అంగన్‌వాడీభవనాలు త్వరితగతిన పూర్తి చేయండి
Published Wed, Aug 3 2016 7:56 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (మెట్రో): జిల్లాలో అంగన్‌వాడీ భవనాలు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లాకలెక్టర్ కాటంనేని బాస్కర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల పనులు నత్తనడకన సాగుతున్నాయనీ తక్షణమే వేగం పెంచి పనులు పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో సిసి రోడ్ల నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయనీ వీటినీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఎస్‌ఇ మాణిక్యం, ఇఇ రఘుబాబు, రామన్న, ప్రకాశ్ పాల్గొన్నారు.
తొలివిడత పూర్తయిన జలశిరి ః
జిల్లాలో ఎన్‌టిఆర్ జలసిరి తొలివిడత పూర్తయ్యిందని జిల్లా కలెక్టర్ భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఎన్‌టిఆర్ జలసిరి పథకంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌టిఆర్ జలసిరి ఫేజ్ వన్ ద్వారా 1971 మంది అర్హత గల పేద రైతులకు బోర్లు మంజూరు చేయడం జరిగిందని శనివారం నాటికి పూర్తిస్థాయిలో బోర్లను మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. ఫేజ్‌టులో భాగంగా 1592 ధరఖాస్తులు రైతుల నుండి బోర్లు మంజూరు కోసం అందాయనీ, వీటిని స్థానిక తహశీల్దార్లు, భూగర్భ జలశాఖ అధికారులు కలిసి ధరఖాస్తులు ఆన్‌లైన్‌లో పొందు పరచాలని కలెక్టరు చెప్పారు. అర్హత గల రైతులకు బోర్లు మంజూరు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డ్వామా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఎపిడి ఎస్‌వివి సత్యనారాయణ, టి.నాగరాజు, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.
Advertisement