INFERTILITY
-
ఐవీఎఫ్.. శారీరకంగా, మానసికంగా ఎంత బాధ ఉంటుందంటే.. కొరియోగ్రాఫర్
బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్(Director and choreographer) ఫరాఖాన్(Farah Khan) తరుచుగా తన ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) జర్నీ గురించి మాట్లాడుతుంటారు. ఇటీవల నటి డెబినా బోనర్టీతో పాడ్‌కాస్ట్ సంభాషణలో ఫరాఖాన్ ఐవీఎఫ్ సవాళ్ల గురించి భావోద్వేగంగా చెబుతూ నాటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. నిజానికి ఐవీఎఫ్‌తో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందా..? శారీరకంగా, మానసికంగా చాలా దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయా అంటే..ఫరాఖాన్ తన ఐవీఎఫ్ జర్నీ గురించి మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ వల్ల శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తామని అన్నారు. ముందుగా మన శరీరాన్ని సిద్ధం చేసేందుకు వైద్యులు చాలా హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారని అన్నారు. ఈ ప్రక్రియలో ప్రాథమికంగా అండాశయాల కోసం రోజుకు ఐదు ఇంజెక్షన్లు(5 injections) తీసుకున్నట్లు తెలిపారు. అలాగే "గర్భాశయ పొరను సరిచేసేందుకు అండాశయాలు సరిగ్గ పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకోవడానికి ప్రెగ్నైల్ అనే హార్మోన్‌ని ఇంజెక్షన్ రూపంలో కడుపుకు, తొడకు ఇస్తారు. ఇది ఎంత బాధాకరంగా ఉంటుందంటే.. మాటల్లో చెప్పలేం. కానీ ఇక్కడ బిడ్డను కనాలనే ఆలోచన ఆ బాధను ఓర్చుకునేలా చేస్తుంది. అయితే ఈ హర్మోన్ ఇంజెక్షన్లు మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి. అకస్మాత్తుగా ఏడవడం, మూడీగా ఉండటం, చికాకు తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే ఈ సమస్యలన్నింటిని అర్థం చేసుకునే భర్త అండదండ ఉంటేనే ఈ ఐవీఎఫ్ ప్రక్రియను విజయవంతంగా ఎదుర్కొని బిడ్డను కనగలరని అన్నారు." ఫరాఖాన్. ఆమె 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా ముగ్గురు పిల్లలకి తల్లయ్యారు. View this post on Instagram A post shared by The Debinna Bonnerjee Show (@thedebinnabonnerjeeshow)ఈ ఐవీఎఫ్ వంధ్యత్వం(Infertility)తో పోరాడుతున్న వారికి ఆశను అందిస్తుండగా, దీన్ని చేయించుకోవాలంటే ఆయా వ్యక్తులుకు అంతే స్థాయిలో అపారమైన స్థైర్యం కావాలి. ముఖ్యంగా శారీరక, మానసిక భావోద్వేగాలను అదుపు చేసుకోగలిగే శక్తి ఉండాలి లేదా స్ట్రాంగ్‌గా ఎదుర్కొనేలా సిద్ధపడాలి.హార్మోన్ల చికిత్సల వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు..తరచుగా అండాశయాలను ఉత్తేజపరిచేందుకు, పిండ ఇంప్లాంటేషన్ కోసం శరీరాన్ని సిద్ధం చేసేలా హార్మోన్ల చికిత్సలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల వీటివల్ల అనేక రకాల దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పదంటున్నారు. అవేంటంటే..ఓవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్ సిండ్రోమ్ (OHSS): అండాశయాల సేకరణ కోసం ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్ల కారణంగా అండాశయాలు వాపు రావడం జరుగుతుంది. ఇది చాలా బాధకరమైన స్థితి. దీని కారణంగా పొట్ట ఉబ్బరం, వికారం, వాంతులు, కడుపు నొప్పి తదితర సమస్యలు వస్తాయి. మూడ్ స్వింగ్స్, భావోద్వేగ అసమతుల్యత: IVF చేయించుకుంటున్న సమయంలో తరుచుగా అనుభవించే మానసిక కల్లోలం, చిరాకు, భావోద్వేగ బాధలకు హార్మోన్ల హెచ్చు తగ్గులే మూల కారణం. దీనివల్ల మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్లను ప్రభావితం చేసే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.ఇంజెక్షన్ ఇచ్చే ప్రాంతంలో నొప్పి లేదా వాపుకి గురవ్వడం.అలసట, తలనొప్పులు నిర్జలీకరణం, నిద్రలేకపోవడం వంటి సమస్యలు ఎదరవుతాయని చెబుతున్నారు నిపుణులుభావోద్వేగ సవాళ్లని అధిగమించాలంటే..యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) లేదా కౌన్సెలింగ్ వంటివి తీసుకోవడంవాకింగ్ లేదా స్విమ్మింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలతో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొనవచ్చు. కుటుంబ సహకారం తీసుకోవడం తదితరాలతో ఈ ఐవీఎఫ్‌తో వచ్చే భావోద్వేగ సవాళ్లని అధిగమించగలుగుతారు. -
అందరికీ సంతాన భాగ్యం!
రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ దవాఖాన్లలో ఐవీఎఫ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు ఇది ఓ రకంగా శుభవార్త అని డాక్టర్లు చెబుతున్నారు. సంతానం కోసం అనేకమంది దంపతులు ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయిస్తూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరీ బాధితుల వద్ద రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. రూ. 50 నుంచి రూ. 80 వేల ఖర్చులో పూర్తయ్యే ఐవీఎఫ్ చికిత్సకు, రూ.3 నుంచి రూ.6 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తున్నా, సగం మందికి ఫలితం దక్కడం లేదు. కానీ, ప్రైవేట్ ఆస్పత్రులు మార్కెటింగ్ ట్రిక్స్‌తో బాధిత దంపతులను మభ్యపెట్టి లక్షల్లో దండుకుంటున్నాయి. –సాక్షి, హైదరాబాద్పెరుగుతున్న ఇన్ఫర్టిలిటీ సమస్యలురాష్ట్రంలో యువతకు సంతాన సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రతి వంద జంటల్లో 30 నుంచి 40 జంటలు ఏదో ఒక స్థాయి ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ చెబుతోంది. ప్రభుత్వ దవాఖాన్లలో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ అందించే సౌకర్యాలు లేకపోవడం, ప్రైవేట్ ఆస్పత్రులు రూ.లక్షల్లో చార్జీలు వసూలు చేస్తుండడంతో ఎంతో మంది మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారు. మారిన జీవనశైలితో ఆడ, మగ ఇద్దరిలోనూ ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరిగాయని వైద్య,ఆరోగ్యశాఖ అంచనా వేస్తుంది. పిల్లలు పుట్టకపోవడంతో కొత్త జంటలు మానసిక వేదనను అనుభవిస్తున్నాయి. ఈ సమస్య తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ దవాఖాన్లలో ఫర్టిలిటీ సెంటర్లు పెడుతామని 2017లో అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 2023 వరకూ ఒక్క గాం«దీలో మాత్రమే ఫర్టిలిటీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే అందులో సౌకర్యాలు కల్పించలేదు. నెల రోజుల క్రితం గాంధీ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి దామోదర దృష్టికి ఈ విషయాన్ని అధికారులు తీసుకొచ్చారు. దీంతో ఆయన ఎంబ్రయాలజిస్ట్‌ను నియమించాలని, అవసరమైన పరి కరాలు, మెడిసిన్ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. -
సంతాన లేమి : అవే కొంప ముంచుతున్నాయి!
వంధ్యత్వం లేదా ఇన్ఫెర్టిలిటీ అనేది ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఏడు జంటలలో ఒకరిని ప్రభావితం చేస్తోంది దక్షిణ , మధ్య ఆసియా, సబ్-సహారా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో అత్యధిక ఈ సమస్య కనిపిస్తోంది. పురుషుల్లో వాయు కాలుష్యం, మహిళల్లో రోడ్డు ట్రాఫిక్ శబ్దం కారణంగా వంధ్యత్యం వేధిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. నార్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు బీఎంజే జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.డెన్మార్క్‌లోని నోర్డ్ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం పాటు ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (PM 2.5) వాయు కాలుష్యాన్ని గురైన పురుషుల్లో సంతాన లేమి ఏర్పడే ముప్పు అధికంగా ఉందని పేర్కొంది. పీఎం 2.5 పురుషులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. దీనికి ఎక్కువ ఎక్స్పోజ్ కావడంతో పురుషులలో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదేవిధంగా, శబ్ద కాలుష్యం మహిళల్లో అధిక వంధ్యత్వానికి దారితీస్తోంది. సగటు కంటే 10.2 డెసిబుల్స్ ఎక్కువగా ఉండే రోడ్డు ట్రాఫిక్ శబ్దం 35 ఏళ్లు పైబడిన మహిళల్లో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనం కనుగొంది. 2000-2017 మధ్య డెన్మార్క్‌లో 30-45 ఏళ్ల వయసున్న 5,26,056 మందిపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. పీఎం 2.5కి ఐదేళ్లకు పైన గురైన 30-45 ఏళ్ల వయసున్న వారిలో వంధ్యత్య ముప్పు 24 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది. -
హార్ట్ఫీషియల్గా అమ్మానాన్నలుగా..
ఇటీవల మనదేశం వ్యంధ్యత్వ సంక్షోభం (ఇన్ఫెర్టిలిటీ) దిశగా వెళుతోంది. ఈ సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే... ప్రతి ఆరు వివాహిత జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. సంతానలేమి అన్నది కేవలం పిల్లలు కలగకపోవడం మాత్రమే కాదు... ఇది మరిన్ని సంక్షోభాలకు... అంటే ఉదాహరణకు జనాభాలో యువత శాతం తగ్గిపోవడం, వృద్ధుల సంఖ్య పెరగడం వంటి అనర్థాలకు దారితీయవచ్చు. దీనివల్ల దేశ ఆర్థిక సంపద తగ్గడంతోపాటు అనేక విధాలా నష్టం జరుగుతుంది. ఈ నెల 25న ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) డే సందర్భంగా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న దంపతులకు కృత్రిమ గర్భధారణకు సంబంధించిన కొన్ని అంశాలపై అవగాహన కోసం కొన్ని ప్రశ్నలకు ఇన్ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ కట్టా శిల్ప సమాధానాలు.ఇటీవల మనదేశంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరగడానికి కారణాలేమిటి?జ: దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటిది సామాజికం, రెండు ఆరోగ్యపరమైన కారణాలు. సామాజిక అంశాల విషయానికి వస్తే... ఇటీవల యువత పై చదువులు, మంచి ఉద్యోగాలంటూ కెరియర్ కోసం ఎక్కువ కాలం కేటాయించడం, పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడం, వాటిని నెరవేర్చుకోవడం కోసం ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఉద్యోగాల్లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, క్రమంగా లేని పనివేళలు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం, అధిక బరువు, మద్యపానం, పొగతాగడం, డ్రగ్స్ వంటి అనారోగ్యకర అలవాట్లు, వ్యసనాలు వంటివి సంతాన లేమికి దారితీస్తున్నాయి. ఇవన్నీ సామాజిక సమస్యలు.ఇక ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే... మహిళల్లో కనిపించే హార్మోన్లలో అసమతౌల్యత, ఇన్ఫెక్షన్లు, మానసిక ఒత్తిడులు వంటివి సంతానలేమికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు అండం తయారీలో, ఫలదీకరణలో, పిండం ఇం΄్లాంటేషన్లో ఇబ్బందుల వంటివి మహిళలకు ప్రత్యేకంగా వచ్చే సమస్యల్లో కొన్ని. ఇక మగవారిలోనైతే... శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత తగ్గడం సంతానం కలగడానికి అవరోధంగా నిలుస్తున్నాయి.సాధారణంగా దంపతుల్లో సంతానలేమి ఉంటే ప్రధానంగా మహిళనే నిందిస్తారు. ఇదెంతవరకు సమంజసం?జ: ఇది మళ్లీ మరో సామాజిక సమస్య. వాస్తవానికి గర్భం రాకపోతే అందులో తప్పెవరిదీ ఉండదు. కానీ మన సమాజంలో మహిళ గర్భం దాల్చకపోతే, ఆమెనే తప్పుబడుతుంటారు. నిజానికి గర్భధారణ జరగకపోవడానికి లోపాలు 40% మహిళల్లో ఉంటే, మరో 40% శాతం పురుషుల్లోనూ ఉండవచ్చు. ఇద్దరిలోనూ లోపాలున్న కేసులు మరో 10% మందిలో ఉంటాయి. అయితే ఎంతకూ కారణాలు తెలియని కేసులు మరో 10% ఉంటాయి. అందుకే ఒక జంటకు సంతానం కలగకపోతే... ఎవరినెవరూ నిందించుకోకుండా, శాస్త్రీయపద్ధతుల్లో అవసరమైన పరీక్షలన్నీ క్రమంగా చేయించుకోవాలి.ఫలానా దంపతులకు సంతానలేమి అనే నిర్ధారణ ఎలా? జవాబు: ఆరోగ్యంగా ఉన్న భార్యాభర్తలు వివాహం అయ్యాక ఎలాంటి కుటుంబనియంత్రణ పద్ధతులనుపాటించకుండా, కలిసి ఉంటూ ఏడాదిపాటు గర్భధారణ కోసం ప్రయత్నించినా గర్భం రాకపోతే అప్పుడు ఆ దంపతులకు సంతానలేమి సమస్య ఉండే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. ఈ సమస్యను ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.రెండో రకమైన సంతానలేమి ఏమిటంటే... మొదటిసారి గర్భధారణ తర్వాత, రెండోసారి గర్భధారణ కోసం కోరుకున్నప్పుడు ఏడాదిపాటు ప్రయత్నించినా గర్భం దాల్చకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు.ఇప్పుడున్న సాంకేతిక పురోగతితో కృత్రిమ గర్భధారణ ఎలా?జ: స్త్రీ, పురుషుల లోపాలు, వాటిని అధిగమించాల్సిన పద్ధతులన్నీ ప్రయత్నించాక కూడా గర్భం రాకపోతే అప్పుడు కొన్ని అత్యాధునిక పద్ధతుల్లో సంతాన సాఫల్యాన్ని సాధించవచ్చు. అవి...ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ): అండం విడుదలలో లోపాలు,ఎండోమెట్రియాసిస్, పురుషుల వీర్యకణాల సంఖ్య, కదలికల్లో లోపాలు ఉన్నప్పుడు ఐయూఐ అనే పద్ధతి ద్వారా డాక్టర్లు వీర్యకణాలను నేరుగా యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపుతారు.ఐవీఎఫ్: స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఫలదీకరణ సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు ఐవీఎఫ్ అనే మార్గాన్ని సూచిస్తారు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనే మాటకు సంక్షిప్త రూపమే ఐవీఎఫ్. దీనికే ‘టెస్ట్‌ట్యూబ్ బేబీ’ అనే పేరు. ఇందులో తొలుత మహిళలో అండాలు బాగా పెరిగేందుకు మందులిస్తారు. వాటిల్లోంచి ఆరోగ్యకరమైన కొన్ని అండాలను సేకరించి, పురుషుడి శుక్రకణాలతో ప్రయోగశాలలోని ‘టెస్ట్‌ట్యూబ్’లో ఫలదీకరణం చేస్తారు.ఈ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ పిండాలు వృద్ధి చెందుతాయి. (అందుకే టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియను అనుసరించిన చాలామందిలో ట్విన్స్ పుట్టడం సాధారణం.) ఇందులోని ఆరోగ్యకరమైన పిండాలను మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. రెండు వారాలకు నిర్ధారణ పరీక్షలూ, నాలుగు వారాల తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి గర్భం నిలిచిందా లేదా నిర్ధారణ చేసుకుంటారు. ఒకవేళ గర్భం నిలవకపోతే కారణాలను విశ్లేషించి, మళ్లీ ΄్లాన్ చేస్తారు.ఐసీఎస్ఐ: ఇంట్రా సైటో΄్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) అనే ఈ ప్రక్రియ పురుషుల్లో సమస్య ఉన్నప్పుడు అనుసరిస్తారు. ఇది కూడా ఐవీఎఫ్ లాంటిదే. ఇందులో ఎంపిక చేసుకున్న శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు. ఇందులోనూ మహిళల అండాల్లో లోపాలు ఉంటే మహిళా దాత నుంచి అండాన్ని సేకరించడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎగ్), పురుషుని వీర్యకణాల్లో లోపాలుంటే దాత నుంచి సేకరించిన శుక్రకణంతో ఫలదీకరణ చేయడం (ఐవీఎఫ్ విత్ డోనార్ స్పెర్మ్), దంపతుల్లోని స్త్రీ, పురుషులిద్దరిలోనూ లోపాలు ఉంటే మరో మహిళ, మరో పురుషుడి నుంచి అండం, శుక్రకణాలు సేకరించి ఫలదీకరించి దంపతుల్లోని మహిళ గర్భంలోకి ప్రవేశపెట్టడం (ఐవీఎఫ్ విత్ డోనార్ ఎంబ్రియో) అనే పద్ధతుల్లో సంతాన సాఫల్యం కలిగించడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు.– డాక్టర్ కట్టా శిల్ప, కన్సల్టెంట్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ -
Mothers Day 2024: ఐవీఎఫ్ అద్భుతాలెన్నో...పెద్దవయసులోనూ గర్భధారణ
గత ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌కి చెందిన ఎర్రమట్టి మంగమ్మ అనే మహిళ పెద్దవయసులోనూ ఐవీఎఫ్ ద్వారా గర్భాన్ని ధరించడం రికార్డ్‌గా నిలిచింది. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధం అంటూ దీనిపై వాదోపవాదాలు ఎలా ఉన్నప్పటికీ ఆకాశమే హద్దుగా నిలుస్తున్న ఐవీఎఫ్ చికిత్స సామర్ద్యానికి ఇది అద్దం పడుతుందనేది వాస్తవం. సంతానలేమి సమస్యతో పోరాడుతున్న ఆధునిక మహిళకు ఇన్–విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)అమ్మ కావాలనే కలను సాకారం చేయడంతో పాటు వయసుకు సంబంధించిన అడ్డంకులు కూడా తొలగిస్తోంది. ప్రీ ఇంప్లాంటేషన్ ద్వారా జన్యు పరీక్షలు వంశపారంపర్య వ్యాధులకు అడ్డుకట్ట వేయడం వంటి మరికొన్ని అదనపు ప్రయోజనాలను జత చేసుకుంటూ ఐవీఎఫ్ అంతకంతకూ మహిళలకు చేరువవుతోందని అంటున్నారు ఫెర్టీ9ఫెర్టిలిటీ సెంటర్ కు చెందిన సీనియర్ కన్సల్టెంట్ డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.వయస్సు నుంచి ఒత్తిడి దాకా...కెరీర్ వేటలో లేటు పెళ్లిళ్లు, గర్భధారణ వాయిదాలు...నగర మహిళకు తప్పనిసరిగా కాగా మధ్య వయసులో గర్భదారణ యత్నాలు బెడిసికొడుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం.. అత్యధిక శాతం ఆధునిక మహిళలు 30ఏళ్ల వయసు తర్వాత మాత్రమే పిల్లల గురించి ఆలోచిస్తున్నారని, ఆలస్యంగా తల్లి కావడం ఒక నిబంధనలా మారిందని వెల్లడించింది. అదే విధంగా నగర జీవనంలో కాటేసే కాలుష్యం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి వంటివన్నీ తల్లి కావాలనే ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి. ఈ నేపధ్యంలో వీటన్నింటికీ పరిష్కారంగా మారింది ఐవీఎఫ్..పెద్ద వయసులోనూ పిల్లలకు అవకాశం..డబ్లు్యహెచ్ నివేదిక ప్రకారం 17.5% మంది వయోజనులను ప్రభావితం చేసే వంధ్యత్వాన్ని గుర్తించడం ద్వారా, ఐవీఎఫ్ మహిళల సంతానోత్పత్తి అవకాశాలపై మరింత అవగాహనను అందిస్తుంది.ఒంటరులకు...లివ్ ఇన్ కాపురాలకూ..మాతృత్వం పొందే విషయంలో సాంఘిక నిబంధనలతో పాటు అనేక రకాల పరిమితులు అడ్డంకులుగా మారుతున్నాయి. కారణాలేమైనప్పటికీ నగరంలో నివసించే ఒంటరి జీవుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాగే పెళ్లి కాకుండా కలిసి జీవిస్తున్న జంటలూ, స్వలింగ దాంపత్యాలు సైతం పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంతానకాంక్షను తీరుస్తోంది ఐవీఎఫ్. ఐవీఎఫ్ ద్వారా ప్రీ ఇంప్లాంటేషన్, జన్యు పరీక్ష వంటివి కూడా సాధ్యపడుతుండడంతో మహిళలు వారి పునరుత్పత్తి భవిష్యత్తు గురించి సమాచారం పొందగలుగుతున్నారు. దీని ద్వారా ఎవరైనా సరే ఇంప్లాంటేషన్‌కు ముందు జన్యుపరమైన అపసవ్యతలకు సంబంధించి పిండాలను పరీక్షించవచ్చు, భవిష్యత్ తరాలకు వంశపారంపర్య వ్యాధులను చేర వేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జన్యువులపై ఈ స్థాయి నియంత్రణ ద్వారా మహిళలు వారి కుటుంబాల కోసం వారి విలువలు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఐవీఎఫ్ సహకరిస్తుంది.ఐవీఎఫ్...అడ్డంకులకు పరిష్కారం..సంతానలేమి సమస్యకు పరిష్కారంగా అందుబాటులోకి వచ్చిన ఐవీఎఫ్ ఇప్పుడు సంతానలేమికి కారణమయ్యే అడ్డంకులను అధిగమించడానికి కూడా సహకరిస్తోంది. జన్యుపరీక్షలతో వంశపారంపర్య వ్యాధులకు చెక్ పెట్టే అవకాశం.. వైవిధ్యభరిత మాతృత్వాలు వంటివి ఐవీఎఫ్ ద్వారా సాధ్యమవుతున్నాయి.– డా.టి.శ్రావ్యా తల్లాపురెడ్డి.సీనియర్ కన్సల్టెంట్, ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్ -
మాష్టారు..పొగమానేయండి! లేదంటే మీరు డైమండ్ డక్కే!
ధూమపానం అనేది శతాబ్దాలుగా సమాజాన్ని పీడిస్తున్న పెద్ద దురలవాటు. పొగరాయుళ్లు పొగ తాగవద్దని ఎంత చెప్పినా వినరు. ఆ అలవాటు, ఒక ఎడిక్షన్‌లా మారిపోయి, ప్రాణం మీదికి వచ్చేదాకా తెచ్చుకుంటారు. గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, వంధ్యత్వం ఆఖరికి కేన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులొస్తాయని తెలిసి కూడా ఈ దురలవాటును మానుకునేందుకు చాలామంది ఇష్టపడరు. పరిస్థితి చేయి దాటిన తరువాత ఏం చేసినా ఫలితం ఉండదనే సత్యాన్ని గమనించరు. అంతేకాదు ధూమపానం చేయకపోయినా పాగతాగేవారి ద్వారా ఆ పొగను పీల్చడం వల్ల సన్నిహిత కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్నవారు కూడా అనారోగ్యం బారిన పడతారు. వీరినే ప్యాసివ్ స్మోకర్లు అంటారు. ఈ సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ కారణంగా ఉబ్బసం, బ్రోన్కైటిస్ , న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల బారిన పడతారు. లైంగిక సామర్థ్యంపై దెబ్బ ధూమపానం కారణంగా పురుషుల పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుంది. శుక్రకణాల సంఖ్య, వాటి చురుకుదనం తగ్గి పోతుంది. చివరికి వంధ్యత్వానికి దారితీస్తుంది. ధూమపానం పురుషాంగానికి రక్త ప్రవాహం నిలిచిపోతుంది. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. స్త్రీలలో అయితే సంతానోత్పత్తి తగ్గిపోవడం, గర్భస్రావం, నెలలు నిండకుండానే ప్రసవం ,శిశువుల్లో తక్కువ బరువు పుట్టడం లాంటి ప్రమాదాలుంటాయి. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో ధూమపానం పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు , అభివృద్ధి లోపాల ప్రమాదాన్ని పెంచుతుంది. తాజాగా డా. శ్రీకాంత్ మిరియాల ఇదే విషయాన్ని తనదైన స్టయిల్లో పొగబాబులకు అర్థమయ్యేలా ట్విటర్లో షేర్ చేశారు. ఆ వివరాలు... డాక్టర్ గారూ కష్టంగా ఉందండి. ఎంత కష్టం? చాలా? ఏం చేసినా? లేదు సార్, అస్సలు నిలబడట్లేదా? కొంచెమే, కానీ అది సరిపోవట్లేదు. అయ్యో? మీరే ఏదో ఒకటి చెయ్యాలి, నా కాపురం నిలబెట్టాలి. సరే, డాప్లర్ పరీక్ష అని ఉంటది, అది చేసుకుని రా! ఇదిగో సార్ రిపోర్టు. అక్కడికి రక్తం… pic.twitter.com/Sfgd2ss0Ba — Srikanth Miryala (@miryalasrikanth) March 4, 2024 (క్రికెట్లో డైమండ్ డక్ అంటే ఒక ఆటగాడు ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండా, ఒక్కపరుగూ చేయకుండా, ఔట్ కావడం) -
Nizamabad: వ్యాపార కేంద్రాలుగా ఇన్ఫెర్టిలిటీ సెంటర్లు!
నందిపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన సావిత్రి, రాజు(పేరుమార్చాం) దంపతులకు ఆలస్యంగా పెళ్లయ్యింది. నాలుగేళ్లు గడిచినా సంతానం కలగలేదు. దీంతో జిల్లా కేంద్రంలోని ఇన్ఫెర్టిలిటీ కేంద్రానికి వెళ్లారు. ప్రముఖ వైద్యురాలు పరీక్షించి స్కానింగ్‌లు చేయించి మందులు వాడాలని సూచించారు. ఫలితం లేకపోవడంతో ఐయూఐ, అటు తర్వాత ఐవీఎఫ్ చేసినా సంతానం కలగలేదు. ఇందుకోసం సుమారు రూ. 3లక్షలతో పాటు అదనంగా మందుల కోసం రూ. లక్షా 50వేలు ఖర్చయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఇలా చాలామంది దంపతులు పిల్లల కోసం అప్పులు చేసి చికిత్స చేయించుకున్నా పిల్లలు పుట్టకపోవడంతో చివరకు దత్తత తీసుకుంటున్నారు. నిజామాబాద్‌నాగారం: పిల్లలు పుట్టక ఆవేదన చెందుతూ.. సంతానం కోసం పరితపిస్తున్న దంపతుల అవసరాన్ని అవకాశంగా మలుచుకుని జిల్లాలో ‘ఇన్ఫెర్టిలిటీ’ దందాను జోరుగా నిర్వహిస్తున్నారు. సంతానం కోసం ఆస్పత్రికి వచ్చిన దంపతుల నుంచి రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. మొద ట మూడు నుంచి ఆరు నెలల పాటు ట్రిట్మెంట్ తీసుకోవాలని సూచిస్తారు.. అటు తర్వాత ఏడాది కోర్సు అని.. ఇంకా పిల్లలు పుట్టకపోతే రెండు నుంచి మూడేళ్ల కోర్సు అంటూ నమ్మబలుకుతూ డబ్బు లు వసూలు చేస్తున్నారు. అయినా ఫలితం లేకపోతే ఐయూఐ, ఐవీఎఫ్ పేరిట రూ. లక్షలు గుంజుతున్నారు. చివరకు సంతానం కలగకపోవడంతో మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. వీటి సక్సెస్ రేటు 20శాతం ఉంటుందని వైద్యులు చెబుతున్నా.. వాస్తవానికి కేవలం రెండు శాతం మాత్ర మే ఉంటుందని సమాచారం. ఒకవైపు ఈ తతంగమంతా అనుమతి ఉన్న కేంద్రాల్లో సాగుతుండగా.. మరోవైపు అనుమతి లేకుండా జిల్లాలో చాలా కేంద్రాలు కొనసాగుతున్నాయి. అనుమతి లేకున్నా వైద్యం యాంత్రిక జీవనంలో పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకోవడంతో పాటు దంపతుల్లో సమస్యలు ఉండడంతో కొందరికి సంతానం కలగడంలేదు. పిల్లలు పుట్టడం లేదనే ఆందోళనతో ఇన్ఫెర్టిలిటీ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో నాలుగైదేళ్లుగా వీటికి డిమాండ్ పెరిగింది. దీంతో జిల్లాలో సంతాన సాఫ ల్య కేంద్రాలు పదుల సంఖ్యలో వెలిశాయి. వీటిలో అనుమతి పొందిన కేంద్రాలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి. అనధికారికంగా చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో సంతానం కోసం చికిత్సలు అందిస్తున్నారు. కొందరు గైనకాలజిస్టులు అనుమతి లేకుండానే వైద్యం చేస్తున్నారు. పల్లెల్లో ఆర్ఎంపీ, పీఎంపీలు సైతం ఫలానా ఇన్ఫర్టిలిటీ కేంద్రానికి వెళ్తే పిల్లలు పుడతారంటూ చెప్పి మరీ పంపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందులో కూడా కమీషన్లు ఉండడం గమనార్హం. ఏదేమైనా రూ. లక్షలు ఖర్చు చేసి నెలలు, సంవత్సరాల పాటు చికిత్స పొందినా ఫలితం ఉండకపోవడంతో చాలా మంది మనోవేదనకు గురవుతున్నారు. పర్యవేక్షణ కరువు జిల్లాలో ఇన్పెర్టిలిటీ కేంద్రాల పేరిట యథేచ్ఛగా దోపిడీ జరుగుతున్నా పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలో కేవలం ఆరు కేంద్రాలకు మాత్రమే అనుమతి ఉంది. వీటి ఏ విధమైన చికిత్స అందిస్తున్నారో సంబంధిత అధికారులు తూతూమాత్రంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రీట్మెంట్, ఫీజుల విషయంలో సైతం పట్టించుకోవడం లేదు. కేంద్రాల నుంచి కూడా ‘మామూళ్లు’ ముడుతుండడంతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదులు వస్తే చర్యలు ఇన్ఫెర్టిలిటీ కేంద్రాల్లో సంతానం కోసం చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఏమైనా తేడా జరిగినట్లు తెలిస్తే ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తాం. ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. సంతాన సాఫల్య కేంద్రాల చికిత్స విధానంలో సక్సెస్ రేటు ఎంత అనే విషయం నాకు తెలియదు. – గంగాధర్, ఇన్చార్జి ఏవో పర్యవేక్షణ చేయిస్తాం జిల్లాలో అనుమతి పొందిన ఫెర్టిలిటీ కేంద్రాలు ఆరు మాత్రమే ఉన్నాయి. ఇందులో కచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఏవో గంగాధర్‌ను పర్యవేక్షణ చేయాలని ఆదేశించాం. తేడాలు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సుదర్శనం, డీఎంహెచ్‌వో -
దక్షిణాదిపై సర్వే.. సంతానలేమి ఇక్కడే ఎక్కువ ఎందుకో తెలుసా?
ఉత్తరాది రాష్ట్రాల కంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలలో సంతానలేమి రేటు ఎక్కువగా ఉందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం, వివాహ వయస్సు, జీవసంబంధ కారకాలు, జీవనశైలి కారకాలు వంధ్యత్వంతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ సమస్యకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల తర్వాత స్థానంలో గోవా, ఢిల్లీ, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలున్నట్టు ప్లస్‌వన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. అయితే, ‘భారత్‌లో వంధ్యత్వ ధోరణులు.. ప్రవర్తనా నిర్ణాయకాలు’ పేరిట అధ్యయనం నిర్వహించారు. అనారోగ్యమే.. ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో దంపతుల్ని వెంటాడుతున్న సమస్య సంతానలేమి. అయితే, ఈ సమస్యను ఒక అనారోగ్య సమస్యగా కాకుండా అదొక ప్రత్యేక సమస్యగా పరిగణించడం జరుగుతోంది. కాగా, ఈ సమస్యకు ముందు, వెనుకా కూడా అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వంధ్యత్వానికి కారణాల్లో అపసవ్య జీవనశైలి, లైంగిక వ్యాధులు వంటివి ఉన్నాయి. విచ్చలవిడి శృంగారం, పలువురు సెక్స్ భాగస్వాములను కలిగి ఉండటం తద్వారా లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు.. వంధ్యత్వానికి, అవాంఛనీయ గర్భస్రావాలకు కారణాలుగా మారుతున్నాయని అధ్యయనం అభిప్రాయపడింది. ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్ నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. ‘లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు తగిన ఆధునిక వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలలో వంధ్యత్వ రేటు ఎక్కువగా ఉంది. పర్యావరణ, సామాజిక–ఆర్థిక జీవనశైలి అలవాట్లు వంటి అనేక ఇతర అంశాలు సమస్య తీవ్రతకు దోహదం చేస్తాయి. ఒక జంట నివసించే వాతావరణం, వేడికి, శబ్దానికి తరచుగా గురికావడం ఆ జంట పునరుత్పత్తి సామర్ధ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది’ అని అధ్యయనం పేర్కొంది. ‘అధిక బరువు దుష్పలితాలు రుతుస్రావం, వంధ్యత్వం, గర్భస్రావం, గర్భం ప్రసవంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ధూమపానం, మద్యపానం, తరచు గర్భస్రావాల ముందస్తు గర్భనిరోధక మందుల వినియోగం కూడా వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచుతాయని వెల్లడించింది. మానసిక సమస్యలెన్నో.. అనారోగ్య కారణాలతో ఏర్పడే ఈ సమస్య ఆ తర్వాత కూడా అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. పురుషులతో పోలిస్తే సంతాన లేమి మహిళలను మరింత ఎక్కువగా వేధిస్తుందని వారి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని అధ్యయనం తేల్చింది. అంతేకాకుండా కుటుంబ, సమాజ ఒత్తిడిని వారు అతిగా భరించాల్సి వస్తుందని కూడా వెల్లడించింది. భారతదేశంలోని జంటలలో వంధ్యత్వం 1981లో 13 శాతం మాత్రమే కాగా అది 2001 నాటికి 16 శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘1998–99 నుంచి 2005–06 మధ్య మాత్రం వంధ్యత్వ రేటు తగ్గింది. ఇక మిగిలిన కాలం అంతా పెరుగుదలే గమనించినట్టు అధ్యయనం స్పష్టం చేసింది. ప్రస్తుతం వివాహిత మహిళల్లో ఎనిమిది శాతం మంది ప్రాథమిక, ద్వితీయ వంధ్యత్వానికి గురవుతున్నారు. అందులో 5.8 శాతం మంది ద్వితీయ వంధ్యత్వానికి గురవుతున్నారు’ అని పేర్కొంది. వైద్య పరిష్కారాలు ఉన్నాయి.. సంతానలేమి సమస్య తీవ్రంగానే ఉందని గత కొంత కాలంగా అధ్యయనాలు చెబుతున్నాయి. మా వద్దకు వస్తున్న జంటల సంఖ్య కూడా దీన్ని నిర్ధారిస్తోంది అని నోవా ఐవీఎఫ్ సెంటర్ నిర్వాహకులు డా.స్వప్న అంటున్నారు. ఇటీవల ఈ సమస్యపై ఆధునికుల్లో అవగాహన పెంచడానికి విజయవాడలో ఎపీఆర్సీఓజీ ట్రస్ట్, విజయవాడ అబ్సెటెట్రిక్ అండ్ గైనకాలాజికల్ సొసైటీలతో కలిసి సదస్సును నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆధునిక వైద్య ప్రపంచం సంతానలేమికి విభిన్న రకాల పరిష్కారాలను అందిస్తోంది. అయితే, ఇవన్నీ జీవనశైలి మార్పులతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. సంతానలేమి కారణాలపై యువతలో అవగాహన పెరగాలని, కనీసం 25 నుంచి 28 ఏళ్లలోపు మధ్య వయసులోనే సంతానం పొందేలా ప్లాన్ చేసుకోవాలని ఆమె సూచించారు. -
మగబిడ్డకు జన్మనిచ్చిన స్వలింగ జంట!ఒకే బిడ్డను ఇద్దరు గర్భంలో..
ఓ స్వలింగ జంట మగ బిడ్డకు జన్మనివ్వడమే ఓ మిరాకిల్ అనేకుంటే.. ఏకంగా ఇద్దరు కలిసి ఒక బిడ్డనే కడపున మోయడం మరింత విశేషం. ఈఘటన ఐరోపాలో చోటు చేసుకుంది. ఇది ఎలా సాధ్యం అనిపిస్తోంది కదా!. ఫెర్టిలిటి సెంటర్‌ని సంప్రదించి బిడ్డల్ని కనే ప్రయత్నం చేశారనుకున్నా.. ఇద్దరూ గర్భంలో మోయడం ఏంటీ అనే డౌటు వస్తుంది కదా!. గతంలో తొలిసారిగా ఓ స్వలింగ జంట ఇలానే ఒకే బిడ్డను ఇద్దరూ మోసి చరిత్ర సృష్టించారని ఈ స్వలింగ జంట రెండోదని అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఏంటా కథా కమామీషు చూద్దాం!. స్పెయిన్‌లో మజోర్కాలోని పాల్మాలో ఎస్టీఫానియా(30), అజహారా(27) అనే స్వలింగ జంట అక్టోబర్ 30న ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వారిద్దరూ మహిళలే. పిల్లల్ని కనాలని ఆశపడ్డారు. ఇద్దరు మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించాలనుకున్నారు. అందుకోసం ఓ ఫెర్టిలిటి సెంటర్‌ని సంప్రదించారు. ముందుగా ఎస్టీఫానియా మహిళ గర్భంలో స్పెర్మ్‌ని ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందేలా చేశారు. ఐదు రోజుల అనంతరం ఆ పిండాన్ని అజహారా గర్భంలో పెట్టారు. అలా ఇద్దరూ ఒకే బిడ్డను మోసి మాతృత్వపు అనుభూతిని పొందారు. ఇందుకోసం సుమారు రూ. 4 లక్షలు ఖర్చుపెట్టి మరీ తమ కలను సాకారం చేసుకున్నారు. అంతేగాదు ఇద్దరూ ఒకరిపట్ల ఒకరూ కేర్ వహిస్తూ తమ అనుబంధం మరింత బలపడింది అనేందుకు చిహ్నంగా ఒకే బిడ్డకు జన్మనిచ్చాం. ఆ ఆలోచన మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటూ ఆనందంగా చెబుతున్నారు ఇరువురు. ఈ వైద్య విధానాన్ని ఇన్వోసెల్గా పిలిచే సంతానోత్పత్తి చికిత్స అంటారు. ఇలా ఇంతకుమునుపు 2018లో టెక్సాస్‌లో ఓ స్వలింగ జంట(ఇద్దరు మహిళలు) ఒకే బిడ్డను మోసి.. ప్రపంచంలోనే తొలి స్వలింగ జంటగా నిలిచారు. సంతానం లేనివాళ్లకే గాక పిల్లల్ని కనడం సాధ్యం కానీ ఇలాంటి స్వలింగ జంటలకు ఈ సరికొత్త వైద్య విధానం ఓ వరం. వైద్యవిధానం సరికొత్త ఆవిష్కరణలతో అభివృద్ధిని, ప్రగతిని సాధిస్తోందనడానికి ఈ ఘటనే ఓ నిదర్శనం (చదవండి: కోవిడ్ కొత్త వ్యాక్సిన్ ఆ క్యాన్సర్‌ని రానివ్వదు! అధ్యయనంలో వెల్లడి) -
నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం..ఎన్నో జంటలను వేధించే సమస్య
నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం.ఈ సందర్భంగా ఎన్నో జంటలను వేధించే వంధ్యత్వ సమస్య గురించి తెలుసుకుందాం. వంధ్యత్వం అనేది పిల్లలు కనలేని స్థితి. కొన్ని జంటలు ఈ సమస్య కారణంగా శారీరకంగా మానసికంగా చాలా క్షోభని అనుభవిస్తారు. ఈ సమస్య ఎందువల్ల వస్తుంది. దీని నుంచి ఎలా బయపడొచ్చో చూద్దాం. నిజానికి నూటికి 50 శాతం జంటలు ఈ సమస్యను అనుభవిస్తున్నావారే. దీనికి ఇద్దరిలో ఒకరి వల్ల కావచ్చు లేదా ఇద్దరిలోనూ సమస్య ఉండవచ్చు. ముందుగా మగవారిలో ఎందుకు ఈ సమస్య వస్తుందో చూద్దాం. మగవారిలో ఈ సమస్య ఎలా తలెత్తుతుందంటే.. వారిలో స్పెర్మ కౌంట్ సరిగా లేకపోవడం. వృషణాలలో సమస్య గవదబిళ్లలు వంటి ఇన్ఫెక్షన్లు అకాల స్ఖలనం సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జన్యుపరమైన రుగ్మత పునరుత్పత్త అవయవాలకుగాయలు ఎక్కువగా ఆవిరి పట్టడం, వేడి నీటి స్నానాలు కారణంగా స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం ఏర్పడుతుంది స్మోకింగ్, మద్యపానం, డ్రగ్స్ వంటివి వాడినా క్యాన్సర్‌కి సంబంధించిన చికిత్స రేడియోషన్ లేదా కీమోథెరఫీ వంటి వాటివల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇక స్త్రీలలో ఎలా ఎదురవుతందంటే.. పీసీఓఎస్, హైపర్ప్రోలాక్టినిమియా లేదా హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ల అసమతుల్యత గర్భాశయ అసాధారణతలు, గర్భాశయ పాలిప్స్, ఫైబ్రాయిడ్లు తదితర కారణాలు ఫెలోపియన్ ట్యూబ్ దెబ్బతినడం, అండాలు ప్రయాణానికి ఆటంకం కలిగంచే సంశ్లేషణలు ఎండోమెట్రియోసిస్, టర్నర్ సిండ్రోమ్, పెల్విక్ సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు సంతానోత్సత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇగ మగవారిలోనూ, స్త్రీలలోనూ కామన్‌గా ఎదురయ్యే సమస్యలు ⇒30వ దశకం దాటిని స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది ⇒అలాగే పురుషులలో 40 ఏళ్లు పైబడిన వారికి సంతాన సామర్థ్యం తగ్గుతుంది ⇒పురుషులకు మద్యం, సిగరెట్ తాగే అలవాటు ఉంటే గర్భస్రావం అయ్యే సమస్య ఎక్కువగా ఉంటుంది. ⇒ఇద్దరిలో ఎవరు అధిక బరువు ఉన్నా ఈ సమస్య ఎదురవుతుంది. ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం స్త్రీ, పురుషులకు దీనిపై అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే దీన్ని జరుపుకుంటున్నాం. ఒకవేళ్ల ఇరువురికి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగి ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఒక చక్కని మార్గంలా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా జంటలు ఒకరినొకరు నిందించుకోకుండా సమస్యను సానుకూల దృష్టితో చూసే అవకాశం, అవగాహన ఏర్పడుతుంది. ఇక చక్కటి కుటుంబం కోసం ఆరాటపడే జంటలు పైన చెప్పిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టడమేగాక ఆనందమయ జీవితాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. (చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగాలరా?.. ఇది సాధ్యమేనా!) -
ఎన్నిసార్లు కలిసిన ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ప్రధాన కారణం ఇదే
-
ప్రెగ్నెంట్ అంటూ... ప్లాస్టిక్ బొమ్మతో షాకిచ్చిన మహిళ!
దంపతులకు పిల్లలు లేకపోతే పడే బాధ అంతా ఇంతా కాదు. నలుగురిలోనూ ఇబ్బందిగా ఉండి ఎక్కడికి వెళ్లలేక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అచ్చం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న ఒక మహిళ ఆ బాధ నుంచి తప్పించుకునే క్రమంలో ఆడిన నాటకమే ఆమెను పట్టుబడేలా చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...40 ఏళ్ల మాహిళ పెళ్లై 18 ఏళ్లు అయినా పిల్లలు లేరు. చుట్టుపక్కల సూటిపోటీ మాటలకు బాధపడి తాను ప్రెగ్నెంట్ అని నాటకం ఆడింది. ఈ మేరకు ఆమె ప్రతి నెల స్థానిక ఆస్పత్రిలో చెకప్ చేయించుకునేందుకు వెళ్తుండేది. ఆ తర్వాత ఒకరోజు కడుపులో నొప్పిగా ఉందంటూ చెప్పి హడావిడి చేసి...నెలలు నిండకుండా బిడ్డ పుట్టిందంటూ ఒక ప్లాస్టిక్ బొమ్మను చూపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ బిడ్డను ఒక గుడ్డలో చుట్టి చెకప్ కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉన్న వైద్యులు చెక్ చేసి ఇది బిడ్డ కాదని ఒక ప్లాస్టిక్ బొమ్మ అని తేల్చి చెప్పారు. అంతేకాదు వైద్యులు ఆమె హెల్త్ రిపోర్టులు తీసుకురమ్మని కుటుంబ సభ్యులకు చెప్పారు. వైద్యులు తీసుకువచ్చిన ఆ ఎక్స్‌రే రిపోర్టులన్ని నకిలీవని తేల్చారు. ఆమె ప్రతినెల చెకప్‌కి వెళ్తున్న ఆస్పత్రిని సైతం విచారించగా.....ఆమె కడుపులో ఇన్ఫక్షన్ ఉందంటూ ఆస్పత్రికి వచ్చేదని, ఆమె గర్భవతి కాదని చెప్పారు. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పెళ్లి అయ్యి చాలా ఏళ్లైన పిల్లలు లేరంటూ తిడుతుంటే తట్టుకోలేక ఇలా కట్టుకథ అల్లానని చెప్పుకొచ్చింది సదరు మహిళ. (చదవండి: నిందితుడు అరెస్టు కాకూడదని..కారుతో సెక్యూరిటీ గార్డుని ఢీ కొట్టి...) -
సంతాన లోపానికి సగం కారణం పురుషుల్లోని సమస్యలే.. షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ఎనిమిది ప్రత్యేక జన్యువులు ప్రభావితం చేస్తున్నాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ఎనిమిది జన్యువుల్లో జరుగుతున్న మార్పులు వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపి, పురుషుల్లో వంధ్యత్వానికి కారణమవుతోందని తేల్చారు. ఈ వివరాలను సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయగ్నస్టిక్స్ డైరెక్టర్ డాక్టర్ కె.తంగరాజ్ వెల్లడించారు. సంతానం కలగకపోవడానికి సగం కారణం పురుషుల్లోని సమస్యలేనని.. పిల్లలు పుట్టకపోతే మహిళలను నిందించడం సరికాదని స్పష్టం చేశారు. జన్యుమార్పులు వంధ్యత్వానికి దారితీస్తున్నట్టు వెల్లడైన నేపథ్యంలో.. ఈ సమస్య పరిష్కారం కోసం మెరుగైన పద్ధతుల ఆవిష్కరణకు వీలవుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరి తెలిపారు. దీర్ఘకాలం నుంచి పరిశోధనలు..: దేశంలోని పురుషుల్లో వంధ్యత్వ సమస్యకు కారణాలను తెలుసుకునేందుకు డాక్టర్ తంగరాజ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం రెండు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. గతంలోనూ వంధ్యత్వ సమస్య ఉన్న పురుషుల్లో 38శాతం మంది వై క్రోమోజోమ్‌లో తేడాలున్నట్టు వీరు గుర్తించారు. దీనితోపాటు కణాల్లోని మైటోకాండ్రియా, ఆటోసోమల్ జన్యువుల్లో మార్పులు కూడా వంధ్యత్వానికి కారణమవుతున్నట్టు తేల్చారు. తాజా పరిశోధనలో భాగంగా తాము వంధ్యత్వ సమస్య ఉన్న 47మందిలోని జన్యుక్రమాన్ని పరిశీలించామని తెలిపారు. దేశవ్యాప్తంగా మరో 1,500 మంది వంధ్యత్వ పురుషుల్లోని జన్యుమార్పులతో పోల్చి చూశామని.. ఈ క్రమంలో ఎనిమిది ప్రత్యేక జన్యువుల సంగతి తెలిసిందని పరిశోధనలో భాగం వహించిన సీసీఎంబీ పీహెచ్డీ విద్యార్థి, ముంబై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ శాస్త్రవేత్త సుధాకర్ దిగుమర్తి తెలిపారు. ఈ పరిశోధనలో బెంగళూరు జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌తోపాటు సికింద్రాబాద్‌లోని మమత ఫెర్టిలిటీ ఆస్పత్రి, సీడీఎఫ్‌డీ తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయని వివరించారు. ఈ వివరాలు హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. డాక్టర్ కె.తంగరాజ్ -
అమ్మానాన్న అయ్యేదెప్పుడో!
కర్నూలు(హాస్పిటల్): పెళ్లితో ఇద్దరు ఒక్కటై ఆ తర్వాత పండండి బిడ్డకు జన్మనిచ్చి అమ్మానాన్న పిలుపుతో మురిసిపోవడం దంపతుల కల. వివాహమైన ఏడాదికో, రెండేళ్లకో వారి కల నెరవేరి ఇద్దరు ముగ్గురవుతారు. ఇప్పుడా పరిస్థితి మారిపోతోంది. మారిన జీవనశైలి, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా యువతీయువకుల్లో సంతానలేమి సమస్య అధికమవుతోంది. సంతాన యోగ్యానికి స్త్రీ, పురుషుల్లో అనేక అడ్డంకులు ఏర్పడినప్పుడు సంతానం కోసం ఎదురుచూడక తప్పదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం పెళ్లైన ప్రతి వంద మందిలో 15 మంది దంపతులు ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో గైనకాలజిస్టుల వద్దకు, సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లే వారి సంఖ్య ఇటీవల కాలంలో అధికమైంది. ఆయా వైద్యుల వద్ద నిత్యం రద్దీ కనిపిస్తుండటం ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఇందులో ప్రధానంగా కర్నూలులోని వైద్యుల వద్దకు భర్త లేదా తల్లిదండ్రులతో వెళ్లే వారు, వివిధ రకాల పరీక్షలు చేయించుకుంటున్న వారు నిత్యం కనిపిస్తున్నారు. కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ తదితర ప్రాంతాల్లో దాదాపు 200 మంది గైనకాలిజిస్టులు సేవలు అందిస్తున్నారు. వీరి వద్దకు గర్భం దాల్చిన వారితో పాటు సంతాన సమస్యతో వైద్యులను సంప్రదించే వారు కూడా అధిక మంది ఉన్నారు. వైద్యుల సూచనలు పాటించినా సంతాన ప్రాప్తి కలగని వారు చివరకు సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. గతంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కర్నూలు నగరంలో ఐదు సంతాన సాఫల్య కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. సంతానలేమికి దంపతులిద్దరిలోనూ లోపాలు కారణం కావచ్చు. వైద్యపరిభాషలో సంతానం లేకపోవడానికి 40 శాతం ఆడ వారిలో, 30 శాతం మగవారిలో లేదా 20 శాతం ఇద్దరిలో లోపాలుంటున్నాయి. 10 శాతం మందిలో దాదాపుగా చెప్పలేని కారణాలతో సంతానలేమి సమస్య ఏర్పడుతోంది. వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు ► అండవాహికల్లో లోపాల నిర్ధారణకు హెచ్ఎస్జీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది చాలా సార్లు అండవాహికలు తెరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. కొందరు కేవలం ఈ పరీక్ష ద్వారానే గర్భం దాలుస్తారు. ► అండాశయ గర్భాశయ లోపాల నిర్ధారణకు ల్యాపరోస్కోపిక్ స్టడీ చేస్తారు. ఇది ఒక సర్జికల్ విధానం. ఈ విధానం ద్వారా కూడా సంతాన అవకాశాలు ఉంటాయి. ► బయట నుంచి పంపిన కెమెరా ద్వారా గర్భాశయ స్థితిగతులు నిర్ధారించడం, తగిన పరిష్కారం సూచించేందుకు హిస్టరోస్కోపి చేస్తారు. ► పురుషుల్లో వీర్యవాహిక మూసుకుపోయినప్పుడు వృషణాల నుంచి టీసా అండ్ పీసా విధానం ద్వారా నేరుగా వీర్యం సేకరించి ఫలితం సాధిస్తారు. సంతానలేమికి కారణాలు స్త్రీలలో.. ► ఆలస్యంగా వివాహం కావడం ► నెలసరి సక్రమంగా రాకపోవడం ► ఆలస్యంగా రజస్వల కావడం ► అండం పెరుగుదల, విడుదల సక్రమంగా లేకపోవడం ► అండం ప్రయాణించే మార్గం మూసుకుపోవడం ► అండాశయంలో నీటి బుడగలు (పీసీవోడీ) ► గర్భాశయ గోడలు పిండం ఎదుగుదలకు అనువుగా లేకపోవడం ► గర్భాశయ ముఖద్వారం వీర్యకణాలు లోనికి వెళ్లేందుకు అనువుగా లేకపోవడం ► హార్మోన్ల శాతంలో తేడాలుండటం పురుషుల్లో ► వీర్యంలో వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం ► వీర్యకణాల కదలిక, సారూప్యంలో అధికంగా తేడాలుండటం ► వీర్యంలో వీర్యకణాలు లేకపోవడం ► వీర్యకణాలు ప్రయాణించే నాళాలు మూసుకుపోవడం ► హార్మోన్ల శాతంలో తేడాలుండటం ► ధూమ, మద్యపానసేవనం, డ్రగ్స్‌కు అలవాటు పడటం ► జంక్‌ఫుడ్ ఎక్కువగా తినడం, స్థూలకాయం, నిద్రలేకుండా పనిచేయడం ► జన్యుపరమైన లోపాలు ఆహారపు అలవాట్లే కారణం ఇటీవల కాలంలో సంతానం లేని వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అధిక శాతం జీవనశైలిలో మార్పులు, వారి ఆహార విధానాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. దీనికి తోడు శారీరక శ్రమ లేకపోవడంతో చాలా మంది స్థూలకాయులుగా మారుతున్నారు. సంతానం కలిగేందుకు ఇది పెద్ద అవరోధంగా మారుతోంది. ఇలాంటి వారు ముందుగా బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసుకోవడంతో పాటు వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలి. – డాక్టర్ శిరీషారెడ్డి, ఫర్టిలిటి స్పెషలిస్టు, గైనకాలజిస్టు, కర్నూలు 50 శాతం పురుషుల్లో సమస్య సమాజంలో సంతానలేమి సమస్య 10 శాతం ఉండేది. కానీ ఇప్పుడు 30 నుంచి 40 శాతం వరకు ఉంది. గతంలో పురుషుల్లో ఈ సమస్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు వారిలో 50 శాతం మందిలో ఈ సమస్య ఉంది. దీనికి కారణం సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో పని ఒత్తిడి, వారు వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, చెడు అలవాట్ల వల్ల వారిలో వీర్యకణాల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా మహిళల్లో సీపీవోడీ సమస్య ఎక్కువగా ఉంది. ప్రతి పది మందిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. – డాక్టర్ విష్ణుప్రియ, ఫర్టిలిటీ స్పెషలిస్టు, కర్నూలు -
Covid Vaccine: టీకాతో వ్యంధ్యత్వం రాదు
న్యూఢిల్లీ: పురుషులు, మహిళల్లో వ్యంధ్యత్వానికి (ఇన్ఫెర్టిలిటీ) కోవిడ్–19 వ్యాక్సినేషన్ కారణమవుతోందన్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. కరోనా వ్యాక్సిన్ పూర్తి సురక్షితం, ప్రభావవంతం అని గుర్తుచేసింది. పాలిచ్చే తల్లులు సైతం కరోనా టీకా తీసుకోవచ్చని జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొంది. టీకా తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత బిడ్డకు పాలివ్వడం మానాల్సిన అవసరం లేదని సూచించిందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
మాకు పిల్లలు కావాలి.. వ్యాక్సిన్ వద్దంటున్న అమెరికన్లు
వాషింగ్టన్: బైడెన్ ప్రభుత్వం తమ దేశప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసి కోవిడ్ నుంచి ఉపశమనం పొందాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఇటీవల టీకాకు సంబంధించిన ఓ వార్త కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించేలా కన్పిస్తోంది. ఎందుకంటే అక్కడి 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న అమెరికన్లలో ఇంకా సగం మంది టీకా తీసుకోలేదు. ఇటీవల సోషల్ మీడియాలో ఈ అంశంపై పలు రకాలుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి. టీకా ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో సంతానప్రాప్తిని కోల్పోయే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో అమెరికన్లు టీకా వేయించుకునేందుకు వెనుకాడుతున్నారు. ఇలాంటి ఫేక్ పోస్టులతో ప్రస్తుతం అమెరికా ప్రజలు సతమతమవుతున్నారు. దీంతో బిడైన్ ప్రభుత్వ లక్ష్యానికి ఇదో సమస్యగా మారింది. మాకు టీకా వద్దు బాబోయ్ టీకా వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి.. మహిళలు టీకాలు తీసుకోవడం లేదని ఓ అమెరికా అధ్యయనం తేల్చింది. ఫెర్టిలిటీ వ్యవస్థపై వ్యాక్సిన్ నెగటివ్ ప్రభావం చూపిస్తుందని ప్రజలు భావిస్తున్నారు. అందుకే వ్యాక్సిన్ తీసుకోని వారు ఇదే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నట్లు కైసర్ ఫామిలీ ఫౌండేషన్ డైరక్టర్ అష్లే కిర్జింగర్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో జరిపిన పరిశోధనలో మూడింట రెండు వంతుల మంది టీకాను వేసుకోలేమని కారణంగా, వారి సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందేమో అని ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 18 నుంచి 49 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 50 శాతం, పురుషులలో 47 శాతం మంది ఇలాంటి భయాలు మొదలయ్యాయి. కారణంగా ఇంతవరకు వారెవరూ టీకాలు వేయించుకోవడానికి ముందుకు రావడంలేదు. ఈ క్రమంలో కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ నుంచి మొదట్లో గర్భిణీ స్త్రీలను మినహాయించడం కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయనే చెప్పాలి. కొందరి వాదనేమో ఇలా ఉంది.. వ్యాక్సిన్లు ప్రత్యుత్పత్తి వ్యవస్థను టార్గెట్ చేస్తాయంటే.. అది కొంత ఆడవారికి ఆందోళన కలిగించే అంశమే అని అంటున్నారు. అయితే వ్యాక్సిన్లు తీసుకుంటే వంధ్యత్వం వస్తుందన్న ఆధారాలు ఏమీ లేవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ( చదవండి: వ్యాక్సినేషన్ పూర్తయితే మాస్కు అక్కర్లేదు ) -
ప్రతి పది మంది పురుషుల్లో ఒకరింతే..
న్యూయార్క్ : పురుషుల్లో సంతాన సాఫల్య సమస్యలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. ప్రతి పది మంది పురుషుల్లో ఒకరు తండ్రి అయ్యేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని తాజా అథ్యయనం బాంబు పేల్చింది. తక్కువ వీర్యకణాల సంఖ్యతో పెద్దసంఖ్యలో పురుషులు సంతాన లేమితో సతమతమవుతున్నారని పేర్కొంది. ఈ లక్షణం పురుషుల్లో తర్వాతి దశల్లో క్యాన్సర్ రిస్క్కూ దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ చేపట్టిన సర్వేలో రెడ్, ప్రాసెస్డ్ మాంసాహారం, తీపి పానీయాలు, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారాన్ని అధికంగా తీసుకునే పురుషుల్లో సగటు వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్టు తేలింది. వీరిలో వీర్యకణాల సంఖ్య సగటు 25.6 మిలియన్లు తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. సహజంగా సంతానోత్పత్తికి వీర్యకణాల సంఖ్య 39 మిలియన్లు ఉండాలని వారు తెలిపారు. మరోవైపు చాలామంది పురుషులు తల్లిగర్భంలో ఉన్నప్పుడే ఈ లోపంతో పుడుతున్నారని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తొలి నెలల్లోనే శిశువులు తండ్రులుగా మారే అవకాశాలు దెబ్బతింటున్నాయని, వారి పునరుత్పత్తి అవయవాలు ప్రతికూల ప్రభావానికి లోనవుతున్నాయనేందుకు ఆధారాలు లభించాయని చెబుతున్నారు. ఇది వీర్యకణాలు తగ్గడానికే పరిమితం కాదని, వారు వయసు పెరిగేకొద్దీ హృద్రోగాలు, క్యాన్సర్ వంటి తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. -
నాకు సంతానయోగం ఉందా?
నా వయసు 34 ఏళ్లు. వివాహమై పదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? – ఎల్. సరస్వతి, కందుకూరు ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు: జన్యుసంబంధిత లోపాలు థైరాయిడ్ సమస్యలు అండాశయంలో లోపాలు నీటిబుడగలు గర్భాశయంలో సమస్యలు ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు డయాబెటిస్ గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు హార్మోన్ సంబంధిత సమస్యలు థైరాయిడ్ పొగతాగడం శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతానలేమిలో రకాలు: ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ: అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ : మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది. గుర్తించడం ఎలా : తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. -
పురుషులలో సంతాన లేమి సాఫల్యానికి మార్గాలు
ఫాదర్స్‌డేకి కాస్త ముందు వెనకలుగా కొన్ని దేశాలలో మెన్స్ హెల్త్ వీక్ జరుపుకుంటాయి. ఈ సంవత్సరం మెన్స్ హెల్త్ వీక్ ఈ నెల 10న ఆరంభం అయింది. నేటితో ముగుస్తోంది. పురుషులు తమ ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన సరైన సమయమిది. బిడ్డకు తల్లి లేదా తండ్రి కావడమనేది ఎంతో ఆనందించదగ్గ విషయం. దురదృష్టవశాత్తూ ప్రస్తుత జీవనశైలిని బట్టి ఇటీవలి కాలంలో చాలా దేశాలలో అదొక పెద్ద సవాలుగా మారింది భారతీయ జనాభాలో వంధ్యత్వం దాదాపు 10 నుంచి 14 శాతం మందిపై ప్రభావం చూపుతోంది. ఎటువంటి గర్భనిరోధక సాధనాలు వాడకుండా ఏడాది పాటు సంసార జీవితం గడుపుతున్నా సంతానం కలగకపోవడాన్ని వంధ్యత్వం అనవచ్చు. ఇంచుమించు అన్ని వంధ్యత్వ కేసులలోనూ, 40 నుంచి 50 శాతం వరకు పురుషులలో వంధ్యత్వానికి సంబంధించినవే. సంతాన లేమితో బాధపడుతున్న చాలామంది పురుషులు దాంపత్య జీవనంలో తమకు ఎదురవుతున్న సవాళ్లను, సమస్యలను ఎవరికీ చెప్పుకోకపోవడం దురదృష్టకరం.. లైంగికపరమైన స్తబ్ధత, తక్కువస్థాయిలో వీర్యం ఉత్పత్తి కావడం. వీర్య ఉత్పత్తిలో అసాధారణ పరిణామాలు, లేదా వీర్యనాళాలలో బ్లాకేజీలు వంటివి వంధ్యత్వానికి ప్రధాన కారణాలు. జబ్బు పడటం, తీవ్ర గాయాల పాలుకావడం, అసాధారణమైన ఆరోగ్య సమస్యలు, జీవనశైలి లక్షణాలు, తదితరమైనవి పురుష వంధ్యత్వానికి దారితీసే మౌలికాంశాలు. సంతానలేమికి ఇతర కారణాలు తక్కువ వీర్యకణాలు ఉండటం: వీర్యంలో మిల్లీలీటరుకు 15 మిలియన్ల కణాలకన్నా తక్కువ ఉండటాన్ని తగినన్ని వీర్యకణాలు లేకపోవడంగా పరిగణింపవచ్చు. సంతానం లేని దంపతులలో దాదాపు మూడవ వంతుమంది జంటలకు తక్కువ వీర్యకణాల వల్లనే సంతానం కలగడం లేదు. వీర్యకణాల కదలిక తక్కువగా ఉండడం: వీర్యంలోనుంచి వీర్యకణాలు అండాన్ని చేరి, ఫలదీకరణ చెందాలంటే కణాలు చురుకుగా కదలాలి. కణాలు ఈదలేకపోతే ఫలదీకరణ జరగదు. అసాధారణమైన వీర్యం: వీర్యకణాలకు సరైన ఆకారం లేకపోవడం వల్ల అండంలోనికి చొచ్చుకుపోలేకపోవడాన్ని అసాధారణమైన వీర్యంగా చెప్పవచ్చు. పురుషులలో వంధ్యత్వానికి దారితీసే ఇటువంటి పరిణామాలకు వృషణాలకు ఇన్ఫెక్షన్ సోకడం లేదా విపరీతమైన వేడిమికి గురవడం, వెరికోసిల్, హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, క్యాన్సర్, శస్త్రచికిత్సలు మొదలైన కారణాలు ఉండవచ్చు. వంధ్యత్వానికి దారితీసే కారకాలు ధూమపానం, మద్యపానం, యాంటిబయొటిక్ స్టెరాయిడ్ల వాడకం, అధికంగా చక్కెర కలిపిన శీతల పానీయాలు సేవించడం, రసాయనాల ప్రభావానికి గురికావడం, అధికబరువు లేదా స్థూలకాయం, మానసిక ఒత్తిడి, అధికంగా వ్యాయామం చేయడం. రోజుకు మూడుగంటల కన్నా ఎక్కువసేపు టీవీ చూడటం, రెండుగంటల కన్నా ఎక్కువగా మొబైల్ ఫోన్లను వాడటం, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ ఉన్న ప్రదేశానికి కి.మీ. పరిధిలో నివసించడం వల్ల కూడా వీర్యం తగిన పరిణామంలో ఉత్పత్తి కాదు. వీర్యకణాలలో డి.ఎన్.ఎ. విచ్ఛిత్తి చెందడం ఒక్కోసారి వీర్యకణాలలో డిఎన్ఎ విచ్ఛిత్తి చెందడం వల్ల కూడా పురుషులలో వంధ్యత్వానికి దారితీసే అవకాశం ఉంది. పరిసరాల ప్రభావం, కొని ్నరకాల జీవనశైలి అలవాట్ల వల్ల డిఎన్ఎ విచ్ఛిత్తి చెందుతుంది. రసాయనాల ప్రభావానికి గురికావడం, తీవ్రమైన వేడిమి ఉన్న ప్రదేశాలలో పని చేయడం, ధూమపానం డిఎన్ఎ విచ్ఛిత్తికి దారితీస్తాయి. సాఫల్యానికి సలహాలు తగినంత నీటిని తాగడం, పిల్లలకోసం ప్రయత్నించడానికి కనీసం రెండు మూడు నెలల ముందు నుంచి ధూమపానాన్ని మానివేయడం, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే టొమాటో, చిలకడ దుంపలు, పుచ్చ, గుమ్మడి, క్యారట్లు, చేపలు, వాల్నట్స్, బ్లూ బెర్రీస్, దానిమ్మ, డార్క్ చాకొలేట్స్ వంటి వాటిని తినడం మంచిది. డాక్టర్ స్వప్నాశ్రీనాథ్ ఎఫ్ఎన్బి రిప్రొడక్టివ్ మెడిసిన్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కోమలి ఫెర్టిలిటీ సెంటర్ (ఎ యూనిట్ ఆఫ్ రమేష్ హాస్పిటల్స్) గుంటూరు – విజయవాడ; ఈమెయిల్: drswapnasrinath@gmail.com -
భారతీయ పురుషుల్లో వంధ్యత్వం
తార్నాక: పురుషుల్లో అతి ముఖ్యమైన ‘వై–క్రోమోజోమ్’ దెబ్బతినడం వల్ల భారతీయ పురుషుల్లో వంధ్యత్వం ఏర్పడుతుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తేల్చారు. పురుషుల్లో వై–క్రోమోజోమ్‌లోని లోపం ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బ తీస్తున్నట్టు గుర్తించారు. దీనిపై రెండు దశాబ్దాలుగా సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ (సీసీఎంబీ)లో చేస్తున్న పరిశోధనలు ఫలించాయి. మానవుల్లో వంధ్యత్వానికి పురుషుల్లో ఉండే వై–క్రోమోజోమ్‌లోని లోపాలే ప్రధాన కారణమని సీసీఎంబీకి చెందిన డాక్టర్ తంగరాజ్ ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. భారతీయుల్లోని ప్రతి ఏడు జంటల్లో ఒకరు వంధ్యత్వానికి గురువుతున్నారని వారు గుర్తించారు. ముఖ్యంగా పురుషుల్లోని వై–క్రోమోజోమ్ అనేకరకాల జన్యువులను కలిగి ఉంటుంది. అది స్పెర్మటోజెనిసిస్, శుక్రకణాల ఉత్పత్తిలో ప్రధాన పాత్రపోషిస్తుంది. అయితే మగవారిలో ఆనారోగ్యం, గాయాలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు.. జీవనశైలి, పరిసరాల ప్రభావం వై–క్రోమోజోమ్ ఉత్పిత్తి చేసే శుక్రకణాలు విడుదలకు అడ్డంకులు కలిగిస్తాయని, ఈ కారణాలే మగవారిలో వంధ్యత్వానికి కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 8.5 శాతం కేసుల్లో ఈ లక్షణాలు బయటపడినట్టు వారు వెల్లడించారు. ప్రస్తుత అధ్యయనంలోౖ వై–క్రోమోజోమ్‌ల లోపాలపై సూక్ష్మ, స్థూల అధ్యయనాలు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అజూస్పెర్మా ఫ్యాక్టర్లోని మూడు పొడవైన వై–క్రోమోజోమ్ స్పెర్మటోజెనిసిస్లను ఉపయోగించి 587 మంది పరిపూర్ణమైన ఫెర్టిలిటీ గల వారు, 973 మంది వంధ్యత్వ లక్షణాలు గలవారిలోని శుక్రకణాల ఫలదీకరణపై పరిశోధన చేయగా, 29.4 శాతం భారతీయ పురుషుల్లో క్రోమోజోములు తగ్గిపోతున్నట్టు గుర్తించారు. వై–క్రోమోజోమ్ తొలగింపు అనేది ప్రత్యుత్పత్తి వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని వారు తేల్చారు. -
సమస్యగా మారిన సంతానలేమి
నవ్యాంధ్ర రాజధాని జిల్లాలో సంతానలేమి సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఉరుకులు పరుగుల జీవన విధానం, పనిఒత్తిళ్లు, శారీరక శ్రమ లేకపోవడమే కారణంగా వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు, ఆ జాబితాలో సంతానలేమి సమస్య కూడా చేరింది. లబ్బీపేట(విజయవాడ తూర్పు): నవ్యాంధ్ర రాజధాని జిల్లాలో సంతానలేమి సమస్య రోజురోజుకు పెరుగుతోంది. ఉరుకులు పరుగుల జీవన విధానం, పనిఒత్తిడిలు, శారీరక శ్రమ లేకపోవడం కారణంగా చెబుతున్నారు. మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు, ఆ జాబితాలో సంతానలేమి సమస్య కూడా చేరింది. సంతాన లేమి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో 80 శాతం మందిలో జీవన విధానం ప్రధాన కారణంగా తేలింది. ఆలస్య వివాహాలు, పెళ్లయి కొంతకాలం వరకు పిల్లలు వద్దనుకోవడం కూడా సంతానలేమికి సమస్యగా మారింది. జీవన విధానం కారణంగా మహిళలు, పురుషుల్లో హార్మోన్లు అసమతుల్యత ఎక్కువుగా ఉంటుంది. దీంతో మహిళల్లో అండం విడుదల కాకపోవడం, పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇవీ కారణాలు మహిళల్లో ప్రధానంగా హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్, ట్యూబల్ బ్లాక్స్, లో ఓవేరియన్ డిఫెక్ట్, గర్భాశయ, ఎండో మెట్రియాసిస్ సమస్య సంతానలేమికి కారణాలుగా నిలుస్తున్నాయి. ఒబెసిటీ, ఒత్తిళ్ల కారణంగా హార్మన్ల అసమతుల్యత, ఆ ఫలితంగా అండం సరైన సమయంలో విడుదల అవ్వకపోవడం జరుగుతుంది. నీటి బుడగలు(పీసీఓడీ), ఇవి కొందరిలో 12, 13 ఏళ్ల వయస్సులోనే వస్తుంటాయి. పెళ్లి అయిన తర్వాత పెరిగిపోయి గర్భధారణ రాకుండా చేస్తాయి. ఈ సమస్య 30 శాతం మందిలో ఉంటుంది. కొందరిలో ట్యూబల్ బ్లాక్స్ ఉంటాయి. ఇవి పుట్టుకతోనే కొందరిలో ఉంటే, మరికొందరిలో సెప్టిక్ అబార్షన్స్, ఇతర ఇన్ఫెక్షన్ల కారణంగా బ్లాక్స్ ఏర్పడతాయి. థైరాయిడ్, పొలాక్టిన్ హార్మన్ల అసమతుల్యతగా చెబుతున్నారు. గర్భాశయంలో లోపాలు ఉన్న వారికి గర్భం వచ్చినా అబార్షన్ అయిపోతుంటుంది. పురుషుల్లో సంతాన సమస్యలు వీర్యం నాణ్యత, శుక్రకణాలు(కౌంట్) తక్కువుగా ఉండడం, వృషణ, వృషణ నాళాలకి సంబంధించిన వ్యాధులు, పురుషుల హార్మోన్ వ్యాధులు, జన్యు సంబంధమైన వ్యాధులు ఎక్కువుగా వస్తున్నాయి. ప్రొఫెషన్లో ఎదుర్కొంటున్న ఒత్తిడి కూడా కారణమే. మద్యం, పొగతాగడం, పొగాకు ఉత్పత్తులు వినియోగించే వారిలో సంతానలేమి సమస్యలు పెరుగుతాయి. ఆలస్య వివాహాలు కారణమే ఇటీవల కాలంలో ఆలస్య వివాహాలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. సంతానలేమి సమస్యకు ఇది కూడా ఒక కారణమే. పురుషులు 30 ఏళ్లలోపు, మహిళలు 25 ఏళ్లలోపు వివాహాలు చేసుకుంటే సంతానానికి సరైన సమయంగా చెప్పవచ్చు. మరికొందరు వివాహమైనా పిల్లల పుట్టకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. కొంతకాలం తర్వాత వారు పిల్లలు కావాలనుకున్నా పుట్టని పరిస్థితి నెలకొంటుంది. అందుకే ఏ వయస్సులో చేయాల్సినవి ఆ వయస్సులో చేయాలని గతంలో పెద్దలు అనేవారు. ఇప్పుడు వైద్యులు కూడా అదే సూచిస్తున్నారు. చింతన వద్దు.. లబ్బీపేట(విజయవాడతూర్పు): సంతనం కలగని వారు చింతించాల్సిన అవసరం లేదని, ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని రిటైర్డ్ వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఆర్ఎస్ రమాదేవి అన్నారు. సంతాన సాఫల్య వైద్య నిపుణుల సమాఖ్య(ఇసార్) ఆధ్వర్యంలో సంతాన సాఫల్యతపై అవగాహన కలిగించేందుకు విజయవాడలో వాక్‌థాన్ ఆదివారం నిర్వహించారు. సిద్ధార్థ ఆడిటోరియం వద్ద ప్రారంభమైన అవగాహన నడక పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, బెంజిసర్కిల్ వరకూ కొనసాగింది. ఈ వాక్‌థాన్‌ను డాక్టర్ ఆర్ఎస్ రమాదేవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సకాలంలో సంతానం కలగలేదని దంపతులు నాటు వైద్యం చేయించుకోవడం మానుకోవాలన్నారు. సంతానం కలగక పోవడానికి గల స్పష్టమైన సమాచారం నిపుణుల వద్ద నుంచి పొంది, తగు పరిష్కారాలను పొందాలన్నారు. సంతాన సాఫల్యం కోసం మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక వైద్య విధానాలు, ఔషధాలు లభిస్తున్నాయన్నారు. సంతాన సాఫల్యతలో నిష్ణాతులైన వైద్యులందరూ కలిసి ఇసార్ పేరుతో ఒక సమైక్య సంఘాన్ని ఏర్పాటు చేసి, రోగులకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పెళ్లయిన దంపతులకు జీవన విధానంలో ఒక అమరిక, తగు ఆహారపు అలవాట్లు, వ్యాయామం తప్పనిసరి అన్నారు. కార్యక్రమంలో ఇసార్ ఏపీ చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ పద్మజ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చందన వీరమాచినేని, డాక్టర్ స్వప్న, డాక్టర్ అనిత తదితరులు పాల్గొన్నారు. కారణం తెలుసుకోవడం ముఖ్యం సంతానలేమితో తమ వద్దకు వచ్చిన దంపతులకు ముందుగా, అందుకు గల కారణాలను తెలుసుకుంటాం. సమస్య భార్యలో ఉందా..భర్తలో ఉందో తెలుసుకుంటాం. సమస్య తలెత్తడానికి గల కారణం తెలుసుకుని దాని పరిష్కారానికి అవసరమైన సూచనలిస్తాం. దీంతో చాలా మంది కొద్దిరోజుల్లోనే గర్భం దాల్చడం జరగుతుంది. మందులతో గర్భధారణ లేని వారికి ఐవీఎఫ్, ఐయూఐ పద్దతులను అనుసరిస్తాం. – డాక్టర్ చందన వీరమాచినేని, ప్రసూతి, సంతాన సాఫల్య నిపుణురాలు -
కాఫీ కావాలా.? కాస్త జాగ్రత్త !
ఒకప్పుడు ఇరానీ చాయ్‌కి కేరాఫ్‌గా ఉన్న సిటీలో ఇప్పుడు కాఫీ ఘుమఘుమలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. కాఫీ డేలు, కాఫీషాప్‌లు అనధికార ఆఫీసులుగా, వినోద కేంద్రాలుగా మారిపోతూ గంటల తరబడి కాలక్షేపాలకు వేదికలవుతున్నాయి. సిటీలో కాఫీ ప్రియత్వం ఇప్పుడు ఓ రేంజ్లో ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఇటీవల వెలుగుచూసిన ఓ పరిశోధన కాఫీ ప్రియులైన యువతులకు పలు హెచ్చరికలు చేస్తోంది. సాక్షి, సిటీబ్యూరో : ఇండియన్ సొసైటీ ఆఫ్ రీ ప్రొడక్షన్ ప్రకారం... జాతీయస్థాయిలో 14శాతం మంది (దాదాపు 2.71 కోట్ల మంది) దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లోని ప్రతి ఆరుగురు జంటల్లో ఓ జంట బాధితులే. జీవనశైలి మార్పులు, ఆరోగ్య పరిస్థితులు, జన్యు పరమైన సమస్యలు వంటివి దీనికి కారణాలుగా వైద్యరంగం పేర్కొంటోంది. ఇదే క్రమంలో మనం ఇష్టంగా తాగే కాఫీ సైతం నట్టింట్లో కేర్ మనే సవ్వడిని దూరం చేస్తుందని తాజాగా వెల్లడైంది. మహిళలపై కాఫీ చూపే వ్యతిరేక ప్రభావాలపై 1988 నుంచే పరిశోధనలు జరుగుతున్నప్పటికీ ఏవీ కూడా నిర్దిష్టంగా దీని ప్రభావాన్ని తేల్చలేకపోయాయి. అయితే తాజాగా భారీ స్థాయిలో వేలాది మంది మహిళల్ని భాగస్తుల్ని చేస్తూ డెన్మార్క్‌లో నిర్వహించిన పరిశోధన మాత్రం వీటికి భిన్నంగా పలు అంశాల్ని వెలుగులోకి తెచ్చింది. చాక్లెట్ కూడా... బెడ్ కాఫీ గొంతులో పడకుండా మంచం దిగని వారెందరో. చాలా మందికి అదొక రోజువారీ వ్యసనం. ఇంతగా అది ఒక అలవాటు స్థాయి నుంచి వ్యసనం స్థాయికి చేరడానికి కాఫీలో ఉండే కెఫైన్ కారణంగా చెబుతారు. పొద్దున్నే కాఫీ తాగే ఈ తరాల నాటి సంప్రదాయానికి అదనంగా ఇప్పుడు నగరవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న కాఫీ షాప్‌లు జతయ్యాయి. అక్కడ గంటల తరబడి కాలక్షేపం చేసే యువత పెద్ద పెద్ద మగ్గుల్లో కాఫీలను తాగడం అత్యంత సహజంగా మారింది. నేరుగా అధిక పరిమాణంలో కెఫైన్‌ను అందించే కాఫీతో పాటు టీ మరికొన్ని ఫ్లేవర్డ్ డ్రింక్స్, కొన్ని రకాల చాక్లెట్స్ కూడా కొద్దో గొప్పో కెఫైన్‌ను కలిగి ఉంటాయి. కెఫైన్.. కేర్‌ఫుల్ పెళ్లికాని యువతులతో పాటు సంతానం కోసం ఎదురుచూసే వివాహితలు కూడా కెఫైన్ పరిమాణం విషయంలో తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. కెఫైన్ సంతాన ప్రక్రియకు అవరోధంగా నిలుస్తుందని, పిండం వృద్ధి చెందకుండా అడ్డుకుంటుందని డెన్మార్క్ పరిశోధన హెచ్చరిస్తోంది. హార్మోన్ల ప్రక్రియను కూడా కెఫైన్ దెబ్బతీస్తోందని స్పష్టం చేసింది. ప్రతిరోజు 300 మి.గ్రా. మించి (అంటే ఒక కప్పునకు మించి అనుకోవచ్చు) కెఫైన్‌ను తీసుకునే మహిళలకు సంతానలేమి అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. అయితే పూర్తిగా దీనికి దూరం కాలేని మహిళలు... రోజుకు 200 మి.గ్రాకు తమ అలవాటును పరిమితం చేయాల్సి ఉంటుంది. – డాక్టర్ రాధికారాణి అక్కినేని,అపోలో ఫెర్టిలిటీ, కొండాపూర్ -
సెల్‌ఫోన్‌తో నిద్రిస్తున్నారా?
కాలిఫోర్నియా : సెల్ఫోన్లను దూరంగా ఉంచకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ హెచ్చరించింది. సెల్ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ కారణంగా క్యాన్సర్, వంధత్వం, మానసిక సమస్యలు వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు హెచ్చుగా ఉన్నట్లు చెప్పింది. మొబైల్ ఫోన్ల ద్వారా పెద్ద మొత్తంలో ఫైళ్లను డౌన్లోడ్ చేస్తున్నా.. స్ట్రీమింగ్(వీడియోలు చూస్తున్నా, ఆడియో వింటున్నా) విడుదల అయ్యే రేడియేషన్ పాళ్లు మామూలు సమయాలతో పోల్చితే అధికంగా ఉంటాయని వివరించింది. ఎక్కువ మంది సెల్‌ఫోన్‌తో నిద్రిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. నిద్రించే సమయాల్లో సెల్‌ఫోన్‌ను రెండు అడుగుల దూరంలో ఉంచడం మంచిదని పేర్కొంది. ఇది ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదని చెప్పింది. చిన్నపిల్లలు రేడియేషన్‌కు ఎక్కువగా ప్రభావితమవుతారని తెలిపింది. పలు పరిశోధనలు సెల్‌ఫోన్ వాడటం వల్ల మెదడు, చెవులలో గడ్డలు ఏర్పడుతున్నాయని పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రైమరీ, మిడిల్ స్కూళ్లలో సెల్ఫోన్ల వినియోగాన్ని ఫ్రాన్స్ గత వారం నిషేధించింది. -
ఆలస్యంగా పెళ్లయితే.. అంతే సంగతి!!
ముంబై: ఏ ముచ్చటైనా జరగాల్సిన సమయంలోనే జరగాలంటారు పెద్దలు. అలా జరగకపోతే అసలుకే ఎసరొస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. అచ్చటా ముచ్చటా జరగాల్సిన సమయంలోనే జరిగితే ఎటువంటి సమస్యలుండవని, ఆలస్యమైతే సంతానలేమి సమస్యతో బాధపడాల్సిందేనని చెబుతున్నారు. ‘హెల్పింగ్ ఫ్యామిలీస్’అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. దేశంలోని తొమ్మిది నగరాల్లో 100 మంది సంతాన సాఫల్య నిపుణులతోపాటు 2,562 మందిని ప్రశ్నించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చింది. శృంగార సామర్థ్యం తక్కువ నుంచి అతి తక్కువగా ఉన్నవారిలో 46 శాతం మంది 31 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకున్నవారేనని తేలింది. వీరిలో 63 శాతం మంది శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తర చూ వైద్యులను సంప్రదిస్తున్నారని సర్వే స్పష్టం చేసింది. వీరిలో ఈ సమస్య తలెత్తడానికి సంతాన సాఫల్య వైద్య నిపుణులు అనే క కారణాలను వెల్లడిస్తున్నారు. జీవన విధానంలో మార్పులు చోటుచేసుకోవడం, మానసిక ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకున్నవారిలో ఇటువంటి సమస్య తలెత్తే అవకాశం మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని చెబుతున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం ద్వారా సదరు యువతీయువకులు మానసిక ఒత్తిడికి గురవడంతోపాటు వ్యసనాలకు బానిసలయ్యే అవకాశముందని, ఇది వారిలో శృంగార సామర్థ్యాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇవేకాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా ఇందుకు కారణం కావొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శృంగారంపట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలు కూడా ఈ సమస్యను మరింత ఎక్కువగా చేస్తున్నాయంటున్నారు.అసలైన వయసులో మూఢవిశ్వాలను నమ్ముతూ శృంగారానికి దూరంగా ఉండడంతో వారిలో సామర్థ్యం తగ్గిపోతోందని, సమయం వచ్చేసరికి మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారని, అవగాహన పెంచుకోవడమే దీనికి పరిష్కారమని చెబుతున్నారు.