ordered
-
అణ్వాయుధ దాడికి పుతిన్ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన
మాస్కో: ప్రపంచమంతా ఎంతగానో భయపడుతున్నట్లే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణు క్షిపణి సాతాన్-2ను ఉక్రెయిన్‌పై ప్రయోగించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి.ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు అందించడం గురించి పశ్చిమ దేశాలు యోచిస్తున్న సమయంలో పుతిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడటం గమనార్హం. రష్యాలో రూపొందిన సాతాన్-2 క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు క్షిపణి. దీనికి ఏకకాలంలో డజన్ల కొద్దీ అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఈ అణు క్షిపణి బరువు 208.1 టన్నులు. ఇది 10 టన్నుల వరకు పేలోడ్‌ను మోయగలదు. దీని స్ట్రైక్ రేంజ్ 35 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా ఈ క్షిపణి ఎంత ప్రమాదకరమో ఇట్టే ఊహించుకోవచ్చు.రష్యా ఇప్పుడు ఈ క్షిపణికి ఆర్ఎస్-28 సర్మత్ అనే పేరు పెట్టింది. ప్రపంచదేశాలు దీనిని సాతాన్-2 పేరుతో పిలుస్తున్నాయి. దీనిని రష్యా విజయవంతంగా పరీక్షించిన తర్వాత, 2023లో దీనిని సైన్యంలో చేర్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఈ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణిని ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేశారు.ఇది కూడా చదవండి: నైజీరియన్ యువతులతో వ్యభిచారం 9 మంది అరెస్ట్ -
మహిళా రెజ్లర్లకు భద్రత కల్పించండి: కోర్టు
న్యూఢిల్లీ: ముప్పున్న మహిళా రెజ్లర్లకు భద్రతను ఉపసంహరించడం తగదని పేర్కొన్న కోర్టు తక్షణమే భద్రత కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ముగ్గురు రెజ్లర్లు గతంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఇదివరకే ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు.కేసు విచారణలో ఉంది. కాగా... కేంద్రంలో అధికారపక్షం నేత అయిన బ్రిజ్‌భూషణ్ నుంచి హాని ఉంటుందని గతంలో ఆ ముగ్గురు రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. కానీ ఇప్పుడు ఉన్నపళంగా పోలీసు భద్రతను ఉపసంహరించడం ఏంటని అడిషనల్ చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పుత్ ఢిల్లీ పోలీసులను తలంటారు.వెంటనే భద్రతను పునరుద్ధరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. రెజ్లర్ల భద్రతపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ‘ఎక్స్’ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్రిజ్‌భూషణ్‌పై పోరాడుతున్న రెజ్లర్లకు భద్రతను తొలగించారని వినేశ్ పోస్ట్ చేసింది. -
యూపీలో నేడు 'నో నాన్ వెజ్ డే'.. యోగీ సర్కార్ ప్రకటన
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నవంబర్ 25ని "నో నాన్ వెజ్ డే"గా ప్రభుత్వం ప్రకటించింది. సాధు టిఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మాంసం దుకాణాలు, కబేళాలు మూసివేయాలని అధికారిక ప్రకటన తెలిపింది. సాధు తన్వార్దాస్ లీలారామ్ వాస్వానీ ఒక భారతీయ విద్యావేత్త. మీరా మూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించారు. సింధ్‌లో సెయింట్ మీరా స్కూల్‌ను స్థాపించారు. ఆయన బోధనలకు పూణేలో దర్శన్ మ్యూజియాన్ని అంకితం చేశారు. సాధువు టిఎల్ వాస్వానీ జయంతి సందర్భంగా నవంబర్ 25 అంతర్జాతీయ నాన్‌వెజ్ డేగా కూడా కొనసాగుతోంది. హలాల్ సర్టిఫికేషన్‌తో ఉన్న ఆహార ఉత్పత్తుల విక్రయాలను నిషేధిస్తూ యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత యూపీ ప్రభుత్వం తాజాగా నాన్ వెజ్ డేని ప్రకటించింది. హలాల్ సర్టిఫికేషన్ అంశంలో ఎగుమతి కోసం తయారు చేసిన ఉత్పత్తులను మినహాయించింది. ఇదీ చదవండి: మరోసారి గెలుపు మాదే: సచిన్ పైలెట్ -
ఎస్సీ వర్గీకరణపై కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. శుక్రవారం కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, ఇతర సీనియర్ అధికారులతో ఈ మేరకు ఆయన కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. ఇటీవల హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వరూప మహాసభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనడం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణకు, మాదిగల సాధికారతకు సాధ్యమైన మార్గాలపై కేంద్రం త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఎమ్మారీ్పఎస్ పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా మందకృష్ణ చేస్తున్న ప్రతి పోరాటానికీ బీజేపీ మద్దతుగా నిలించిందని ఆయన పేర్కొన్నారు. ‘‘మీది న్యాయ పోరాటం. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలనే మాదిగ ఉప కులాల కోరిక అత్యంత న్యాయమైనది. మీకు జరుగుతున్న అన్యాయానికి వీలైనంత త్వరగా అడ్డుకట్ట వేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. ఇందుకోసం వెంటనే కమిటీ వేస్తామని హమీ ఇస్తున్నా. ఈ విషయమై సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికే న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది’’ అని ఆయన చెప్పారు. కాగా, నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ శనివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ చర్చనీయంగా మారింది. -
ఆ భూములకు మార్కెట్ ధర నిర్ణయించండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని హైటెక్ సిటీ ప్రాంతంలో కమ్మ, వెలమ కుల సంఘాలకు కేటాయించిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయించాలని సర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. జీవో 571 ప్రకారం మార్కెట్ ధరను అంచనా వేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ చేపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించాలని ఆదేశించింది. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదన్న గత ఉత్తర్వులను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే నిర్మాణాలు చేసి ఉంటే అవి తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమ కుల సంఘాల కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదెకరాల చొప్పున కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రిటైర్డు ప్రొఫెసర్ ఎ.వినాయక్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం మరోసారి సోమవారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కుల సంఘాలకు భూకేటాయింపు అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. 2012, సెప్టెంబర్ 14 నాటి జీవో 571 మేరకు ప్రభుత్వం ఈ సంఘాలకు ఇచ్చిన భూములకు మార్కెట్ విలువను నిర్ణయిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ వినతిని ఆమోదించవద్దని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
భారత సైన్యానికి అశోక్ లేలాండ్ వాహనాలు - ఆర్డర్ ఎన్ని కోట్లంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ తాజాగా భారత సైన్యం నుంచి రూ.800 కోట్ల ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా భారత సైన్యానికి ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్, గన్ టోయింగ్ వెహికిల్స్‌ను అశోక్ లేలాండ్ సరఫరా చేస్తుంది. 12 నెలల్లో వీటిని డెలివరీ చేస్తామని కంపెనీ ఎండీ, సీఈవో శేణు అగర్వాల్ తెలిపారు. డిఫెన్స్ వ్యాపారం కంపెనీ వృద్ధికి బలమైన స్తంభంగా నిలిచిందని చెప్పారు. ఈ డీల్‌తో డిఫెన్స్ మొబిలిటీ వెహికల్స్ వ్యాపారంలో సంస్థ నాయకత్వాన్ని మరింత స్థిరపరుస్తుందని అన్నారు. -
‘ఓఆర్ఎస్’ అమ్మకాలపై కౌంటర్ వేయండి
సాక్షి, హైదరాబాద్: శక్తినిచ్చే ఓఆర్ఎస్ పేరిట పలు సంస్థలు నకిలీ పానీయాలు విక్రయిస్తున్నాయని దాఖలైన కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఆహార భద్రతా సంస్థ జారీ చేసిన నిబంధనలను పాటించకుండా పలు సంస్థలు ఓఆర్ఎస్ విక్రయాలు చేస్తున్నా చర్యలు తీసుకోవలేవడం లేదంటూ హైదరాబాద్ మణికొండలోని ల్యాంకోహిల్స్‌కు చెందిన డాక్టర్ ఎం.శివరంజని సంతోష్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. చదవండి: జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్! దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిల్‌కు అభ్యంతరం తెలిపిన హైకోర్టు రిజిస్ట్రీని.. నంబర్ కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. అనారోగ్యంగా ఉన్న వారికి ఓఆర్ఎస్ ఎంతగానో ఉపయోగపడుతుందని, డ్రగ్ అండ్ కాస్మోటిక్ చట్టంలోని నిబంధనలను పలు సంస్థలు పాటించడం లేదని పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నారు. చక్కెర, ఉప్పు అధిక మోతాదుల్లో ఉన్న డ్రింక్స్‌ను ఓఆర్ఎస్ పేరిట అమ్మేస్తున్నాయని నివేదించారు. ఇవి తాగితే ఆస్పత్రి కావాల్సి వస్తుందని, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదని వెల్లడించారు. నిబంధలు పాటించకుండా.. బహిరంగంగా విక్రయాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వాదనల విన్న ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది. -
ఒలెక్ట్రాకు 100 ఈ–బస్‌ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజాగా 100 ఈ–బస్‌లకు ఆర్డర్ అందుకుంది. అసోం రోడ్డు రవాణా సంస్థ నుంచి ఈ మేరకు లెటర్ ఆఫ్ అవార్డ్ స్వీకరించింది. డీల్ విలువ రూ.151 కోట్లు అని సంస్థ సీఎండీ కె.వి.ప్రదీప్ ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీ తయారీ ఎలక్ట్రిక్ బస్‌లు ఇప్పటికే దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాయని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి కంపెనీకి ఇదే తొలి ఆర్డర్. తొమ్మిది నెలల్లో ఈ బస్సులను డెలివరీ చేయనుంది. ఒలెక్ట్రాను మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రమోట్ చేస్తోంది. కాగా, గ్రీన్‌టెక్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.800 కోట్ల వరకు నిధులను సమీకరించడానికి బోర్డ్ ఆమోదం తెలిపిందని ఒలెక్ట్రా పేర్కొంది. -
సినిమా టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ప్రత్యేక కమిటీ చేసిన మార్గదర్శకాల మేరకు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సినిమా టికెట్ల ధరల నిర్ణయానికి సంబంధించి ప్రత్యేక కమిటీవేసి మార్గదర్శకాలు రూపొందించాలంటూ 2016లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం అధ్యక్షుడు, న్యాయవాది జీఎల్ నరసింహారావు రాసిన లేఖను ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యం (పిల్)గా విచారణకు స్వీకరించింది. ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి మార్గదర్శకాలు కూడా రూపొందించి ప్రభుత్వానికి పంపామని హోంశాఖ తరఫున న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి నివేదించారు. దీంతో స్పందించిన ధర్మాసనం.. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకొని తమకు తెలియజేయాలని ఆదేశించింది. కాగా, సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ప్రభుత్వ ఆమోదం తర్వాతే థియేటర్ యజమానులు పెంచుకోవాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ థియేటర్ యజమానులు దాఖలుచేసిన అప్పీళ్లను తర్వాత విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేస్తూ తదుపరి విచారణను అక్టోబరు 26కు వాయిదా వేసింది. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దేశాధినేత
ఆక్లాండ్: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ పండంటి ఆడబిడ్డకు బుధవారం ఆక్లాండ్‌లోని ఆస్పత్రిలో జన్మనిచ్చారు. దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా ఆర్డర్న్ రికార్డుకెక్కారు. 37 ఏళ్ల జెసిండా, 40 ఏళ్ల క్లార్క్ గెఫోర్డ్ దంపతులకు ఈ పాప మొదటి సంతానం. 3.3 కిలోగ్రాముల బరువుతో బిడ్డ ఆరోగ్యంగా ఉందని ఆర్డర్న్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ‘కొత్తగా తల్లిదండ్రులైన వారికున్న భావోద్వేగాలే మాకూ ఉన్నాయి. శుభాకాంక్షలు అందజేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు’అని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాని బెనజీర్ భుట్టో 1990లో అధికారంలో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. కాగా, లేబర్‌పార్టీ అధ్యక్ష బాధ్య తలు చేపట్టిన మూడు నెలలకు అంటే గతేడాది అక్టోబర్‌లో ఆర్డర్న్ ప్రధాని అయ్యారు. -
విమానంలో 110మంది.. కూల్చేయమన్న పుతిన్
మాస్కో : దాదాపు 110మందితో వెళుతున్న విమానాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. 2014లో ఆయన ఈ మేరకు ఉన్నతాధికారులకు సూచించినట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే, వేల సంఖ్యలో ప్రాణాలు రక్షించేందుకే ఆయన అంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పుతిన్ పేరిట ఓ డాక్యుమెంటరీని తాజాగా ప్రదర్శించారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో కూడా లభిస్తోంది. రెండుగంటలపాటు సాగే ఈ వీడియోలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. 2014 ఫిబ్రవరి 7న సొచ్చిలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. వాటిని చూసేందుకు దాదాపు 40వేల మంది ఔత్సాహికులు వచ్చారు. ఆ కార్యక్రమానికి పుతిన్ కూడా వెళ్లాల్సి ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే పుతిన్‌కు నిఘా అధికారుల నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఖర్కివ్ నుంచి ఇస్తాంబుల్‌కు ప్రయాణిస్తున్న ఓ టర్కీ విమానాన్ని (టర్కీష్ పీగాసస్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737-800) ఉగ్రవాదులు హైజాక్ చేశారని, అందులో ఓ ప్రయాణీకుడికి బాంబు కూడా అమర్చారని, అది ప్రస్తుతం ఒలింపిక్స్ ప్రారంభం కానున్న సొచ్చి వైపు దూసుకొస్తుందని ఆ ఫోన్ కాల్ సమాచారం. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పుతిన్ వెంటనే తన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సత్వరమే చేయాల్సిన దానిపై చర్చించారు. వెంటనే 110 మంది ప్రయాణిస్తున్న ఆ విమానాన్ని కూల్చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. 40 వేలమంది ప్రాణాలు కాపాడటం ఎంతో ముఖ్యం అని వారికి చెప్పారు. ఆ తర్వాత ఆయన ఒలింపిక్స్ వద్దకు వెళ్లారు. అయితే, మరికొద్దిసేపటికీ ఆయనకు మరో ఫోన్ కాల్ వచ్చింది.. అంతకు ముందు వచ్చింది కేవలం ఫేక్ బెదిరింపు కాల్ అని, ఓ ప్రయాణీకుడు తాగి విమానంలో గొడవ చేశాడని, ప్రస్తుతం ఆ విమానం టర్కీ వైపే వెళుతుందని చెప్పారు. దీంతో పుతిన్ ఊపిరి పీల్చుకున్నారట. ఈ విషయాన్ని క్లెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కూడా ధ్రువీకరించారు. -
సంక్షేమ ఫలాలను పేదలకు చేర్చాలి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో పేదలందరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక ఉపాధి సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. జిల్లా పరిషత్ అతిథిగృహంలో మంత్రిని శుక్రవారం వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అధికా రులనుద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలను క్షేత్రస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా ఉపయోగం ఉండదన్నారు. అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లకూడదని చెప్పారు. జిల్లా అధికారులు గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఇ.శ్రీనివాస్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఆర్వీ సూర్యనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మల, రవాణాశాఖ డెప్యూటీ కమిషనర్ ఎస్.మూర్తి మంత్రిని కలిశారు. ఏలూరు కృష్ణా జూట్‌మిల్ అధినేత బ్రిజ్గోపాల్ లునాని, రావుగోపాల్ లునాని, మణిగోపాల్ లునాని సోదరులు మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. పితానికి ఘన స్వాగతం రాష్ట్ర కార్మిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా శుశ్రవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రి పితాని సత్యనారాయణకు ఘనస్వాగతం లభించింది. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద మంత్రికి తొలుత పోలీసులు గౌరవవందనం చేయగా జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, డీఆర్వో కట్టా హైమావతి, ఆర్డీవో జి.చక్రధరరావు, తహసీల్దార్ చంద్రశేఖర్ ఘనస్వాగతం పలికారు. మంత్రి జవహర్‌ను కలిసిన అధికారులు కొవ్వూరులో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్‌ను జిల్లా అధికారులైన వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో, టెరిటోరియల్ డీఎఫ్‌వో, ఎస్డీసీ, గృహనిర్మాణశాఖ పీడీ శుక్రవారం కలుసుకున్నారు. -
సొసైటీలో కుంభకోణంపై విచారణకు ఆదేశం
ఏలూరు (మెట్రో) : ఆచంట మండలం వల్లూరు సహకార సొసైటీలో అవినీతి కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి రెండు రోజుల్లో నివేదిక అందించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ జిల్లా సహకార అధికారి లూథర్‌ను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫోన్ ద్వారా వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా వల్లూరుకు చెందిన రాములు కలెక్టర్‌కు ఫోన్ చేసి సొసైటీలో నిధులు దుర్వినియోగమయ్యాయని, బాధ్యులపై చర్యలు తీసుకుని సొసైటీని రక్షించాలని కోరాడు. కలెక్టరేట్లో విధులు నిర్వహించి రిటైర్ అయిన సాంబశివరావు అనే ఉద్యోగి తనకు పెన్షన్ బెనిఫిట్స్ ఇంకా అందలేదని ఫిర్యాదు చేయగా జిల్లా రెవెన్యూ అధికారిని కలవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఏలూరు రేంజ్లో 13 మంది సీఐల బదిలీ
ఏలూరు అర్బ న్ : ఏలూరు రేంజ్లో 13 మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ పీవీఎస్ రామకృష్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో పని చేస్తున్న వీరికి రేంజ్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. సీఐ పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం పి.మురళీకృష్ణారెడ్డి కాకినాడ వ న్‌టౌ న్ రాజమండ్రి సీసీఎస్ జె.జోగేశ్వరరావు పశ్చిమ గోదావరి (అటాచ్) తూర్పు గోదావరి (వీఆర్) ఎస్ఎస్వీ నాగరాజు ఏలూరు (సీఐడీ) భీమవరం రూరల్ ఆర్జీ జయసూర్య భీమవరం రూరల్ డీసీఆర్బీ ఏలూరు కె.వెంకటేశ్వరరావు రాజమండ్రి (వీఆర్) విజయవాడ సిటీ ఎ.శ్రీనివాసరావు తూర్పు గోదావరి (వీఆర్) ప్రత్తిపాడు (తూర్పు గోదావరి) జి.సత్యనారాయణ ప్రత్తిపాడు (తూర్పు గోదావరి) వీఆర్ (పశ్చిమ గోదావరి) ఎల్.రవితేజ వీఆర్ (పశ్చిమ గోదావరి) వీఆర్ (కృష్ణా) బి.పెద్దిరాజు వీఆర్ (కృష్ణా) రావులపాలెం పి.వెంకటరమణ రావులపాలెం డీఎస్బీ, కాకినాడ వి.శ్రీనివాస్ డీఎస్బీ, కాకినాడ తుని బి.అప్పారావు తుని టౌ న్ పిఠాపురం మహ్మద్ ఉమర్ పిఠాపురం కాకినాడ టూటౌ న్ -
అంగన్‌వాడీభవనాలు త్వరితగతిన పూర్తి చేయండి
ఏలూరు (మెట్రో): జిల్లాలో అంగన్వాడీ భవనాలు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లాకలెక్టర్ కాటంనేని బాస్కర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనులు నత్తనడకన సాగుతున్నాయనీ తక్షణమే వేగం పెంచి పనులు పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో సిసి రోడ్ల నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయనీ వీటినీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్ఇ మాణిక్యం, ఇఇ రఘుబాబు, రామన్న, ప్రకాశ్ పాల్గొన్నారు. తొలివిడత పూర్తయిన జలశిరి ః జిల్లాలో ఎన్టిఆర్ జలసిరి తొలివిడత పూర్తయ్యిందని జిల్లా కలెక్టర్ భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఎన్టిఆర్ జలసిరి పథకంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టిఆర్ జలసిరి ఫేజ్ వన్ ద్వారా 1971 మంది అర్హత గల పేద రైతులకు బోర్లు మంజూరు చేయడం జరిగిందని శనివారం నాటికి పూర్తిస్థాయిలో బోర్లను మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఫేజ్టులో భాగంగా 1592 ధరఖాస్తులు రైతుల నుండి బోర్లు మంజూరు కోసం అందాయనీ, వీటిని స్థానిక తహశీల్దార్లు, భూగర్భ జలశాఖ అధికారులు కలిసి ధరఖాస్తులు ఆన్లైన్లో పొందు పరచాలని కలెక్టరు చెప్పారు. అర్హత గల రైతులకు బోర్లు మంజూరు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డ్వామా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఎపిడి ఎస్‌వివి సత్యనారాయణ, టి.నాగరాజు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు. -
ఫ్రిజ్ ఉంటే.. ఇల్లు ఫట్
♦ ద్విచక్ర వాహనం ఉన్నా కొత్త గృహం రాదు ♦ కేంద్రం ఆదేశాలను రాష్ట్రానికి వర్తింపజేసేందుకు టీడీపీ ప్రభుత్వ యత్నం ♦ మంజూరుకు నిబంధనలు విధించిన పాలకులు ప్రొద్దుటూరు : ద్విచక్ర వాహనమే కాదు ఫ్రిజ్ ఉన్నా కూడా ప్రభుత్వ గృహాలు మంజూరయ్యే పరిస్థితి లేదు. ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న ఇందిరా ఆవాస్ యోజన పథకానికి మోదీ ప్రభుత్వం ఈ పేరు మార్చింది. దీనినే హౌసింగ్ ఫర్ ఆల్ అని కూడా పిలుస్తున్నారు. తొలి విడతగా ఇందుకు సంబంధించి జాతీయ స్థాయిలో వంద పట్టణాలను ఎంపిక చేయగా జిల్లాలో కడప, ప్రొద్దుటూరు ఉన్నాయి. ఇందులో మొత్తం 15 రకాల నిబంధనలను విధించారు. ఈ ప్రకారం 2, 3, 4 చక్రాల వాహనాలు, ఫ్రిజ్, నెలకు రూ.10 వేల ఆదాయం మించి ఉన్న వారు, ఆదాయ పన్ను చెల్లించు వారు, ఉద్యోగ, వృత్తి పన్ను చెల్లించు వారు, సొంత ల్యాండ్‌లైన్ ఫోన్ కలిగి ఉన్న వారు ఈ పథకానికి అనర్హులని పేర్కొన్నారు. సొంత (పక్కా/ఆర్డీటీ) ఇల్లు ఉన్నా, వ్యవసాయానికి సంబంధించిన 3 లేదా 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్నా, రూ.50 వేలకు మించి కిసాన్ క్రిడెట్ కార్డు ఉన్నా, ప్రభుత్వం నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నా, తడి భూమి రెండున్నర ఎకరాలు మించి ఉన్నా, ఐదెకరాలు ఉండి రెండు పంటలు మించి పండిస్తున్నా, బోర్లతో 7.5 ఎకరాల్లో పంటలు పండిస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, ఇంటికి నెలకు రూ.500 మించి కరెంటు బిల్లు చెల్లిస్తున్నా వారు ఇంటికి దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ హౌసింగ్‌కు అమలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు అయింది. ఇప్పటి వరకు ఏ ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు కాలేదు. గత ప్రభుత్వంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక పలుకుబడి ఉన్న టీడీపీ తమ్ముళ్లకు ఇళ్ల మరమ్మతుల కోసం.. గృహానికి రూ.10 వేలు చొప్పున మంజూరు చేయడం జరిగిందే తప్ప, ఏ ఒక్కరికీ కొత్తగా ఇల్లు మంజూరు చేయలేదు. ఇదిలా వుండగా అమృత్ పథకం కింద జిల్లాలో కడప కార్పొరేషన్‌కు 2 వేలు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి 2 వేలు చొప్పున ఇళ్లు మంజూరయ్యాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 1250 చొప్పున ఇళ్లు మంజూరు చేయగా.. ప్రొద్దుటూరు, కడప రూరల్ ప్రాంతాలకు మాత్రం 500 చొప్పున ఇళ్లు మంజూరు చేశారు. అయితే ఇళ్లు మంజూరైనా ఇంకా లబ్ధిదారుల ఎంపిక మాత్రం జరగలేదు. తాజాగా ప్రధాని ఆవాస యోజన పథకానికి ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకానికి కూడా ఇవే నిబంధనలను అమలు చేయనుంది. ఈ నెల 5న జరిగిన ప్రొద్దుటూరు మండల సర్వసభ్య సమావేశంలో హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు ఈ నిబంధనలను చదివి వినిపించగా.. ఈ ప్రకారం ఏ ఒక్కరికీ ఇల్లు మంజూరయ్యే అవకాశం లేదని మండల ఉపాధ్యక్షుడు మల్లేల రాజారాంరెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. త్వరలో గ్రామ సభలు ఈనెల 15 నుంచి ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి సంబంధించి గ్రామ సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఆ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనల నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కష్టతరంగా మారే అవకాశం ఉంది. -
ఆ విద్యార్థుల వివరాలివ్వండి
ఢాకా: గత పది రోజులుగా విద్యాలయాలకు హాజరుకాని విద్యార్థుల వివరాలు ఇవ్వాల్సిందిగా అన్ని విద్యాసంస్థలను బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. కొన్నాళ్లుగా ఎవరైనా పిల్లలు తప్పిపోయుంటే వారి వివరాలను అధికారులకు అందజేయాల్సిందిగా ప్రధానమంత్రి షేక్ హసీనా ఇటీవల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఢాకా దాడి అనంతరం పలువురు విద్యార్థులు తప్పిపోయారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జులై 1న గుల్షన్ ప్రాంతంలో హోలే అర్టిసన్ బేకరి అండ్ రెస్టారెంట్ పై ఆరుగురు సాయుధులు దాడి చేసి 22 మందిని అతి కిరాతకంగా హతమార్చారు. ఇందులో ఐదుగురిని మట్టు పెట్టిన ఉగ్రవాదులు ఒకరిని సజీవంగా పట్టుకున్నారు. ఐదుగురు ఉన్నత విద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులే నని దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. -
టాటా సన్స్ కు వేల కోట్ల భారీ జరిమానా
టోక్యో: వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్ మేజర్ ఆపరేటింగ్ ప్రమోటర్ టాటా సన్స్ లిమిటెడ్ కి లండన్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. జపాన్‌కు చెందిన టెలికాం కంపెనీ నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్టీటీ) డొకోమో వివాదంలో సుమారు ఎనిమిదివేల కోట్ల రూపాయల బారీ జరిమానా విధించింది. 79 వేల 531 వేల కోట్ల రూపాయల(1.17 బిలియన్ డాలర్ల) నష్టపరిహారాన్ని చెల్లించాలని లండన్ లోని అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల కోర్టు ఆదేశించింది. డొకొమో తో చేసుకున్న ఒప్పందాన్ని బేఖాతరు చేశారని ఆరోపణలపై సానుకూలంగా స్పందించిన కోర్టు ఈ మొత్తాన్ని డొకొమోకు నష్టపరిహారంగా చెల్లించాలంటూ టాటా సన్స్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని టాటా సన్స్ ప్రతినిధి కూడా ధృవీకరించారు.. కోర్టు ఆదేశాలకు తమకు చేరాయని దీనిని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. టాటా సన్స్ ఎల్లప్పుడూ చట్టానికనుగుణమైన పద్ధతిలో ఒప్పంద బాధ్యతలు నిర్వర్తించేందుకు కట్టుబడి ఉందని ..దీనిపై ఇపుడే వ్యాఖ్యానించలేమన్నారు. కాగా టాటా టెలిలో తనకున్న 26.5 శాతం వాటాను విక్రయించడం ద్వారా సంయుక్త భాగస్వామ్యం నుంచి బయటకు రావాలనుకుంటున్నట్లు 2014 ఏప్రిల్ లో డొకోమో ప్రకటించింది. ఈ వాటాలను రూ.7,250 కోట్లకు కొనుగోలు చేసేందుకు తొలుత అంగీకరించిన టాటా సన్స్ ఆ తరువాత వెనుకడుగు వేసింది. టాటా సన్స్ తో కలసి తాము ఏర్పాటు చేసిన టాటా టెలి సర్వీసెస్ లో వాటాల బదలీపై ముందు చేసుకున్న ఒప్పందాన్ని టాటా సన్స్ పాటించలేదని డొకోమో ఆరోపించింది ఈ వివాదంలో మధ్యవర్తిత్వం కోరుతూ డొకోమో లండన్‌లోని కోర్టులో గత ఏడాది జనవరి లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
33మంది ఉన్నతాధికారులకు ఉద్వాసన
న్యూఢిల్లీ: ప్రజలకు సుపరిపాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పని చేయని అధికారులను సహించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు . రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో పని చేయని 33 మంది ఉన్నతాదికారులను ముందస్తు రిటర్మెంట్ తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. గడిచిన రెండేళ్లలో 72 మంది ఉన్నతాధికారులను శాఖా పరమైన క్రమశిక్షన పేరుతో తొలగించారు. కానీ ఇంత మొత్తంలో ఒకేసారి ముందస్తు పదవీ విరమణ చేయమని ఆదేశించడం ఇదే మొదటిసారి . ఇప్పటి వరకు తొలగించిన 105 మందిలో అందరూ గ్రూప్ 1 అధికారులు కావడం గమనార్హం . వీరందరూ 50 ఏళ్ల పై బడిన వారే. జనవరిలో జరిగిన 'ప్రగతి ఇంటరాక్షన్' సమావేశంలో పని చేయని అధికారుల వివరాలను అందజేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రధాని ఆదేశించారు.. అప్పటి నుంచి 122 మంది ఉన్నతాధికారుల వివరాలు సేకరించిన అనంతరం ఇప్పటి వరకు 72 మందిపై చర్యలు తీసుకున్నారు -
జాన్సన్ & జాన్సన్ కి మరో ఎదురు దెబ్బ
న్యూయార్క్: ప్రముఖ బహుళ జాతి సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి మరోసారి ఎదురు దెబ్బ తప్పలేదు. ఈ సంస్థ ఉత్పత్తులు బేబీ టాల్క్ పౌడర్, షవర్ టు షవర్ లను కొద్ది దశాబ్దాల పాటు వాడడం మూలంగా మహిళలకు అండాశయ క్యాన్సర్ సోకుతోందంటూ వచ్చిన ఆరోపణలో అమెరికా కోర్టు తీర్పు మరోసారి సంస్థకు భారీ షాకిచ్చింది. మిస్సౌరీ అండ్ న్యూ జెర్సీ కోర్టు తీర్పు తరహాలోనే మరో తీర్పు వెలువరించింది. బాధితురాలు గ్లోరియా రిస్తెంసుంద్ కి అనుకూలంగా అమెరికా జ్యూరీ తీర్పునిచ్చింది. సుమారు 365కోట్ల రూపాయల జరిమానా (55 మిలియన్ డాలర్లు) చెల్లించాలని సోమవారం అమెరికా జ్యూరీ ఆదేశించింది. బాధితురాలికి జరిగిన అసలు నష్టానికి గాను 5 మిలియన్ డాలర్లు, శిక్షాత్మక నష్టాలకు గాను 50 మిలియన్ డాలర్లు మొత్తం 55 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు చెప్పింది. అలబామాకు చెందిన గ్లోరియా రిస్తెంసుంద్ ఒవేరియన్ క్యాన్సర్ తో బాధపడుతూ జాన్సన్ అండ్ జాన్సన్ పై ఫిర్యాదుచేశారు. బేబీ పౌడర్, షవర్ టు షవర్ లను దశాబ్దాల తరబడి వాడడం మూలంగా అండాశయ క్యాన్సర్ కు గురయిన్నట్టు ఆమె వాదించారు. ఈ తీర్పు తప్పట్ తమ క్లయింట్ సంతోషం వ్యక్తం చేశారని, హిస్టెరెక్టమీ లాంటి ఎన్నో ఆపరేషన్ల తర్వాత ప్రస్తుతం ఆమె వ్యాధి కొంచెం ఉపశమించినట్టు ఆమె తరపు న్యాయవాదులు తెలిపారు. అమెరికాలో నమోదైన అన్ని కేసులను సత్వరమే పరిష్కరించాలని కోరారు. అయితే దీనిపై మరోసారి అప్పీలు కు వెడతామని సంస్థ ప్రతినిది కరోల్ గూడ్ రిచ్ తెలిపారు. 30 యేళ్ల తమ సర్వీసులకు ఈ తీర్పు చెప్ప పెట్టులాంటిదన్నారు. తమ పోరాటం కొనసాగుతుందనీ, తమ నిజాయితీ నిరూపించుకుంటామన్నారు. క్యాన్సర్ సోకడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయని, ఆమె కుటుంబంలో క్యాన్సర్ హిస్టరీ ఉందని వాదించారు. అటు వరుస ఎదురుదెబ్బల నేపథ్యంలో కంపెనీ షేరు భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. కాగా బర్మింగ్ హామ్ కు చెందిన ఫాక్స్ అనే మహిళ కేసులో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తమ అమ్మకాలను పెంచుకోవడం కోసం టాల్క్ ఆధారిత పౌడర్ లు క్యాన్సర్ కు దారితీయ వచ్చని దశాబ్దాలుగా హెచ్చరించడం లేదని గతంలో అమెరికా కోర్టు భావించింది. ఈ వ్యవహారంలో సంస్థపై ఇప్పటికే అమెరికాలో సుమారు 1200 వరకు కేసులు నమోదయ్యాయి. గత విచారణలో ఆ కంపెనీ మోసం, నిర్లక్ష్యం, కుట్ర లకు పాల్పడిన్నట్లు ఆమె కుటుంబ న్యాయవాదులు ఆరోపించారు. వీటిని వాడటం వల్లన కలిగే నష్టాల అవకాశాల గురించి ఆ కంపెనీ కి 1980 ప్రాంతంలోనే తెలుసని, అయినా ప్రజలను, నియంత్రణ సంస్థలను మోసం చేస్తూ వచ్చారని వారు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే ఆమ కుటుంబానికి 72 బిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని అమెరికా లోని మిస్సోరి స్టేట్ కోర్టు జ్యూరీ ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
యోగా గురు బిక్రమ్ చౌదురికి భారీ జరిమానా
హాట్ యోగా గురు బిక్రమ్ చౌదురికి లాస్ ఏంజిల్స్ కోర్టు భారీ జరిమానా విధించింది. యోగాలో ప్రత్యేక ప్రక్రియను ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న బిక్రమ్.. సుమారు తొమ్మిది లక్షల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. బిక్రమ్ చౌదురి ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిరూపణ కావడంతో లాస్ ఏంజిల్స్ జ్యూరీ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించింది. మీనాక్షీ జాఫా బోడెన్ అనే బాధిత మహిళ... తనపై బిక్రమ్ వేధింపులకు పాల్పడ్డాడని, న్యాయం చేయాలంటూ కోర్టుకెక్కింది. బోడెన్ ఆరోపణలపై సుదీర్ఘ విచారణ చేపట్టిన లాస్ ఏంజిల్స్ కోర్టు... ఇరువైపుల వాదలను విన్న అనంతరం... బిక్రమ్‌ను దోషిగా తేల్చింది. దీంతో 9,24,500 డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇదో అపారమైన తీర్పు అని బాధితురాలు తరపు న్యాయవాది కార్లా మిన్నర్డ్ వెల్లడించారు. తన క్లైంట్ జాఫా బోడెన్పైను బిక్రమ్ చౌదురి.. తాకేందుకు ప్రయత్నించడం, హోటల్ గదిలో తనతో ఉండాలని బలవంతం చేయడం వంటి అనేక రకాలైన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని దీంతో 2013 జూన్ లో బాధితురాలు కోర్టును ఆశ్రయించిందని న్యాయవాది మిన్నర్డ్ చెప్పారు. 69 ఏళ్ళ బిక్రమ్ చౌదురి 2003, సెప్టెంబర్ 27న యోగా ఎక్స్పో పేరిట లాస్ ఏంజిల్స్.. కన్వెన్షన్ సెంటర్లో యోగా శిక్షణా తరగతిని నిర్వహించారు. సుమారు వంద డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత కలిగిన గదిలో 90 నిమిషాలపాటు ప్రత్యేక టెక్నిక్‌తో యోగా ప్రదర్శన ఇచ్చారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 650 స్టూడియోల్లో తమ శిష్యుల ద్వారా ప్రదర్శనలు చేసి చౌదురి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మహిళపై వేధింపులు రుజువు కావడంతో లాస్ ఏంజిల్స్ కోర్టు అతడికి జరిమానా విధించింది. యోగా శిక్షణ పేరిట ఈ హాట్ యోగా గురు వేధింపులకు పాల్పడుతున్నట్లు ఇంతకు ముందే కోర్టులో పలు కేసులు నమోదయ్యాయి. తొమ్మిది వారాల శిక్షణా తరగతి కోసం కళాశాల ఫండ్ నుంచి తాను పదివేల డాలర్లు చెల్లించానని... అయితే తనపై శిక్షణ పేరిట బిక్రమ్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ కెనడియన్ మహిళ సైతం కోర్టును ఆశ్రయించింది. అయితే బిక్రమ్ తరపు న్యాయవాదులు మాత్రం ఇంతకు ముందు అతడెప్పుడూ హింసాత్మక ఘటనలకు, లైంగిక చర్యలకు పాల్పడలేదని చెప్తున్నారు. -
ఇకపై చెప్పులు లేకుండా కోర్టుకు ఖైదీలు!
తిరువళ్లూరు: నిందితుడు న్యాయమూర్తిపై చెప్పులు విసిరిన ఘటన తమిళనాడు జిల్లా కోర్టులో చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం న్యాయమూర్తి...ఇకపై కోర్టుకు ఖైదీలను హాజరుపరిచే సమయంలో చెప్పులు లేకుండా తీసుకురావాలని పోలీసులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్లితే....తిరువళ్లూరు జిల్లా ఆవడి ప్రాంతానికి చెందిన ఏలుమలై(38)పై పలు కేసులు ఉన్నాయి. ఇతన్ని ఆరు నెలల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. పూందమల్లిలోని జ్యుడీషియల్ కోర్టు-1లో కేసు విచారణ కొనసాగుతోంది. మహిళా న్యాయమూర్తి నిషా కేసును విచారిస్తున్నారు. నిందితుడిని జనవరి 7న కోర్టుకు తీసుకురావాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీసు బందోబస్తు నడుమ పుళల్ జైలు నుంచి ఏలుమలైను గురువారం కోర్టుకు తీసుకొచ్చారు. ఈ కేసును న్యాయమూర్తి నిషా విచారణ చేస్తుండగానే ఆవేశానికి లోనైన అతను కోర్టులో వీరంగం సృష్టించాడు. ఎన్ని సార్లు కోర్టుల చుట్టూ తిరగాలంటూ ఏలుమలై గట్టిగా కేకలు వేశాడు. తీవ్ర దుర్భాషలాడిన అతడు చెప్పులు తీసుకుని మహిళా న్యాయమూర్తిపై విసిరాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిందితుడికి న్యాయమూర్తి మరో 15 రోజుల పాటు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఇకపై కోర్టుకు ఖైదీలను హాజరుపరిచే సమయంలో చెప్పులు లేకుండా తీసుకురావాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. -
గుట్కా వ్యాపారానికి గుడ్‌బై చెప్పాల్సిందే!
విజయవాడ సిటీ : నగర పోలీసులు గుట్కా మాఫియాను తరిమి కొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నగరంలో పెద్ద ఎత్తున గుట్కా వ్యాపారం చేసిన మాఫియా నేతలను కోర్టు మెట్లు ఎక్కించిన పోలీసులు, విచారణలో భాగంగా పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇదే సమయంలో గుట్కా మాఫియాకు సహకరించిన వారిపై కూడా ప్రత్యేక దృష్టిసారించినట్టు విశ్వసనీయ సమాచారం. నగరంలో గుట్కా వ్యాపారాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలంటూ నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వీరిని ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించరాదనేది సీపీ నిర్ణయం. ఈ క్రమంలోనే తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే వీరిపై ఉక్కుపాదం మోపారు. సీపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. టన్నుల కొద్దీ గుట్కా, ఖైనీ నిల్వలను స్వాధీనం చేసుకొని పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గుట్కా హోల్‌సేల్ వ్యాపారులైన చంద్రశేఖర్, కామేశ్వరరావుపై కేసులు నమోదు చేశారు. వీరు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందడంతో పూర్తి స్థాయి వివరాల సేకరణకు రెండుమార్లు పోలీసు విచారణకు రప్పించారు. తిరిగి మరోసారి విచారణకు పిలిచే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలిసింది. గుట్కా మాయంపై దృష్టి మాఫియా ఆర్థిక మూలాలను దెబ్చకొట్టినా వ్యాపారం మానుకోక పోవడంపై పోలీసు కమిషనర్ సవాంగ్ ఆరా తీయగా పట్టుబడిన సరుకులో కొంత ఫుడ్ ఇన్స్పెక్టర్ల ద్వారా వీరికి చేరుతున్నట్టు గుర్తించారు. నిర్దారణ కోసం ఆదేశించగా టాస్క్‌ఫోర్స్ అధికారులు విచారణ జరిపి వాస్తవమేనని తేల్చారు. ఇటీవల పోలీసు విచారణకు వచ్చిన గుట్కా విక్రేతలు కూడా దీనిని ధృవీకరించినట్టు తెలిసింది. దీంతో ఆ కేసుపై మరోసారి దృష్టిసారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పట్టుబడిన సరుకును తిరిగి వారికి చేర్చడం వెనుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. -
ఆంధ్రజ్యోతి ఎండీపై చీటింగ్ కేసుకు కోర్టు ఆదేశం
హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై చీటింగ్ కేసు నమోదు చేయాలని సికింద్రాబాద్ మేజిస్ట్రేట్ మంగళవారం సరూర్‌నగర్ పోలీసులకు ఉత్తర్వులు జారీచేశారు. ఫిర్యాదుదారుడు సుంకరి జనార్ధన్‌గౌడ్ కథనం మేరకు... వీణ, వాణి అవిభక్త కవలలకు ఆపరేషన్ నిమిత్తం 2012 సంవత్సరంలో రండి... రండి... చేయి కలుపుదాం - వీణా, వాణిలకు అండగా నిలుద్దాం అంటూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారం చేశారు. దీనికి దాతలు స్పందించి, లక్షల రూపాయలను ఆ ఛానల్ ఖాతాలో జమచేశారు. అయితే.. ఆ డబ్బులను బాధితుల ఆపరేషన్‌కు గానీ, వారి తల్లిదండ్రులకు గానీ ఇవ్వకుండా సొంతానికి వాడుకున్నాడని, దీనిపై పలుమార్లు రాధాకృష్ణకు ఫోన్ చేయగా ఫోన్లో బెదిరించాడని ఫిర్యాదుదారుడు కోర్టుకు విన్నవించాడు. రాధాకృష్ణపై భారతీయ శిక్షాస్మృతిలోని 406, 420, 403, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలంటూ సరూర్‌నగర్ పోలీసులకు కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. -
కొత్త చట్టం ప్రకారం పరిహారమివ్వండి
- భూ సేకరణాధికారికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం సేకరించిన ఆస్తులకు గాను వాటి యజమానులకు గతేడాది జనవరి 1 నాటికి నష్టపరిహారం చెల్లించకుండా ఉంటే కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని నిర్ణయించాలని భూసేకరణాధికారిని హైకోర్టు ఆదేశించింది. అయితే, తాజా పరిహార నిర్ణయం ఇప్పటికే చేపట్టిన ఆస్తుల స్వాధీన ప్రక్రియకు ఎంత మాత్రం అడ్డుకాదని ఈ సందర్భంగా హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పొనుగోటి నవీన్‌రావు గత వారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు కాపీ అందుకున్న నాలుగు వారాల్లో ఆస్తులను ఖాళీచేసి, అధికారులకు స్వాధీనం చేయాలని పిటిషనర్లను కూడా న్యాయమూర్తి ఆదేశించారు. బాధితులు ఎప్పుడు ఆశ్రయిస్తే అప్పుడు కొత్త చట్టం ప్రకారం పరిహారాన్ని చెల్లించాలని భూసేకరణాధికారికి స్పష్టం చేశారు. గతేడాది జనవరి 1న కొత్త భూ సేకరణ చట్టం అమల్లోకి వస్తే, అధికారులు పాత భూ సేకరణ చట్టం కింద పరిహారాన్ని నిర్ణయించారని, కొత్త చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కొందరు యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో నాంపల్లిలో మెట్రో రైల్ అలైన్మెంట్ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి, ఆ ప్రాంతంలో భూ సేకరణ చేపట్టకుండా ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్ల విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం హైదరాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో 20 ప్రైవేటు ఆస్తులను సేకరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఆస్తుల సేకరణపై వాటి యజమానులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, వాటిని తోసిపుచ్చిన జిల్లా కలెక్టర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసి, ఆ తరువాత పరిహారాన్ని ఖరారు చేశారు. నాంపల్లి వద్ద మెట్రో రైల్ అలైన్‌మెంట్‌ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు సంబంధించి ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే, ప్రెస్‌నోట్ ఆధారంగా కోర్టు ఓ నిర్ణయానికి రాలేదని న్యాయమూర్తి చెప్పారు. నాంపల్లిలో రోడ్డు విస్తరణ అవసరమా..? కాదా..? అన్న విషయాన్ని కోర్టు తేల్చదని, ఆ అంశం తమ పరిధిలోనిది కాదన్నారు. తమ ముందున్నది పరిహారం చెల్లింపు అంశమేనంటూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.