులకు తెలియజేయకుండా..తమ నటనతో వారిని అలరిస్తూ ఉంటారు. బాలీవుడ్ నటి ప్రీతీ జింటా కూడా నిజ జీవితంలో చాలా కష్టాలు పడినా.. వెండితెరపై మాత్రం మహారాణిలా నవ్వుతూ కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయట. తాజాగా ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న కష్ట సమయం గురించి వెల్లడిస్తూ..తల్లి అయ్యేందుకు పడిని బాధలను షేర్ చేసుకుంది. ‘అందరి జీవితాల్లో లాగే నా లైఫ్‌లో కూడా మంచి రోజులతో పాటు చెడ్డ రోజులు కూడా ఉన్నాయి. నిజ జీవితంలో సంతోషంగా ఉండేందుకు చాలా సార్లు కష్టపడ్డాను. ముఖ్యంగా పిల్లల కోసం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పడు చాలా బాధను అనుభవించాను. కొన్నిసార్లు తల గోడకు కొట్టుకొని ఏడవాలనిపించేది. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండేదాన్ని. కానీ ఆ ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది. దీంతో చివరకు సరోగసి ద్వారా తల్లినయ్యాను’ అని ప్రీతిజింటా చెప్పుకొచ్చింది. 2016లో అమెరికాకు చెందిన జీన్‌ను ప్రీతి జింటా వివాహం చేసుకుంది. 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న ‘లాహోర్: 1947’లో ప్రీతి కీలక పాత్రను పోషిస్తోంది. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ తన బ్యానర్లో నిర్మిస్తున్నాడు. -
Mothers Day 2024: ఐవీఎఫ్ అద్భుతాలెన్నో...పెద్దవయసులోనూ గర్భధారణ
గత ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌కి చెందిన ఎర్రమట్టి మంగమ్మ అనే మహిళ పెద్దవయసులోనూ ఐవీఎఫ్ ద్వారా గర్భాన్ని ధరించడం రికార్డ్‌గా నిలిచింది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధం అంటూ దీనిపై వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ ఆకాశమే హద్దుగా నిలుస్తున్న ఐవీఎఫ్ చికిత్స సామర్ద్యానికి ఇది అద్దం పడుతుందనేది వాస్తవం. సంతానలేమి సమస్యతో పోరాడుతున్న ఆధునిక మహిళకు ఇన్–విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)అమ్మ కావాలనే కలను సాకారం చేయడంతో పాటు వయసుకు సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిస్తోంది. ప్రీ ఇంప్లాంటేషన్ ద్వారా జన్యు పరీక్షలు వంశపారంపర్య వ్యాధులకు అడ్డుకట్ట వేయడం వంటి మరికొన్ని అదనపు ప్రయోజనాలను జత చేసుకుంటూ ఐవీఎఫ్ అంతకంతకూ మహిళలకు చేరువవుతోందని అంటున్నారు ఫెర్టీ9ఫెర్టిలిటీ సెంటర్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.వయస్సు నుంచి ఒత్తిడి దాకా...కెరీర్ వేటలో లేటు పెళ్లిళ్లు, గర్భధారణ వాయిదాలు...నగర మహిళకు తప్పనిసరిగా కాగా మధ్య వయసులో గర్భదారణ యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. అత్యధిక శాతం ఆధునిక మహిళలు 30ఏళ్ల వయసు తర్వాత మాత్రమే పిల్లల గురించి ఆలోచిస్తున్నారని, ఆలస్యంగా తల్లి కావడం ఒక నిబంధనలా మారిందని వెల్లడించింది. అదే విధంగా నగర జీవనంలో కాటేసే కాలుష్యం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి వంటివన్నీ తల్లి కావాలనే ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఈ నేపధ్యంలో వీటన్నింటికీ పరిష్కారంగా మారింది ఐవీఎఫ్..పెద్ద వయసులోనూ పిల్లలకు అవకాశం..డబ్లు్యహెచ్ నివేదిక ప్రకారం 17.5% మంది వయోజనులను ప్రభావితం చేసే వంధ్యత్వాన్ని గుర్తించడం ద్వారా, ఐవీఎఫ్ మహిళల సంతానోత్పత్తి అవకాశాలపై మరింత అవగాహనను అందిస్తుంది.ఒంటరులకు...లివ్ ఇన్ కాపురాలకూ..మాతృత్వం పొందే విషయంలో సాంఘిక నిబంధనలతో పాటు అనేక రకాల పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి. కారణాలేమైనప్పటికీ నగరంలో నివసించే ఒంటరి జీవుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాగే పెళ్లి కాకుండా కలిసి జీవిస్తున్న జంటలూ, స్వలింగ దాంపత్యాలు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంతానకాంక్షను తీరుస్తోంది ఐవీఎఫ్. ఐవీఎఫ్ ద్వారా ప్రీ ఇంప్లాంటేషన్, జన్యు పరీక్ష వంటివి కూడా సాధ్యపడుతుండడంతో మహిళలు వారి పునరుత్పత్తి భవిష్యత్తు గురించి సమాచారం పొందగలుగుతున్నారు. దీని ద్వారా ఎవరైనా సరే ఇంప్లాంటేషన్‌కు ముందు జన్యుపరమైన అపసవ్యతలకు సంబంధించి పిండాలను పరీక్షించవచ్చు, భవిష్యత్ తరాలకు వంశపారంపర్య వ్యాధులను చేర వేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జన్యువులపై ఈ స్థాయి నియంత్రణ ద్వారా మహిళలు వారి కుటుంబాల కోసం వారి విలువలు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఐవీఎఫ్ సహకరిస్తుంది.ఐవీఎఫ్...అడ్డంకులకు పరిష్కారం..సంతానలేమి సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చిన ఐవీఎఫ్ ఇప్పుడు సంతానలేమికి కారణమయ్యే అడ్డంకులను అధిగమించడానికి కూడా సహకరిస్తోంది. జన్యుపరీక్షలతో వంశపారంపర్య వ్యాధులకు చెక్ పెట్టే అవకాశం.. వైవిధ్యభరిత మాతృత్వాలు వంటివి ఐవీఎఫ్ ద్వారా సాధ్యమవుతున్నాయి.– డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.సీనియర్ కన్సల్టెంట్, ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ -
ఐవీఎఫ్ హార్మోన్ల బదులు అబార్షన్ బిళ్లలిచ్చారు!
న్యూయార్క్: వైద్యపరమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ ఉదంతం. అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో సంతానం కోసం ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించిన తమికా థామస్ అనే మహిళకు మెడికల్ షాపు ఐవీఎఫ్ హార్మోన్ల బదులు పొరపాటున అబార్షన్ మాత్రలు ఇచి్చంది. ఏకంగా ఇద్దరు గర్భస్థ శిశువుల మరణానికి కారణమైంది! పుట్టబోయే బిడ్డలను పొట్టన పెట్టుకున్నారంటూ మెడికల్ షాప్‌పై ఆమె స్టేట్ బోర్డ్ ఆఫ్ ఫార్మసీకి ఫిర్యాదు చేసింది. ప్రిస్క్రిప్షన్‌లోని డాక్టర్ చేతిరాత అర్థం కాకపోవడం ఈ దారుణ పొరపాటుకు దారి తీసినట్టు విచారణలో తేలింది. ‘షాపు సిబ్బంది తప్పు మీద తప్పు చేశారు. ఆ రాతను తమకు తోచినట్టుగా అర్థం చేసుకుని ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. పైగా తాము ఏం మందులు ఇస్తున్నదీ, వాటివల్ల ఏం జరుగుతుందన్నది విధిగా చెప్పాల్సి ఉండగా ఆ పని కూడా చేయలేదు’అని బోర్డు తేలి్చంది. మెడికల్ షాప్‌కు పది వేల డాలర్ల జరిమానా విధించింది. కానీ దీనివల్ల పుట్టక ముందే కన్ను మూసిన తమ బిడ్డలు తిరిగొస్తారా అంటూ థామస్ దంపతులు విలపిస్తున్నారు. వారికి నలుగురు సంతానం. పెద్ద కుటుంబం కావాలనే కోరికతో మళ్లీ పిల్లలను కనాలని నిర్ణయించుకుని ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. -
ట్రీట్మెంట్ ఫెయిల్, కాళ్లు, చేతులు మొద్దుబారుతున్నాయి: ఏడ్చిన నటి
అమ్మ అని పిలిపించుకోవాలని ఏ మహిళకు ఉండదు. కానీ గర్భధారణ విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే ఐవీఎఫ్, సరోగసీ పద్ధతుల ద్వారా పిల్లలను కనాలని ఆలోచిస్తారు. బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంభావన సైతం ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్)ను ఆశ్రయించింది. కానీ ఈ ఆధునిక పద్ధతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతోంది. తాజాగా మరోసారి ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్‌తో సతమతమవుతున్నానంటోంది. తన బాధను అభిమానులతో పంచుకుంటూ కంటతడి పెట్టుకుంది. 'పిల్లలను కనాలని ఐవీఎఫ్ పద్ధతిని ఎంచుకున్నాం. కానీ దీనివల్ల కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నాను. చల్లగా ఉండే ప్రదేశంలో ఎక్కువ సేపు ఉంటే చాలు కాళ్లు, చేతులు మొద్దుబారిపోతున్నాయి. తర్వాత వాపు లేదంటే నొప్పి వస్తోంది. కొన్నిసార్లు నన్ను చూస్తే నాకే కోపమొస్తోంది. అసలు నాకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మంచి జరగబోతుందనుకునేలోపు ఏదో ఒక చెడు జరుగుతుంది. నా వల్ల నా భర్త అవినాష్ కూడా బాధపడుతున్నాడు. ఈ సమస్యలతో నిత్యం పోరాడుతూ ఉండటం నరకంగా ఉంది. కొందరేమో నేను లావయ్యానని ట్రోల్ చేస్తున్నారు. అవును, నేను నాలుగోసారి ఐవీఎఫ్ పద్ధతి ప్రయత్నించగా అది ఫెయిల్ అయింది. అందువల్లే ఇలా బరువు పెరిగాను' అని చెప్పుకొచ్చింది సంభావన. అటు ఆమె భర్త అవినాష్ సైతం ఇలాంటి వైద్య విధానాలు అంత సులువుగా ఏమీ ఉండవన్నాడు. దీనివల్ల శరీరంలో హార్మోన్స్ అదుపు తప్పుతాయని, అంతమాత్రానికే తన భార్యను నోటికొచ్చినట్లు అంటే బాగోదని హెచ్చరించాడు. View this post on Instagram A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial) View this post on Instagram A post shared by Sambhavna Seth (@sambhavnasethofficial) చదవండి: అమ్మ హాస్పిటల్లో ఉందంటే కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు ధనుష్‌తో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
సంతానం లేనివారు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగిచుకోవాలి
-
పొరపాటున వేరే వారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..!
వాషింగ్టన్: తల్లి అయితే గాని స్త్రీ జన్మకు పరిపూర్ణత లభించదనుకునే సమాజం మనది. ఇక మాతృత్వం కోసం ప్రతి మహిళ పరితపిస్తుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. అమ్మ అని పిలుపించుకోవాలని ఉవ్విళ్లూరుతుంది. దురదృష్టం కొద్ది పిల్లలు పుట్టే అవకాశం లేని వారి బాధ వర్ణానాతీతం. అయితే ప్రస్తుతం వీరిపాలిట వరంగా మారింది కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్). కృత్రిమ గర్భధారణ ఎందరో మహిళలకు మాతృత్వం అనే వరాన్ని తిరిగి అందిస్తుంది. ఇదంతా బాగానే ఉంది.. కానీ దీనిలో ఏ మాత్రం తేడా జరిగినా.. ఫలితం దారుణంగా ఉంటుంది. ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు అమెరికాకు చెందిన ఓ జంట. ఇందుకు కారణమైన ఐవీఎఫ్ క్లినిక్‌పై కేసు నమోదు చేశారు. ఆ వివరాలు.. (చదవండి: భర్త మరణించిన ఆరు నెలలకు గర్భం..!) అమెరికాకు చెందిన డఫ్నా, అలెగ్జాండర్ కార్డినాల్ దంపతులకు వివాహం అయ్యి చాలా కాలమయ్యింది కానీ పిల్లలు కలగలేదు. దాంతో వాళ్లు కృత్రిమ గర్భధారణ(ఐవీఎఫ్) ద్వారా బిడ్డను కనాలనుకున్నారు. ఈ క్రమంలో తమ ఇంటికి సమీపంలో ఉన్న ఓ ఐవీఎఫ్ కేంద్రాన్ని సంప్రదించారు. ఐవీఎఫ్ ద్వారా గర్భవతి అయిన డఫ్నా.. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ రంగు, ఒత్తైన నల్లటి జుట్టు.. చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు. తమ కుటుంబంలో ఎవరికి ఈ చిన్నారి లాంటి శరీర ఛాయ, జుట్టు లేవు. అయితే బిడ్డ పుట్టిన సంతోషంలో ప్రారంభంలో వారు ఇవేం పట్టించుకోలేదు. కానీ బిడ్డ పెరుగుతున్న కొద్ది వారిలో అనుమానం బలపడసాగింది. ఈ క్రమంలో డఫ్నా దంపతులు వారి బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ చేయించారు. ఫలితాలు వారిద్దరిలో ఎవరితో కూడా సరిపోలేదు. దాంతో వారి అనుమానం మరింత బలపడింది. (చదవండి: కోవిడ్ కాలం.. అంకురం కోసం...) ఈ క్రమంలో వారు తాము సంప్రదించిన ఐవీఎఫ్ కేంద్రానికి వెళ్లి.. విషయం చెప్పి.. నిలదీయగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది. డఫ్నా దంపతులు ఐవీఎఫ్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే మరో జంట కూడా కృత్రిమ గర్భధారణ కోసం పక్కనే ఉన్న క్లినిక్‌కు వచ్చారు. అయితే ఈ రెండింటిలో పని చేసేది ఒక్కడే డాక్టర్. ఫలితంగా సదరు డాక్టర్ పొరపాటున ఇరువురి పిండాలను తారుమారు చేశాడు. అంటే డఫ్నా దంపతుల పిండాన్ని వేరే వారి గర్భంలో.. వారి పిండాన్ని డఫ్నా గర్భంలో ప్రవేశపెట్టాడు. జుట్టు, శరీర ఛాయ వేరుగా ఉండటంతో అనుమానం రావడంతో.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో డఫ్నా దంపతులు సదరు ఐవీఎఫ్ కేంద్రం మీద కేసు పెట్టారు. తమ జన్యుపరమైన బిడ్డను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. (చదవండి: బరువు తగ్గించే ఔషధానికి ఆమోదం.. షాపులకు క్యూ కట్టిన జనాలు) ఈ క్రమంలో రెండు జంటలు తమ తమ జన్యుపరమైన బిడ్డలను పరస్పరం మార్చుకుని... సొంత బిడ్డలతో ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా డఫ్నా దంపతులు తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. మేం వేసిన లాసూట్ ద్వారా భావోద్వేగ నష్టాలు, పరిహారం,ఆస్తి నష్టాలు, అలాగే అనేక రకాల ఖర్చులను కోరుతోంది. చదవండి: కోమాలోకి వెళ్లి సొంత భాష మర్చిపోయి.. కొత్త భాష మాట్లాడుతోంది!! -
కోవిడ్ కాలం.. అంకురం కోసం...
భర్త ప్రాణం తీసుకెళుతున్న యుముణ్ణి సంతాన వరం కోరి భర్తను కాపాడుకుని పురాణాల్లో నిలిచింది సావిత్రి. ఇప్పుడు వడోదరాలో ఇద్దరు స్త్రీలు ఈ కారణం చేతనే అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. కోవిడ్ వల్ల భర్త మరణించగా ముందే నిల్వ చేసిన అతని వీర్యంతో ఒక భార్య తల్లి కావాలనుకుంటూ ఉంటే కోవిడ్ వల్ల చావు అంచుల్లో ఉన్న భర్త వీర్యాన్ని హైకోర్టుకు వెళ్లి మరీ సేకరించి తల్లి కావాలని నిర్ణయించుకుంది మరో భార్య. మాతృత్వ భావన, సహచరుడి పట్ల ఉన్న గాఢమైన ప్రేమ ఈ స్త్రీలను నేటి సావిత్రులుగా మార్చింది. వివాహం అయ్యాక భార్యాభర్తలు ఎన్ని ఊసులాడుకుంటారో ఎవరికి తెలుసు? పుట్టబోయే సంతానం గురించి ఎన్ని కలలు కంటారో ఎవరికి తెలుసు? పరస్పరం ఎంత అనురాగం పంచుకుంటారో ఎవరికి తెలుసు? వైవాహిక జీవితం సంతానం కలగడంతో ఫలవంతం అవుతుంది. మనిషి తన కొనసాగింపును సంతానం తో ఆశిస్తాడు. తన ఉనికి సంతానం ద్వారా వదిలిపెడతాడు. ఆ సంతానం కలిగే లోపే ఆ ఉనికి మరుగున పడిపోయే పరిస్థితి వస్తే? అతని సంతానం కావాలి మూడు రోజుల క్రితం గుజరాత్ హైకోర్టుకు అత్యవసర ప్రాతిపదికన ఒక మహిళ అప్పీలు చేసుకుంది. ‘నేను సంతానవతిని కాదల్చుకున్నాను. అందుకు నా భర్త నుంచి వీర్యం తీసి సంరక్షించుకునేందుకు అనుమతినివ్వండి’ అని. మంగళవారం (జూలై 20) కోర్టుకు వెళితే ఆ సాయంత్రానికే కోర్టు అనుమతినిస్తే అదే రోజు రాత్రి ఆమె భర్త నుంచి వీర్యాన్ని సేకరించి భద్ర పరిచారు డాక్టర్లు. వడోదరాలోని స్టెర్లింగ్ హాస్పిటల్లో ఈ ఉదంతం జరిగింది. ‘పేషెంట్‌కు కోవిడ్ వల్ల మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగింది. అతను ఇప్పుడు సపోర్ట్ సిస్టమ్‌లో ఉన్నాడు. ప్రాణాలు దక్కే ఆశలు అతి స్వల్పం. అందుకే అతని భార్య అతని వీర్యం ద్వారానే కృత్రిమ పద్ధతిలో భవిష్యత్తులో సంతానవతి అయ్యే విధంగా వీర్యాన్ని సేకరించమని మమ్మల్ని కోరింది. భర్త కుటుంబం అందుకు అంగీకరించింది. అయితే అలా వీర్యాన్ని సేకరించాలంటే ఆ పురుషుడి అనుమతి ఉండాలి. అనుమతి ఇచ్చే స్థితిలో అతను లేడు. అందుకే కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోమన్నాం. ఆమె కోర్టు నుంచి అనుమతి తీసుకురావడంతో వెంటనే వీర్యాన్ని సేకరించాం. అలా వీర్యాన్ని సేకరించే ప్రొసీజర్‌కు అరగంట సమయం పట్టింది’ అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మాతృత్వపు హక్కు ప్రతి స్త్రీకి ఉంటుంది. సహజంగా వీలు లేకపోతే కృత్రిమ పద్ధతి ద్వారా, సరొగసి ద్వారా ఆమె తల్లి కావచ్చు. కాని ఈ కోవిడ్ కాలంలో అన్నీ హటాత్తుగా జరిగిపోతున్నాయి. ఎన్నో ఆశలు, కలలు కన్న జీవన భాగస్వాములు రోజుల వ్యవధిలో అదృశ్యమవుతున్నారు. సంతాన కల నెరవేరక ముందే వారు మరణించే పరిస్థితి ఎన్నో కుటుంబాల్లో ఈ కోవిడ్ కాలంలో జరిగినా ఈ మహిళ మాత్రం భర్త ద్వారానే సంతానాన్ని కనడానికి ఈ విధం గా నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆకర్షిస్తోంది. ఆమెను అర్థం చేయించే ప్రయత్నం చేస్తోంది. హైకోర్టు ఆమె నిర్ణయానికి మద్దతుగా ‘కృత్రిమ పద్ధతిలో ఆమె తల్లి అయ్యే విషయం లో మీ అభిప్రాయం ఏమిట’ని ప్రభుత్వాన్ని, ఆస్పత్రి వర్గాలని కూడా సమాధానం కోరుతూ నోటీసులు ఇచ్చింది. భర్త చనిపోయాక తల్లి కావాలని... అయితే ఇదే వడోదరాలో రెండు నెలలుగా మరో మహిళ కూడా ఇదే కారణంతో వార్తల్లో ఉంది. ఆమె పేరు హెలీ ఏర్కే. వయసు 36. వడోదరాలో అకౌంటెంట్‌గా పని చేస్తోంది. ఆమె భర్త సంజయ్ టీచర్‌గా పని చేసేవాడు. ఏప్రిల్ మొదటి వారంలో అతడు కోవిడ్ వల్ల మరణించాడు. ‘నా భర్త ఎంతో మంచివాడు. జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనాలని నాకు చెప్పేవాడు. నేనంటే ఎంతో ప్రేమ. నాకు 30 ఏళ్లకు పెళ్లయ్యింది. ఆయన నా కంటే పెద్ద. పెళ్లి సమయంలోనే మేము లేటు వయసు వల్ల గర్భధారణకు ఇబ్బంది వస్తుందా అని సందేహించాం. రెండు మూడు ఆస్పత్రులకు తిరిగి చివరకు ఒక ఆస్పత్రి లో మా ‘ఎంబ్రియో’ (అండం, వీర్యాల ఫలదీకరణం. దీనిని గర్భంలో ప్రవేశపెట్టాక పిండం అవుతుంది)లు ఐదారు సంరక్షించుకున్నాం. నా భర్త జీవించి ఉండగా ఒక ఎంబ్రియోతో గర్భం దాల్చడానికి ప్రయత్నించాను. నిలువలేదు. ఇప్పుడు నా భర్త లేడు. కాని అతని వారసుణ్ణి కనాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నా కుటుంబం సమాజం ఇందుకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను’ అని హెలీ అంది. సంతానం కలిగితే ఆ సంతానంలో భర్తను చూసుకోవాలని ఆమె తపన. ‘నా గర్భాశయం గర్భం మోయడానికి అనువుగా లేదని డాక్టర్లు తేల్చేశారు. మా ఇంటిని అమ్మగా వచ్చిన డబ్బును నేను తల్లి కావడానికి వెచ్చిస్తాను. సరొగసీ ద్వారా నేను నా భర్త అంకురాన్ని నిలబెట్టుకునే ప్రయత్నిస్తాను’ అని హెలీ అంది. కోవిడ్ ఎందరికో మరణశాసనాలు రాస్తోంది. కాని మనుషులు జీవించే ఆశను పునరుజ్జీవింప చేసే ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఒక మనిషి మరణించినా అతడి సంతానం జన్మనెత్తే వినూత్న సమయాలను ఇప్పుడు మనిషి సృష్టిస్తున్నాడు. క్రిమి మరణిస్తుంది. మనిషి తప్పక జయిస్తాడు. హెలీ ఏర్కె, సంజయ్ -
భర్త మరణించిన ఆరు నెలలకు గర్భం..!
సృష్టిలో దేవతలకు కూడా దక్కని అపూర్వ బహుమతి మనుషులకు దక్కింది. అమృతం తాగిన వాళ్లు దేవతలు దేవుళ్లు.. అది కన్నబిడ్డలకు పంచే వాళ్లే అమ్మానాన్నలు అంటారు. ప్రతి మహిళ తన జీవితంలో అమ్మ అనిపించుకోవాలి అనుకుంటుంది. వాషింగ్టన్: ఓక్లహామాకు చెందిన సారా షెలెన్‌బెర్గర్(40) అనే మహిళ తన భర్త మరణించిన 14 నెలల తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన సారా మే 3న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బార్బడోస్ ఫెర్టిలిటీ క్లినిక్ సహకారంతో ఆమె ఈ ప్రక్రియను కంప్లీట్ చేసింది. ‘‘చిన్నారి రాకతో నా మాతృహృదయం ఉప్పొంగింది. బిడ్డను గుండెలకు హత్తుకోవడం గొప్ప అనుభవాన్ని ఇస్తోంది.’’ అని తెలిపింది. కాగా, దక్షిణ నజరేన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు సారా, స్కాట్ కలుసుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారింది. సెప్టెంబర్ 2018 లో వివాహం చేసుకున్నారు. కనీసం ముగ్గురు పిల్లలకు జన్మనివ్వాలని కోరుకున్నారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. ఆమె భర్త స్కాట్(41) గతేడాది ఫిబ్రవరిలో గుండు పోటుతో కన్నుమూశారు. మరి ఎలా సాధ్యమైంది? పిల్లల కోసం ఈ జంట చాలాకాలం నిరీక్షించింది. అయితే వైద్యులు ఐవీఎఫ్‌ను ఎంచుకోవాలని వారికి సలహా ఇచ్చారు. యుఎస్‌లో ఐవిఎఫ్ పద్దతిలో బిడ్డను కనడం చాలా ఖర్చుతో కూడుకున్నది. దీంతో ఈ జంట బార్బడోస్ ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్లారు. కానీ, బిడ్డ పుట్టకముందే ఆమె భర్త కన్నుమూశారు. అయితే పిండం ప్రక్రియను ప్రారంభించడానికి ముందు సారా, ఆమె భర్త అందుకు చేయాల్సిన పనులను పూర్తి చేశారు. జీవిత భాగస్వామి చనిపోతే పిండాలకు సంబంధించి తదుపరి ప్రక్రియ ఎలా అనుసరించాలో అందులో రాసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆమెకు బిడ్డను కనేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. పిండాన్ని ఐవిఎఫ్ పద్దతిలో అప్పటికే స్టోర్ చేసి ఉంచడం ద్వారా సారా షెలెన్‌బెర్గర్ బిడ్డకు జన్మనిచ్చింది. రెండో బిడ్డను కనేందుకు ఆసక్తి ‘‘తన భర్త ఇప్పుడు లేడు. కానీ ఈ సమయంలో బిడ్డకు జన్మనివ్వాలన్న నిర్ణయానికి తన భర్త మద్దతు ఉందని కచ్చితంగా చెప్పగలను. బిడ్డ పుట్టినప్పటి నుంచి నా జీవితానికి ఓ అర్థం దొరికినట్లు ఉంది. పిల్లలకు తండ్రిలేని లోటు లేకుండా పెంచుతాను. అంతేకాకుండా మరో పిండం కూడా భద్రపరచి ఉంది. అదే చివరిది… దానితో వచ్చే ఏడాది చివరి నాటికి రెండో బిడ్డను కనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.’’ అని సారా షెలెన్‌బెర్గర్ చెప్పారు. ఇక సారా తన భర్త, బిడ్డతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by 🌵Sarah Shellenberger🌵 (@sarahrshellenberger) -
10 ఏళ్ల గ్యాప్‌తో కవలల జన్మ
బీజింగ్ : మామూలుగా కవలలు ఒకే సారి పుట్టడమో.. లేదా కొద్ది రోజులు గ్యాపు తీసుకుని పుట్టడమో జరుగుతుంది. కానీ, చైనాకు చెందిన ఓ మహిళ మాత్రం 10 సంవత్సరాల గ్యాప్‌తో కవలలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన హ్యూబేలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. హ్యూబేకు చెందిన వాంగ్ అనే మహిళ 2009లో ఐవీఎఫ్ పద్దతి ద్వారా గర్భం దాల్చింది. 2010 జూన్‌లో ఆమె లూలూ అనే శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె శరీరంలోని అండాలను భవిష్యత్తు అవసరాల నిమిత్తం వైద్యులు అలానే ఉంచేశారు. అయితే పదేళ్ల తర్వాత వాంగ్ మళ్లీ తల్లి కావాలనుకుంది. తనకు ఐవీఎఫ్ చేసిన వైద్యుడిని సంప్రదించింది. అతడు మళ్లీ ఆమెకు ఐవీఎఫ్ నిర్వహించాడు. దీంతో ఆమె జూన్ 16న టాంగ్‌టాంగ్ అనే శిశువుకు జన్మనిచ్చింది. టాంగ్‌టాంగ్ అచ్చం లూలూ లానే అంతే బరువుతో పదేళ్ల తర్వాత ఒకే నెలలో జన్మించాడు. -
బోసి నవ్వుల కోసం
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచపు తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లెస్లీ బ్రౌన్ పుట్టి (జులై 25,1978) 40 ఏళ్లు నిండింది. ఓవైపు నగరంలో ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)విధానంలో జననాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. మరోవైపు నగరవాసుల్లో పెరుగుతున్న సంతాన హీనతకు కారణాల్లో మారుతున్న జీవనశైలి ప్రధానమైనదని వైద్యులు చెబుతున్నారు. ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, అనారోగ్యకరమైన అలవాట్లు, రేడియేషన్ ప్రభావం, హార్మోన్లలో హెచ్చుతగ్గులు... వీటన్నింటి మూలంగా ఏర్పడుతున్న సంతానలోపం అధిగమించడానికి అత్యాధునిక వైద్య విధానాలు మాత్రమే మార్గం. మెట్రోల్లోనే ఎక్కువ... దేశంలో ఏటా లక్ష వరకు ఐవీఎఫ్ చికిత్సలు నమోదవుతున్నాయి. వీటిలో అత్యధికంగా మెట్రో నగరాల్లోనే జరుగుతున్నాయి. దేశంలో జరిగే మొత్తం చికిత్సల్లో హైదరాబాద్ సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లోనే 55 శాతానికి పైగా ఐవీఎఫ్ చికిత్సలు నమోదవుతున్నాయి. ఢిల్లీ, ముంబై ఈ విషయంలో మరింత ముందంజలో ఉన్నాయి. నాలుగో స్థానంలో సిటీ... ఒక సర్వే ప్రకారం దక్షిణాదిలో 37 శాతం ఐవీఎఫ్ చికిత్సలు నమోదవుతుంటే... 90 మంది వైద్యులు, 60 ఐవీఎఫ్ సెంటర్లతో ఏడాదికి 11వేలకు పైగా చికిత్సలు చేస్తూ ఢిల్లీ ఈ విషయంలో ప్రథమ స్థానంలో ఉంది. అలాగే 100 మంది డాక్టర్లు, 70 సెంటర్లతో ఏడాదికి 10వేల చికిత్సలు నమోదు చేస్తూ ముంబై రెండో స్థానంలో ఉంది. ఇక 30 మంది డాక్టర్లు, 25 సెంటర్లతో ఏడాదికి 7వేల ఐవీఎఫ్‌లు చేస్తూ చెన్నై మూడో స్థానంలో నిలిచింది. మన నగరం 26 మంది వైద్యులు, 18 సెంటర్లతో ఏడాదికి 6వేల చికిత్సలతో నాలుగో స్థానం దక్కించుకుంది. బెంగళూర్ 30 మంది డాక్టర్లు, 20 సెంటర్లతో ఏడాదికి 4,200 కేసులు నమోదు చేస్తూ ఐదో స్థానంలో, 8వేల చికిత్సలతో అహ్మదాబాద్ ఆరో స్థానంలో, 7వేలకు పైగా చికిత్సలతో కోల్‌కతా ఏడో స్థానంలో, 4వేల చికిత్సలతో పుణె ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. వ్యయం తక్కువే అయినా... అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర ఐవీఎఫ్ చికిత్సకు అవుతున్న వ్యయం (రూ.లక్షన్నర నుంచి రూ.2 లక్షలు) తక్కువే అయినప్పటికీ అవసరార్థుల్లో 80 శాతం మందికి ఇది అందుబాటులో లేదు. ఒక్క ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తప్ప మరే బీమా సంస్థ కూడా దీనికి అవసరమైన వ్యయాన్ని కవర్ చేసే సదుపాయం కల్పించడం లేదు. అలాగే మిగతా నగరాలతో పోలిస్తే తగినంత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఐవీఎఫ్ చికిత్స అందించే నిపుణుల కొరత కూడా నగరంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దేశంగా... ఈ ఐవీఎఫ్ విధానంపై యువతలో అవగాహన మరింత పెరిగేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఐవీఎఫ్ ఉత్తమం గతంతో పోలిస్తే దంపతులు ఐవీఎఫ్ విధానం వైపు మొగ్గు చూపుతుండడంతో దీనికి ఆదరణ బాగా పెరిగింది. అయినప్పటికీ మన దగ్గర కృత్రిమ గర్భధారణపై అపోహలు, సంశయాలు మాత్రం ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. వీటిలో సామాజికపరమైనవే ఎక్కువ. అత్యాధునిక పద్ధతులు అందుబాటులో ఉన్నా, 22–33 మిలియన్ల భారతీయ దంపతులు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారని ఒక నివేదిక తేల్చడం దీనికో ఉదాహరణ. – డాక్టర్ స్వాతి మోతె, గైనకాలజిస్ట్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ (ఇందిరా ఐవీఎఫ్) -
మనకు తెలియకుండానే..మన పిల్లల్ని అమ్మేసుకుంటున్నారు!
ఐవీఎఫ్ కేంద్రాలు, ఏజెంట్ల అక్రమాలతో విపరీత పరిణామాలు ఐవీఎఫ్ కోసం వచ్చేవారి పిండాలను విక్రయిస్తున్న దుర్మార్గం అండాలు, వీర్యకణాలు, సరోగసీ తల్లి.. అంతా రెడీమేడ్ ఆ పిండాలతో సరోగసీ ద్వారా పిల్లల్ని పుట్టించి అమ్ముకునే దారుణం సరైన చట్టాలు లేక, నిబంధనల్లో లొసుగులతో వ్యవహారం మారుతున్న జీవన పరిస్థితులు.. వ్యాధులు.. శారీరక లోపాలు.. కారణాలేవైనా కొన్ని వేల జంటలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాయి. అలాంటి వారికి సంతానం కల్పిస్తామంటూ వీధికో ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) కేంద్రాలు వెలుస్తున్నాయి. ఎన్నో ఆసుపత్రులూ ఐవీఎఫ్ సేవలను అందిస్తున్నాయి. కానీ ఇవి ఎన్నో అక్రమాలకు, అనైతిక వ్యవహారాలకు వేదికలుగా మారుతున్నాయి. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారి నుంచి అండాలు, వీర్యకణాలు సేకరించి ఫలదీకరణం చెందించిన పిండాలను కొందరు విక్రయిస్తున్నారు. అంతేకాదు ఈ పిండాలతో సరోగసీ తల్లిద్వారా పిల్లలను పుట్టించి, వారినీ అమ్మేసుకుంటున్నారు. నాలుగు రోజుల కింద ‘సాక్షి’ బయటపెట్టిన విశాఖ తీరాన పిల్లల విక్రయం అలాంటి వ్యవహారంలో భాగమే. అక్కడ సుజాత, వెంకట్ అనే ఇద్దరు ఏజెంట్లు ఆడపిల్లకు రెండున్నర లక్షలు, మగపిల్లాడికి నాలుగున్నర లక్షలు ఖరీదు కట్టి విక్రయిస్తూ... ఈ బాగోతాన్ని నడిపించారు. ఇంకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరెన్నో చోట్ల ఇలాంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయి. అసలు ఈ ఐవీఎఫ్ ఏమిటి, అందులో లోపాలు, అక్రమాల తీరుపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్... - భువనేశ్వరి, తెలంగాణ బ్యూరో సంతానం కోసం తపన.. పురుషుల్లోగానీ, స్త్రీలలోగానీ లోపం ఎవరిలో ఉన్నా... పిల్లలను పొందేందుకు ఐవీఎఫ్ విధానం తోడ్పడుతోంది. స్త్రీ నుంచి అండాల్ని తీసి భాగస్వామి శుక్రకణాలతో ప్రయోగశాలలో ఫలదీకరణం చేస్తారు. అలా ఏర్పడిన పిండం (ఎంబ్రియో)ను స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఒకవేళ స్త్రీ గర్భాశయంలో ఏదైనా సమస్య ఉంటే సరోగసీ విధానం (మరో మహిళ గర్భాశయంలో పిండాన్ని ప్రవేశపెట్టి నెలలు నిండాక కనడం) ద్వారా బిడ్డను పొందవచ్చు. అయితే ఒకేసారి, ఒకే పిండంతో ఐవీఎఫ్ ప్రక్రియ విజయవంతం కాదు. అందువల్ల ముందు జాగ్రత్తగా స్త్రీ నుంచి ఎక్కువ సంఖ్యలో అండాలను సేకరించి, శుక్రకణాలతో ఫలదీకరణం చెందించి... రెండు, మూడు పిండాలను అభివృద్ధి చేస్తారు. వాటిని అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద జాగ్రత్తగా భద్రపరుస్తారు. మొదటి ప్రయత్నం విఫలమైతే రెండో పిండంతో ఐవీఎఫ్ ప్రక్రియ కొనసాగిస్తారు. అవగాహన లేమి ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనేందుకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వీటిని తమ వద్దకు వచ్చే దంపతులకు తెలియజేయాల్సిన బాధ్యత వైద్యులదే. ఐసిఎమ్ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్) నిబంధనల ప్రకారం... వైద్యానికి అవసరమైన పిండాల్ని వాడుకుని, మిగతావాటిని ఆ దంపతుల అనుమతితో క్రయోబ్యాంకుల్లో భద్రపరచవచ్చు. లేదంటే వాటిని నాశనం చేయాలి. అంతేతప్ప దానం చేయడం, విక్రయించడం వంటివి చేయకూడదు. ఒకవేళ ఐవీఎఫ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దంపతుల్లో ఎవరైనా మరణిస్తే ఆ పిండం భవిష్యత్తు ఏమిటో కూడా దంపతులు ముందే రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. కానీ ఈ నియమ నిబంధనలను చాలా ఐవీఎఫ్ కేంద్రాలు పాటించడం లేదు. ఇక్కడే అసలు సమస్య మొదలయింది. అండాలను, వీర్యాన్ని సేకరిస్తున్న వైద్యులు.. ఎన్ని పిండాలను రూపొందిస్తున్నారన్న సమాచారాన్ని దంపతులకు తెలియజేయడం లేదు. పెద్దగా చదువుకోనివారి విషయంలో అయితే వారికున్న సమస్య, వైద్యం ఖర్చు మినహా డాక్టర్లకు వారికి మధ్య మరెలాంటి సంభాషణా ఉండడం లేదు. దీంతో వారికి ఐవీఎఫ్ అనంతరం మిగిలిపోయిన పిండాలను వైద్యులు, ఏజెంట్లు అమ్ముకుంటున్నారు. ఎవరికి పుట్టారో.. ఎవరి పిల్లలో.. పిండాల విక్రయం ఎంత పెద్ద నేరమో, దానికి పాల్పడ్డవారికి ఎంత పెద్ద శిక్ష వెయ్యాల్లో చెప్పలేముగానీ... దీని పర్యవసానాలు ఎంత అనైతికంగా, భయానకంగా ఉంటాయో ఊహిస్తే ఆందోళన ఆవరిస్తుంది. ఉదాహరణకు రమేష్, రాధ అనే దంపతులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డల్ని పొందడానికి ఆసుపత్రికి వెళ్లారు. రాధ అండాలు, రమేష్ వీర్యంతో ఫలదీకరణ చెందించి... నాలుగైదు పిండాలను రూపొందిస్తారు. వారు మొదటి ప్రయత్నంలోనే బిడ్డను పొందారనుకుందాం. మిగతా పిండాలను దళారులు మరొకరికి విక్రయిస్తారు. వారు అద్దె గర్భం ద్వారా బిడ్డను పొందితే... ఆ బిడ్డకు రమేష్-రాధల డీఎన్ఏ, లక్షణాలు వస్తాయి. ఆ బిడ్డ రమేష్ రూపురేఖలతోనో, రాధ పోలికలతోనో ఉండే అవకాశం ఎక్కువ. పిండాల విక్రయం అంటే మనకు తెలియకుండా మన బిడ్డను దొంగిలించి, అమ్ముకోవడమే. ఇక ఒక జంట నుంచి మిగిలిపోయిన రెండు పిండాల ద్వారా పిల్లలుగానీ, కవలలుగానీ పుడితే... వారిని వేర్వేరు వ్యక్తులకు విక్రయించడం, వేర్వేరుగా పెరగడం మరింత దారుణమైన అంశం. ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన ఈ వ్యవహారం గురించి తెలియగానే... పిల్లల కోసం ఐవీఎఫ్‌ను ఆశ్రయించిన వారిలో చాలా మంది ఆలోచనలో పడ్డారు. సరైన చట్టాలే లేవు దేశంలో ఇన్ఫెర్టిలిటీ కేంద్రాలకు సంబంధించి కానీ, ఆ వైద్య విధానం గురించి కానీ ప్రత్యేకంగా ఒక చట్టాన్ని రూపొందించలేదు. పదేళ్లుగా సరోగసీ, ఐవీఎఫ్ విధానంలోని లొసుగుల గురించి కేంద్రానికి కొన్ని వందల ఫిర్యాదులు అందాయి. అయినా దీనిపై ఇంకా ఎటువంటి చట్టం చేయలేదు. కేవలం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనలపైనే ఐవీఎఫ్ కేంద్రాలు నడుస్తున్నాయి. అయితే ఈ నిబంధనలనైనా ఎంతవరకు పాటిస్తున్నారనే దానిని పర్యవేక్షించే యంత్రాంగం లేకపోవడంతో.. పిండాలు, వాటి నుంచి సరోగసీ ద్వారా పుట్టించిన పిల్లల విక్రయాలు జరుగుతున్నాయి. ఇక అండాలు, పిండాలను నిల్వ చేసే క్రయో బ్యాంకులకు సంబంధించి ప్రత్యేక చట్టం లేకపోవడం వల్ల అటు దంపతులు, ఇటు వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం క్రయో బ్యాంకులకు సంబంధించి మన వైద్యులు విదేశాల్లో అమల్లో ఉన్న చట్టాల్ని అనుసరిస్తున్నారు. నిజానికి మన భారతీయ సమాజం నైతికంగా ఆ విధానాలకు పూర్తిగా విరుద్ధం. కొంతకాలం కింద ఓ విదేశీ యువతి ఇక్కడ సరోగసీ పద్ధతి ద్వారా బిడ్డను పొంది తిరుగు ప్రయాణంలో మనవాళ్లకు తలబొప్పి కట్టే సమస్యను తెచ్చిపెట్టింది. ఆరోగ్య సమస్యలు ఉండవంటూ.. విశాఖ నర్సు సుజాత దీనికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. ‘‘మా దగ్గర పుట్టే పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. మానసికంగా కూడా చురుగ్గా ఉంటారు. మామూలుగా పుట్టే పిల్లలకు, మేం విక్రయించే పిండాల ద్వారా పుట్టే పిల్లలకు చాలా తేడా ఉంటుంది..’’ అని పేర్కొన్నారు. ఇందులో కొంత వరకు వాస్తవం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులైన తల్లిదండ్రుల నుంచి పుట్టే పిల్లలు అదే విధంగా ఉంటారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నిబంధనల ప్రకారం దాతలకు హెచ్ఐవి, హెపటైటిస్ బి, సి, హైపర్ టెన్షన్, డయాబెటిస్, లైంగిక వ్యాధులు, జన్యులోపాలు, తలసేమియా వంటి జబ్బులేమీ ఉండకూడదు. ఇన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆ పిం డాల నుంచి ఎదిగిన పిల్లలు అ న్ని రకాలుగా ఆరోగ్యవంతులుగా ఉంటారు. దీనినే ఏ జెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ‘‘మామూలుగా పిల్లలను యాభై వేలకు, లక్ష రూపాయలకు కొనుక్కుంటారు. కానీ మేం పూర్తి ఆరోగ్యంగా, చురు గ్గా ఉండే పిల్లలను ఇస్తున్నాం.. ఇందుకు నాలుగు లక్షలు ఖర్చుచేయడంలో తప్పులేదు కదా..’’ అంటూ విక్రయానికి ఒడిగడుతున్న వారు చెప్పుకొంటున్నారు. భద్రత పరిస్థితి ఏమిటి? ఐవీఎఫ్ చికిత్సకు వెళ్లిన దంపతులకు తమ అండాలు, వీర్యకణాలు, పిండాలకు సంబంధించి వైద్యులు చెప్పే సమాచారంపై సందేహాలుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలనేది తెలియదు. ఐవీఎఫ్ నిపుణులు చేస్తున్న ప్రక్రియలో ఎంతవరకు నిజాయితీ ఉందో కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. నిజానికి క్రయో బ్యాంకు (అండం, వీర్య కణాలు, పిండాన్ని భద్రపరిచే చోటు) అవసరం చాలా ఉంది. ఫలదీకరణం చెందిన తొలిదశ పిండాలను, స్త్రీ నుంచి సేకరించిన అండాన్ని భద్రపరిచే ప్రక్రియ దాదాపు ఒకేలా ఉంటుంది. వీటిని మైనస్ 190 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వచేస్తారు. అయితే ఒక్కసారిగా మైనస్ 190 డిగ్రీల చల్లదనానికి తీసుకెళితే పిండాలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా కొద్ది నిమిషాలపాటు రకరకాల చిక్కటి ద్రవాల్లో ఉంచడం ద్వారా వాటిలోని నీటి శాతాన్ని తగ్గిస్తారు. తర్వాత నిమిషానికి ఒక డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రత తగ్గించుకుంటూ మైనస్ 40 డిగ్రీల వరకూ శీతలీకరిస్తారు. దీంతో వాటిలోని జీవక్రియలన్నీ నిలిచిపోతాయి. అప్పుడు వాటిని సన్నటి నాళికల్లో ఉంచి ద్రవరూప నైట్రోజన్ ట్యాంకుల్లో ఉంచుతారు. ఈ ట్యాంకులో మైనస్ 190 డిగ్రీల చల్లదనం ఉంటుంది. అండాలను, పిండాలను తిరిగి వినియోగించాలనుకుంటే రెండు రోజుల ముందే తీసి... చల్లబరిచిన తీరుకు సరిగ్గా వ్యతిరేక పద్ధతిలో ఉష్ణోగ్రతను, నీటి శాతాన్ని పెంచుతారు. దీంతో కణం పూర్తి జవజీవాలతో పునరుత్పత్తికి సిద్ధంగా తయారవుతుంది. ఇలా నెలలు, సంవత్సరాల తరబడి క్రయో బ్యాంకుల్లో పిండాల్ని దాచుకోవచ్చు. ఒక పిండాన్ని క్రయో బ్యాంకులో భద్రపరుచుకోవాలంటే ఆరునెలలకు రూ. పదిహేను వేల నుంచి నలభై వేల వరకు ఉంటుంది. మామూలుగా అయితే అండం ఇచ్చే స్త్రీ, వీర్య కణాలు ఇచ్చే పురుషుడు, ‘సరోగసీ’ మహిళ... వీరెవరైనా వైద్యుల సమక్షంలోనే దాతలు కాగలరు. వారి వివరాలు ఆయా ఆసుపత్రులు గోప్యంగా ఉంచాలి. కానీ కొంతకాలంగా ప్రైవేటు ఏజెంట్లు రంగంలోకి వచ్చారు. వారు అండాలు, వీర్యకణాల దాతలను, సరోగసీ తల్లుల్ని వైద్యులకు, తల్లిదండ్రులకు నేరుగా సరఫరా చేసేస్తున్నారు. ప్రత్యేక చట్టం లేకపోవడం, నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని రకరకాల దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. విశాఖలో వెంకట్ అనే ఏజెంటు తన దగ్గర అన్ని రకాల దాతలు ఉన్నారని బాహాటంగా మార్కెటింగ్ చేసుకుంటుండడం గమనార్హం. సాధారణంగా సరోగసీ విధానం ద్వారా తల్లి కావాలనుకుంటే... మొత్తం ప్రక్రియకు పది నుంచి పన్నెండు లక్షలు ఖర్చవుతుంది. అదే ఇలాంటి ప్రైవేటు ఏజెంట్ల ద్వారా సరోగసీ తల్లిని దంపతులే తీసుకెళితే ఎనిమిది లక్షల్లో పూర్తవుతుంది. అండం, వీర్య కణాలకు చెల్లించే సొమ్మూ తగ్గుతుంది. ఐవీఎఫ్ ప్రక్రియ కోసం ఆస్పత్రులు, కేంద్రాలు పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేస్తుండడంతో చాలా మంది ప్రైవేటు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. పరిస్థితి దయనీయంగా ఉంది.. ‘‘మన దగ్గర ఐవీఎఫ్ విధానంలోని లోపాలు దంపతులను, వైద్యులను సమస్యల్లోకి నెడుతున్నాయి. దేశంలో వందల సంఖ్యలో ఐవీఎఫ్ సెంటర్లున్నాయి. ఇవన్నీ తమ క్రయో బ్యాంకు డేటాను పదేళ్లకోసారి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు అందజేయాలి. కానీ ఎన్నో సంస్థలు ఆ పని చేయడం లేదు. పిండాల్ని విక్రయించి, బిడ్డల్ని పుట్టించి అమ్ముకుంటున్నారనేందుకు అవకాశం లేదని చెప్పలేం. నిబంధనలు ఉల్లంఘించడానికి ఎన్నో అవకాశాలున్నాయి. చాలా సెంటర్లు చికిత్సకు ముందు కౌన్సెలింగ్ కూడా ఇవ్వడం లేదని కొందరు దంపతులు చెప్పారు. అలాగే ఎలాంటి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయించుకోవడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చట్టం తేవడంతో పాటు ప్రభుత్వం ఐవీఎఫ్ సెంటర్లపై ఒక కన్నేసి ఉంచాలి.’’ - డాక్టర్ హిమదీప్తి, నోవా ఐవీఎఫ్ సెంటర్, హైదరాబాద్ దాతలను సరఫరా చేసే ఏజెంట్లు! మామూలుగా అయితే అండం ఇచ్చే స్త్రీ, వీర్య కణాలు ఇచ్చే పురుషుడు, ‘సరోగసీ’ మహిళ... వీరెవరైనా వైద్యుల సమక్షంలోనే దాతలు కాగలరు. వారి వివరాలు ఆయా ఆసుపత్రులు గోప్యంగా ఉంచాలి. కానీ కొంతకాలంగా ప్రైవేటు ఏజెంట్లు రంగంలోకి వచ్చారు. వారు అండాలు, వీర్యకణాల దాతలను, సరోగసీ తల్లుల్ని వైద్యులకు, తల్లిదండ్రులకు నేరుగా సరఫరా చేసేస్తున్నారు. ప్రత్యేక చట్టం లేకపోవడం, నిబంధనల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని రకరకాల దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. విశాఖలో వెంకట్ అనే ఏజెంటు తన దగ్గర అన్ని రకాల దాతలు ఉన్నారని బాహాటంగా మార్కెటింగ్ చేసుకుంటుండడం గమనార్హం. సాధారణంగా సరోగసీ విధానం ద్వారా తల్లి కావాలనుకుంటే... మొత్తం ప్రక్రియకు పది నుంచి పన్నెండు లక్షలు ఖర్చవుతుంది. అదే ఇలాంటి ప్రైవేటు ఏజెంట్ల ద్వారా సరోగసీ తల్లిని దంపతులే తీసుకెళితే ఎనిమిది లక్షల్లో పూర్తవుతుంది. అండం, వీర్య కణాలకు చెల్లించే సొమ్మూ తగ్గుతుంది. ఐవీఎఫ్ ప్రక్రియ కోసం ఆస్పత్రులు, కేంద్రాలు పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేస్తుండడంతో చాలా మంది ప్రైవేటు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. కవలల సమస్య ఐవీఎఫ్ చికిత్స ద్వారా బిడ్డల్ని కంటున్న వారిలో డెబ్బై శాతం మందికి కవలలు పుట్టే అవకాశం ఉంది. ఒకేసారి మూడు పిండాలు పెట్టి ఐవీఎఫ్ చేసినప్పుడు.. చాలా వరకు రెండు పిండాలు గర్భంలో జీవం పోసుకుంటాయి. దీంతో కవలలు పుడతుండడంతో తల్లిదండ్రులు, వైద్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఫెర్టిలిటీ సెంటర్లో ఐవీఎఫ్ చేయించుకున్న దంపతులు ‘మేం మధ్య తరగతి వాళ్లం. ఉన్న సొమ్మంతా ఐవీఎఫ్కే పెట్టాం. ఇప్పుడు ఇద్దరు పిల్లలను ఎలా పోషించగలం? మాకు ఒక్కరే చాలు..’ అంటూ వైద్యులను ఇబ్బంది పెట్టారు. దీంతో వారికి నాలుగైదు సార్లు కౌన్సెలింగ్ చేసి, ఇద్దరు పిల్లల్ని అప్పగించి పంపారు. ఇక వేరొకరి పిండాల్ని విక్రయించి, సరోగసీ ద్వారా కవలలు పుట్టినప్పుడు పరిస్థితి మరీ దారుణం. ఆ బిడ్డల పరిస్థితి ఏమిటని దళారులను అడిగితే.. ‘‘ఏముంది.. ఇద్దరిని వేరు వేరు దంపతులకి అమ్మేస్తాం..’’ అని చెప్పడం మనసును కలచివేస్తుంది. ఇలా పుట్టినవారిలో శారీరక లోపాలు ఉన్నవారుంటే.. వారి పరిస్థితి ఏమిటనేదానికి సమాధానం లేదు. వారిని యాచకులకు అమ్మేస్తారనే ఆరోపణ ఉంది. ప్రత్యేక చట్టం చేయాలి ‘‘రెండు దశాబ్దాలుగా దేశంలో లక్షల మంది ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కన్నారు, సరోగసీ ద్వారా తల్లులవుతున్నారు. ఇటు దంపతులకు కానీ, అటు వైద్యులకు కానీ చట్టపరమైన నిబంధనలు లేకపోవడం దురదృష్టకరం. ఈ ఐవీఎఫ్ కేంద్రాల్లో లొసుగులు, లోపాలను గుర్తించే యంత్రాంగం లేకపోవడం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ఈ విధానానికి సంబంధించి మనదేశంలో ఉన్న లొసుగులను గమనించే.. విదేశీయులు సరోగసీ తల్లి (గర్భంలో బిడ్డను మోసి, కనిచ్చే తల్లి) కావాలంటూ క్యూ కడుతున్నారు. ఇలా మన దేశంలో పుట్టి, విదేశాలకు వెళ్లిన పిల్లలు.. వారి బిడ్డగా పెరుగుతున్నారా, బానిసలుగా మారుతున్నారా అన్నది కూడా తెలియని పరిస్థితి. ఇదే పని మనం మరే ఇతర దేశంలో కూడా చేయలేం..’’ - నిశ్చిల సిద్ధారెడ్డి, ప్రభుత్వఅదనపు న్యాయవాది