to officers
-
పేరుపాలెం సొసైటీపై విచారణ
మొగల్తూరు: పేరుపాలెం సహకార సంఘ కార్యదర్శిపై విచారణ నిర్వహిస్తున్నామని, రెండు రోజుల్లో నివేదిక అధికారులకు అందిస్తామని అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.ఆనందరాజు తెలిపారు. పేరుపాలెం సహకార సంఘ కార్యాలయంలో కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలపై బుధవారం రైతులను విచారించారు. సంఘ కార్యదర్శి అందే రవికిషోర్, అధ్యక్షుడు మేళం గాంధీ మధ్య అభిప్రాయ భేదాలు చోటుచేసుకోవడంతో సంఘ సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. 20 రోజులుగా సంఘ కార్యకలాపాలు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 4న 20 మంది రైతులు సంఘంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, విచారణ నిర్వహించాలని కోరుతూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆదేశాలతో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆనందరాజు సంఘ కార్యదర్శి, అధ్యక్షుడు, రైతులను విచారించారు. సంఘంలో రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించడంతో పాటు రైతుల ఆరోపణలు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన చెప్పారు. -
సంక్షేమ ఫలాలను పేదలకు చేర్చాలి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో పేదలందరికీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కార్మిక ఉపాధి సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. జిల్లా పరిషత్ అతిథిగృహంలో మంత్రిని శుక్రవారం వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అధికా రులనుద్దేశించి మంత్రి మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలను క్షేత్రస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా ఉపయోగం ఉండదన్నారు. అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లకూడదని చెప్పారు. జిల్లా అధికారులు గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఇ.శ్రీనివాస్, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఆర్వీ సూర్యనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ నిర్మల, రవాణాశాఖ డెప్యూటీ కమిషనర్ ఎస్.మూర్తి మంత్రిని కలిశారు. ఏలూరు కృష్ణా జూట్‌మిల్ అధినేత బ్రిజ్గోపాల్ లునాని, రావుగోపాల్ లునాని, మణిగోపాల్ లునాని సోదరులు మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. పితానికి ఘన స్వాగతం రాష్ట్ర కార్మిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా శుశ్రవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న మంత్రి పితాని సత్యనారాయణకు ఘనస్వాగతం లభించింది. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద మంత్రికి తొలుత పోలీసులు గౌరవవందనం చేయగా జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, డీఆర్వో కట్టా హైమావతి, ఆర్డీవో జి.చక్రధరరావు, తహసీల్దార్ చంద్రశేఖర్ ఘనస్వాగతం పలికారు. మంత్రి జవహర్‌ను కలిసిన అధికారులు కొవ్వూరులో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్‌ను జిల్లా అధికారులైన వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో, టెరిటోరియల్ డీఎఫ్‌వో, ఎస్డీసీ, గృహనిర్మాణశాఖ పీడీ శుక్రవారం కలుసుకున్నారు. -
లక్ష్యాలను పూర్తిచేసే వరకు సెలవుల్లేవ్
ఏలూరు (మెట్రో) : నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు పూర్తిచేసే వరకూ జిల్లాలో ఏ ఒక్కరికీ సెలవుల్లేవని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో ప్రాధాన్యతా రంగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు మరో 50 రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివిధ పథకాలలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ మధ్య కాలంలో బడ్జెట్ రాలేదనే సాకుతో ఎలాగూ పనులు చేయరని, ఈ నేపథ్యంలో ఉన్న బడ్జెట్‌తో ఈ 50 రోజులూ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఉద్యాన పంటకూ బిందుసేద్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసరావును ఆదేశించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఉద్యానవనం వంటి శాఖల అధికారులు రైతులతో ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలు వారే నేరుగా అమ్ముకునే వీలు కల్పించాలన్నారు. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. రైతులకు రుణాలు, ఉపకరణాలు వారి అర్హత మేరకు అందించాలన్నారు. ఈ పంపిణీలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు ఫామ్‌పాండ్స్ తవ్వించి భూగర్భజలాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప వంటి జిల్లాల్లో ప్రభుత్వం నిరే్ధశించిన లక్ష్యాలకన్నా బిందుసేద్యం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఈ జిల్లాల్లో వారంవారం సమీక్షలు నిర్వహిస్తున్నా బిందు సేద్యం లక్ష్యాలను ఎందుకు పూర్తిచేయలేకపోతున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, సీపీవో బాలకృష్ణ, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ్మశ్వరి, మార్కెటింగ్ డీఎం నాగమల్లిక పాల్గొన్నారు. 667 సోలార్ పంపుసెట్లు మంజూరు ఎన్టీఆర్ జలసిరి పథకం ఫేజ్–2లో భాగంగా జిల్లాలో 667 సోలార్ పంపుసెట్లు బ్లాక్‌లు మంజూరయ్యాయని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. వీటిలో 351 బ్లాక్‌లలో రైతులకు బోర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బుధవారం జలసిరి, నీరు–చెట్టు పథకాలకు సంబంధించిన పనులపై అధికారులతో సమీక్షించారు. ఎన్టీఆర్ జలసిరి ఫేజ్–2లో నూతన విధానం ద్వారా ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ రైతుల నుంచి రూ.5 వేలతో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.6 వేలు, ఓసీ, బీసీ రైతులు రూ.25 వేలు విరాళం ద్వారా వెంటనే చెల్లించిన వారికి సోలార్ పంపుసెట్లు ఇవ్వనున్నట్టు కలెక్టర్ చెప్పారు. డీఆర్వో హైమావతి, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, ఏపీడీ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. గడువులోగా సీసీ రోడ్లు నిర్మించాలి జిల్లాలో పంచాయతీరాజ్ నిధులతో నిర్మించే సీసీ రహదారుల నిర్మాణ పనులు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మార్చి 20 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఏఈలను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మండల సమాఖ్య, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పునాది దశలో ఉన్న నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలని, ప్రారంభించని పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించాల్సిన సీసీ రోడ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సీసీ రోడ్లు నిర్మాణ పనులు కాంట్రాక్టర్లు ప్రారంభించకుంటే నోటీసులిచ్చి బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. నిబంధనలకు తూట్లు పొడిస్తే కఠిన చర్యలు జిల్లాలో పంటలు పండుతున్నా వ్యవసాయానికి పనికిరాదంటూ చేపల చెరువులకు అనుమతులు ఇచ్చే అధికారుల ఉద్యోగాలు పోతాయని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన చేపల చెరువుల అనుమతుల కమిటీ అధికారులతో కలెక్టర్ భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపల చెరువుల అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి ఆ భూమి వ్యవసాయానికి పనికి వస్తుందీ, లేనిదీ చూడాలని, భూసార పరీక్షలు నిర్వహించి పనికిరాదని తేలితే అనుమతులను మంజూరు చేయాలన్నారు. చేపల చెరువుల ఏర్పాటులో ఇన్, అవుట్ డ్రెయిన్లు సక్రమంగా ఉన్నదీ, లేనిదీ ఇరిగేషన్ అధికారులు పరిశీలించి అవి సక్రమంగా ఉంటేనే అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఫిషరీస్ డీడీ యాకూబ్ బాషా, వ్యవసాయశాఖ జేడీ వై.సాయిలక్షీ్మశ్వరి, గ్రౌండ్ వాటర్ డీడీ రంగారావు పాల్గొన్నారు. పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోండి జిల్లాలో అనుమతులు మంజూరు చేసిన పరిశ్రమలు త్వరితగతిన నెలకొల్పేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించారు. పరిశ్రమల స్థాపనపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విధానంలో త్వరితగతిన పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నప్పటికీ ఇంతవరకూ జిల్లాలో ఆశించినస్థాయిలో పరిశ్రమలు ఎందుకు నెలకొల్పడం లేదని అధికారులను ప్రశ్నించారు. సాధ్యమైనంత వరకూ త్వరితగతిన జిల్లాలో పరిశ్రమలు స్థాపించేలా అధికారులు కృషి చేయాలన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి వీలైతే అనుతులు ఇవ్వాలని, లేకుంటే ఏ కారణం చేత తిరస్కరిస్తున్నారో తెలిపి తిరస్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఇంకా 38 పరిశ్రమల అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలన్నారు. రైల్వే ట్రాక్‌ల వెంబడి చేసే నిర్మాణాలకు రైల్వే ప్రాపర్టీ హద్దు నుంచి 30 మీటర్లు విడిచి నిర్మాణాలు చేపట్టాలనే నిబంధన ఉందని అధికారులు చెప్పడంపై కలెక్టర్ స్పందిస్తూ నష్టపోయిన సొంత భూమికి నష్టపరిహారం ఎవరిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఒక నివేదిక తయారు చేయాలని చెప్పారు. -
లక్ష్యాలను పూర్తిచేసే వరకు సెలవుల్లేవ్
ఏలూరు (మెట్రో) : నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు పూర్తిచేసే వరకూ జిల్లాలో ఏ ఒక్కరికీ సెలవుల్లేవని కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లో ప్రాధాన్యతా రంగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు మరో 50 రోజుల్లో పూర్తికానున్న నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివిధ పథకాలలో నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూన్ మధ్య కాలంలో బడ్జెట్ రాలేదనే సాకుతో ఎలాగూ పనులు చేయరని, ఈ నేపథ్యంలో ఉన్న బడ్జెట్‌తో ఈ 50 రోజులూ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఉద్యాన పంటకూ బిందుసేద్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసరావును ఆదేశించారు. వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, ఉద్యానవనం వంటి శాఖల అధికారులు రైతులతో ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలు వారే నేరుగా అమ్ముకునే వీలు కల్పించాలన్నారు. రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు. రైతులకు రుణాలు, ఉపకరణాలు వారి అర్హత మేరకు అందించాలన్నారు. ఈ పంపిణీలో ఏమైనా అవకతవకలు చోటు చేసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు ఫామ్‌పాండ్స్ తవ్వించి భూగర్భజలాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప వంటి జిల్లాల్లో ప్రభుత్వం నిరే్ధశించిన లక్ష్యాలకన్నా బిందుసేద్యం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, ఈ జిల్లాల్లో వారంవారం సమీక్షలు నిర్వహిస్తున్నా బిందు సేద్యం లక్ష్యాలను ఎందుకు పూర్తిచేయలేకపోతున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, సీపీవో బాలకృష్ణ, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్షీ్మశ్వరి, మార్కెటింగ్ డీఎం నాగమల్లిక పాల్గొన్నారు. 667 సోలార్ పంపుసెట్లు మంజూరు ఎన్టీఆర్ జలసిరి పథకం ఫేజ్–2లో భాగంగా జిల్లాలో 667 సోలార్ పంపుసెట్లు బ్లాక్‌లు మంజూరయ్యాయని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. వీటిలో 351 బ్లాక్‌లలో రైతులకు బోర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బుధవారం జలసిరి, నీరు–చెట్టు పథకాలకు సంబంధించిన పనులపై అధికారులతో సమీక్షించారు. ఎన్టీఆర్ జలసిరి ఫేజ్–2లో నూతన విధానం ద్వారా ఇప్పటివరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ రైతుల నుంచి రూ.5 వేలతో సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నూతన నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.6 వేలు, ఓసీ, బీసీ రైతులు రూ.25 వేలు విరాళం ద్వారా వెంటనే చెల్లించిన వారికి సోలార్ పంపుసెట్లు ఇవ్వనున్నట్టు కలెక్టర్ చెప్పారు. డీఆర్వో హైమావతి, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ, ఏపీడీ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. గడువులోగా సీసీ రోడ్లు నిర్మించాలి జిల్లాలో పంచాయతీరాజ్ నిధులతో నిర్మించే సీసీ రహదారుల నిర్మాణ పనులు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మార్చి 20 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఏఈలను కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో మండల సమాఖ్య, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పునాది దశలో ఉన్న నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలని, ప్రారంభించని పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా నిర్మించాల్సిన సీసీ రోడ్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో సీసీ రోడ్లు నిర్మాణ పనులు కాంట్రాక్టర్లు ప్రారంభించకుంటే నోటీసులిచ్చి బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. -
గ్రామపంచాయతీలకు సొంత భవనాలు
ఏలూరు సిటీ : జిల్లాలో సొంత భవనాలు లేని 101 గ్రామ పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టరు కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పంచాయితీరాజ్ ద్వారా చేపట్టిన పనుల ప్రగతిని బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో స్వంత భవనాలు లేని గ్రామ పంచాయతీ కార్యాలయాలు 101గా గుర్తించడం జరిగిందని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం, 14వ ఆర్థిక కమిషన్ నిధులతో నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని, డ్వామా పీడీని కలెక్టరు ఆదేశించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పనుల పట్ల అశ్రద్ధ చూపితే కఠిన చర్యలు : పరిపాలనా ఆమోదం పొంది టెండర్లు పిలవడానికి 6 నెలలా? టెండర్లు పూర్తయిన తరువాత కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకు మరో 6 నెలలా? విధులు నిర్వర్తించడంలో ఇంత నిర్లక్ష్యమా అంటూ పంచాయితీరాజ్ శాఖ ఇంజనీర్లపై కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు ఫైనలైజ్ అయిన 48 గంటల్లో కాంట్రాక్టర్లలో ఇంత నిర్లప్తత నెలకొనడంపై కలెక్టరు అసహనం వ్యక్తం చేశారు. పెదపాడు మండలంలో ఫిబ్రవరి నెలలో రూ. 10 లక్షల ఖర్చుతో నిర్మించే భవనానికి గత ఫిబ్రవరిలో పరిపాలనా ఆమోదం మంజూరు చేసినప్పటికీ ఇంతవరకూ కనీసం టెండర్లు ఎందుకు పిలవలేదని, అదే పెదవేగి మండలంలో వ్యవసాయ శాఖ భవనం నిర్మాణాలకు ఫిబ్రవరి నెలలో టెండర్లు ఫైనలైజ్ అయినప్పటికీ ఇంతవరకు కాంట్రాక్టరుకు పనులు అప్పగించడం లో ఇంత జాప్యం ఎందుకు జరిగిందని కలెక్టరు సూపరింటెండింగ్ ఇంజనీరును ప్రశ్నించారు. మంజూరైన పనులలో ఒక పెద్ద పనిని వివిధ భాగాలుగా చేసి నామినేషన్‌పై అప్పగించడం 4 లేదా 5 పనులను మొత్తంగా ప్యాకేజీగా ఒక కాంట్రాక్టర్ అప్పగించవద్దన్నారు. సమావేశంలో సమావేశంలో సూపరింటెండింగ్ ఇంజనీర్ ఈ.మాణిక్యం, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి టీ.సురేష్‌కుమార్, డ్వామా పీడీ వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ జీ.చంద్రశేఖర్, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ప్రకాష్‌నాయుడు, రఘుబాబు, కెసీ రామన్న, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
శివారు ప్రాంత భూములకు సాగునీరు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన పంటలు ఎండిపోకుండా అవసరమైన నీటిని శివారు ప్రాంత భూములకు కూడా తరలించాలని కలెక్టర్ ఇరిగేషన్ శాఖ ఈఈ జి.శ్రీనివాసరావును ఆదేశించారు. కలెక్టరేట్లో వర్షాభావ పరిస్థితులపై ఇరిగేషన్ వ్యవసాయ, భూగర్భజల శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఈ నెలలో వర్షాలు కురవకపోవడంతో శివారు ప్రాంత భూములకు నీరందక మెట్ట ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటడంతో కొన్ని చోట్ల పంటలు దెబ్బతింటున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. లింగపాలెం, చింతలపూడి, పోలవరం, గోపాలపురం, నరసాపురం శివారు ప్రాంతాల్లోని భూములకు సేద్యపు నీరు సక్రమంగా అందక పంటలు దెబ్బతింటున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించి ఎక్కడా కూడా ఒక్క ఎకరం పంట ఎండిపోకుండా రాబోయే 40 రోజులు తక్షణ పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, భూగర్భజల శాఖ డీడీ రంగారావు పాల్గొన్నారు. హార్టీకల్చర్ హబ్‌కు అధికారుల సహకారం లేదు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంటే దీనికి అధికారులు సహకరించడం లేదని కలెక్టర్ భాస్కర్ అన్నారు. అధికారుల తీరులో మార్పురాకుంటే వీరిపై చర్యలు తీసుకుంటామన్నారు. 80 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలున్నాయని, రైతు ఏ రకం తోటలు పెంచుతున్నాడో డేటాబేస్‌లో పొందుపరచాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఐదు నెలల్లో కేవలం 6,700 ఎకరాలు మాత్రమే ఆన్లైన్ చేశారని, సమగ్ర డేటాబేస్ ఎప్పటికి సిద్ధమవుతుందని కలెక్టర్ ప్రశ్నించారు. గతంలో ఉద్యానశాఖకు ఒక్క ఏడీ ఉన్నప్పుడే పనులు బాగా జరిగేవని ప్రస్తుతం ఒక డీడీ, ఇద్దరు ఏడీలు నియమితులైన తరువాత ప్రగతి శూన్యంగా కనిపిస్తోందన్నారు. సమావేశంలో హార్టీకల్చర్ డీడీ వైవీఎస్ ప్రసాద్, ఉద్యానశాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు దుర్గేష్, విజయలక్ష్మి, ఏపీఎంఐసీ పీడీ ఎస్.రామ్మోహనరావు పాల్గొన్నారు. -
బయోమెట్రిక్ హాజరుపై శ్రద్ధ పెట్టండి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఆయా మండల కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు నూరుశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ తహసీల్దార్లను, ఎంపీడీవోలను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మండల అ«ధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి మండలస్థాయిలో బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. కలెక్టర్ పరిశీలనలో ప్రతి కార్యాలయం నుంచి ఇద్దరు, ముగ్గురు బయోమెట్రిక్ హాజరుకు దూరంగా ఉండటాన్ని గుర్తించిన కలెక్టర్ పూర్తిస్థాయిలో సిబ్బంది ఎందుకు బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయలేకపోతున్నారని ప్రశ్నించారు. సర్వేలకు వెళ్లినా బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేనని చెప్పారు. పుష్కరాల విధులు మినహాయించగా ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, డీఆర్వో ప్రభాకరరావు పాల్గొన్నారు. -
వ్యవసాయ యంత్రాలు ముందుగానే ఇవ్వండి
ఏలూరు (మెట్రో): వ్యవసాయ యంత్రాలు అందించడంలో జిల్లా వ్యవసాయ అధికారులు శ్రద్ధ వహించి రాబోయే రబీ సీజన్‌కు ఇప్పటి నుంచే పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్ కె.భాస్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం ప్రాధాన్యతా రంగాల సమావేశంలో ఆయన మాట్లాడారు. యాంత్రీకరణలో భాగంగా ఏ మేరకు యంత్రాలు అందుతున్నాయో, ఏ యంత్రాలు ఇస్తున్నారో అనే విషయాలు నూరు శాతం రైతులకు తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయాలు ప్రతి ఒక్క రైతుకూ తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పోస్ యంత్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులు సక్రమంగా రైతులకు చేరేలా చూడాలన్నారు. డీలర్లు ఈ పోస్ యంత్రాల ద్వారా ఎరువులను పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్ష్యాలను త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని పట్టు పరిశ్రమశాఖ డెప్యూటీ డైరెక్టర్ సుబ్బరామయ్యను ఆదేశించారు. అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, లీడ్‌బ్యాంకు మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, డీసీవో లూథర్ పాల్గొన్నారు. -
అంగన్‌వాడీభవనాలు త్వరితగతిన పూర్తి చేయండి
ఏలూరు (మెట్రో): జిల్లాలో అంగన్వాడీ భవనాలు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లాకలెక్టర్ కాటంనేని బాస్కర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనులు నత్తనడకన సాగుతున్నాయనీ తక్షణమే వేగం పెంచి పనులు పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో సిసి రోడ్ల నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయనీ వీటినీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్ఇ మాణిక్యం, ఇఇ రఘుబాబు, రామన్న, ప్రకాశ్ పాల్గొన్నారు. తొలివిడత పూర్తయిన జలశిరి ః జిల్లాలో ఎన్టిఆర్ జలసిరి తొలివిడత పూర్తయ్యిందని జిల్లా కలెక్టర్ భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఎన్టిఆర్ జలసిరి పథకంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టిఆర్ జలసిరి ఫేజ్ వన్ ద్వారా 1971 మంది అర్హత గల పేద రైతులకు బోర్లు మంజూరు చేయడం జరిగిందని శనివారం నాటికి పూర్తిస్థాయిలో బోర్లను మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఫేజ్టులో భాగంగా 1592 ధరఖాస్తులు రైతుల నుండి బోర్లు మంజూరు కోసం అందాయనీ, వీటిని స్థానిక తహశీల్దార్లు, భూగర్భ జలశాఖ అధికారులు కలిసి ధరఖాస్తులు ఆన్లైన్లో పొందు పరచాలని కలెక్టరు చెప్పారు. అర్హత గల రైతులకు బోర్లు మంజూరు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డ్వామా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఎపిడి ఎస్‌వివి సత్యనారాయణ, టి.నాగరాజు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.