ఖిల్లాఘనపురం: పోషణభారంగా భావించిన ఓ తల్లి ముక్కుపచ్చలారని కూతురును అంగట్లో విక్రయించేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండలంలో చోటుచేసుకుంది. తిర్మలాయపల్లి పంచాయతీ రోడ్డు మీది తండాకు చెందిన రాత్లావత్ దేవుజా, మణి దంపతులకు కూతురు ఉంది. రెండోకాన్పులో మణికి కవల ఆడపిల్లలు పుట్టారు. ముగ్గురు కూతుళ్ల పోషణభారంగా భావించి ఓ పాపను విక్రయించేందుకు సిద్ధపడింది. తల్లి జమ్మాతో కలసి ఘనపురం బస్టాండ్‌కు వచ్చి కొందరిని కలిసి తన కూతురును అమ్ముతానని చెప్పింది. ఎవరూ ముందుకురాకపోవడంతో కనీసం డబ్బులు ఇవ్వకుండనైనా తీసుకోండి..! అంటూ బతిమాలింది. ఈ విషయాన్ని స్థానికులు కొందరు పోలీసులకు చెప్పడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చి ఆమెను ఇంటికి పంపించారు.
కూతురును విక్రయానికి ఉంచిన తల్లి
Published Fri, Feb 13 2015 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement
Advertisement