అణ్వాయుధ దాడికి పుతిన్‌ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన | Putin Ordered Deployment of world deadliest Nuclear Missile Satan ii on Ukraine | Sakshi
Sakshi News home page

అణ్వాయుధ దాడికి పుతిన్‌ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన

Published Thu, Nov 28 2024 12:52 PM | Last Updated on Thu, Nov 28 2024 3:20 PM

Putin Ordered Deployment of world deadliest Nuclear Missile Satan ii on Ukraine

మాస్కో: ప్రపంచమంతా ఎంతగానో భయపడుతున్నట్లే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణు క్షిపణి సాతాన్-2ను ఉక్రెయిన్‌పై ప్రయోగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.

ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు అందించడం గురించి పశ్చిమ దేశాలు యోచిస్తున్న సమయంలో పుతిన్ నుంచి ఈ  ఆదేశాలు వెలువడటం గమనార్హం. రష్యాలో రూపొందిన సాతాన్‌-2 క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు క్షిపణి. దీనికి ఏకకాలంలో డజన్ల కొద్దీ అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఈ అణు క్షిపణి బరువు 208.1 టన్నులు. ఇది 10 టన్నుల వరకు పేలోడ్‌ను మోయగలదు. దీని స్ట్రైక్ రేంజ్ 35 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా ఈ క్షిపణి ఎంత ప్రమాదకరమో ఇట్టే ఊహించుకోవచ్చు.

రష్యా ఇప్పుడు ఈ క్షిపణికి ఆర్‌ఎస్‌-28 సర్మత్ అనే పేరు పెట్టింది. ప్రపంచదేశాలు దీనిని సాతాన్-2 పేరుతో పిలుస్తున్నాయి. దీనిని రష్యా విజయవంతంగా పరీక్షించిన తర్వాత, 2023లో దీనిని సైన్యంలో చేర్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఈ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు.

ఇది కూడా చదవండి: నైజీరియన్‌ యువతులతో వ్యభిచారం 9 మంది అరెస్ట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement