సంక్షేమ ఫలాలను పేదలకు చేర్చాలి
సంక్షేమ ఫలాలను పేదలకు చేర్చాలి
Published Sat, Apr 8 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో పేదలందరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక ఉపాధి సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. జిల్లా పరిషత్ అతిథిగృహంలో మంత్రిని శుక్రవారం వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అధికా రులనుద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలను క్షేత్రస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా ఉపయోగం ఉండదన్నారు. అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లకూడదని చెప్పారు. జిల్లా అధికారులు గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఇ.శ్రీనివాస్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఆర్‌వీ సూర్యనారాయణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నిర్మల, రవాణాశాఖ డెప్యూటీ కమిషనర్ ఎస్.మూర్తి మంత్రిని కలిశారు. ఏలూరు కృష్ణా జూట్‌మిల్ అధినేత బ్రిజ్‌గోపాల్ లునాని, రావుగోపాల్ లునాని, మణిగోపాల్ లునాని సోదరులు మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.
పితానికి ఘన స్వాగతం
రాష్ట్ర కార్మిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా శుశ్రవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రి పితాని సత్యనారాయణకు ఘనస్వాగతం లభించింది. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద మంత్రికి తొలుత పోలీసులు గౌరవవందనం చేయగా జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, డీఆర్వో కట్టా హైమావతి, ఆర్డీవో జి.చక్రధరరావు, తహసీల్దార్ చంద్రశేఖర్ ఘనస్వాగతం పలికారు.
మంత్రి జవహర్‌ను కలిసిన అధికారులు
కొవ్వూరులో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్‌ను జిల్లా అధికారులైన వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో, టెరిటోరియల్ డీఎఫ్‌వో, ఎస్‌డీసీ, గృహనిర్మాణశాఖ పీడీ శుక్రవారం కలుసుకున్నారు.
Advertisement
Advertisement