meat shops
-
యూపీలో నేడు 'నో నాన్ వెజ్ డే'.. యోగీ సర్కార్ ప్రకటన
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నవంబర్ 25ని "నో నాన్ వెజ్ డే"గా ప్రభుత్వం ప్రకటించింది. సాధు టిఎల్ వాస్వానీ జయంతిని పురస్కరించుకుని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు మాంసం దుకాణాలు, కబేళాలు మూసివేయాలని అధికారిక ప్రకటన తెలిపింది. సాధు తన్వార్దాస్ లీలారామ్ వాస్వానీ ఒక భారతీయ విద్యావేత్త. మీరా మూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్‌ను ప్రారంభించారు. సింధ్‌లో సెయింట్ మీరా స్కూల్‌ను స్థాపించారు. ఆయన బోధనలకు పూణేలో దర్శన్ మ్యూజియాన్ని అంకితం చేశారు. సాధువు టిఎల్ వాస్వానీ జయంతి సందర్భంగా నవంబర్ 25 అంతర్జాతీయ నాన్‌వెజ్ డేగా కూడా కొనసాగుతోంది. హలాల్ సర్టిఫికేషన్‌తో ఉన్న ఆహార ఉత్పత్తుల విక్రయాలను నిషేధిస్తూ యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత యూపీ ప్రభుత్వం తాజాగా నాన్ వెజ్ డేని ప్రకటించింది. హలాల్ సర్టిఫికేషన్ అంశంలో ఎగుమతి కోసం తయారు చేసిన ఉత్పత్తులను మినహాయించింది. ఇదీ చదవండి: మరోసారి గెలుపు మాదే: సచిన్ పైలెట్ -
వచ్చేస్తున్నాయి ‘మటన్ మార్ట్’లు
సాక్షి, అమరావతి: మాంసాహార ప్రియులకు శుభవార్త. అందుబాటు ధరల్లో ఆరోగ్యకరమైన మాంసాహారాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో మాంసం దుకాణాలు (మటన్ మార్టు) ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో నగరాలు, పట్టణాల్లో ఇవి ఏర్పాటవుతాయి. మలిదశలో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వీటిని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. మేక మాంసం, గొర్రె మాంసం అంటే నోరూరని మాంసాహారులుండరు. తలకాయ మాంసం, కాళ్ల పులుసు, బోటీ కూర ఉంటే లొట్టలేసుకుని తింటారు. అనారోగ్యం అనంతరం వేగంగా కోలుకునేందుకు పెద్దల నుంచి వైద్యుల వరకు మటన్ తినమని ప్రోత్సహిస్తారు. నూటికి 85 శాతం మంది మాంస ప్రియులుంటే అందులో మటన్ ఇష్టపడే వారు 90 శాతానికిపైనే ఉంటారు. మాంసాహార ఉత్పత్తుల వినియోగంలో 13.53 శాతం మేక, గొర్రె మాంసానిదే. ధర ప్రియమైనా ఆదివారం వచ్చిందంటే కోడి మాంసం, చేపలు, రొయ్యలకు దీటుగా మటన్ విక్రయాలు జరుగుతుంటాయి. 2.31 కోట్ల మేకలు/గొర్రెల సంపద కలిగిన మన రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. ఎగుమతుల్లో కూడా టాప్–10లోనే ఉంది. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యం ఏటా ఉత్పత్తిలో ఆశించిన స్థాయిలో వృద్ధి రేటు సాధిస్తున్నప్పటికీ స్థానిక వినియోగం పెరగడం లేదు. దీనికి ప్రధాన కారణం ధర సామాన్యులకు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్యకరమైన వాతావరణంలో వధశాలలు, దుకాణాలు లేకపోవడమే. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ పోర్టబుల్ మాంసం ఉత్పత్తి, రిటైల్ సౌకర్యం (పీ – మార్ట్) అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రమాణాలకనుగుణంగా అత్యంత ఆరోగ్యకరమైన వాతావరణంలో మొబైల్ మటన్ దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. సబ్సిడీపై మంజూరు ఏపీ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో యూనిట్ రూ.10 లక్షల అంచనా వ్యయంతో తొలిదశలో మహానగరాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 112 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. విశాఖ, విజయవాడ నగరాల్లో నాలుగు, మిగిలిన కార్పొరేషన్ల పరిధిలో రెండు, ఇతర మునిసిపాల్టీల పరిధిలో ఒక్కటి చొప్పున సబ్సిడీతో కూడిన గ్రాంట్‌తో వీటిని ఏర్పాటు చేస్తారు. మటన్ మార్ట్‌ల్లో ఎన్నో ప్రత్యేకతలు 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన మొబైల్ మటన్ విక్రయాల వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా డిజైన్ చేశారు. 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశుభ్రమైన వాతావరణంలో కనీసం 10 జీవాలను వధించేందుకు వీలుగా వధశాలతో పాటు డ్రెస్సింగ్, జీవాల అవయవాల (గ్రేడ్స్) వారీగా కటింగ్, డ్రెస్సింగ్, ప్యాకేజింగ్, రిటైల్ విక్రయాలు జరిపేందుకు వీలుగా రూపొందించారు. వధించేటప్పుడు కానీ, కాల్చేటప్పుడు కానీ వ్యర్థాలు కాదు కనీసం వాసన కూడా బయటకు రాదు. విద్యుత్, మంచినీరు తదితర సౌకర్యాలతో కూడిన ఈ వాహనంలో ప్రాసెసింగ్ చేసిన తాజా మాంసాన్ని నిల్వ చేసేందుకు అత్యాధునిక రిఫ్రిజరేటర్లు, 100కి పైగా స్టైయిన్‌లెస్ స్టీల్ బాక్స్‌లు (500 గ్రాములు) ఉంటాయి. వైద్యులు పరీక్షించిన పూర్తి ఆరోగ్యకరమైన జీవాలను మాత్రమే ఇక్కడ విక్రయిస్తారు. వ్యర్థ పదార్థాలను నిల్వ చేసేందుకు వాహనంలోనే డంపింగ్ సౌకర్యం ఉంటుంది. జీరో పొల్యూషన్‌తో పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు. లిక్విడ్ వేస్ట్ కోసం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) కూడా వాహనంలోనే ఉంటుంది. మొబైల్ మార్ట్ నిర్వహణపై హైదరాబాద్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. విధి విధానాల రూపకల్పన ‘పోర్టబుల్ మీట్ ప్రొడక్షన్ అండ్ రిటైలింగ్ ఫెసిలిటీ (పీ – మార్ట్) అని వ్యవహరించే మటన్ మార్ట్లు తొలుత నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తాయి. తర్వాత మండల కేంద్రాలు, పంచాయతీల్లో ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పన జరుగుతోంది. త్వరలోనే వీటిని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం’ – జేపీ వెంకటేశ్వర్లు, ఎండీ, ఏపీఎండీసీ -
మాంసం దుకాణాలకు కొత్త రూల్స్
సాక్షి, హైదరాబాద్: కోడి, మేక, చేపల మాంసం దుకాణాలు వ్యర్థాలను రోడ్లపై పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురపాలక శాఖ హెచ్చరించింది. పట్టణాల్లో మాం సం దుకాణాలన్నింటినీ గుర్తించి వాటికి సం బంధించిన వ్యర్థాల సమీకరణ, తరలింపునకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పురపాలక శాఖ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ ఆదేశించారు. పశు వధశాలల వ్యర్థాలను బయో మెథనేషన్ ప్రక్రియ ద్వారా అక్కడికక్కడే నిర్వీర్యం చేయాలని సూచించారు. మాంసం దుకాణదారులందరూ తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. దుకాణంలో లీక్ ప్రూఫ్ చెత్తబుట్టలుండాలి పనిముట్లు, కంటైనర్లను క్రమం తప్పకుం డా వేడి నీళ్లతో కడగాలి నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలి, డిస్ఇన్ఫెక్ట్ చేయాలి వర్కర్లు అప్రాన్లు, హెడ్‌గేర్, గ్లౌజులను తప్పనిసరిగా ధరించాలి ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటి కీటక నివారిణిలను క్రమం తప్పకుండా దుకాణ ప్రాంగణంలో చల్లాలి. దుకాణంలో వీటిని లభ్యంగా ఉంచుకోవాలి. కార్మికులకు చర్మవ్యాధులు ఉండరాదు, గోళ్లు పెంచుకొని ఉండరాదు ఈగలు ఉండరాదు బాలకార్మికులతో పని చేయించుకోరాదు ఏవైనా ఉల్లంఘనలుంటే వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా మున్సిపల్ అధికారుల పేర్లతో దుకాణంలో బోర్డు ఏర్పాటు చేయాలి. రోజుకు టన్ను కంటే ఎక్కువ మొత్తంలో మాంసం వ్యర్థాల ఉత్పత్తి ఉంటే బయో మెథనేషన్ ప్రక్రియ ద్వారా వీటిని నిర్వీ ర్యం చేయాలి అంత కంటే తక్కువ ఉంటే అత్యంత లోతుగా పూడ్చి వేయాలి మాంసం వ్యర్థాలతో ఎరువుల తయారీకి అవకాశం ఉంటే పరిశీలన జరపాలి. ఇలా తయారైన ఎరువులను హరితహారం కోసం వినియోగించాలి -
కృష్ణా జిల్లాలో మాంసపు దుకాణాల మూసివేత
-
మాంసం దుకాణాల కూల్చివేత
♦ 40 దుకాణాలు నేలమట్టం ♦ భారీగా పోలీసు బందోబస్తు ♦ పంతం నెగ్గించుకున్న పురపాలక సంఘం అధికారులు జయపురం : జయపురం పురపాలక సంఘం అధికారులు మాంసం దుకాణాలను రెండవ దైనిక బజారుకు తరలించాలన్న తమ పట్టుదలను నెగ్గించుకున్నారు. పట్టణంలో మొదటి దైనిక బజారులో ఉన్న చేపలు, మాంసం దుకాణాలను ఈ నెల 15వ తేదీలోగా ఎత్తివేసి రెండవ దైనిక బజారుకు తరలించాలని పురపాలక సంఘం ఆదేశాలు జారీ చేసినా వ్యాపారులు స్పందించలేదు. దీంతో పురపాలక సంఘం అధికారులు శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వెంటనే దుకాణాలను తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయాన్నే పొక్లయినర్లతో సహా మార్కెట్‌కు వచ్చి ఆయా దుకాణాలను కూల్చి నేలమట్టం చేశారు. జయపురం పురపాలక సంఘం కార్యనిర్వాహక అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్న జయపురం సబ్ కలెక్టర్ చక్రవర్తి సింగ్ రాథోర్ పోలీసు బలగాలతో, మున్సిపాలిటీ సిబ్బందితో వచ్చి బిద్యాధర సింగ్ దవేవ్ దైనిక బజారులో మాంసాలు అమ్మకాల కోసం గతంలో ఏర్పాటు చేసిన దుకాణాలను పడగొట్టించారు. ఈ మార్కెట్లో మాంసం, చేపలు, ఎండు చేపలు అమ్మే దాదాపు 40 దుకాణాలను ఆదివారం నేలకూల్చారు. ఉదయం బోరున వర్షం పడుతున్నా దుకాణాలను నేలమట్టం చేశారు. ఈ ఆపరేషన్‌కు ఎవరూ అంతరాయం కలిగించకుండా మార్కెట్ ప్రవేశమార్గం వద్ద అధిక సంఖ్యలో పోలీసులు మోహరించి ఎవరినీ లోనికి వెళ్లనీయలేదు. కేవలం పత్రికల వారిని మాత్రం లోనికి అనుమతించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాథోర్ పోలీసు అధికారులతో చర్చించారు. ఈ ఆపరేషన్‌ను మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ అరుణకుమార్ పాఢీ, మున్సిపాలిటీ ఇంజినీర్, పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా దుకాణాలు కూల్చే ఆపరేషన్ ముగిసింది. రెండవ దైనిక బజారుకు వెళ్లాలంటే కష్టమే పట్టణ నడిబొడ్డున ఉన్న బిద్యాదర్ దైనిక బజారులో అనేక దశాబ్దాలుగా ఉన్న మాంస దుకాణాలను రెండవ దైనిక బజారుకు తరలించటంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఈ చర్య మంచిదే అయినా రెండవ దైనిక బజారుకు తరలించటంతో పట్టణంలోని దాదాపు 70 శాతం మంది ప్రజలకు మార్కెట్ దూరం అవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంత దూరం వెళ్లాలి అంటే కష్టం అని అందుచేత పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు మాంసం చేపల దుకాణాలు ఏర్పాటు చేయాలని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. గాంధీ జంక్షన్, ప్రసాదరావుపేట, కెల్లానగర్, సాంబారు తోట, డెప్పిగుడ, కరణం వీధి, లేబర్ కాలనీ, పారాబెడ, నారాయణతోట వీధి, గైడ వీధి, మహారాణిపేట, భ««ధ్య వీధి, భూపతి వీధి, భోయివీధి, మిల్లు వీధి, జైలు రోడ్డు మొదలగు అనేక ప్రాంతాల నుంచి రెండవ దైనిక బజారుకు వెళ్లాలంటే ఆటోలపైనే వెళ్లాలని, ఇది ప్రజలకు వ్యయంతో కూడినది అని అంటున్నారు. అంతేకాకుండా రెండవ దైనిక బజారు రోడ్డు చాలా ఇరుకుగా ఉండటంతో వాహనాలు వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని అభిప్రాయ పడుతున్నారు. అందుచేత ప్రసాదరావుపేట, గాంధీ జంక్షన్, పారాబెడ, మొదలగు ప్రాంతాలలో మత్స్య మాంస దుకాణాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
కబేళాల మూతతో ఎన్ని కష్టాలో!
⇔ యూపీలో యోగి సర్కారు నిర్ణయంతో ఆందోళన ⇔ దేశంలో పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తిలో యూపీయే టాప్ ⇔ ప్రభుత్వ ఆదేశాలతో 80% కబేళాలు, దుకాణాల మూసివేత ⇔ మాంసం ఎగుమతులు, చర్మ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం ⇔ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులుగా మారుతున్న వైనం ⇔ పాల ఉత్పత్తీ తగ్గిపోవచ్చు.. గోవుల సంఖ్య ఇంకా తరిగిపోవచ్చు! ⇔ రాష్ట్రమంతటా మాంసానికి కటకట.. మూతపడుతున్న రెస్టారెంట్లు (సాక్షి నాలెడ్జ్ సెంటర్) ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు కేబాళాల మూసివేత నిర్ణయంతో ఆ రాష్ట్రంలో బీఫ్ కొరత ఏర్పడింది. మాంసాహారులు తీవ్ర కటకట ఎదుర్కొంటున్నారు. అయితే.. కబేళాల మూసివేత నిర్ణయం రాష్ట్రంపై పలు ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని పరిశీలకులు చెప్తున్నారు. ముఖ్యంగా.. పాల ఉత్పత్తిలో, మాంసం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న యూపీ.. ఈ నిర్ణయం వల్ల ఆ ఉత్పత్తుల్లో వెనుకబడిపోతుందని, అది ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే.. ‘అనధికారిక కబేళాలను, యంత్రాలతో నడిచే కబేళాలను మూసివేసేందుకు కఠిన చర్యలు చేపడతా’మని ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించింది. యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినవెంటనే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆ ఎన్నికల హామీ అమలు దిశగా చర్యలు ప్రారంభించింది. మంగళవారం లక్నోలోని కమాల్గదాహా ప్రాంతంలో అనధికారికంగా నిర్వహిస్తున్న ఒక కబేళాను అధికారులు సీల్ చేశారు. బుధవారం మీరట్‌లో బీఎస్పీ ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన మూడు బీఫ్ ప్రాసెసింగ్ ప్లాంట్లను సీల్ చేశారు. వారణాసిలో కూడా ఒక కబేళాపై అధికారులు దాడి చేసి సీల్ చేశారు. ఘజియాబాద్‌లో మరో 10 మాంసం దుకాణాలను మూసివేశారు. ఇంకోవైపు మంగళవారం నాడు హాత్రాస్‌లో మూడు మాంసం దుకాణాలను గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ పరిణామాలతో బుధ, గురు వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మాంసం దుకాణాలు మూతపడ్డాయి. మాంసాహార ప్రియులకు మాంసం కరువైంది. ముఖ్యంగా బీఫ్ ధర తక్కువగా ఉండడం వల్ల ఆ మాంసం వినియోగించే వారు రాష్ట్రంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలా మంది మాంసం లేనిదే ముద్ద తనని వారు ఉన్నారు. ఇప్పుడు బీఫ్ కొరతతో ఏం చేయాలన్నది అటువంటి వారికి పాలుపోవడం లేదు. పాల ఉత్పత్తి తగ్గుతుందా..? దేశంలో పాల ఉత్పత్తిలో ప్రస్తుతం యూపీదే అగ్రస్థానం. 2015-16 సంవత్సరంలో రాష్ట్రంలో 26,387 వేల టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి. ఒకవైపు అక్రమ కబేళాల నిషేధం, మరోవైపు గోవధకు వ్యతిరేకంగా ఉధృత చర్యలు రాష్ట్రంలో పాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని పలువురు నిపుణులు చెప్తున్నారు. ముసలివైపోయిన పశువుల ధర తగ్గిపోవడం, వాటిని కబేళాలకు పంపించడం కష్టమవడం వంటి పరిస్థితుల్లో రైతులు పశువుల పెంపకం మీద, పాడి పరిశ్రమ మీద ఆసక్తి తగ్గే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మాంసం ఎగుమతి పడిపోతుంది..! దేశపు మొత్తం మాంసం ఎగుమతుల విలువ రూ. 26,682 కోట్లు కాగా.. అందులో సింహ భాగం వాటా యూపీదే. 2015-16 ఆర్థిక సంవత్సరంలో యూపీ మాంసం ఎగుమతులు రూ. 11,351 కోట్ల మేర ఉన్నాయి. దేశవ్యాప్తంగా 62 కబేళాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా అందులో 38 ఒక్క యూపీలోనే ఉన్నాయి. వాటిలోనూ 37 కబేళాలు విదేశాలకు ఎగుమతి చేసే బీఫ్ (పశు మాంసం) ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ కబేళాలు నిబంధనలు పాటించడం లేదని, లైసెన్సులు లేవని మూతవేయడం వల్ల మాంసం ఎగుమతులు అకస్మాత్తుగా పడిపోయి రాష్ట్రంలో భారీగా ఆదాయం నష్టపోతుందని నిపుణులు చెప్తున్నారు. వేలాది మంది ఉపాధికి గండి.. కబేళాల నిషేధం, మూసివేత కారణంగా వాటిలో పనిచేసే వేలాది మంది నిరుద్యోగులుగా మారతారు. మాంసం దుకాణాలు మూతపడుతుండటంతో వాటిపై ఆధారపడ్డ వారికి ఉపాధి కరువవుతుంది. ఇక కబేళాల నుంచి వచ్చే పశు చర్మాలపై ఆధారపడి ఉన్న రాష్ట్రంలోని చర్మ పరిశ్రమ సైతం తీవ్రంగా దెబ్బతింటుంది. అందులోనూ వేలాది మంది ఉపాధికోల్పోవటమే కాదు.. చర్మ ఉత్పత్తుల ఎగుమతులూ పడిపోతాయని పరిశీలకులు చెప్తున్నారు. యూపీలో గోవులు అంతరిస్తాయా..? ప్రభుత్వ నిర్ణయాల వల్ల యూపీలో గోవులు త్వరలోనే ‘అంతరించిపోయే’ ప్రమాదం ముంచుకురావచ్చుననీ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఆవుల యాజమాన్యాన్ని వదులుకుంటున్నారని, నిజానికి గోప్రాంతం (కౌ బెల్ట్)గా పేరుపడ్డ యూపీలో ఇప్పటికే ప్రతి వంద గేదెలకూ 0.64 అవులు మాత్రమే ఉన్నాయని వారు లెక్క చెప్తున్నారు. అదే పశ్చిమబెంగాల్లో వంద గేదెలకు 27 ఆవులు, అస్సాంలో 16, కేరళలో 13 అవుల చొప్పున ఉన్నాయని.. ఆ రాష్ట్రాల్లో గోవధ మీద నిషేధం లేదు కనుక వాటి సంఖ్య పెరుగుతోందని, యూపీలో గోవధను నిషేధిస్తే ఆవుల సంఖ్య ఇంకా పడిపోవచ్చునని విశ్లేషిస్తున్నారు. అక్రమ కబేళాలను నిషేధించడం కాకుండా వాటిని క్రమబద్ధీకరించడం, నిబంధనలు పాటించేలా చూడటం వంటి చర్యలతో ఇటువంటి నష్టాలు రాకుండూ చూడవచ్చునని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వందేళ్ల ఘన చరిత్ర.. ఒక్క రోజులో మూత! టుండే కబాబీ... యూపీలో ఈ పేరు తెలియని వారు ఉండరు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడ దాదాపు వంద రకాల సుగంధద్రవ్యాలతో తయారు చేసే కబాబ్‌లు, మాంసపు వంటకాల అభిమానులు ప్రపంచమంతటా విస్తరించివున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర గల ఈ టుండే కబాబీ కేంద్రం కూడా బుధవారం ఒక్క రోజులో మూతపడింది. బీఫ్ వంటకాలకు ప్రఖ్యాతి గాంచిన టుండే కబాబి అక్బరి గేట్ కేంద్రాన్ని మూసివేశారు. మటన్, చికెన్ వంటకాలను విక్రయించే అమీనాబాద్ కేంద్రాన్ని మాత్రం గురువారం తెరిచారు. 1905 సంవత్సరంలో లక్నో నగరంలో టుండే కబాబి కేంద్రాన్ని హాజీ మురాద్ అలీ స్థాపించారు. ఈ సంస్థకు చెందిన నాలుగు కబేళాలను 2013-15 సంవత్సరాల మధ్య అధికారులు మూసివేశారు. తాజాగా లక్నోలో కబేళాల మూసివేతతో బీఫ్ కొరత ఏర్పడటంతో టుండే కబాబీ కేంద్రాన్ని మూసివేశారు. ‘మాంసం దొరకకపోతే ఎలా నడుపుతాం. బీఫ్ కబాబీ దుకాణాన్ని రెండు రోజులుగా పూర్తిగా మూసివేశాం’ అని యజమాని మొహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. -
ఉత్తరప్రదేశ్‌లో మటన్ షాపులకు నిప్పు
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మూడు మటన్ షాపులకు నిప్పుపెట్టడం కలకంల సృష్టించింది. మంగళవారం రాత్రి హత్రాస్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన రెండు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా గోసంరక్షక దళాలు మటన్ షాపులకు నిప్పు పెట్టినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజే సీఎం యోగి రాష్ట్రంలోని రెండు కబేళాలపై నిషేధం విధించారు. గోవుల అక్రమ రవాణాను ఆపేందుకు మొరాదాబాద్ ఎస్పీ కూడా అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ తన ఎన్నికల్లో మేనిఫెస్టోలో అక్రమ కబేళాలను మూసివేస్తామని హామీ ఇచ్చింది. ఆ వాగ్ధానం ప్రకారమే రాష్ట్రంలో కబేళాలను మూసివేస్తున్నారు.