బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కుటుంబం పెద్దదైంది. యస్.. మీ గెస్ నిజమే. నీల్ తండ్రి అయ్యారు. గత ఏడాది రుక్మిణి మాథుర్‌ని నీల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రుక్ష్మిణి ఓ పాపకు జన్మనిచ్చారు. ‘‘మొత్తం ముఖేష్ ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉన్నాం. దేవుడి దయ వల్ల తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. మా డార్లింగ్ డాటర్‌కి నుర్వీ నీల్ ముఖేష్ అని నామకరణం చేశాం’’ అని నీల్ పేర్కొన్నారు. ఇక ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... సౌత్‌లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోన్న మరో సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. అటు నార్త్‌లో నీల్ హీరోగా ‘బైపాస్ రోడ్’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో టాలీవుడ్ ‘హార్ట్‌ఎటాక్’ గాళ్ అదా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. నీల్ బ్రదర్ నామాన్ నీల్ నితిన్ ముఖేష్ ఈ సినిమాకు దర్శకుడు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment