బయోమెట్రిక్ హాజరుపై శ్రద్ధ పెట్టండి
Published Fri, Aug 12 2016 10:12 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో ఆయా మండల కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు నూరుశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ తహసీల్దార్లను, ఎంపీడీవోలను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మండల అ«ధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి మండలస్థాయిలో బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. కలెక్టర్ పరిశీలనలో ప్రతి కార్యాలయం నుంచి ఇద్దరు, ముగ్గురు బయోమెట్రిక్ హాజరుకు దూరంగా ఉండటాన్ని గుర్తించిన కలెక్టర్ పూర్తిస్థాయిలో సిబ్బంది ఎందుకు బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయలేకపోతున్నారని ప్రశ్నించారు. సర్వేలకు వెళ్లినా బయోమెట్రిక్ హాజరు వేయాల్సిందేనని చెప్పారు. పుష్కరాల విధులు మినహాయించగా ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, డీఆర్వో ప్రభాకరరావు పాల్గొన్నారు.
Advertisement