Nuclear missiles
-
అణ్వాయుధ దాడికి పుతిన్ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన
మాస్కో: ప్రపంచమంతా ఎంతగానో భయపడుతున్నట్లే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణు క్షిపణి సాతాన్-2ను ఉక్రెయిన్‌పై ప్రయోగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు అందించడం గురించి పశ్చిమ దేశాలు యోచిస్తున్న సమయంలో పుతిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం. రష్యాలో రూపొందిన సాతాన్-2 క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు క్షిపణి. దీనికి ఏకకాలంలో డజన్ల కొద్దీ అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఈ అణు క్షిపణి బరువు 208.1 టన్నులు. ఇది 10 టన్నుల వరకు పేలోడ్‌ను మోయగలదు. దీని స్ట్రైక్ రేంజ్ 35 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా ఈ క్షిపణి ఎంత ప్రమాదకరమో ఇట్టే ఊహించుకోవచ్చు.రష్యా ఇప్పుడు ఈ క్షిపణికి ఆర్ఎస్-28 సర్మత్ అనే పేరు పెట్టింది. ప్రపంచదేశాలు దీనిని సాతాన్-2 పేరుతో పిలుస్తున్నాయి. దీనిని రష్యా విజయవంతంగా పరీక్షించిన తర్వాత, 2023లో దీనిని సైన్యంలో చేర్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఈ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు.ఇది కూడా చదవండి: నైజీరియన్ యువతులతో వ్యభిచారం 9 మంది అరెస్ట్ -
అణు క్షిపణులతో ఉత్తరకొరియా పరేడ్
సియోల్: ఉత్తరకొరియా శక్తివంతమైన అణు క్షిపణులను ప్రదర్శించింది. గురువారం సాయంత్రం రాజధాని ప్యాంగ్యాంగ్లో జరిగిన సైనిక పరేడ్‌లో రష్యా, చైనా ప్రతినిధులతో కలిసి అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ వీటిని తిలకించారు. 1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉత్తరకొరియా పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, రష్యాతో బంధం మరింత బలోపేతమైందని చాటేందుకే కిమ్ పరేడ్‌ను వేదికగా మార్చుకున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తరకొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తాత పేరుతో ప్యాంగాంగ్‌లో ఉన్న కిమ్–2 సంగ్ స్వే్కర్లో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి లి హొంగ్జోంగ్లతో కలిసి ప్రదర్శనను కిమ్ వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. సైనిక కవాతు మధ్య యుద్ధ ట్యాంకులు, భారీ ఖండాంతర క్షిపణు(ఐసీబీఎం)లతో కూడిన ట్రక్కులు కదులుతుండగా ముగ్గురూ చేతులు ఊపుతున్న ఫొటోలను అధికార వార్తాసంస్థ కేసీఎన్ఏ శుక్రవారం విడుదల చేసింది. కిమ్ ప్రసంగించిందీ లేనిదీ వెల్లడించలేదు. క్షిపణి వ్యవస్థలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన నిఘా, అటాక్ డ్రోన్లను కూడా ప్రదర్శించారు. ఈ ఐసీబీఎంలన్నీ రష్యా డిజైన్ల ఆధారంగా తయారైనవేనని విశ్లేషకులు అంటున్నారు. -
మిస్సైల్ విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. శత్రుదేశాల ఖండాంతర క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని తుత్తునియలు చేయగల కొత్తరకం క్షిపణి ఎండో–అట్మాస్ఫెరిక్ ఇంటర్‌సెప్టర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని యుద్ధ నౌక నుంచి శనివారం డీఆర్డీవో (రక్షణ పరిశోధన పరిశోధన సంస్థ), నావికా దళం ఈ పరీక్ష నిర్వహించాయి. శత్రు దేశాల క్షిపణిని మధ్యలోనే అడ్డుకుని, ధ్వంసం చేయగలిగే సరికొత్త బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) సాంకేతికతను సొంతం చేసుకున్న దేశాల సరసన భారత్ నిలిచిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలో పాలుపంచుకున్న డీఆర్డీవో, నేవీ, రక్షణ పరిశ్రమల ప్రతినిధులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. -
Sakshi Cartoon: బైడెన్‌కు ఉత్తర కొరియా క్షిపణి భయం
బైడెన్‌కు ఉత్తర కొరియా క్షిపణి భయం -
ఆంక్షలున్నా ఆగని ఉత్తరకొరియా
న్యూయార్క్: ఉత్తరకొరియా తన అణ్వాయుధ క్షిపణి పరీక్షా కార్యక్రమాలను కొనసాగిస్తూనేఉందని ఐరాస నిపుణులు ఒక నివేదికలో వెల్లడించారు. తాజాగా అణ్వాయుధాలకు అవసరమైన సామగ్రిని కూడా ఉత్తరకొరియా సంపాదించిందని తెలిపారు. దీంతో ఆ దేశం క్షిపణి పరీక్షలను వేగవంతం చేసిందని, జనవరిలో పలు పరీక్షలు జరిపిందని నివేదిక తెలిపింది. అణ్వస్త్రాలకు అవసరమైన సాంకేతికతను సైబర్ మార్గంలో సంపాదిస్తోందని తెలిపింది. ఇందుకు కావాల్సిన ఆర్థిక సంపత్తిని సైబర్అటాక్స్తో సంపాదిస్తోందని వెల్లడించింది. -
మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!
న్యూయార్క్: ఇప్పటి వరకు దేశాల మధ్య పారిశ్రామిక ఒప్పందం, అణ్యాయుధాల ఒప్పందం, సరిహద్దుల ఒప్పందం విఫలం కావడం వంటి కారణాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందేమోనని దేశాధి నేతలు భయపడుతున్నారు. పరిస్థితి మరీ దిగజారకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సంప్రదింపులు, చర్చలు జరిపి పరిస్థితిని అదుపు చేసేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది గ్రహాంతరవాసులతోటే అంటున్నారు యూఎస్ మిలటరీ ఆఫీసర్ రాబర్ట్ సలాస్ అంటున్నారు. (చదవండి: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్) ఇంతకీ అసలు విషయం ఏమిటంటే గ్రహాంతరవాసులు అణు క్షిపణులను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు తాను గుర్తించానని సలాస్ అంటున్నారు. ఈ మేరకు గ్రహాంతరవాసులు వేరోక గ్రహం నుంచి వచ్చి అణు లక్ష్యాల వద్ద ఆయుధ వ్యవస్థలను తారుమారు చేసి, వాటిని నిలిపివేసినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో అవి కొన్ని క్షిపణులను యాక్టివేట్ చేయడం మొదలు పెట్టడమే కాకా దాదాపు పది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు నిర్విర్యం చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ విషయానికి సంబంధించి నలుగురు యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు త్వరలో పత్రాలను విడుదల చేస్తారని కూడా సలాస్ అన్నారు. సలాస్ యూఎస్ ఆధునిక విధ్వంసక అణు క్షిపణి కార్యక్రమంగా పేరుగాంచిన టైటాన్ 3 ప్రోగ్రామ్‌లో ఎయిర్ ఫోర్స్ క్షిపణి ప్రొపల్షన్ ఇంజనీర్‌గానూ, యూఎస్ వెపన్ కంట్రోలర్‌గానూ పనిచేస్తున్నాడు. అంతేకాదు 1971నుంచి 1973 వరకు స్పేస్ షటిల్ డిజైన్ ప్రతిపాదనలకు సంబంధించిన మార్టిన్-మారిటా ఏరోస్పేస్, రాక్వెల్ ఇంటర్నేషనల్ సంస్థలకు అత్యంత విశ్వసనీయత కలిగిన ఇంజనీర్‌గా కూడా సేవలందించాడు. (చదవండి: ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) -
అణు క్షిపణిని పరీక్షించిన పాక్
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత భారతదేశంపై కయ్యానికి కాలు దువ్వుతున్న దాయాది దేశం పాకిస్తాన్ తాజాగా అణు బాలిస్టిక్ క్షిపణి ‘ఘజ్నవి’ని విజయవంతంగా పరీక్షించింది. ఇప్పటికే కరాచీలోని మూడు గగనతల మార్గాలను మూసివేసి, నిత్యం భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతున్న పాక్ ఇప్పుడు ఏకంగా అణు క్షిపణిని పరీక్షించడం గమనార్హం. అణు వార్హెడ్లను (అత్యధిక తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లే సామర్థ్యమున్న ఈ క్షిపణి 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని ఆర్మీ తెలిపింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే దీనిద్వారా భారత దేశంలోని కొంత భూభాగాన్ని సైతం లక్ష్యంగా చేసుకోవచ్చు. స్కడ్ టైప్ బాలిస్టిక్ మిస్సైల్‌ను అభివృద్ధి చేసి ఘజ్నవిని రూపొందించినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఘజ్నవి వీడియోను పాకిస్తాన్ మిలిటరీ మీడియా అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ గురువారం ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తల బృందాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ, ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అభినందించారని అసిఫ్ గఫూర్ తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ‘నాజర్’, మే నెలలో ‘షహీన్–2’ అనే బాలిస్టిక్ మిస్సైళ్లను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం నిర్వీర్యం చేయడంపై పాకిస్తాన్ భగ్గుమంటోంది. కశ్మీర్‌పై ఎంతదాకా అయినా వెళ్తామని, అణు యుద్ధానికైనా సిద్ధమని పాక్ ప్రధాని ఇమ్రాన్ గతంలోనే చెప్పారు. ఈ అణు క్షిపణి లక్ష్య పరిధి: 290 కి.మీ. బరువు: 5,256 కేజీలు పొడవు: 9.64 మీటర్లు చుట్టుకొలత: 88 సె.మీ వార్‌హెడ్: అణ్వాయుధం -
‘అమెరికాను మించిన ఆయుధాలున్నాయి’
వాషింగ్టన్: అణు క్షిపణులు సహా అత్యంత శక్తిమంతమైన, అజేయమైన ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ ఆయుధాల ముందు అమెరికా ఆయుధ సంపత్తి దిగదుడుపేనని పేర్కొన్నారు. వార్షిక స్టేట్ ఆఫ్ ద నేషన్ ప్రసంగంలో పుతిన్ మాట్లాడారు. ఆయుధాలకు సంబంధించిన కొన్ని ప్రతీకాత్మక వీడియోలనూ ఆయన చూపించారు. వీడియోల్లో ఆయుధాలు అమెరికా వైపునకు గురిపెట్టినట్లుగా ఉన్నాయి. శత్రు దేశాల రక్షణ వ్యవస్థలు తమ ఆయుధాలను గుర్తించేలోపే అవి విధ్వంసం సృష్టిస్తాయని పుతిన్ చెప్పారు. కాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా మండిపడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఒప్పందాలను ఉల్లంఘించి రష్యా శక్తిమంతమైన ఆయుధాలను తయారుచేస్తోందని ఆరోపించింది. ఈ విషయాన్ని తాము ఎప్పటినుంచో చెబుతున్నా రష్యా తోసిపుచ్చిందనీ, కానీ ఇప్పుడు ఆ దేశాధ్యక్షుడే స్వయంగా ఆ విషయం బయటపెట్టారని అమెరికా పేర్కొంది. -
కొరియా అణ్వాయుధ క్షిపణి.. అమెరికాలో వణుకు!
వాషింగ్టన్: ఉత్తర కొరియా అణ్వాయుధ క్షిపణి సామర్థ్యం అమెరికాను ఆందోళన పరుస్తోంది. కొన్ని నెల్లలోనే అమెరికాపై దాడి చేయగల అణ్వాయుధ క్షిపణి సామర్థ్యం ఉత్తర కొరియా సొంతంకాబోతుండటంతో తీవ్ర కలవరం రేపుతోందని ఆ దేశ కేంద్ర నిఘా ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ మైక్ పాంపియో తెలిపారు. సీఏఐ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆయన తాజాగా బీబీసీతో మాట్లాడారు. ఉ. కొరియా నుంచి, ముఖ్యంగా కిమ్ జాంగ్ ఉన్ నుంచి పొంచి ఉన్న ముప్పు గురించి తాము నిరంతరం చర్చిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. కొన్ని నెలల్లోనే అమెరికాను ఢీకొట్టే అణ్వాయుధ క్షిపణి సామర్థ్యం కొరియా సొంతం కాబోతున్న అంశంపై ప్రధానంగా తమ మంతనాలు సాగుతున్నాయని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడికి కొన్ని ప్రత్యామ్నాయాలు సూచించే కర్తవ్యం తమపై ఉందని, దౌత్యేతర మార్గాల్లో ఈ ప్రత్యామాయాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఉత్తర కొరియాపై బలప్రయోగం వల్ల ఈ ప్రాంతంలో పెద్దస్థాయిలో ప్రాణనష్టం జరిగే అవకాశముందన్న విషయాన్ని తాము గుర్తించామని చెప్పారు. ఈ ప్రాంతంలో అమెరికాకు మిత్రపక్షాలైన దక్షిణ కొరియా, జపాన్ ఉండటంతో బలప్రయోగంతో ఇక్కడ తలెత్తబోయే పరిణామాలను తమ దృష్టిలో ఉన్నాయని, కిమ్‌ను తొలగించడం లేదా అమెరికాపై దాడి చేయగల అణ్వాయుధ సామర్థ్యాన్ని పరిమితం చేయడం వంటివాటిపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే.. ఉ.కొరియా అధినేత కిమ్‌తో మాటల యుద్ధానికి దిగిన సంగతి తెలిసిందే. తన అణ్వాయుధ ఆశయాలను కిమ్ పరిమితం చేసుకోకపోతే పెను పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
‘నా టేబుల్ మీదా.. బటన్ ఉంది’
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తర కొరియా మీద విరుచుకుపడ్డారు. ‘కిమ్ నీ టేబుల్ మీద ఉండే న్యూక్లియర్ బటన్ కన్నా పెద్దది, అంతకన్నా చాలా శక్తివంతమైన న్యూక్లియర్ బటన్ నా టేబుల్ మీద ఉంది’ అది గుర్తుంచుకో అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన నాటి నుంచి ఇరు దేశాల మధ్య మాటలయుద్ధం పతాక స్థాయికి చేరింది. అదే సమయంలో ఉత్తర కొరియా వరుస అణ్వస్త్ర పరీక్షలతో ప్రపంచాన్ని కంగారు పెట్టింది. ట్రంప్ ట్వీట్ వెలువడిన కొద్ది గంటల్లోనే.. అత్యంత శక్తివంతమైన ఖండాంతర క్షిపణిని (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్) రూపొందించాలని సైంటిస్టులకు కిమ్ ఆదేశాలు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఉత్తర కొరియా గత ఏడాది అణుబాంబులతోపాటు హైడ్రోన్ బాంబును కూడా పరీక్షించింది. అమెరికా, దాని మిత్ర దేశాలు తమను భయపెడుతూ సైనిక విన్యాసాలు నిర్వహించినంత కాలం అణు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఇదిలావుండగా.. కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ కిమ్ జాంగ్ ఉన్.. అమెరికాను తీవ్ర స్థాయిలో హెచ్చరించిన విషయం తెలిసిందే. తన టేబుల్ మీద ఎప్పుడూ ఒక బటన్ ఉంటుంది.. దానిని నొక్కితే అమెరికా బుగ్గిపాలే అంటూ హెచ్చరికలు జారీ చేశారు. North Korean Leader Kim Jong Un just stated that the “Nuclear Button is on his desk at all times.” Will someone from his depleted and food starved regime please inform him that I too have a Nuclear Button, but it is a much bigger & more powerful one than his, and my Button works! — Donald J. Trump (@realDonaldTrump) January 3, 2018 -
పాకిస్తాన్‌పై భారత్ సాయం కావాలి: ట్రంప్
వాషింగ్టన్: పూర్తి స్థాయి న్యూక్లియర్ వ్యవస్థ లేని పాకిస్థాన్ సమస్య గురించి ఇండియా తదితర దేశాల సాయాన్ని కోరుతున్నట్లు అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ ఫ్రంట్ రన్నర్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇండియానా పోలీస్‌లోని టౌన్‌హాల్ లో మాట్లాడుతూ... పాకిస్తాన్ వంటి దేశాలతో ఎలా డీల్ చేస్తారనే ప్రశ్న అడగ్గా ట్రంప్ ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కు న్యూక్లియర్ ఆయుధాలు ఉండటమే నిజమైన సమస్య అని ఆయన అన్నారు. మొత్తం తొమ్మిది దేశాలు న్యూక్లియర్ ఆయుధాలను కలిగి ఉన్నాయి. ఇది ఒకే ఒక్క పెద్ద సమస్య అని అన్నారు. పాకిస్తాన్‌తో కొద్దిపాటి సత్సంబంధాలు ఉన్నాయి. తాను వాటిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. పాకిస్తాన్‌కు అమెరికా చాలాసార్లు ఆర్ధికంగా సాయం చేసింది. ఆ దేశ ప్రవర్తన మీద తర్వాతి పరిణామాలు, విపరిణామాలు ఆధారపడి ఉంటాయని అన్నారు. భారత్, మరికొన్ని దేశాలు అమెరికాకు సాయం చేస్తున్నాయి. ఇప్పటివరకు అమెరికా చాలా దేశాల నుంచి ఎలాంటి ఫలితాలను ఆశించకుండా సాయం చేసిందని, ఇక ముందు అలా జరగదని ట్రంప్ పేర్కొన్నారు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఒబామా ప్రభుత్వం బిలియన్ డాలర్ల కొద్దీ పాక్‌కు సాయం చేయడాన్నిఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్‌కు 9/11 దాడుల తర్వాత నుంచి ఇప్పటివరకు చేసిన 25 బిలియన్ డాలర్ల సాయాన్ని ఆ దేశం తన మిలటరీ సారథ్యంలో నడుస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఊపిరి ఊది భారత్‌లో ప్రాణాంతక దాడులు చేసిందని అమెరికన్ కాంగ్రెస్‌కు చెందిన నేత మ్యాట్ సల్మాన్ వాదించారు. 180 మిలియన్ల జనాభా, 100కు పైగా న్యూక్లియర్ ఆయుధాలు, రాజకీయంగా వెనుకబడి టెర్రరిస్టులకు ఆవాసంగా మారిన పాకిస్తాన్ 2016-2017 సంవత్సరానికిగాను 742.2 మిలియన్ల యూఎస్ డాలర్ల సాయాన్ని కోరినట్టు, ఇవన్నీ దేశ భద్రతకే ఉపయోగపడాలని భారత్‌తో యుధ్దానికి కాదని మరో కాంగ్రెస్ నేత బ్రాడ్ షేర్మ్యాన్ చెప్పారు. -
సాగర గర్భం నుంచి అణ్వస్త్రం
దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతం మూడు రకాలుగా అణ్వస్త్ర క్షిపణుల ప్రయోగంలో అగ్రదేశాల సరసన భారత్ గగనతలం, ఉపరితలం నుంచే కాకుండా.. సముద్రగర్భం నుంచి సైతం దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించగల సత్తాను భారత్ సాధించింది. జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల దీర్ఘశ్రేణి ‘సబ్‌మెరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్(ఎస్ఎల్బీఎం)’ను సోమవారం బంగాళాఖాతంలో విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. సముద్రంలో నీటి లోపలి నుంచి జలాంతర్గామి ద్వారా బీవో5 అణ్వస్త్ర క్షిపణిని రక్షణ శాఖ ఇదివరకే విజయవంతంగా పరీక్షించినప్పటికీ.. దాని లక్ష్య పరిధి 700 కి.మీ. మాత్రమే. తాజాగా పరీక్షించిన క్షిపణి పరిధి 2 వేల కిలోమీటర్లు. నీటి లోపలి నుంచి ప్రయోగించేలా భారత్ రూపొందించినవాటిలో ఇదే అత్యధిక పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి కావడం విశేషం.దీంతో గగన, భూతలాలతోపాటు సముద్రగర్భం నుంచి సైతం దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యంలో అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి అతికొద్ది దేశాల సరసన భారత్ కూడా నిలిచింది. ఈ ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన రక్షణ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అభినందించారు. డీఆర్డీవో అభివృద్ధిపరుస్తున్న ఎస్ఎల్బీఎం క్షిపణులను ఐఎన్ఎస్ అరిహంత్ జలాంతర్గామితో సహా ఇతర వేదికలపై మోహరించనున్నారు.