యూపీలో నేడు 'నో నాన్‌ వెజ్ డే'.. యోగీ సర్కార్ ప్రకటన | Uttar Pradesh Declares No Non Veg Day Today On November 25th, All Meat Vendors Asked To Shut Shops - Sakshi
Sakshi News home page

No Non Veg Day In UP: యూపీలో నేడు 'నో నాన్‌ వెజ్ డే'.. యోగీ సర్కార్ ప్రకటన

Published Sat, Nov 25 2023 12:09 PM | Last Updated on Sat, Nov 25 2023 12:50 PM

No Non Veg Day In UP Today All Meat Shops Ordered Shut - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నవంబర్ 25ని "నో నాన్ వెజ్ డే"గా ప్రభుత్వం ప్రకటించింది. సాధు టిఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మాంసం దుకాణాలు, కబేళాలు మూసివేయాలని అధికారిక ప్రకటన తెలిపింది.

సాధు తన్వార్దాస్ లీలారామ్ వాస్వానీ ఒక భారతీయ విద్యావేత్త. మీరా మూవ్‌మెంట్ ఇన్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించారు. సింధ్‌లో  సెయింట్ మీరా స్కూల్‌ను స్థాపించారు. ఆయన బోధనలకు పూణేలో దర్శన్ మ్యూజియాన్ని అంకితం చేశారు. సాధువు టిఎల్ వాస్వానీ జయంతి సందర్భంగా నవంబర్ 25 అంతర్జాతీయ నాన్‌వెజ్ డేగా కూడా  కొనసాగుతోంది. 

హలాల్ సర్టిఫికేషన్‌తో ఉన్న ఆహార ఉత్పత్తుల  విక్రయాలను నిషేధిస్తూ యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత యూపీ ప్రభుత్వం తాజాగా నాన్‌ వెజ్ డేని ప్రకటించింది. హలాల్ సర్టిఫికేషన్ అంశంలో ఎగుమతి కోసం తయారు చేసిన ఉత్పత్తులను మినహాయించింది.

ఇదీ చదవండి: మరోసారి గెలుపు మాదే: సచిన్ పైలెట్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement