
తల్లికి తన పిల్లలే సర్వస్వం అని అంటారు. తనకు పుట్టిన బిడ్డను తొలిసారి ఎత్తుకున్నప్పుడు ఆ తల్లి లోకాన్ని జయించినంతగా మురిసిపోతుంది. అయితే ఢిల్లీకి చెందిన ఆషితా చందక్(38) కథ దీనికి భిన్నమైనది. దీనిని విన్నవారంతా కంటతడి పెడుతున్నారు. ఆషితా చందక్ కొద్ది రోజుల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. ఇందుకోసం ఆమె ఆతృతగా ఎదురుచూస్తోంది. బిడ్డను కని, ఎప్పుడెప్పుడు ఒడిలోకి తీసుకుంటానా అని ఆమె ఎదురుచూసింది. అయితే ఎనిమిదినెలల గర్భవతి అయిన ఆషితా విషయంలో విధి కన్నెర్రజేసింది. తన బిడ్డను చూసుకోకుండానే ఆమె ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించింది. ఆషితా కుటుంబ సభ్యులు ఆమె ఇంతలోనే తమకు దూరమవుతుందనే విషయాన్ని నమ్మలేకున్నారు.
ఆషితా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో కస్టమర్ సపోర్ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. పెళ్లయిన ఎనిమిదేళ్త తరువాత ఆమె గర్భం దాల్చింది. ఫిబ్రవరి 7న ఆషిత ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆషిత 8 నెలల గర్భవతి. కొన్ని వారాల్లో ఒక బిడ్డకు జన్మనివ్వనుంది. అయితే ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనందున వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. దీంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే శిశువును వెంటిలేటర్ సపోర్ట్‌తో ఐసీయీలో ఉంచి చికిత్ప అందించారు. ఫిబ్రవరి 13న ఆషితా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు.
ఆషితా కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఆషితా భర్త రాజుల్ రామ్‌పాట్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. మెదడు పూర్తిగా పనిచేయడం మానేసిన బాధితుడు లేదా బాధితురాలిని వైద్యులు బ్రెయిన్ డెడ్ గా ప్రకటిస్తారు. అటువంటి స్థితిలో మెదడులో ఎటువంటి చురుకుదనం ఉండదు. దేనినైనా అర్థం చేసుకునే సామర్థ్యం, శరీరానికి సంకేతాలను పంపే సామర్థ్యం పూర్తిగా పోతుంది. వైద్యులు ఎవరినైనా బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారంటే వారు దాదాపు చనిపోయారని అర్థం.
ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా..
Comments
Please login to add a commentAdd a comment