పిల్లల కోసం ఆ ట్రీట్‌మెంట్‌.. విపరీతమైన బాధ అనుభవించా : ప్రీతి జింటా | Preity Zinta Opens Up About IVF Journey Before Conceiving Her Twins Jai And Gia, Comments Goes Viral | Sakshi
Sakshi News home page

Preity Zinta On IVF Journey: విపరీతమైన బాధ.. తల గోడకు కొట్టుకొని ఏడవాలనిపించేది

Published Wed, Sep 4 2024 12:46 PM | Last Updated on Wed, Sep 4 2024 1:20 PM

Preity Zinta Opens Up About IVF journey Before Conceiving Her Twins

సినీ తారల జీవితం బయటకు చూడడానికి అద్దాల మేడలా కనిపిస్తుంది. ఒక్కసారి లోపలికి తొంగి చూస్తే కనిపించేదంతా ఊహించడానికి కష్టంగా ఉంటుంది. తెరపై పండించే వినోదం వెనుక ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. బయటకు చెప్పుకోలేని సమస్యలు తారలను ఎప్పుడూ వేధిస్తూనే ఉంటాయి. అయితే ఇవేవి తమ అభిమానులకు తెలియజేయకుండా..తమ నటనతో వారిని అలరిస్తూ ఉంటారు. బాలీవుడ్‌ నటి ప్రీతీ జింటా కూడా నిజ జీవితంలో చాలా కష్టాలు పడినా.. వెండితెరపై మాత్రం మహారాణిలా నవ్వుతూ కనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయట. 

తాజాగా ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న కష్ట సమయం గురించి వెల్లడిస్తూ..తల్లి అయ్యేందుకు పడిని బాధలను షేర్‌ చేసుకుంది. ‘అందరి జీవితాల్లో లాగే నా లైఫ్‌లో కూడా మంచి రోజులతో పాటు చెడ్డ రోజులు కూడా ఉన్నాయి. నిజ జీవితంలో సంతోషంగా ఉండేందుకు చాలా సార్లు కష్టపడ్డాను. ముఖ్యంగా పిల్లల కోసం ఐవీఎఫ్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నప్పడు చాలా బాధను అనుభవించాను. కొన్నిసార్లు తల గోడకు కొట్టుకొని ఏడవాలనిపించేది. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండేదాన్ని. కానీ ఆ ట్రీట్‌మెంట్ ఫెయిల్‌ అయింది. దీంతో చివరకు సరోగసి ద్వారా తల్లినయ్యాను’ అని ప్రీతిజింటా చెప్పుకొచ్చింది. 

2016లో అమెరికాకు చెందిన జీన్‌ను ప్రీతి జింటా వివాహం చేసుకుంది. 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటించేందుకు సిద్ధమైంది. సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న ‘లాహోర్‌: 1947’లో ప్రీతి కీలక పాత్రను పోషిస్తోంది. రాజ్‌ కుమార్‌ సంతోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆమిర్‌ ఖాన్‌ తన బ్యానర్‌లో నిర్మిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement