
బాలీవుడ్ ప్రముఖ నటి మసాబా గుప్తా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈనెల 11న మొదటి బిడ్డకు స్వాగతం పలికింది. ఈ విషయాన్ని మసాబా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సత్యదీప్ మిశ్రాను పెళ్లాడిన మసాబాకు ఇటీవలే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా ఈ జంటకు ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. రిచా చద్దా, శిల్పాశెట్టి, సమీరా రెడ్డి, బిపాసా బసు అభినందనలు తెలిపారు.
మసాబా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మాకు చాలా ప్రత్యేకమైన రోజు. చిన్న అమ్మాయి మా జీవితంలోకి 11.10.2024న అడుగుపెట్టింది' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. మసాబా గుప్తా నటిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్ 18న మసాబా గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన భర్త సత్యదీప్‌తో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది.
ఎవరీ మసాబా గుప్తా..
కాగా ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా కూతురే మసాబా గుప్తా. ఈమె గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా సిరీస్‌లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment