వాషింగ్టన్: అణు క్షిపణులు సహా అత్యంత శక్తిమంతమైన, అజేయమైన ఆయుధాలు తమ వద్ద ఉన్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. తమ ఆయుధాల ముందు అమెరికా ఆయుధ సంపత్తి దిగదుడుపేనని పేర్కొన్నారు. వార్షిక స్టేట్ ఆఫ్ ద నేషన్ ప్రసంగంలో పుతిన్ మాట్లాడారు. ఆయుధాలకు సంబంధించిన కొన్ని ప్రతీకాత్మక వీడియోలనూ ఆయన చూపించారు.
వీడియోల్లో ఆయుధాలు అమెరికా వైపునకు గురిపెట్టినట్లుగా ఉన్నాయి. శత్రు దేశాల రక్షణ వ్యవస్థలు తమ ఆయుధాలను గుర్తించేలోపే అవి విధ్వంసం సృష్టిస్తాయని పుతిన్ చెప్పారు. కాగా, పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా మండిపడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఒప్పందాలను ఉల్లంఘించి రష్యా శక్తిమంతమైన ఆయుధాలను తయారుచేస్తోందని ఆరోపించింది. ఈ విషయాన్ని తాము ఎప్పటినుంచో చెబుతున్నా రష్యా తోసిపుచ్చిందనీ, కానీ ఇప్పుడు ఆ దేశాధ్యక్షుడే స్వయంగా ఆ విషయం బయటపెట్టారని అమెరికా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment