వంధ్యత్వం లేదా ఇన్‌ఫెర్టిలిటీ అనేది ప్రపంచాన్ని వేధిస్తున్న సమస్య. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఏడు జంటలలో ఒకరిని ప్రభావితం చేస్తోంది దక్షిణ , మధ్య ఆసియా, సబ్-సహారా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో అత్యధిక ఈ సమస్య కనిపిస్తోంది. పురుషుల్లో వాయు కాలుష్యం, మహిళల్లో రోడ్డు ట్రాఫిక్ శబ్దం కారణంగా వంధ్యత్యం వేధిస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. నార్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు బీఎంజే జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి.
డెన్మార్క్‌లోని నోర్డ్ అధ్యయనం ప్రకారం దీర్ఘకాలం పాటు ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (PM 2.5) వాయు కాలుష్యాన్ని గురైన పురుషుల్లో సంతాన లేమి ఏర్పడే ముప్పు అధికంగా ఉందని పేర్కొంది. పీఎం 2.5 పురుషులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. దీనికి ఎక్కువ ఎక్స్‌పోజ్ కావడంతో పురుషులలో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదేవిధంగా, శబ్ద కాలుష్యం మహిళల్లో అధిక వంధ్యత్వానికి దారితీస్తోంది. సగటు కంటే 10.2 డెసిబుల్స్ ఎక్కువగా ఉండే రోడ్డు ట్రాఫిక్ శబ్దం 35 ఏళ్లు పైబడిన మహిళల్లో వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనం కనుగొంది. 2000-2017 మధ్య డెన్మార్క్‌లో 30-45 ఏళ్ల వయసున్న 5,26,056 మందిపై నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. పీఎం 2.5కి ఐదేళ్లకు పైన గురైన 30-45 ఏళ్ల వయసున్న వారిలో వంధ్యత్య ముప్పు 24 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనం వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment