నేడు ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం.ఈ సందర్భంగా ఎన్నో జంటలను వేధించే వంధ్యత్వ సమస్య గురించి తెలుసుకుందాం. వంధ్యత్వం అనేది పిల్లలు కనలేని స్థితి. కొన్ని జంటలు ఈ సమస్య కారణంగా శారీరకంగా మానసికంగా చాలా క్షోభని అనుభవిస్తారు. ఈ సమస్య ఎందువల్ల వస్తుంది. దీని నుంచి ఎలా బయపడొచ్చో చూద్దాం.
నిజానికి నూటికి 50 శాతం జంటలు ఈ సమస్యను అనుభవిస్తున్నావారే. దీనికి ఇద్దరిలో ఒకరి వల్ల కావచ్చు లేదా ఇద్దరిలోనూ సమస్య ఉండవచ్చు. ముందుగా మగవారిలో ఎందుకు ఈ సమస్య వస్తుందో చూద్దాం.
మగవారిలో ఈ సమస్య ఎలా తలెత్తుతుందంటే..
- వారిలో స్పెర్మ కౌంట్ సరిగా లేకపోవడం.
- వృషణాలలో సమస్య
- గవదబిళ్లలు వంటి ఇన్ఫెక్షన్లు
- అకాల స్ఖలనం
- సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి జన్యుపరమైన రుగ్మత
- పునరుత్పత్త అవయవాలకుగాయలు
- ఎక్కువగా ఆవిరి పట్టడం, వేడి నీటి స్నానాలు కారణంగా స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం ఏర్పడుతుంది
- స్మోకింగ్, మద్యపానం, డ్రగ్స్ వంటివి వాడినా
- క్యాన్సర్‌కి సంబంధించిన చికిత్స రేడియోషన్ లేదా కీమోథెరఫీ వంటి వాటివల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది.
ఇక స్త్రీలలో ఎలా ఎదురవుతందంటే..
- పీసీఓఎస్, హైపర్‌ప్రోలాక్టినిమియా లేదా హైపోథైరాయిడిజం వంటి హార్మోన్ల అసమతుల్యత
- గర్భాశయ అసాధారణతలు, గర్భాశయ పాలిప్స్, ఫైబ్రాయిడ్లు తదితర కారణాలు
- ఫెలోపియన్ ట్యూబ్ దెబ్బతినడం, అండాలు ప్రయాణానికి ఆటంకం కలిగంచే సంశ్లేషణలు
- ఎండోమెట్రియోసిస్, టర్నర్ సిండ్రోమ్, పెల్విక్ సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు సంతానోత్సత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ఇగ మగవారిలోనూ, స్త్రీలలోనూ కామన్‌గా ఎదురయ్యే సమస్యలు
⇒30వ దశకం దాటిని స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది
⇒అలాగే పురుషులలో 40 ఏళ్లు పైబడిన వారికి సంతాన సామర్థ్యం తగ్గుతుంది
⇒పురుషులకు మద్యం, సిగరెట్ తాగే అలవాటు ఉంటే గర్భస్రావం అయ్యే సమస్య ఎక్కువగా ఉంటుంది.
⇒ఇద్దరిలో ఎవరు అధిక బరువు ఉన్నా ఈ సమస్య ఎదురవుతుంది.
ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం స్త్రీ, పురుషులకు దీనిపై అవగాహన కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతోనే దీన్ని జరుపుకుంటున్నాం. ఒకవేళ్ల ఇరువురికి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగి ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఒక చక్కని మార్గంలా ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా జంటలు ఒకరినొకరు నిందించుకోకుండా సమస్యను సానుకూల దృష్టితో చూసే అవకాశం, అవగాహన ఏర్పడుతుంది. ఇక చక్కటి కుటుంబం కోసం ఆరాటపడే జంటలు పైన చెప్పిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టడమేగాక ఆనందమయ జీవితాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.
(చదవండి: ప్రెగ్నెంట్‌గా ఉండగానే..మరోసారి ప్రెగ్నెంట్ కాగాలరా?.. ఇది సాధ్యమేనా!)
Comments
Please login to add a commentAdd a comment